destruction case
-
జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు
చంచల్‌గూడ: ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన పేరుతో విధ్వంసం సృష్టించిన కేసులో ఆందోళనకారుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 28 మంది ఆందోళనకారులు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బుధవారం మరో 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరిలో పృథ్వీ రాథోడ్, బింగి రమేష్, రాజా సురేంద్రకుమార్, దేవోసత్ సంతోష్, ఎండీ సాబేర్, పద్వల్ యోగేష్, బమన్ పరశురాం, పుప్పాల అయ్యప్ప చారీ, పసునూరి శివసుందర్, సురనర్ తుకారామ్ ఉన్నారు. కారుతో మైనర్ బాలుడి బీభత్సం సైదాబాద్: మైనర్ బాలుడు కారుతో బీభత్సం సృష్టించాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన మేరకు..బుధవారం సాయంత్రం చంపాపేట రహదారిపై చింతల్‌బస్తీకి వెళ్లే రహదారిపై ఓ మైనర్ బాలుడు కారును నడుపుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో వేగంగా వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టాడు. అలాగే ముందుకు వెళుతూ అక్కడి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఆగిపోయాడు. ఆ సమయంలో అక్క డ ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. (చదవండి: తూటా రూట్ మారెన్) -
గర్ల్‌ఫ్రెండ్ పై ఉన్న పిచ్చి ఎంత పనిచేసింది...సుమారు రూ.40 కోట్లు..
కొంతమంది కోపం వప్తే మనిషిలా ప్రవర్తించారు. అనుకున్నది జరగకపోయిన, తాను అనుకున్నట్లుగా లేకపోయిన కొంతమందికి భలే కోపం ముంచుకోస్తుంది. దీంతో వాళ్ల చేసే హంగామా ఇంత అంత కాదు. మరికొంతమంది కోపంతో విలువైన వస్తువులు పాడు చేయడం లేక తమకు హాని కలిగించుకోవడమే వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. ఒకరి మీద ఉన్న కోపాన్ని వేరే వారిపై చూపించి లేనిపోనీ సమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే అమెరికాకు చెందిన బ్రియాన్ హెర్నాండెజ్. తన ప్రియురాలితో గొడవపడి కోపంతో చేసిన దారుణమైన పనికి ఊచలెక్కపెడుతున్నాడు. అసలేం జరగిందంటే...అమెరికాలోని 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ టెక్సాస్‌లోని డల్లాస్ మ్యూజియం ఆప్ ఆర్ట్‌లోకి చొరబడి విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఆ మ్యూజియంలో ఎంతో విలువ చేసే గొప్ప గొప్ప కళాఖండాలుంటాయి. అతను అత్యంత విలువైన అరుదైన కళాఖండాలన్నింటిని ధ్వంసం చేశాడు. బ్రియాన్ మ్యూజియంలో నష్ట పరిచిన కళాఖండాల విలువ సుమారు రూ. 40 కోట్లు. దీంతో డల్లాస్ పోలీసులు బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే పోలీసులు విచారణలో అతన్ని ఎందుకిలా చేశావని ప్రశ్నించిగా...అతను చెప్పింది విని ఒక్కసారిగి షాక్ అయ్యిపోయారు. గర్లఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ అని ఇటీవలే తనతో గొడపడ్డానని బ్రియాన్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే పిచ్చి అని ఆమెతో గొడవపడటంతో తట్టుకోలేక ఇలా చేశానని చెప్పాడు. ఏదిఏమైన పిచ్చివ్యామోహంతోనూ, కోపంతోనూ చేసే పనులు మిగిల్చే నష్టం ఊహకందనంతా ఘోరంగా ఉంటుంది. (చదవండి: నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ) -
అమలాపురం విధ్వంసం కేసులో మరో 25 మంది అరెస్ట్
అమలాపురం టౌన్: అమలాపురంలో ఈ నెల 24న జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుల్లో 19 మంది అరెస్ట్ చేశామని, తాజా అరెస్టులతో ఆ సంఖ్య మొత్తం 44కు చేరిందని చెప్పారు. ఆదివారం మరికొందరిని అరెస్ట్ చేస్తామన్నారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లాల ఎస్పీలు కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు లతామాధురి, చక్రవర్తితో కలసి డీఐజీ పాలరాజు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శనివారం అరెస్ట్ చేసిన నిందితుల్లో అమలాపురం పట్టణం, అంబాజీపేట, అల్లవరం, అయినవిల్లి మండలాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్ల దహనం, బస్సులు, పోలీసు వజ్ర వాహనం ధ్వంసం కేసుల్లో వీరంతా నిందితులని పేర్కొన్నారు. 20 వాట్సాప్ గ్రూపుల స్క్రీన్ షాట్స్, గూగుల్ ట్రాక్స్, టవర్ లోకేషన్లు, సీసీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా బయలుదేరాలి వంటి సూచనలు వాట్సాప్ గ్రూపుల్లో వెళ్లాయని తెలిపారు. మరో వారంపాటు 144 సెక్షన్ కోనసీమలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధించిన సెక్షన్ 144ను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు డీఐజీ చెప్పారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత కూడా మరో 24 గంటలపాటు కొనసాగుతుందన్నారు. సోమవారం నుంచి ఇంటర్నెట్ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని తెలిపారు. నష్టాలు నిందితుల నుంచే రికవరీ ఆందోళనకారులు ఆ రోజు ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేసి అపార నష్టాన్ని కలిగించారని డీఐజీ పాలరాజు తెలిపారు. వీరిపై ప్రివెన్షన్ ఆప్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టాలను నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారుల ద్వారా నిందితుల వ్యక్తిగత ఆస్తులను విలువ గట్టి వాటిని సీజ్ చేశామని చెప్పారు. ఆస్తులు ధ్వంసం చేసిన దృశ్యాలను, వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసానికి వ్యూహరచనతో మెసేజ్‌లను డీఐజీ పాలరాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు చూపించారు. -
దేవుడి మీద కోపంతో ఆ కూలీ ఏం చేశాడంటే..
భోపాల్: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తేగానీ.. భార్యాబిడ్డల కడుపు నిండదు. కాయకష్టంతో పాటు దేవుడ్ని కూడా నమ్ముకున్నారు. అలాంటిది అనారోగ్యం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. పెద్దల సలహాతో ఎన్నో పూజలు చేశాడు. పుణ్యక్షేత్రాలు దర్శించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు కలత చెందిన చేసినపని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మధ్యప్రదేశ్ ఛట్టార్పూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ భూరా(27)పై.. బేటా 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశాడని అతనిపై అభియోగం నమోదు అయ్యింది. సోమవారం ఉదయం అతను ఆ దాడికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పోలీసులను మోహరించారు. వినోద్‌కు భార్యా, ఐదేళ్ల బిడ్డ ఉన్నారు. గత మూడునాలుగేళ్లుగా వీళ్లద్దరి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎన్ని మందులు వాడినా.. దేవుళ్లకు ఎంత మొక్కినా వాళ్ల ఆర్యోగం మెరుగుపడలేదట. ఈమధ్యే అతనికి పిల్లనిచ్చిన అత్త కూడా చనిపోయింది. ఈ పరిణామాలన్నీ అతన్ని మానసికంగా కుంగదీశాయి. దేవుడి మీద కోపం పెంచుకున్న వినోద్.. సుత్తి, శిలతో పూజారి లేని ఆ ఆలయానికి చేరుకుని విగ్రహాలు ధ్వంసం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం అతన్ని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ప్రార్థనా స్థలాలను అప్రవిత్రం చేయడం) కింద కేసు నమోదు చేసుకుని వినోద్‌ను జైలుకు తరలించారు. చదవండి: ఒంటి కాలితో బడికి.. చిన్నారికు అంతా ఫిదా -
ఎనిమిదేళ్ల తరువాత నిందితుడి అరెస్ట్
తిరువొత్తియూరు : ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఎనిమిదేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడు నాగైకి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నాగపట్టణానికి చెందిన రమేష్ ఎలక్ట్రికల్ ఇంజినీర్. 2013లో జరిగిన ఓ ధర్నాలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రమేష్ కోసం గాలించారు. అప్పటికే అతడు విదేశాలకు పారిపోయాడు. ఈ క్రమంలో ఓమెన్ రాజధాని మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంగళవారం రాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎస్సై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం
జనగామ: జనగామ జిల్లా పట్టణ పోలీస్టేషన్ భవనంపై నుంచి ఓ యువకుడు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా సాధన ఉద్యమం సమయంలో మున్సిపల్ కార్యాలయం లో జరిగిన విధ్వంసం కేసులో పట్టణానికి చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హాజరు కావాలని పోలీసుల నుంచి పిలుపు రావడంతో మంగళ్లపల్లి రాజు, పిట్టల సురేష్, మాజీద్, గండి నాగరాజుతో మరో నలుగురు వచ్చారు. ముగ్గురు నాయకులు పీఎస్ లోపలికి వెళ్లగా, నాగరాజును మాత్రం ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. నాగరాజు, కానిస్టేబుల్ మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో తాము అతడిని స్టేషన్ లోకి తీసుకెళ్లామని పోలీసులు చెప్పారు. అరుుతే స్టేషన్ లోకి తీసుకెళ్లి తనను కొట్టారని, ఇంకా బెదిరించడంతో తాను స్టేషన్ భవనంపైకి ఎక్కి దూకానని నాగారాజు చెప్పారు. పోలీసుల వాహనంలో నాగరాజును ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సంతోషం రవీందర్‌పై నాగరాజు హెచార్సీలో ఫిర్యాదు చేయడంతోనే కక్షగట్టి చితక బాదారని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్ ఆరోపించారు. ఎస్సైపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై సంతోషం రవీందర్ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే సమయంలో నాగరాజు కానిస్టేబుల్‌తో గొడవపడ్డాడని, పట్టుకునే ప్రయత్నంలో కిందదూకాడని చెప్పారు. ఆ సమయంలో తాను స్టేషన్ లో లేనని చెప్పారు.