
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఓ ఆకతాయి కదులుతున్న రైలు కిందకు తోసేశాడు. థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‍లో గురవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అమ్మయి చెన్నై బీచ్‌కు వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఘటనకు ముందు యువతికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోపంతో ఉన్న నిందితుడు రైలు ప్లాట్‌ఫైంకి రావడం చూసి ఆమెను తోసేశాడని చెప్పారు.
నిందితుడ్ని అలందూర్‌కు చెందిన సతీశ్‌గా(23) గుర్తించారు పోలీసులు. అతను రిటైర్డ్ ఎస్‌ఐ కుమారుడని వెల్లడించారు. ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేశాడని, చాలా కాలంగా యువతి వెంట పడుతున్నట్లు తెలిపారు.
యువతికి నిశ్చితార్థం..
మృతి చెందిన యువతిని సత్యగా గుర్తించారు పోలీసులు. ఆమె తల్లి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఆమె తల్లి సహా కుటుంబసభ్యులంతా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు.
చదవండి: టీచర్ బ్రేకప్ చెప్పిందని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment