సీఎం యోగిపై కైఫ్ కామెంట్ | Mohammad Kaif welcomes Yogi Adityanath's appointment as new Uttar Pradesh CM | Sakshi
Sakshi News home page

సీఎం యోగిపై కైఫ్ కామెంట్

Published Wed, Mar 22 2017 12:59 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

సీఎం యోగిపై కైఫ్ కామెంట్

సీఎం యోగిపై కైఫ్ కామెంట్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టడాన్ని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌ స్వాగతించాడు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు.

‘యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ కు అభినందనలు. ఆయన పాలనలోరాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని, యూపీ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతిఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై ముందుగానే అనుమానాలు వ్యక్తం చేయకుండా శుభాకాంక్షలు చెప్పడం మంచిది. దేశాభివృద్ధి బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నాన’ని కైఫ్‌ ట్వీట్ చేశాడు.

2014 లోక్ సభ ఎన్నికల్లో ఫూల్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కైఫ్ ఘోర పరాజయం చవిచూశాడు. క్రికెటర్ గా అతనికున్న క్రేజ్‌ ఎన్నికల్లో పనిచేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement