సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు డిమాండ్
సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్‌కు డిమాండ్
Published Sun, Feb 12 2017 10:18 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
- కోల్స్ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి
- కాలేజీ ఎదుట క్రైస్తవుల ఆందోళన
కర్నూలు (టౌన్) : నిషేధిత స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ మహబూబ్‌బాషాను సస్పెండ్ చేయాలని క్త్రెస్తవ సంఘాల నాయకులు, బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుదాస్ డిమాండ్ చేశారు. కోల్స్ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్నారు. ఆదివారం 11వ రోజు దీక్షలు కొనసాగాయి. స్థానిక కోల్స్ కళాశాల ఆవరణలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో క్త్రెస్తవులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు కమిటీ నాయకులు, కోల్స్ చర్చి సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ ఆథారిటీ పత్రాలు సృష్టించుకుని కోల్స్ కాలేజీ కాంపౌండ్‌ను అమ్ముకున్న పి.సోలమోన్‌ను అరెస్టు చేయాలన్నారు.
సిగ్గు, షరం లేకుండా కోనుగోలు చేసిన రాజకీయ నేతలు స్వచ్చందంగా స్థలాన్ని వదులుకోవాలన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో అన్ని చర్చిలను ఏకం చేసి కొన్న, అమ్మిన వారి ఇళ్ల వద్ద దీక్షలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కోల్స్ స్థలం కబ్జాకు గురికావడంతో యావత్తూ క్త్రెస్తవ లోకం ఆందోళనలో ఉందన్నారు. ఉద్యమం ఉదృతం కాకముందే ... ప్రభుత్వం, అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చంద్రశేఖర్, షడ్రక్, దినకర్, సుధీర్‌కుమార్, స్టాన్లీజోన్స్, మాజీ కార్పోరేటర్ గిడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement