tiolets works
-
షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చక్‌దేపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్థానిక మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్డను శుభ్రం చేయమని బలవంతం చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. వారంతా ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థినులంటూ పలు కథనలు వచ్చాయి. ఐతే ఆ వార్తన్నింటిని జిల్లా విధ్యాధికారి సోనమ్ జైన్ ఖండించారు. విచారణలో ఆ బాలికలు తాము మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని, వర్షాల కారణంగా మరుగుదొడ్లు మురికిగా ఉన్నందున చేతిపంపు నుంచి నీటిని తెచ్చిపోశామని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆ బాలికలు, వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు జైన్ వెల్లడించారు. ఐతే ఈ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ విషయంపై గుణ జిల్లా కలెక్టర్‌ను విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాఠశాల విదయాశాఖ బృదం పాఠశాలకు చేరుకుని ప్రత్యేక విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేగాతు ఈ ఘటనలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సిసోడియా పేర్కొన్నారు. यह तस्वीरें बेहद आपत्तिजनक है… मामाजी की सरकार में स्कूल में भाँजियो से शौचालय साफ़ करवाया जा रहा है.. तस्वीरें गुना ज़िले के बमोरी के चकदेवपुर के प्राथमिक- माध्यमिक स्कूल की है…. “ बेटी पढ़ाओ “ अभियान की हक़ीक़त… pic.twitter.com/UweK7emh8l — Narendra Saluja (@NarendraSaluja) September 22, 2022 (చదవండి: భారీ వర్షాలు..స్కూల్స్ బంద్, ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం) -
ఘనవ్యర్థాల నిర్వహణకు ‘గోబర్ ధన్’
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్’కింద 2 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే ఘనవ్యర్థాల నిర్వహణ కోసం గోబర్–ధన్ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని మరుగుదొడ్లు నిర్మిస్తామని గురువారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటికే 6 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు జైట్లీ పేర్కొన్నారు. దీంతో దేశంలోని మహిళల గౌరవం, బాలికల విద్య.. మొత్తంగా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు. భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చే లక్ష్యంలో భాగంగా గోబర్–ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రిసోర్సెస్ ధన్) కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పశువుల పేడ, ఘన వ్యర్థాలను కంపోస్ట్, ఎరువులు, బయోగ్యాస్‌లా మార్చడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు. -
పుష్కర సేవల్లో ‘యూపీ’ యువకులు
సాక్షి, అమరావతి : కృష్ణాపుష్కరాల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు సేవలు అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్‌కు చెందిన 300 వందల మంది యువకులు టాయిలñ ట్స్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుని వచ్చారు. అదే రాష్ట్రానికి చెందిన లల్లూజీ కంపెనీ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ప్రతి ఘాట్లోయాత్రికుల రద్దీ బట్టి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. అవసరమైనప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలి. దీని కోసం ఆ యువకులు ఘాట్ల వద్దే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. టాయిలెట్స్ విడిభాగాలు తీసుకొచ్చి ఎక్కడ ఏర్పాటు చేయోలో అక్కడ తాత్కాలికంగా ఫిటింగ్ చేస్తారు. పుష్కరాల సందడి బావుందనీ , పుష్కరస్నానం చేశామని వారు తెలిపారు.