‘కోల్స్’ స్థలాల ఆక్రమణ దారుణం
‘కోల్స్’ స్థలాల ఆక్రమణ దారుణం
Published Thu, Feb 16 2017 10:31 PM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
– కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (టౌన్): నగరంలో కోల్స్ కళాశాల స్థలాలను ఆక్రమించుకోవడం దారుణమని కర్నూలు ఎంపీ బుట్టారేణుక అన్నారు. స్థానిక కోల్స్ సెంటినీయల్ తెలుగు బాప్టిస్టు చర్చి ఎదుట బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలేదీక్షలకు గురువారం ఆమె సంఘీభావం తెలిపారు. దీక్షలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రకటించారు. స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న కోల్స్ కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కర్నూలు ప్రజలపై ఉందన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. క్రైస్తవుల ఆస్తులతో కొంతమంది నాయకులు వ్యాపారం చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. కోల్స్ స్థలాలను కోనుగోలు చేసిన, అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నగర కన్వీనర్ పి.జి. నరసింహాలు యాదవ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెహమాన్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దయ్య, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, ఈశ్వర్ పాల్గొన్నారు.
22న భారీ ర్యాలీ..
కోల్స్ కళశాల స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 22వ తేదీన కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున క్త్రెస్తవుల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుదాసు వెల్లడించారు. దీక్షలకు మద్దతు ప్రకటించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు సోమసుందరం మాదిగ మాట్లాడుతూ..ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
Advertisement