లక్నో : ఐఐఎం లక్నో సహకారంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ముందుకెళతామని సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు. ఐఐఎం లక్నో సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులతో మంధన్ పేరిట జరిగిన నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో సీఎం యోగితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ప్రభుత్వంతో చేతులు కలిపి, ఆయా కార్యక్రమాలను ముందుకు తీసుకెళితే మంచి ఫలితాలు అందివస్తాయని యోగి ఆదిత్యానాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం బృందంలా కలిసిపనిచేయడం కోసం ఈ శిక్షణ తమకు ఉపకరిస్తుందని చెప్పారు. లక్ష్యాలను అధిగమించి మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు దోహదపడుతుందని అన్నారు. మూడు దశల్లో జరిగే శిక్షణ కార్యక్రమంలో ఇది రెండవది కాగా, ఈ కార్యక్రమానికి 50 మంది మంత్రులు, అధికారులు హాజరై మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను ఐఐఎం లక్నో సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల నుంచి నేర్చుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సుపరిపాలనకు ఈ శిక్షణ నేపథ్యంలో ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment