పాడేరు రూరల్ :వచ్చే నెల 12వ తేదీ నుంచి 23 వరకు జరుగనున్న కష్ణా పుష్కరాల కోసం పాడేరుడిపో నుంచి బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రామకష్ణ చెప్పారు. శుక్రవారం ఆయన పాడేరు ఆర్టీసీyì ´ù¯]l$ సందర్శించారు. గ్యారేజీలో కార్మికులతో మాట్లాడి బస్సుల కండిషన్ అడిగి తెలుసుకున్నారు. బస్సుడిపో ఆవరణలో మొక్కలనాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పాడేరు నుంచి విజయవాడ వైవీరామ్ ఎస్టేట్ వరకు బస్సులు నడుపుతామని అక్కడి నుంచి పుష్కర ఘాట్‌కు సిటీ బస్సుల్లో వెళ్లాలన్నారు. ప్రతి రోజు మూడేసి సర్వీసులు నడుపుతామన్నారు. టికెట్ ధర రూ.520 గా నిర్ణయించామన్నారు. పుష్కరాల కోసం విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం రీజియన్‌ల నుంచి ప్రతి రోజు 200 బస్సులు ప్రత్యేకంగా నడపనున్నట్లు చెప్పారు. ఇవి కాకుండా రోజు వారి సర్వీసులు యథాతథంగా నడుస్తాయన్నారు. అలాగే పాడేరు ఆర్టీసీ డిపోకు కొత్తగా 10 పల్లె వెలుగు, రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులు మంజూరయ్యాయన్నారు. వీటిలో ఇప్పటికే మూడు బస్సులు పాడేరు చేరుకున్నాయని, మిగిలిన బస్సులు త్వరలో వస్తాయన్నారు. ఆయన వెంట ఆర్టీసీరీజినల్ మేనేజర్ సుదీష్‌బాబు, డిపో మేనేజర్ మల్లికార్జున రాజు ఉన్నారు.