లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఫోన్లపై నిఘా పెట్టారని, ట్యాపింగ్ చేయిస్తున్నారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన సంభాషణలను ప్రతిరోజు సాయంత్రం యోగి వింటున్నారని అన్నారు. యోగిని నిరుపయోగిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూపీ సీఎంపై ప్రశంసలు కురిపిస్తూ ఆంగ్లంలో యూపీ, యోగి కలిస్తే ‘ఉపయోగి’ అవుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆదివారం అఖిలేఖ్ విలేకరులతో మాట్లాడారు. ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోంది కాబట్టి తనతో మాట్లాడేటపుడు జాగురుకతతో ఉండాలని విలేకరులకుసూ చించారు. యోగి సర్కారు రాష్ట్రంలో ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నడుపుతోందని విమర్శించారు. ఓటమి భయంతోనే 12 మంది బీజేపీ పాలితరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవల వారణాసి, ఆయోధ్యల్లో పర్యటించారన్నారు. లఖింపూర్ ఖేరి హింసాకాండలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వెనకేసుకొస్తున్నాయన్నారు. అధికారంలోకి వస్తే యూపీలో కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment