23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు | 29 UP cops named in 23 rape cases in 14 months: CM | Sakshi
Sakshi News home page

23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు

Published Wed, Aug 19 2015 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు

23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు

లక్నో: ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. దారితప్పి కీచకులుగా మారి ఆత్యాచారాలకు పాల్పడుతున్నారు.  యూపీలో గత 14 నెలల్లో నమోదైన 23 రేప్ కేసుల్లో 29 మంది పోలీసులు నిందితులుగా ఉన్నారు.

సాక్షాత్తూ యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీ అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలీస్ స్టేషన్లలోనే అత్యాచారాలు జరగడం దారుణం. కాగా వీరిలో 11 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇద్దరు కోర్టులో లొంగిపోగా, విచారణాంతరం మరో 8 మంది పేర్లను ఎఫ్ఐఆర్ల నుంచి తొలగించారు. మిగిలిన కేసులు విచారణ దశలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement