యాత్రికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు
విజయవాడ (రైల్వే స్టేషన్) :
రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని డీఆర్‌ఎం అశోక్‌కుమార్ బుధవారం పరిశీలించారు. పుష్కరాలకు విచ్చేస్తున్న ప్రయాణికుల రద్దీ క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 1,6,7 ప్లాట్‌ఫాంలు, తారాపేట , పార్శిల్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పుష్కర నగర్లను, బుకింగ్ కౌంటర్లను ఆయన పరిశీలించారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఆర్పీఎఫ్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఎస్.ఆర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
ఏటీవీఎం కేంద్రాల వద్ద రద్దీ
ఏటీవీఎం కేంద్రాల వద్ద ప్రయాణికులు, యాత్రికుల రద్దీ పెరిగింది. సత్వరం టికెట్లు పొందటంతోపాటు స్మార్ట్ కార్డు కలిగిన వారికి 5 శాతం డిస్కౌంట్‌ను కూడా రైల్వే శాఖ ఇస్తుండడంతో ఇటీవలి కాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది. వీటి వినియోగం వల్ల సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ కాస్త తగ్గింది. ఎలక్ట్రానిక్ టికెట్ల జారీని సీసీఎం మార్కెటింగ్ ఎం.సజ్జనరావు బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సాధారణ టికెట్ల సత్వర జారీకి వీటిని ఏర్పాటు చేశామన్నారు. రైల్వేస్టేçÙన్‌లో రిజర్వుడు టికెట్లను బ్లాక్‌లో విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుష్కర యాత్రికులకు రైల్వే స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన పుష్కర్ నగర్‌లో బుధవారం యూనియన్ బ్యాంకు సిబ్బంది తాగునీటి ప్యాకెట్‌లను అందించారు.