ఆటో వర్కర్ల నిరసన | auto workers protest | Sakshi
Sakshi News home page

ఆటో వర్కర్ల నిరసన

Published Sun, Aug 14 2016 7:29 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

ఆటో వర్కర్ల నిరసన - Sakshi

ఆటో వర్కర్ల నిరసన

విజయవాడ (రైల్వేస్టేషన్‌) :
పుష్కరాల భద్రత పేరిట తమ పొట్టకొట్టవద్దని   సీఐటీయూ రైల్వే స్టేషన్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ దుర్గావలి వేడుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆటో కార్మికులు ఆదివారం రైల్వేఇనిస్టిట్యూట్‌ వద్ద నిరసన ప్రదర్శన చేశారు.  దుర్గావలి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీ దృష్ట్యా తూర్పు ముఖద్వారం వద్ద ఉన్న ఆటోస్టాండ్‌ను రైల్వేఇనిస్టిట్యూట్‌కు మార్చాలని రైల్వే అధికారులు,  పోలీస్‌ అధికారులు కోరగా తాము అంగీకరించామని గుర్తుచేశారు. ట్రాఫిక్‌ పేరిట ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం తమ ఆటోస్టాండ్‌ను తక్షణమే తరలించాలని ఆదేశించారని, ఇప్పటికే అంతమాత్రంగా ఉన్న తమ ఉపాధికి గండి పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సెంట్రల్‌ ఏసీపీ సౌమ్యలత నుంచి ఇప్పటికే ఇనిస్టిట్యూట్‌ వద్ద ఆటోలు నిలుపుటకు అనుమతి తీసుకున్నామని, అయినా ట్రాఫిక్‌ పోలీసులు ఆటోస్టాండు  తరలించమనడం దారుణమని పేర్కొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement