coals
-
నిప్పులపై 10 మీటర్లు నడిచిన బీజేపీ నేత.. వీడియో వైరల్!
భువనేశ్వర్: బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఒడిశాలోని పూరీ జిల్లాలో కొనసాగుతున్న ఝాము జాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామదేవత దులన్ అమ్మవారికి పాత్ర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి సంప్రదాయం ప్రకారం జాతరలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై నడిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ‘ఈ రోజు, నేను పూరీ జిల్లాలోని సమంగ్ పంచాయితీకి చెందిన రెబాటి రామన్ గ్రామంలోని జాతరలో పాల్గొన్నాను. అగ్ని గుండం మీద నడిచి ఆమ్మవారి ఆశీర్వాదం పొందాను. ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని వారి శ్రేయస్సు కోసం ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించానని‘ ట్వీట్ చేశారు. ఝాము జాతరలో కోరికలు నెరవేరాలని అమ్మవారు దులన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నిప్పుల మీద నడవడం ఆ ప్రాంత సంప్రదాయం. కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనడంతో పార్టీ సంబిత్ పాత్రను భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో పూరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు కానీ బిజూ జనతాదళ్ (బిజెడి)కి చెందిన పినాకి మిశ్రా చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. शक्ति पूजा हमारी सनातन संस्कृति एवं परंपरा का अहम हिस्सा है, पुरी जिले के समंग पंचायत के रेबती रमण गांव में आयोजित यह दण्ड और झामू यात्रा इसी प्राचीन परंपरा का प्रतीक है। इस तीर्थयात्रा में अग्नि पर चलकर मां की पूजा-अर्चना एवं आशीर्वाद प्राप्त कर, खुद को धन्य अनुभव कर रहा हूँ।… pic.twitter.com/oTciqW61Gj — Sambit Patra (@sambitswaraj) April 11, 2023 -
15న రన్ ఫర్ జీసస్
కర్నూలు (టౌన్) ; ఈస్టర్ పండగను పురస్కరించుకుని ఈనెల 15 వ తేదీన కర్నూలు నగరంలో నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిటీ పాస్టర్స్ సంఘం అధ్యక్షుడు రెవరెండ్ విలియం, సీనియర్ పాస్టర్ పాస్కల్ ప్రకాష్ పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక కోల్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో రన్ ఫర్ జీసస్ టీ–షర్టులను అవిష్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు పి. విజయకుమార్, నిర్వాహకులు డి.సుధీర్, రన్ ఫర్ జీసస్ కమిటీ సభ్యులు నరేష్, దేవేంద్రప్ప, అనిల్‌నాథ్, డేవిడ్‌పాల్ పాల్గొన్నారు. -
క్రైస్తవ ఆస్తులను కాపాడుకుందాం
– వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ – 22న కోల్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు క్రైస్తవుల భారీ ర్యాలీ – వివిధ రాజకీయ పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయం కర్నూలు సీక్యాంప్: కబ్జాదారుల నుంచి కోల్స్ కళాశాల స్థలాన్ని కాపాడుకుందామని కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. తెలుగు బాప్టిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ కొందరు కోల్స్ స్థలంతో పాటు ఎస్టీబీసీ డిగ్రీ కళాశాల, రాక్‌వుడ్ చర్చి, ఈసీఎం హైస్కూల్ స్థలాలను సైతం అన్యాయంగా ఆక్రమించుకున్నారని చెప్పారు. ఈ స్థలాల పరిరక్షణకు 22న క్రైస్తవులు నిర్వహించే ర్యాలీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రభుదాసు మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్న వారు లీజ్ పేరుతో క్రైస్తవ స్థలాలు కొల్లగొట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టించి అద్దెలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై తిరగబడలాని పిలుపునిచ్చారు. 22న చేపట్టే ర్యాలీకి కోల్స్ సంఘస్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో వివిధపార్టీల నాయకులు పాల్గొని తమ పూర్తి మద్దతు ప్రకటించారు -
‘కోల్స్’ స్థలాల ఆక్రమణ దారుణం
– కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (టౌన్): నగరంలో కోల్స్ కళాశాల స్థలాలను ఆక్రమించుకోవడం దారుణమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. స్థానిక కోల్స్ సెంటినీయల్ తెలుగు బాప్టిస్టు చర్చి ఎదుట బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలేదీక్షలకు గురువారం ఆమె సంఘీభావం తెలిపారు. దీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రకటించారు. స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న కోల్స్ కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కర్నూలు ప్రజలపై ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. క్రైస్తవుల ఆస్తులతో కొంతమంది నాయకులు వ్యాపారం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కోల్స్ స్థలాలను కోనుగోలు చేసిన, అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నగర కన్వీనర్ పి.జి. నరసింహాలు యాదవ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెహమాన్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, ఈశ్వర్ పాల్గొన్నారు. 22న భారీ ర్యాలీ.. కోల్స్ కళశాల స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 22వ తేదీన కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున క్త్రెస్తవుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుదాసు వెల్లడించారు. దీక్షలకు మద్దతు ప్రకటించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు సోమసుందరం మాదిగ మాట్లాడుతూ..ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. -
సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు డిమాండ్
- కోల్స్ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి - కాలేజీ ఎదుట క్రైస్తవుల ఆందోళన కర్నూలు (టౌన్) : నిషేధిత స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ మహబూబ్‌బాషాను సస్పెండ్ చేయాలని క్త్రెస్తవ సంఘాల నాయకులు, బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుదాస్ డిమాండ్ చేశారు. కోల్స్ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్నారు. ఆదివారం 11వ రోజు దీక్షలు కొనసాగాయి. స్థానిక కోల్స్ కళాశాల ఆవరణలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో క్త్రెస్తవులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు కమిటీ నాయకులు, కోల్స్ చర్చి సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ ఆథారిటీ పత్రాలు సృష్టించుకుని కోల్స్ కాలేజీ కాంపౌండ్‌ను అమ్ముకున్న పి.సోలమోన్ను అరెస్టు చేయాలన్నారు. సిగ్గు, షరం లేకుండా కోనుగోలు చేసిన రాజకీయ నేతలు స్వచ్చందంగా స్థలాన్ని వదులుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో అన్ని చర్చిలను ఏకం చేసి కొన్న, అమ్మిన వారి ఇళ్ల వద్ద దీక్షలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కోల్స్ స్థలం కబ్జాకు గురికావడంతో యావత్తూ క్త్రెస్తవ లోకం ఆందోళనలో ఉందన్నారు. ఉద్యమం ఉదృతం కాకముందే ... ప్రభుత్వం, అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చంద్రశేఖర్, షడ్రక్, దినకర్, సుధీర్‌కుమార్, స్టాన్లీజోన్స్, మాజీ కార్పోరేటర్ గిడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.