పుష్కర సేవల్లో ‘యూపీ’ యువకులు
పుష్కర సేవల్లో ‘యూపీ’ యువకులు
Published Wed, Aug 17 2016 8:58 PM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM
సాక్షి, అమరావతి :
కృష్ణాపుష్కరాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు సేవలు అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్‌కు చెందిన 300 వందల మంది యువకులు టాయిలñ ట్స్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుని వచ్చారు. అదే రాష్ట్రానికి చెందిన లల్లూజీ కంపెనీ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ప్రతి ఘాట్‌లోయాత్రికుల రద్దీ బట్టి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. అవసరమైనప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలి. దీని కోసం ఆ యువకులు ఘాట్ల వద్దే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. టాయిలెట్స్ విడిభాగాలు తీసుకొచ్చి ఎక్కడ ఏర్పాటు చేయోలో అక్కడ తాత్కాలికంగా ఫిటింగ్ చేస్తారు. పుష్కరాల సందడి బావుందనీ , పుష్కరస్నానం చేశామని వారు తెలిపారు.
Advertisement
Advertisement