భువనేశ్వర్: బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఒడిశాలోని పూరీ జిల్లాలో కొనసాగుతున్న ఝాము జాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామదేవత దులన్ అమ్మవారికి పాత్ర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి సంప్రదాయం ప్రకారం జాతరలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై నడిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు.
‘ఈ రోజు, నేను పూరీ జిల్లాలోని సమంగ్ పంచాయితీకి చెందిన రెబాటి రామన్ గ్రామంలోని జాతరలో పాల్గొన్నాను. అగ్ని గుండం మీద నడిచి ఆమ్మవారి ఆశీర్వాదం పొందాను. ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని వారి శ్రేయస్సు కోసం ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించానని‘ ట్వీట్ చేశారు. ఝాము జాతరలో కోరికలు నెరవేరాలని అమ్మవారు దులన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నిప్పుల మీద నడవడం ఆ ప్రాంత సంప్రదాయం.
కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడంతో పార్టీ సంబిత్ పాత్రను భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో పూరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు కానీ బిజూ జనతాదళ్ (బిజెడి)కి చెందిన పినాకి మిశ్రా చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
शक्ति पूजा हमारी सनातन संस्कृति एवं परंपरा का अहम हिस्सा है, पुरी जिले के समंग पंचायत के रेबती रमण गांव में आयोजित यह दण्ड और झामू यात्रा इसी प्राचीन परंपरा का प्रतीक है।
— Sambit Patra (@sambitswaraj) April 11, 2023
इस तीर्थयात्रा में अग्नि पर चलकर मां की पूजा-अर्चना एवं आशीर्वाद प्राप्त कर, खुद को धन्य अनुभव कर रहा हूँ।… pic.twitter.com/oTciqW61Gj
Comments
Please login to add a commentAdd a comment