
చంచల్‌గూడ: ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసన పేరుతో విధ్వంసం సృష్టించిన కేసులో ఆందోళనకారుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 28 మంది ఆందోళనకారులు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బుధవారం మరో 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిలో పృథ్వీ రాథోడ్, బింగి రమేష్, రాజా సురేంద్రకుమార్, దేవోసత్ సంతోష్, ఎండీ సాబేర్, పద్వల్ యోగేష్, బమన్ పరశురాం, పుప్పాల అయ్యప్ప చారీ, పసునూరి శివసుందర్, సురనర్ తుకారామ్ ఉన్నారు.
కారుతో మైనర్ బాలుడి బీభత్సం
సైదాబాద్: మైనర్ బాలుడు కారుతో బీభత్సం సృష్టించాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..బుధవారం సాయంత్రం చంపాపేట రహదారిపై చింతల్‌బస్తీకి వెళ్లే రహదారిపై ఓ మైనర్ బాలుడు కారును నడుపుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టాడు. అలాగే ముందుకు వెళుతూ అక్కడి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయాడు. ఆ సమయంలో అక్క డ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
(చదవండి: తూటా రూట్ మారెన్)
Comments
Please login to add a commentAdd a comment