Uttar Pradesh CM
-
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దు
లక్నో: ద్విచక్ర వాహనాల ప్రమాదాలు తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి ఇంధనం పోయొద్దని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో 75 జిల్లాల కలెక్టర్లకు రవాణాశాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ సింగ్ లేఖలు పంపారు. వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్నవారు సైతం కచ్చితంగా హెల్మెట్ ధరించి ఉండాలని పేర్కొన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పెట్రోల్ బంకుల బయట ‘నో హెల్మెట్, నో ఫ్యూయెల్’బోర్డులను ప్రదర్శించాలని సూచించారు. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో బాధితులు హెల్మెట్ ధరించడం లేదన్న గణాంకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాలను కాపాడటం, రోడ్డు భద్రతను నిర్ధారించడమే రవాణా శాఖ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో 2019లో ప్రవేశపెట్టినా అమలులో నిర్లక్ష్యం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా ఆదేశాల అమలుపై పర్యవేక్షణ అవసరమని, దీనికోసం అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా దాదాపు 26వేల మంది చనిపోతున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే వీరిలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల రవాణాశాఖ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు పేపట్టాలని ఆదేశించారు. -
యూపీలో యోగికి గుడి
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు యూపీలోని భరత్కుండ్కు చెందిన ప్రభాకర్మౌర్య అనే వీరాభిమాని గుడి కట్టాడు. యోగి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కాషాయ వస్త్రాలు, విల్లంబులతో దేవతల మాదిరిగా తల వెనుక వెలుగులతో ఏర్పాటు చేశాడు. రోజుకు రెండు సార్లు పూజలు చేసి, భక్తులకు ప్రసాదం పంచిపెడుతున్నాడు. ఫైజాబాద్–ప్రయాగ్‌రాజ్ హైవే పక్కనే భరత్‌కుండ్ ఉంది. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్‌కుండ్ రామాయణ కాలంలో అరణ్యవాసం వెళ్లే శ్రీరాముడికి ఆయన సోదరుడు భరతుడు వీడ్కోలు పలికిన చోటుగా ప్రసిద్ధి. యోగి కార్యక్రమాలతో ప్రభావితమై ఆయనకు గుడి కట్టినట్లు మౌర్య తెలిపాడు. -
యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్
దేశంలో బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి వరక ఢిల్లీలో బుల్డోజర్లకు పనిచెప్పగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజరుతో కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా మసీద్‌ల వద్ద ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీతో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి సర్కార్ కూల్చివేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కచ్ నగరంలో ఓ ర్యాలీలో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సీఎం యోగిపై విరుచుకుపడ్డారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "Close the courts, lock them down": Asaduddin Owaisi lashes out after UP Police demolish Muslim activist Afreen Fatima's house. Watch: https://t.co/jSSc5C5nSD#StandWithAfreenFatima #AfreenFatima #AsaduddinOwaisi pic.twitter.com/vPAIfsoW5b — The Cognate (@TheCognate_) June 13, 2022 ఇది కూడా చదవండి: గాంధీ ఫ్యామిలీపై ఈగ వాలినా అంతుచూస్తాం -
IPL 2022: యూపీ సీఎంతో కేఎల్ రాహుల్ జట్టు ఓనర్ భేటీ
LSG Owner Meets UP CM: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ).. సీజన్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీ హెడ్ క్వార్టర్స్‌కు సంబంధించి కీలక వ్యక్తితో భేటీ అయ్యింది. శనివారం ఎల్ఎస్జీ అధినేత సంజీవ్ గొయెంకా, జట్టు మెంటార్, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌తో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. The first bat of the #LucknowSuperGiants presented to the Honorable Chief Minister, @myogiadityanath. Grateful to receive his support! 🏏 pic.twitter.com/SDmRLMa7Sw— Lucknow Super Giants (@LucknowIPL) February 18, 2022 సీఎంతో భేటీ సందర్భంగా సంజీవ్ గొయెంకా, గంభీర్ లు యోగితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి ఫ్రాంచైజీ తొలి బ్యాట్‌ను అందజేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా గడుపుతున్న యోగి.. సంజీవ్ గొయెంకా, గంభీర్లతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యోగికి బ్యాట్ అందజేస్తున్న ఫోటోను ఎల్ఎస్జీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే, రిటెన్షన్‌లో భాగంగా కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ లను రిటైన్ చేసుకున్న ఎల్ఎస్జీ.. వేలంలో 69 కోట్లు వెచ్చించి మరో 18 మంది ఆటగాళ్లను సొంతం చేసుకుంది. వేలంలో ఎల్ఎస్జీ అత్యధికంగా అవేశ్ ఖాన్‌కు రూ. 10 కోట్లు చెల్లించి దక్కించుకుంది. ఆ తర్వాత జేసన్ హోల్డర్‌కు 8.75 కోట్లు, కృనాల్ పాండ్యాలపై 8.25 కోట్లు వెచ్చించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్): రూ. 17 కోట్లు స్టోయినిస్ : రూ. 9 కోట్ల 20 లక్షలు అవేశ్ ఖాన్ : రూ. 10 కోట్లు హోల్డర్ : రూ. 8 కోట్ల 75 లక్షలు కృనాల్ పాండ్యా : రూ. 8 కోట్ల 25 లక్షలు మార్క్ వుడ్ : రూ. 7 కోట్ల 50 లక్షలు డికాక్ : రూ. 6 కోట్ల 75 లక్షలు దీపక్ హుడా : రూ. 5 కోట్ల 75 లక్షలు మనీశ్ పాండే: రూ. 4 కోట్ల 60 లక్షలు రవి బిష్ణోయ్ : రూ. 4 కోట్లు ఎవిన్ లూయిస్: రూ. 2 కోట్లు దుశ్మంత చమీర: : రూ. 2 కోట్లు కృష్ణప్ప గౌతమ్: రూ. 90 లక్షలు అంకిత్ రాజ్‌పుత్: రూ. 50 లక్షలు షాబాజ్ నదీమ్: రూ. 50 లక్షలు కైల్ మేయర్స్: రూ. 50 లక్షలు మోసిన్‌ఖాన్ : రూ. 20 లక్షలు ఆయుశ్ బదోని: రూ. 20 లక్షలు కరణ్ సన్నీ శర్మ: రూ. 20 లక్షలు మయాంక్ యాదవ్ రూ. 20 లక్షలు మనన్ వోహ్రా: రూ. 20 లక్షలు చదవండి: IPL 2022 Auction: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే -
యోగి నా ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఫోన్లపై నిఘా పెట్టారని, ట్యాపింగ్ చేయిస్తున్నారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను ప్రతిరోజు సాయంత్రం యోగి వింటున్నారని అన్నారు. యోగిని నిరుపయోగిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీ సీఎంపై ప్రశంసలు కురిపిస్తూ ఆంగ్లంలో యూపీ, యోగి కలిస్తే ‘ఉపయోగి’ అవుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆదివారం అఖిలేఖ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది కాబట్టి తనతో మాట్లాడేటపుడు జాగురుకతతో ఉండాలని విలేకరులకుసూ చించారు. యోగి సర్కారు రాష్ట్రంలో ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నడుపుతోందని విమర్శించారు. ఓటమి భయంతోనే 12 మంది బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల వారణాసి, ఆయోధ్యల్లో పర్యటించారన్నారు. లఖింపూర్ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వెనకేసుకొస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే యూపీలో కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
మహిళలను దేవతకు ప్రతిరూపంగా భావించాలి
గోరఖ్‌పూర్: మహిళలను దేవతకు ప్రతిరూపంగా భావించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో వారిపై నేరాలకు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయొచ్చని సూచించారు. ఆయన గురువారం గోరఖ్‌పూర్‌లో నవరాత్రుల సందర్భంగా మహార్నవమి పూజలో పాల్గొన్నారు. అంతకుముందు కన్యాపూజ చేశారు. బాలికల కాళ్లను స్వయంగా కడిగారు. పిల్లలకు భోజనం వడ్డించారు. మన బిడ్డలు, అక్కాచెల్లెమ్మలను దేవతల్లాగా పవిత్రంగా చూసుకోవాలని, గౌరవించాలని అన్నారు. మహిళల విద్య, ఆరోగ్యం, భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఈ విషయంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు. మహిళల సంక్షేమం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. -
‘ట్రిలియన్ డాలర్ ఎకానమీయే లక్ష్యం’
లక్నో : ఐఐఎం లక్నో సహకారంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ముందుకెళతామని సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. ఐఐఎం లక్నో సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులతో మంధన్ పేరిట జరిగిన నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో సీఎం యోగితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ప్రభుత్వంతో చేతులు కలిపి, ఆయా కార్యక్రమాలను ముందుకు తీసుకెళితే మంచి ఫలితాలు అందివస్తాయని యోగి ఆదిత్యానాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బృందంలా కలిసిపనిచేయడం కోసం ఈ శిక్షణ తమకు ఉపకరిస్తుందని చెప్పారు. లక్ష్యాలను అధిగమించి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు దోహదపడుతుందని అన్నారు. మూడు దశల్లో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఇది రెండవది కాగా, ఈ కార్యక్రమానికి 50 మంది మంత్రులు, అధికారులు హాజరై మేనేజ్మెంట్ నైపుణ్యాలను ఐఐఎం లక్నో సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల నుంచి నేర్చుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సుపరిపాలనకు ఈ శిక్షణ నేపథ్యంలో ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు. -
హనుమంతుడి ముందు కుప్పిగెంతులు
దేవుడిపై ప్రయోగించిన కులం కార్డు ఎటు తిరుగుతోందన్న చర్చ తీవ్రరూపం దాలుస్తోంది. ఓ వైపు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో హిందూ సంస్థలు నిమగ్నమైతే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడి కులంపై వ్యాఖ్యలు చేసి కొత్త విషయాల్ని తెర మీదకు తెచ్చారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో.. హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న యోగి ఆ వర్గం నుంచి ఓట్లు రాలుతాయని ఆశించి ఉండొచ్చు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే.. హనుమంతుడు మనువాడీలకు బానిస అని, రాముడి కోసం ఎంతో చేశాడని, అయినా ఆయనకు తోక ఎందుకు పెట్టారని ప్రశ్నించి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్ హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ నందకుమార్.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు. ఉద్రిక్తత రాజేసిన భీమ్ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని హనుమంతుడి ఆలయాలన్నింటిని దళితులు స్వాధీనం చేసుకోవాలని భీమ్ ఆర్మీ పిలుపునిచ్చింది. ఆ ఆలయాలన్నింటిలో దళిత పూజారుల్ని నియమిస్తామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఈ మేరకు భీమ్ ఆర్మీ సభ్యులందరూ ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి ఆలయాలను ఆక్రమించుకోవాలని పిలుపునిచ్చారు. భీమ్ ఆర్మీకి ఆల్ ఇండియా అంబేద్కర్ మహాసభ మద్దతు పలకడంతో ముజఫర్‌నగర్‌లో హనుమాన్ ధామ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్ ఆర్మీ కార్యకర్తలు గత మంగళవారమే సంకటవిమోచన హనుమాన్ ఆలయాన్ని ఆక్రమించుకొని అక్కడి పురోహితుడ్ని తొలగించి దళితుడిని పూజారిగా నియమించారు. ‘హిందూ మతానికి యోగి ఆదిత్యనాథ్ ఒక రాజ్యాంగపరమైన అధికారి. అందుకే ఆయన వ్యాఖ్యలపై మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది’ అని కొత్త పూజారి దీపక్ గంభీర్ అంటున్నారు. మతంతో రాజ్యాధికారం! ఆంజనేయుడి ఆలయాలపై పెత్తనం సాధిస్తామంటూ భీమ్ ఆర్మీ చేసిన ప్రకటనను దళితుల్లోనే కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడకుండా ఇలా ఆలయాల్లో పూజారులుగా నియమిస్తే ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, చైతన్యపరచడం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే బహుజన్ డైవర్సిటీ మిషన్‌కు చెందిన హెచ్.ఎల్.దుసధ్ వాదన భిన్నంగా ఉంది. మతం అత్యంత శక్తిమంతమైనదని, దానిని చేతుల్లోకి తీసుకుంటే నైతికంగా బలం పుంజుకొని రాజ్యాధికారానికి బాటలు పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. కులానికో దేవుడుంటే లాభమా? కులానికో దేవుడు ఉన్న ఈ రోజుల్లో తాజా వివాదం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యాదవులందరూ కృష్ణుడు తమ కులదైవం అంటారు. కుష్వాహాలు రాముడి కుమారుడైన కుశుడి సంతతి వాళ్లమని భావిస్తారు. కుర్మీలు లవుడు తమ వాడేనని అంటారు. విశ్వకర్మ తమ కులదైవమని లోహార్లు చెబుతారు. వాల్మీకీ సంతతికి చెందినవాళ్లమని పారిశుధ్ధ్య కార్మికులు చెప్పుకుంటారు. జరాసంధుడి వారసులమని కహరా కులస్తులు (పల్లకీలు మోసే వృత్తి) చెప్పుకుంటారు. ఇలా ప్రతీ వెనుకబడిన కులాల వాళ్లూ సామాజికంగా తమ హోదాలు పెంచుకోవడానికి ఫలానా దేవుళ్లకి వారసులమని చెప్పుకోవడం పరిపాటిగా మారిందని సోషయాలజిస్టు ఎం.ఎన్. శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారు. -
అయోధ్యలో రాముని భారీ విగ్రహం!
లక్నో: అయోధ్యలోని సరయూ నదీ తీరంలో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నట్లు సమాచారం. 36 మీటర్ల పీఠంపై 100 మీటర్ల ఎత్తైన రాముని విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే దీపావళి రోజు ప్రకటించనున్నారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ.. దీపావళి రోజు అయోధ్యకు సంబంధించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక శుభవార్త చెప్పనున్నారని, అది ఆయన ద్వారానే వింటే బావుంటుందన్నారు. -
నేను కోరుకుంటే నిమిషంలో సీఎం అవుతా : ప్రముఖ నటి
జైపూర్ : తాను కోరుకుంటే నిమిషంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. గురువారం రాజస్తాన్‌లోని బాన్స్వారాలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె ఈ మాటలన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘ నేను బంధీని కావాలనుకోవటం లేదు. నా స్వేచ్ఛ అంతటితో ముగిసిపోతుంది. ఒక వేళ ముఖ్యమంత్రి అయ్యేఅవకాశం నన్ను వెతుకుంటూ వస్తే తప్పకుండా అవుతాను. ఇప్పుడైతే ఆ ఉద్ధేశం లేద’ని అన్నారామె. హేమమాలిని సినిమాలకు కొద్దిగా దూరమైన తర్వాత రాజకీయాలలో బిజీ అయ్యారు. 1999లో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందించారు. 2014లో బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె తన ప్రత్యర్థి జయంత్ చౌదరిపై అత్యథిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. -
‘అక్బర్ గొప్ప చక్రవర్తేం కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్ప చక్రవర్తి’ అని పేర్కొన్నారు. గురువారం లక్నో ఐఎమ్‌ఆర్‌టీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘మహారాణా ప్రతాప్ గొప్పవీరుడు, శౌర్యవంతుడు. వేరేమతానికి చెందిన వాడైన విదేశీయుడు అక్బర్ చక్రవర్తిత్వాన్ని ఆయన ఒప్పుకోలేదు. అంతేకాక ఆ విషయాన్ని నేరుగా అక్బర్ రాయబారితోనే చెప్పగలిగాడు. మహారాణా ప్రతాప్ రాజ్యాన్ని కోల్పోయి దేశాలు పట్టుకుతిరిగినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోలేదు. అందుకే విదేశియుడైన అక్బర్‌ను చక్రవర్తిగా ఒప్పుకోలేదు. కానీ దురదృష్టం కొద్ది మన చరిత్రకారులు ఇలాంటి అంశాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఒక తరం మొత్తం ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం కొల్పోయింది. మహారాణా ప్రతాప్ జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శదాయకం. ఆయన జీవితం నుంచి నేటి యువత శౌర్యం, ప్రతాపం వంటి లక్షణాలను అలవర్చుకోవా’లని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగి ‘యువశౌర్య’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో మహారాణా ప్రతాప్ జీవితం, ధైర్యసాహసాల గురించి వ్యాసాలు, కథలను పొందుపర్చారు. గతంలోనూ... ముస్లీం పాలకుల గురించి నోరు పారేసుకోవడం బీజేపీ నేతలకు ఇదే ప్రథమం కాదు. కొన్ని రోజుల క్రితం బల్లియా సురేంద్ర సింగ్ అనే ఒక బీజేపీ ఎమ్మేల్యే ప్రపంచ వింతల్లో ఒకటైన ‘తాజమహల్’ పేరును ‘రామ్ లేదా క్రిష్ణ మహల్ లేదా రాష్ట్ర భక్తి మహల్’గా మార్చాలన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి సమాజ్‌వారి పార్టీ నేత రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల నాటికి సమాజాన్ని మతం ప్రతిపాదికను చీల్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. బీజేపీ, ఆ పార్టీ నేతలు ఎవరు కూడా చరిత్రను మార్చలేరు. అది తెలియకుండా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నార’ని విమర్శించారు. -
యోగి ఎఫెక్ట్.. డాన్ల ఆటలకు చెక్
లక్నో: సంచలన, కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. జైళ్ల అధికారుల అవినీతిపై దృష్టి సారించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న మాఫియా డాన్లకు అయినా చిన్నపాటి నేరస్తులకు అయినా ఒకే ఆహారం అందించాలని, ఖైదీలందరినీ ఒకేలా చూడాలని అధికారులను యోగి ఆదేశించారు. యూపీ హోం, జైళ్ల శాఖ, విజిలెన్స్ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో కొందరు డాన్లు, కరడుగట్టిన నేరస్తులు జైళ్లలో ఫోన్లు వాడుతున్నారని, ప్రత్యేక వసతులు పొందుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపణలు రావడంతో యోగి.. ఈ సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జైళ్లలో ఖైదీలందరినీ ఒకేలా చూడాలని, మొబైల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను అదేశించారు. కరడుగట్టిన నేరగాళ్లపై ఎలాంటి దయ చూపవద్దని అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖలో అన్ని విభాగాల్లో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులతో సంబంధాలున్న అధికారులను గుర్తించాలని యోగి ఆదేశించారు. యూపీ సీఎం యోగి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పుణ్యక్షేత్రాలున్న చోట మద్యం షాపులు, అమ్మకాలపై నిషేధం విధించారు. -
సీఎం యోగి.. నెలలో పెరిగిన పాపులారిటీ
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనకు, ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా అక్రమ కబేళాలను మూసివేయించడం, ఆకతాయిల నుంచి మహిళలను రక్షించడానికి యాంటీ రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేయడం వల్ల యోగి పాపులారిటీ పెరిగిందని ఓ సర్వేలో తేలింది. నెల రోజుల్లో యోగి పాలన ఎలా ఉంది, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యమా? అంటూ యూపీలోని 20 జిల్లాల్లో 2 వేల మందితో అభిప్రాయాలు తెలుసుకున్నారు. యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్రమ కబేళాల మూసివేత, యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటు, వీఐపీ సంస్కృతి రద్దు, ప్రభుత్వ ఆఫీసుల్లో పాన్ మసాలా, పొగాకు వాడకంపై నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. యోగి నిర్ణయాలకు 62 శాతం మంది ప్రజల నుంచి మద్దతు లభించింది. యోగి ప్రభుత్వం సరైన దిశలో పనిచేస్తుందని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటు చేయడాన్ని ముఖ్యంగా మహిళలు సమర్థిస్తున్నారు. కాగా కబేళాల మూసివేత, యాంటీ రోమియో స్క్వాడ్లు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలపై కొందరు విమర్శించారు. -
మంత్రులు, అధికారులు.. ఉరుకులు, పరుగులు
ఇంతకుముందు సాయంత్రం 6 గంటలైతే చాలు.. లక్నోలోని సచివాలయం మొత్తం బోసిపోయినట్లు ఉండేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత మంత్రులు, అధికారులు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. పెద్ద పదవుల్లో, పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నామని ఇన్నాళ్ల బట్టి హాయిగా కూర్చున్న పెద్ద మనుషులంతా ఇప్పుడు ఆయాసపడుతూ అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట రావడం పాపం.. వెనువెంటనే దాన్ని పాటించక తప్పడం లేదు. మంత్రులు కూడా ఇదివరకటిలా అధికారాన్ని అనుభవించడం కాకుండా, తమ తమ శాఖల కార్యదర్శులతో నిత్యం చర్చలలో మునిగిపోవాల్సి వస్తోంది. రాత్రి 11 గంటలకు కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఫైళ్లు పట్టుకుని అధికారులు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఏ నిమిషంలో ఆయన ఏ సమాచారం అడుగుతారో తెలియకపోవడంతో.. ప్రతి ఫైలూ సమావేశానికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమావేశాలు కూడా చాలా ఎక్కువ సేపు కొనసాగుతున్నాయి. ఇంతకుముందులా సాయంత్రం 6 గంటలకు బయల్దేరి ఇళ్లకు వెళ్లి టీవీలు చూస్తూ జంక్ ఫుడ్ తినడానికి వీల్లేకపోవడంతో ఉన్నతాధికారులకు సైతం పొట్టలు కరుగుతున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి వాళ్లకూ బాధ్యతలను అప్పగిస్తూ, ఆ పని పూర్తయ్యేవరకు వాళ్లే చూసుకునేలా చేస్తున్నారు. మొదటి వందరోజులకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయిస్తూ, వాటిని పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు ఏం వేస్తారో సిద్ధం చేసుకు రమ్మని చెబుతున్నారు. తొలి వందరోజుల పాలన పూర్తయిన తర్వాత బాగా పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని, అలాగే పని ఎగ్గొట్టేవారు, సరైన ఫలితాలు రాబట్టని వారి మీద మాత్రం చర్యలు తప్పవని చెబుతున్నారు. ఆ తర్వాత 6 నెలలకు, ఏడాదికి ఒక్కోసారి చొప్పున అందరి మీద సమీక్ష ఉంటుందన్నారు. రాత్రి 11 గంటలకు నిర్వహించిన విద్యాశాఖ సమావేశానికి కేబినెట్ మంత్రి ముకుట్ బిహారీ వర్మను కూడా పిలిపించారు. ప్రస్తుతం విద్యావ్యవస్థ తీరుతెన్నులు, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లాంటి ముఖ్యమైన అంశాలను చర్చించారు. వంద రోజుల్లోగా ఫీజులను ఒక కొలిక్కి తేవాలని ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు బాధ్యత అప్పగించారు. రోజుకు కనీసం 18-20 గంటలు పనిచేసేవాళ్లే తనకు కావాలని ఇటీవల గోరఖ్‌పూర్‌లో చెప్పిన మాటలను ఇప్పుడు చేసి చూపిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. -
యోగికి జెడ్ ప్లస్ సెక్యురిటీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి అత్యంత కట్టుదిట్టమైన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీని కల్పించారు. కేంద్ర పారామిలటరి బలగాలతో యోగి ఆదిత్యనాథ్ కు జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీ సెక్యురిటీని కల్పిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆ కేటగిరీ కింద ఆయన ఎక్కడికి వెళ్లినా నేషనల్ సెక్యురిటీ గార్డు కమాండోలు ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాచుకుని రక్షణ కల్పిస్తారు. ఓ పైలట్, భద్రతాదళలతో కూడిన ఎస్కార్ట్ వాహనం ఎప్పుడూ యోగి వెంట వెళ్లనుంది. మొత్తం 25-28 మంది కమాండోలు అధునాతన ఆయుధాలతో యోగికి రక్షణ కల్పించనున్నారు. యోగి నివాసం చుట్టూ కూడా సెక్యురిటీ కాపలా కాయనుంది. ఎక్కువ భద్రత ముప్పు ఉన్న వీవీఐపీలకు మాత్రమే ఈ జెడ్ ప్లస్ సెక్యురిటీని అందిస్తారు. ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఉత్తరప్రదేశ్ ను బీజేపీ సొంతం చేసుకోవడంతో, ఐదు సార్లు గోరఖ్ పూర్ ఎంపీగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ మార్చి 19న ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే యోగి ఇప్పటివరకు 'వై' కేటగిరీ వీవీఐపీ సెక్యురిటీని మాత్రమే పొందారు. ఈ కేటగిరీ కింద ఆయన వెంట ఇన్నిరోజులు కేవలం 2-3 కమాండోలు మాత్రమే ఉన్నారు. ఆశ్చర్యకరంగా యోగికి ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ కూడా పదవిలోకి వచ్చిన కొన్ని రోజులకే జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యురిటీని పొందారు. -
నమాజ్, సూర్య నమస్కారాలు ఒకలాంటివే: యోగి
సూర్య నమస్కారాల్లో భాగంగా వేసే ఆసనాలు నమాజ్‌కు చాలా దగ్గరగా ఉంటాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తద్వారా యోగాకు, హిందూ మతానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. 'సూర్య నమస్కారాలలో వేసే అన్ని ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామ క్రియలు.. ఇవన్నీ కూడా మన ముస్లిం మిత్రులు నమాజ్ సమయంలో చేసేటట్లుగానే ఉంటాయి' అని లక్నోలో నిర్వహించిన ఒక యోగా కార్యక్రమంలో ఆయన అన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు భోగాల గురించి చూశారే తప్ప యోగ గురించి చూడలేదని, అందుకే ఈ రెండింటినీ కలిపే ప్రయత్నం కూడా చేయలేదని ఆదిత్యనాథ్ అన్నారు. కులమతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలనుకునేవాళ్లు యోగాను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యోగాను అంతర్జాతీయం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 2014 కంటే ముందు ఎవరైనా యోగా గురించి మాట్లాడితే వాళ్లకు మతం రంగు అంటగట్టేవారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా పాల్గొన్నారు. ఆయన పక్కన కూర్చునే యోగి ఆదిత్యనాథ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. -
150 గంటల్లో సీఎం యోగి రికార్డు నిర్ణయాలు
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ రాష్ట్రాలకు కొత్త వ్యక్తులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ వారిలో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పేరు మాత్రం అటు ప్రధాన వార్తల్లో, ఇటు సోషల్ మీడియాలో వాయువేగంతో దూసుకెళుతోంది. ఆయనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోజుకు కనీసం ఓ నాలుగైదుసార్లు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ వారం రోజుల్లో ఆయన పనితీరును గమనిస్తే నిజంగానే అలుపంటూ లేకుండా పనిచేస్తున్నారనే విషయం అర్ధమవుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా ఆయన పగ్గాలు చేపట్టి దాదాపు 150 గంటలు కావొస్తుంది. ఈ గడువులో ఆయన ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారో తెలిస్తే కచ్చితంగా నొరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన ఈ 150గంటల్లో 50 నిర్ణయాలు తీసుకొని వాటిని శరవేగంగా అమలుచేయించేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్క కేబినెట్ సమావేశం కూడా నిర్వహించకుండానే వారం గడువులోనే దాదాపు అర్ధసెంచరీ నిర్ణయాలు తీసుకున్న తొలి ముఖ్యమంత్రి ఒక్క యోగి అని చెప్పడం కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఆయన నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకున్నారో దానికి మిశ్రమ స్పందన కూడా అంతే వేగంతో వస్తోంది. ఈవ్ టీజింగ్ నియంత్రణకు, ప్రభుత్వ అధికారుల సమయపాలన, పారిశుధ్య పనులు, రోడ్ల నిర్మాణం తదితరమైనవి మొత్తం 50 నిర్ణయాలు యోగి తీసుకున్నారు. అందులో టాప్ 15 నిర్ణయాలు ఒకసారి పరిశీలిస్తే.. 1. రాష్ట్రంలోని అన్ని రహదారులు బీతావాహంగా మారాయి. వీటికి జూన్ 15నాటికి విముక్తి ప్రసాదించాలి 2.మహిళల సంరక్షణ కోసం ప్రత్యేక రోమియో టీములు 3.ప్రభుత్వ కార్యాలయాల్లోకి పాన్, గుట్కా, పాలిథిన్ కవర్లు నిషేధం 4.ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించేలా సిటిజన్స్ చార్టర్ ఏర్పాటు 5.ప్రతి నెల ప్రతి శాఖ అభివృద్ధి పనులపై నివేదిక అందించాలి 6.ప్రభుత్వ గుర్తింపు లేని కబేళాల, మాంసం విక్రయశాలల మూసివేత. 7.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు 8.అలహాబాద్, మీరట్, ఆగ్రా, గోరఖ్‌పూర్, ఝాన్సీలో మెట్రో రైలు 9.ప్రభుత్వ ఫైళ్లను ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం 10.రాజకీయ నాయకుల భద్రతపై సమీక్షలు 11.అధికారులు, మంత్రుల ఆస్తుల వివరాల అందజేతకు ఆదేశాలు 12.అన్ని సహకార సంఘాలు పనిచేసేలా చర్యలు 13.ఉపాధ్యాయులు పాఠశాలల్లో టీ షర్ట్లు వేయకుండా నిషేధం 14.అత్యవసరంలో తప్ప సాధారణ సమయాల్లో టీచర్ల ఫోన్ వాడకంపై నిషేధం 15.ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ ఏర్పాటు -
పోలీసులకు సీఎం యోగి ఝలక్
-
సీఎం అయ్యే విషయం యోగికి ముందే తెలుసు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పేరు అనూహ్యంగా ముందుకొచ్చిందని అందరూ భావించారు. ఎవరికి తెలిసినా, తెలియకపోయినా తానే ముఖ్యమంత్రినవుతాననే విషయం ఆదిత్యనాథ్‌కు ముందే తెలుసనే విషయం ‘చల్తే చల్తే’ అనే ఓ టీవీ కార్యక్రమానికిచ్చిన ఇంటర్వ్యూను చూస్తే అర్థం అవుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో అన్ని కబేళాలను మూయిస్తామని, అందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని ఆ ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పోలీసులతో ‘యాంటీ రోమియో దళాలను’ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే ఈ రెండు హామీలను వెంటనే అమలు చేశారు. దేశంలో ఒక్క యూపీలోని గోరఖ్‌పూర్‌లో మాత్రమే ముస్లింల జనాభా పెరుగకుండా నియంత్రించ గలిగామని, తాము రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడే ఇది సాధించగలిగినప్పుడు కేంద్రంలో అధికారంలోవున్న బీజేపీ దేశవ్యాప్తంగా వారి జనాభా పెరగకుండా ఎందుకు చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా యోగి చెప్పారు. యూపీలో క్రైస్తవుల సంఖ్య నానాటికి పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విలాస జీవితాల ఆశ చూపుతూ క్రైస్తవ మహిళను పెళ్లి చేసుకునేందుకు హిందూ యువకులను తప్పుదారి పట్టిస్తున్నారని కూడా ఆయన అన్నారు. క్రైస్తవుల సంఖ్యను కూడా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యోగి అభిప్రాయపడ్డారు. -
పోలీసులకు సీఎం యోగి ఝలక్
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనశైలిలో ముందుకు వెళుతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టిన ఆయన ప్రభుత్వ కార్యాలయాలను సంస్కరించే పనిలో పడ్డారు. సచివాలయంలో పాన్, గుట్కా నిషేధించిన ఆయన గురువారం లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సీఎం స్టేషన్ కు రావడంతో పోలీసులు పరుగులు పెట్టారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులు, మినీ సెల్స్, లాకప్ సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ‘ఇది మొదటి ఆడిట్. చివరి ఆడిట్ మాత్రం కాదు’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. న్యాయాన్ని కాపాడేందుకు పోలీసులు అండగా నిలబడాలని ఆయన కోరారు. తమకు కావాల్సిన అన్ని వసతులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి హామీయిచ్చారని పోలీసు ఉన్నతాధికారి జావేద్ అహ్మద్ తెలిపారు. -
సీఎం యోగిపై కైఫ్ కామెంట్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టడాన్ని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్వాగతించాడు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కు అభినందనలు. ఆయన పాలనలోరాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని, యూపీ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతిఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై ముందుగానే అనుమానాలు వ్యక్తం చేయకుండా శుభాకాంక్షలు చెప్పడం మంచిది. దేశాభివృద్ధి బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నాన’ని కైఫ్ ట్వీట్ చేశాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కైఫ్ ఘోర పరాజయం చవిచూశాడు. క్రికెటర్ గా అతనికున్న క్రేజ్ ఎన్నికల్లో పనిచేయలేదు. -
లోక్‌సభలో యోగి చివరి ప్రసంగమిదే
-
లోక్‌సభలో యోగి చివరి ప్రసంగమిదే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్లమెంటులో తన చివరి ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. మోదీ ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా మారారని కొనియాడారు. ప్రపంచం మొత్తం మోదీనే గమనిస్తుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. లోక్‌సభ సభ్యుడు అయిన ఆదిత్యనాథ్ ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. దీంతో మంగళవారం ఢిల్లీకి వచ్చి అమాత్యులను కలిసిన ఆయన చివరి ప్రసంగంగా లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 'దేశ ఆర్థికాభివృద్ధి మోదీతోనే సాధ్యం. మోదీ చొరవవల్లే గోరఖ్‌పూర్‌కు ఎయిమ్స్ వచ్చింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రపంచం మోదీని గమనిస్తుంది. అభివృద్ధికి మతంతో సంబంధం లేదు. రెండున్నరేళ్లలోనే ఉత్తరప్రదేశ్‌కు మోదీ 2.30లక్షల కోట్లు ఇచ్చారు. గత 15 ఏళ్లలో ఇప్పటి వరకు గోరఖ్‌పూర్‌లో ఒక్క హింసాయుత ఘటన కూడా చోటుచేసుకోలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థికవృద్ధి రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ పార్లమెంటులో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను' అంటూ యోగి ప్రసంగించారు. -
యోగి.. యూపీ సీఎం ఎలా అయ్యారు?
న్యూఢిల్లీ: మీడియా అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎంపిక చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. సొంత పార్టీ సీనియర్ నేతలు కూడా ఆదిత్యనాథ్ ను ఎంపిక చేస్తారని ఊహించలేదు. ఆయన ఎంపికలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం కూడా లేదని సమాచారం. మరి 'గోరఖ్ పూర్ సన్యాసి'ని యూపీ సీఎంగా ఎంపిక చేయడానికి కారణాలు ఏంటి? ప్రజాదరణ, రాజకీయంగా నిబద్దత, నిరాడంబరత, ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన చూపిన క్రమశిక్షణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆదిత్యనాథ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. యూపీలో బీజేపీ నిర్వహించిన ప్రతి సర్వేలోనూ ఆదిత్యనాథ్ కు మంచి మార్కులు రావడంతో బీజేపీ పెద్దలు ఆయనవైపు మొగ్గుచూపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజ్ నాథ్ సింగ్ తర్వాత స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పట్ల రాజ్ నాథ్ సింగ్ విముఖత వ్యక్తం చేయడంతో ఆయన తర్వాత స్థానంలో ఉన్న ఆదిత్యనాథ్ ను అదృష్టం వరించింది. యూపీ ఓటర్లు కమలం పార్టీ స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో స్టార్ కాంపెయినర్ గా ఉన్న ఆదిత్యనాథ్ చూపిన స్వయం క్రమశిక్షణ కూడా పార్టీ పెద్దలను ఆకట్టుకుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఏడో దశ ఎన్నికల్లో ఆయన ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో పెద్ద ఎత్తున పోటీ చేసిన తిరుగుబాటు అభ్యర్థులను ఓడించడానికి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని, ఆయనలా మరొకరు కష్టపడలేదని తెలిపారు. ముక్కుసూటిగా మాట్లాడడం, నిరాడంబర జీవితం గడిపే ఆదిత్యనాథ్ వ్యక్తిత్వం అమిత్ షాను ఎంతో ఆకట్టుకుందని మరో బీజేపీ నాయకుడు వెల్లడించారు. -
23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. దారితప్పి కీచకులుగా మారి ఆత్యాచారాలకు పాల్పడుతున్నారు. యూపీలో గత 14 నెలల్లో నమోదైన 23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు నిందితులుగా ఉన్నారు. సాక్షాత్తూ యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీ అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలీస్ స్టేషన్లలోనే అత్యాచారాలు జరగడం దారుణం. కాగా వీరిలో 11 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇద్దరు కోర్టులో లొంగిపోగా, విచారణాంతరం మరో 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్ల నుంచి తొలగించారు. మిగిలిన కేసులు విచారణ దశలో ఉన్నాయి.