ఎస్సై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం
జనగామ: జనగామ జిల్లా పట్టణ పోలీస్టేషన్ భవనంపై నుంచి ఓ యువకుడు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా సాధన ఉద్యమం సమయంలో మున్సిపల్ కార్యాలయం లో జరిగిన విధ్వంసం కేసులో పట్టణానికి చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హాజరు కావాలని పోలీసుల నుంచి పిలుపు రావడంతో మంగళ్లపల్లి రాజు, పిట్టల సురేష్, మాజీద్, గండి నాగరాజుతో మరో నలుగురు వచ్చారు. ముగ్గురు నాయకులు పీఎస్ లోపలికి వెళ్లగా, నాగరాజును మాత్రం ఓ కానిస్టేబుల్ అడ్డుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. నాగరాజు, కానిస్టేబుల్ మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో తాము అతడిని స్టేషన్ లోకి తీసుకెళ్లామని పోలీసులు చెప్పారు.
అరుుతే స్టేషన్ లోకి తీసుకెళ్లి తనను కొట్టారని, ఇంకా బెదిరించడంతో తాను స్టేషన్ భవనంపైకి ఎక్కి దూకానని నాగారాజు చెప్పారు. పోలీసుల వాహనంలో నాగరాజును ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సంతోషం రవీందర్‌పై నాగరాజు హెచార్సీలో ఫిర్యాదు చేయడంతోనే కక్షగట్టి చితక బాదారని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్‌ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్ ఆరోపించారు. ఎస్సైపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై సంతోషం రవీందర్ మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే సమయంలో నాగరాజు కానిస్టేబుల్‌తో గొడవపడ్డాడని, పట్టుకునే ప్రయత్నంలో కిందదూకాడని చెప్పారు. ఆ సమయంలో తాను స్టేషన్ లో లేనని చెప్పారు.