ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్లమెంటులో తన చివరి ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. మోదీ ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా మారారని కొనియాడారు. ప్రపంచం మొత్తం మోదీనే గమనిస్తుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. లోక్‌సభ సభ్యుడు అయిన ఆదిత్యనాథ్ ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. దీంతో మంగళవారం ఢిల్లీకి వచ్చి అమాత్యులను కలిసిన ఆయన చివరి ప్రసంగంగా లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..