దేవతామూర్తులతో నన్ను పోల్చొద్దు | Not compared to goddess, says Tamilisai Soundararajan | Sakshi
Sakshi News home page

దేవతామూర్తులతో నన్ను పోల్చొద్దు

Published Sun, Aug 23 2015 11:16 AM | Last Updated on Fri, Mar 29 2019 6:01 PM

దేవతామూర్తులతో నన్ను పోల్చొద్దు - Sakshi

దేవతామూర్తులతో నన్ను పోల్చొద్దు

చెన్నై : తనను దేవతామూర్తులతో సరిపోలుస్తూ చిత్రాలు చిత్రించ వద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కార్యకర్తలకు సూచించారు. పుదుక్కోట్టై సహా కొన్ని ప్రాంతాల్లో బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను సరస్వతి, లక్ష్మి వంటి దేవతామూర్తుల రూపంతో చిత్రించి పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఇది తమిళిసై సౌందరరాజన్ దృష్టికి వచ్చింది. దీన్ని ఖండిస్తూ ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
 
మనమంతా దైవాశీస్సులు పొందినవారమని, అదే సమయంలో కార్యకర్తలు అత్యుత్సాహంతో దేవుళ్లు, దేవతామూర్తుల చిత్రాలతో నేతలను సరిపోలుస్తున్నారని, ఆ విధంగా చేయడం సరికాదన్నారు. ఇకపై ఇటువంటి చర్యలలో కార్యకర్తలు పాల్పడకూడదని హితవు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement