యోగికి జెడ్ ప్లస్ సెక్యురిటీ | Uttar Pradesh CM Yogi Adityanath to get Z Plus security cover | Sakshi
Sakshi News home page

యోగికి జెడ్ ప్లస్ సెక్యురిటీ

Published Thu, Mar 30 2017 7:20 PM | Last Updated on Mon, May 28 2018 1:46 PM

యోగికి జెడ్ ప్లస్ సెక్యురిటీ - Sakshi

యోగికి జెడ్ ప్లస్ సెక్యురిటీ

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి అత్యంత కట్టుదిట్టమైన జెడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీని కల్పించారు. కేంద్ర పారామిలటరి బలగాలతో యోగి ఆదిత్యనాథ్ కు జెడ్ ప్లస్ కేటగిరీ వీవీఐపీ సెక్యురిటీని కల్పిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆ కేటగిరీ కింద ఆయన ఎక్కడికి వెళ్లినా నేషనల్ సెక్యురిటీ గార్డు కమాండోలు ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాచుకుని రక్షణ కల్పిస్తారు.  ఓ పైలట్, భద్రతాదళలతో కూడిన ఎస్కార్ట్ వాహనం ఎప్పుడూ యోగి వెంట వెళ్లనుంది. మొత్తం 25-28 మంది కమాండోలు అధునాతన ఆయుధాలతో యోగికి రక్షణ కల్పించనున్నారు. యోగి నివాసం చుట్టూ కూడా సెక్యురిటీ కాపలా కాయనుంది. 
 
ఎక్కువ భద్రత ముప్పు ఉన్న వీవీఐపీలకు మాత్రమే ఈ జెడ్ ప్లస్ సెక్యురిటీని అందిస్తారు. ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఉత్తరప్రదేశ్ ను బీజేపీ సొంతం చేసుకోవడంతో, ఐదు సార్లు గోరఖ్ పూర్ ఎంపీగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్ మార్చి 19న ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే యోగి ఇప్పటివరకు 'వై' కేటగిరీ వీవీఐపీ సెక్యురిటీని మాత్రమే పొందారు. ఈ కేటగిరీ కింద ఆయన వెంట ఇన్నిరోజులు కేవలం 2-3 కమాండోలు మాత్రమే ఉన్నారు. ఆశ్చర్యకరంగా యోగికి ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్ యాదవ్ కూడా పదవిలోకి వచ్చిన కొన్ని రోజులకే జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యురిటీని పొందారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement