గోరఖ్‌పూర్: మహిళలను దేవతకు ప్రతిరూపంగా భావించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో వారిపై నేరాలకు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయొచ్చని సూచించారు. ఆయన గురువారం గోరఖ్‌పూర్‌లో నవరాత్రుల సందర్భంగా మహార్నవమి పూజలో పాల్గొన్నారు. అంతకుముందు కన్యాపూజ చేశారు. బాలికల కాళ్లను స్వయంగా కడిగారు.
పిల్లలకు భోజనం వడ్డించారు. మన బిడ్డలు, అక్కాచెల్లెమ్మలను దేవతల్లాగా పవిత్రంగా చూసుకోవాలని, గౌరవించాలని అన్నారు. మహిళల విద్య, ఆరోగ్యం, భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. మహిళల సంక్షేమం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment