
తిరువొత్తియూరు : ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఎనిమిదేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడు నాగైకి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నాగపట్టణానికి చెందిన రమేష్ ఎలక్ట్రికల్ ఇంజినీర్. 2013లో జరిగిన ఓ ధర్నాలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రమేష్ కోసం గాలించారు. అప్పటికే అతడు విదేశాలకు పారిపోయాడు. ఈ క్రమంలో ఓమెన్ రాజధాని మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంగళవారం రాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment