అంత్యపుష్కరాలకు 85 బస్సులు
-
ఈనెల 31నుంచి ఆగస్టు 11వరకు
-
రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్
మంకమ్మతోట : జిల్లాలో జరగనున్న అంత్య పుష్కరాలకు 85 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 31నుంచి ఆగస్టు 11వరకు భక్తుల సౌకర్యం కోసం బస్సులు నడుపుతామన్నారు. జిల్లాలో ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, మంథని స్నానఘట్టాల ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 2015లో జరిగిన ఆది పుష్కరాలకు 450 బస్సులతో 22లక్షల మంది భక్తులను చేరవేశామని, అంత్యపుష్కరాలకు 12 రోజులపాటు 85 బస్సులతో 4లక్షల 40వేల మందికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరం ఉన్నంతవరకు మరిన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అన్ని బస్సులకు ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తామన్నారు. కృష్ణ పుష్కరాలకు 15 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఒకరికి రాకపోకలకు రూ.900 చార్జీ అవుతుందని, గ్రూపుగా ఉండి బస్ ఏంగేజ్ చేసుకున్నట్లయితే ఒకరి దాదాపుగా రూ.300 తక్కువ అవుతుందని పేర్కొన్నారు. ఈ పుష్కరాల సందర్భంగా కరీంనగర్ రీజియన్ నుంచి హైదరాబాద్, వనపర్తికి 50 బస్సులు పంపించామన్నారు. ప్రజలు సురక్షితమై ప్రయాణానికి ఆర్టీసీ బస్‌లోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని కోరారు.
రూట్ వేసిన బస్సులు చార్జీలు(రూ.లలో)
కరీంనగర్– ధర్మపురి 10 62
జగిత్యాల – ధర్మపురి 10 28
కోరుట్ల – ధర్మపురి 10 48
మెట్‌పల్లి –ధర్మపురి 5 5
మంథని – కాళేశ్వరం S 10 60
కరీంనగర్– కాళేశ్వరం 10 124
గోదావరిఖని– కాళేశ్వరం 5 81
హుస్నాబాద్– ధర్మపురి 5 97
సిరిసిల్లా – ధర్మపురికి 5 82
వేములవాడ– ధర్మపురికి 5 71
కరీంనగర్– కోటిలింగాల 5 49