సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటు కావడం తథ్యం అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడాన్ని పురస్కరించుకుని కమలాలయంలో ఆ పార్టీ వర్గాలు ఆనందాన్ని పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తి అయింది. దీంతో సంబరాల్లో కమలనాథులు ము ని గా రు. ఉదయాన్నే పార్టీ వర్గాలు టీ నగర్‌లోని కమలాల యానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బాణ సంచా పేల్చుతూ ఆనందం పంచుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్వీట్లు పంచి పెట్టారు. ఈసందర్భంగా అక్కడి ఆడిటోరియంలో ఏడాది ప్రగతిని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీనియర్ నేత ఇలగణేషన్ ప్రారంభించారు. అనంతరం అక్కడ సిద్ధం చేసిన అతి పెద్దకేక్‌ను తమిళి సై కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.
కూటమి తథ్యం : జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష స్పందన వస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో పథకాలను, ప్రాజెక్టులను ఇచ్చే పనిలో ఉందన్నారు. రాష్ర్టంలో ఆరోగ్యకర రాజకీయ వాతావరణం నెలకొల్పేందుకు బీజేపీ ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే జయలలితకు అభినందనలు తెలియజేశామన్నారు. అలాగే డీఎంకే అధినేత కరుణానిధి సోదరి మరణ సమాచారంతో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తన సానుభూతిని తెలియజేశారన్నారు. డీఎంకే కుటుంబ శుభకార్య వేడుకకు అన్ని పార్టీల నాయకులను స్టాలిన్ ఆహ్వాని స్తుండడం కూడా ఇందులో ఓ భాగమేనని వ్యాఖ్యాని ంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ బలమైన శక్తిగా నిలవబోతున్నదని ధీమా వ్యక్తం చే శారు. బీజేపీ నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటు కావడం తథ్యమని స్పష్టం చేశారు. గురువారం చెన్నై ఆర్‌కే నగర్‌లో ఏడాది పాలనలో చేపట్టిన ప్రగతిని వివరిస్తూ బహిరంగ సభకు నిర్ణయించామన్నారు.
కూటమి తథ్యం
Published Wed, May 27 2015 2:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement