రైల్వేస్టేషన్‌లో పుష్కర రద్దీ
విజయవాడ (రైల్వేస్టేషన్):
రైల్వేస్టేషన్ పుష్కర యాత్రికులతో రద్దీగా మారింది. సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన పలు రైళ్లు కిటకిటలాడాయి. సోమవారం రైల్వేస్టేషన్‌లో రద్దీని సీనియర్ డీసీఎం షిఫాలి పరిశీలించారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాం, తారాపేట పుష్కర్‌నగర్, ఆరో నంబరు ప్లాట్‌ఫాంలపై ప్రయాణికుల రద్దీని పరిశీలించారు. రద్దీకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.