workers protest
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యమానికి నడుం బిగించాయి. నేడు గాజువాకలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నిన్న 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా కార్మికులు హాజరయ్యారు. -
ప్రైవేటీకరణ దిశగా స్టీల్‌ప్లాంట్.. ఉక్కు కార్మికుల నిరసన
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు నిరసనకు దిగారు. అగనంపూడి, పెదగంట్యాడ, ముస్తఫా జంక్షన్లలో భారీ నిరసనలు చేపట్టారు. ఉక్కు కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేస్తూ ప్లాంట్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.మరోవైపు, అనుబంధ పరిశ్రమల విక్రయానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రైవేటుకు అప్పగించిన ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్‌ను విక్రయించారు. మరో రెండేళ్ల పాటు వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా అమ్మేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: లాభాల్లో ఉన్నా అమ్మేశారుకేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న జపాన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారంటూ ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రశ్నిస్తోంది. ఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలాచేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కూటమి ప్రభుత్వం ఫెయిల్!
-
మూడున్నరేళ్లుగా వేజ్ అగ్రిమెంట్ ప్రకటించలేదు: జక్కంపూడి
-
స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద కార్మికుల నిరసన..
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెద్ద ఎత్తున కార్మికులు అడ్మిన్ భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. స్టీల్ ప్లాంట్‌కు చేరుకునే అన్ని మార్గాలను దిగ్భంధించేందుకు కార్మికులు యత్నించారు. కాగా, భారీవర్షంలోనూ గొడుగులు పట్టుకుని మరీ.. కార్మిక సంఘాల నేతలు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. -
లాక్డౌన్: ల్యాంకో ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా
తిరుపతి : లాక్డౌన్ కారణంగా కనీస వసతులు లేకపోవడంతో శ్రీకాళహస్తి సమీపంలోని లాంక్యో ఫ్యాక్టరీ కార్మికులు ధర్నాకు దిగారు. దాదాపు రెండు వేల మంది వలస కార్మికులు శనివారం సాయంత్రం ఫ్యాక్టరీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. తమను స్వంత రాష్టాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తినడానికి కూడా తిండి లేదని వలస కార్మికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి బొజ్జల అనుచరులు తమను వేధిస్తున్నారని, వారే యూనియన్ నాయకులుగా వుంటూ అరాచకం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సంస్థ యాజమాన్యం వెంటనే స్పందించని తమను స్వరాష్ట్రం పంపిచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లాక్డౌన్లో కనీస సదుపాయాలు కూడా యాజమాన్యం ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. (డీ విటమిన్ ఉంటే ఢోకాలేదు!) -
సీఎం ఇంటిని ముట్టడించాలి
ఒంగోలు టౌన్: త్వరలో సీఎం ఇంటిని గంటెలు, పప్పుగుత్తులతో ముట్టడించనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి వెల్లడించారు. మ«ధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకుండా యథావిధిగా తమతోనే కొనసాగించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పథకం కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని లోపలికి వెళ్లేందుకు సన్నద్ధమైయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వారివద్దకు వచ్చి కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన విరమించుకున్నారు. 6న చలో విజయవాడకు తరలిరావాలి రాష్ట్రంలోని 85 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డీ రమాదేవి ధ్వజమెత్తారు. తమను యథావిధిగా కొనసాగించి వేతనాలు పెంచాలని కోరుతూ ఆగస్టు 6వ తేదీ చలో విజయవాడలో భాగంగా సీఎం ఇంటిని ముట్టడించనున్నట్లు వెల్లడించారు. చలో విజయవాడకు రాకుండా పోలీసులు అడ్డుకుంటే అక్కడికక్కడ రోడ్లపై ధర్నాలు నిర్వహించాలని కోరారు. పదిహేను సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల కడుపు కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. కేవలం వెయ్యి రూపాయల వేతనంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని, నెలల తరబడి బిల్లులు నిలిచిపోయినప్పటికీ అప్పుచేసి కొంతమంది, పుస్తెలు తాకట్టుపెట్టి మరికొంతమంది మధ్యాహ్న భోజనం అందిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి మరింత ప్రోత్సాహకాలను అందించాల్సిన ప్రభుత్వం వారి ఉనికి లేకుండా చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. 25 కిలోమీటర్ల దూరంలో 25 వేల మందికి ఒకేసారి భోజనం అందించేందుకు స్వచ్ఛంద సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొందన్నారు. ఏకీకృత వంటశాల పేరుతో ఉదయం పూట వండిన భోజనాన్ని 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తే వాటిలో పోషక విలువలు ఉంటాయా అని ప్రశ్నించారు. వేడిగా ఉండే ఆహార పదార్థాలను విద్యార్థులకు అందిస్తే వారికి పోషక విలువలు అందుతాయని, చల్లారిన ఆహారం అందిస్తే 30 శాతం పోషక విలువలు తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోషక విలువలు లేకుండా, కోడిగుడ్డు అందించకుండా ఆహారాన్ని అందిస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంíపించడం తగ్గిస్తారని, పిల్లల సంఖ్య తక్కువగా ఉందని చివరకు ఆ పాఠశాలలను ప్రభుత్వం ఎత్తివేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. స్వచ్ఛంద సంస్థకు ఈ పథకాన్ని అప్పగించడం వల్ల జిల్లాలో దానిపై ఆధారపడిన 5500 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో చలో విజయవాడకు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు నాగేశ్వరరావు, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కన్వీనర్ పెంట్యాల కల్పన, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న పంచాయతీ కార్మికులు సమ్మె
మద్దూరు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పంచాయతీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శనివారానికి ఆరో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు పంచాయతీ ఉద్యోగులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించానలి ఐఎఫ్టీయూ, సీపీఐ నాయకులు భీమేష్, హన్మంతు డిమాండ్ చేశారు. ఆరు రోజులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం శోఛనీయమని అన్నారు. కనీస వేతన చట్టం ప్రకారం రూ.18వేలకు తగ్గకుండా వేతనం పెంచాలన్నారు. వీరి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వీరికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ ఉద్యోగ, కార్మికులు ఆంజనేయులు, వెంకటేష్, అంజయ్య, ఉసేన్ప పాల్గొన్నారు. -
టీఎంయూ దాడిపై టీజేఎంయూ ఆగ్రహం
ఇబ్రహీంపట్నం: అధికార టీఎంయూ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ టీజేఎంయూ కార్మికులు శనివారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ముందు గేట్ ధర్నా నిర్వహించారు. అధికార టీఎంయూ నాయకులు కొందరు ఓడీల్లో డ్యూటీని వేయించుకుని... ఆ డ్యూటీలను కూడా సక్రమంగా చేయకుండా డిపోలో ఎస్టీఐ, సీఐ సీట్లల్లో కూర్చుం టూ కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్నారని టీజేఎంయూ డిపో కార్యదర్శి రమేష్ ఆరోపించారు. వేలాది రూపాయల జీతం తీసుకుంటూ డ్యూటీలు చేయకుండా సంస్థకు నష్టం కలిగిస్తున్నారని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆర్టీఐ(సమాచార హక్కు)చట్టం ద్వారా ఓడీలు చేస్తున్న వారి వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఓడీలను రద్దు చేయాలని ఆర్ఎం ఆదేశించినట్లు చెప్పారు. దీంతో కక్ష పెంచుకున్న టీఎంయూ నాయకులు గత మంగళవారం తనను అసభ్యపదజాలంతో తీవ్రంగా దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని దాడి చేసేందుకు యత్నించారన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఎంయూ నాయకులు ఏ.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, ఎస్ఎల్ రెడ్డి, చందర్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు రిజిష్టర్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దాడులను నిరసిస్తూ డిపో ముందు ధర్నాను నిర్వహించినట్లు చెప్పారు. టీజేఎంయూ జోలికొస్తే ఊరుకోం టీజేఎంయూ నేతల జోలికొస్తే ఊరుకునేది లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ హెచ్చరించారు. ధర్నాకు హాజరై న వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై స్పందిస్తూ... ఆర్టీసీని లాభాలబాట పట్టేందుకు అంకితభావంతో పనిచేస్తున్న తమ సంఘం నేతలపై భౌతిక దాడులకు పాల్పడితే అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ నేతలపై జరుగుతున్న దాడులపై డిపోలో ఓటీ డ్యూటీలపై జరుగుతున్న అక్రమాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జి.రవీందర్, ప్రేమ్‌నాథ్, స్వాములయ్య, డిపో నాయకులు బి.శ్రీశైలం, సురేష్‌యాదవ్, అబ్దుల్ రజాక్, రవి, ఐలయ్య పాల్గొన్నారు. -
కడుపు కొడుతున్నారు!
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాల విద్యార్థులకు తల్లిలా ఆహారం అందిస్తున్న తమ పొట్టను కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం అడ్డు వచ్చిన కార్మికులను పోలీసులు ఈడ్చుకుని వెళ్లి వ్యాన్‌లో ఎక్కించారు. దీంతో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్మికులను తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్మికులు సుమారు గంటపాటు అడ్డుకుని నినాదాలు చేశారు. పోలీసులు రోప్ పార్టీ ద్వారా కార్మికులను చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. కార్మికులు ఒక్క తాటిపై పోలీస్ వాహనాన్ని ఎటువైపు వెళ్లకుండా నిర్బంధించారు. అనంతరం కార్మికులను తోసుకుంటూ పోలీస్‌వాహనాన్ని చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వడ్డించడానికి ఉపయోగిస్తారా మధ్యాహ్న భోజన పథకంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను ఒక్కసారిగా తొలగించి ప్రైవేటు సంస్థలకు అప్పగించి కేవలం వడ్డించేందుకు మాత్రమే కార్మికులను ఉపయోగిస్తామనమని పాలకులు చెప్పడం విడ్డూరంగా ఉందని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71 క్లస్టర్లను ఏర్పాటు చేసి క్లస్టర్ల వారీగా అక్షయపాత్ర తదితర సంస్థలకు అప్పగిస్తున్నారన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నివాసం వద్ద తాము ధర్నా చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న కనీస వేతనాలను కూడా మన రాష్ట్రంలో అమలు చేసేందుకు పాలకులకు చేతులు రావడం లేదని ఆమె విమర్శించారు. 2007 నుంచి వేతనం పెంచకుండా ఈ వేతనాలతోనే జీవిస్తున్నామన్నారు. మెనూచార్జీలు కూడా పెంచకుండా పిల్లలకు అన్నం పెట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఇన్ని ఇబ్బందులు పెట్టి పాలకులు తమను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 80వేల మంది కార్మికులు చంద్రబాబునాయుడుకు గుణపాఠం చెబుతారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును జూలై 2న కలవనున్నామన్నారు. తమ సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించకపోతే చలో అమరావతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నరసింహారావు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పి. పార్వతి, ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ సుప్రజ, వి. జ్యోతి, వి.వెంకటేశ్వరమ్మ, గంగాభవాని, కేవీపీఎస్ నాయకులు సాల్మన్‌రాజు, కార్మికులు పాల్గొన్నారు. -
విజయవాడ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్య పరిష్కారం కోసం కార్పొరేషన్‌ను ముట్టడించేందుకు కార్మికులు భారీగా తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్పొరేషన్లోనికి చొచ్చుకు పోయేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగడంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కార్మికులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
ఎయిర్పోర్ట్ కార్మికుల ఆందోళన
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న డేటా విండ్ కంపెనీ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. దాదాపు 100 మంది ఉద్యోగులు కంపెనీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. నెలనెలా వేతనాలు ఇవ్వకుండా, ఎఎస్ఐ పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా ఇప్పటి దాకా వేధించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు -
సింగరేణి కార్యలయం ఎదుట ఆందోళన
ఇల్లందు: కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇల్లందు సింగరేణి కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను తీర్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని కార్మికులంతా కలిసి సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు. -
మహీంద్రా అండ్ మహీంద్రా ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్మికులకు 20 శాతం బోనస్ ఇవ్వాలని, ఇప్పుడు పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. -
ఆటో వర్కర్ల నిరసన
విజయవాడ (రైల్వేస్టేషన్) : పుష్కరాల భద్రత పేరిట తమ పొట్టకొట్టవద్దని సీఐటీయూ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ దుర్గావలి వేడుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆటో కార్మికులు ఆదివారం రైల్వేఇనిస్టిట్యూట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. దుర్గావలి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీ దృష్ట్యా తూర్పు ముఖద్వారం వద్ద ఉన్న ఆటోస్టాండ్‌ను రైల్వేఇనిస్టిట్యూట్కు మార్చాలని రైల్వే అధికారులు, పోలీస్ అధికారులు కోరగా తాము అంగీకరించామని గుర్తుచేశారు. ట్రాఫిక్ పేరిట ట్రాఫిక్ పోలీసులు ఆదివారం తమ ఆటోస్టాండ్‌ను తక్షణమే తరలించాలని ఆదేశించారని, ఇప్పటికే అంతమాత్రంగా ఉన్న తమ ఉపాధికి గండి పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సెంట్రల్ ఏసీపీ సౌమ్యలత నుంచి ఇప్పటికే ఇనిస్టిట్యూట్ వద్ద ఆటోలు నిలుపుటకు అనుమతి తీసుకున్నామని, అయినా ట్రాఫిక్ పోలీసులు ఆటోస్టాండు తరలించమనడం దారుణమని పేర్కొన్నారు. -
జూట్ మిల్లు లాకౌట్: కార్మికుల ఆందోళన
సాలూరు రూరల్: విజయనగరం జిల్లా సాలూరు మండలం జీగ్రామ్లోని జ్యూట్‌మిల్లు సోమవారం ఉదయం ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న సుమారు 1,550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక్కడ 900 మంది కార్మికులు ట్రైనీలుగా పనిచేస్తున్నారు. వారిలో 600 మందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించడంతో కార్మికులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. -
ఆ హోటల్లో ఏం జరిగినా బయట పెట్టరెందుకు?
విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ కార్మికుల నిరసన ర్యాలీ డాబాగార్డెన్స్(విశాఖ): ‘‘బయట ఏం జరిగినా నిజాన్ని నిర్భయంగా రాస్తానంటోంది ఈనాడు పత్రిక. మరి ఆ సంస్థకే చెందిన డాల్ఫిన్ హోటల్లో ఏం జరిగినా బయట పెట్టరెందుకు? మేము ఎదుర్కొంటున్న సమస్యలు రామోజీరావుకు తెలియవా?’’ అని డాల్ఫిన్ హోటల్ కార్మికులు ప్రశ్నించారు. ఏళ్ల తరబడి హోటల్లో పనిచేస్తున్న పలువురు కార్మికులను యాజమాన్యం హింసిస్తోందని వారు ఆరోపించారు. కార్మిక హక్కుల కోసం యాజమాన్యాన్ని నిలదీసిన యూనియన్ కార్యదర్శి వెంకట అప్పారావును అక్రమంగా విధుల నుంచి తొలగించారని పేర్కొంటూ కార్మికులు సోమవారం విశాఖపట్నంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. డాల్ఫిన్ హోటల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీ జగదాంబ జంక్షన్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి సరస్వతి పార్క్ మీదుగా డాల్ఫిన్ హోటల్ సమీపం వరకు సాగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు వై.రాజు, కార్యదర్శి వెంకట అప్పారావు మాట్లాడారు. హోటల్ యాజమాన్యం కార్మికుల కడుపులు కొట్టే విధానాన్ని విడనాడాలని అన్నారు. కార్మికులపై యాజమాన్యాల వేధింపులు, కార్మికుల కేకలు బయటి ప్రపంచానికి తెలియడం లేదన్నారు. -
అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి
ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికుల ధర్నా హన్మకొండ : ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో అక్రమంగా సస్పెండ్ చేసిన ఉద్యోగుల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సూపర్వైజర్లకు ఇచ్చిన చార్జిషీట్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం హన్మకొండలోని ఆర్ఎం కార్యాలయం ఎదుట ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిఆర్ రెడ్డి, వరంగల్ రీజియన్ కార్యదర్శి ఈఎస్ బాబు మాట్లాడుతూ తొర్రూరు డిపోలో అద్దె బస్సుల అగ్రిమెంట్ ప్రతిని డిపో మేనేజర్ కార్యాలయానికి, అకౌంట్ ఆఫీస్‌కు పంపలేదని దీంతో పాత ధరలతో అద్దె బస్సులకు చెల్లింపులు జరిగాయని చెప్పారు. అద్దె బస్సులకు చెందిన వివరాలు జూనియర్ అసిస్టెంట్లకు అందించక పోవడంతోపాటు, అద్దె బస్సులకు చెల్లింపులపై అవగాహన సదస్సు, శిక్షణ ఇవ్వలేదన్నారు. అధికారులు తమ తప్పులను కప్పి పుచ్చుకోవడానికి కింది స్థాయి సిబ్బందిని బలిచేస్తున్నారని మండిపడ్డారు. యాజమాన్యం జారీ చేస్తున్న సర్క్యులర్లు సకాలంలో సిబ్బందికి అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరవ సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం అద్దె రేట్లు తగ్గించాల్సి ఉందని, అగ్రిమెంట్‌ను సంబంధిత సెక్షన్ చూసే సిబ్బందికి అందించక పోవడంతోనే ఈ చెల్లింపులు జరిగాయని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. చిరుద్యోగులను ఎలా సస్పెండ్ చేస్తారని అన్నారు. తక్షణమే సస్పెన్షన్, చార్జీషీట్లు రద్దు చేయకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో టీఎంయూ నాయకులు, కార్మికులు రాజేశ్వర్‌రావు, పి.వి.రెడ్డి, బి.జాకబ్, ఇ.రామ్మోహన్, కె.రవీందర్రావు, రంజిత్, ప్రసాద్, ఓంప్రకాశ్, నిజాముద్దీన్, సుభాష్, లింగాచారి, సిఆర్ రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం ఇలాకాలోనే పరిశ్రమ మూసివేత
♦ ఏడాదిన్నర కాలంగా దిక్కుతోచని స్థితిలో కార్మికులు ♦ పట్టించుకోని యాజమాన్యం ♦ పరిశ్రమపై ఆధారపడిన వెయ్యి కుటుంబాలు ♦ ఆదుకోవాలంటూ పరిశ్రమ ఎదుటే కార్మికుల నిరసన తూప్రాన్ : ఏడాదిన్నర క్రితం అర్థంతరంగా పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో కార్మికులు బుధవారం పరిశ్రమ ఏదుట నిరసన చేపట్టారు. ఈ సంఘటన మండలంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలోని టీఎం టైర్స్ పరిశ్రమ వద్ద జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ కాళ్లకల్ సమీపంలోని టీఎం టైర్స్ పరిశ్రమలో తాము గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, పరిశ్రమలో 99 మంది పర్మినెంట్ కార్మికులుగా, 650 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నామన్నారు. మరో 150 మంది కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 2013 అక్టోబర్ 13న యాజమాన్యం కార్మికులతో సమావేశం నిర్వహించి పరిశ్రమ నిర్వహణలో ఇబ్బందులు ఉన్నందున, పదిరోజుల్లో సమస్య పరిష్కరిస్తామని, అప్పటి వరకు పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు చెప్పారన్నారు. యాజమాన్యం చెప్పిన మాటలకు ఒప్పుకున్న కార్మికులు పది రోజుల వరకు వేచి చూసి, హెచ్ఎంఎస్ యూనియాన్ అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డికి తమ గోడు వినిపించామన్నారు. అలాగే గజ్వేల్ (గడా) ప్రత్యేకాధికారి హన్మంతురావు దృష్టికి తీసుకవెళ్లామన్నారు. అయినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే పరిశ్రమ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలాగాటమాడుతుంటే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రస్తుతం తమకు పూట గడవడం కూడా కష్టంగా మారిందన్నారు. పాఠశాలలు ప్రారంభయ్యే రోజులు దగ్గర పడుతుంటే కనీసం పిల్లలను చదివించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని పరిశ్రమను తెరిపించి వెయ్యిమంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కార్మికులు కోరారు. -
రామోజీ ఫిలింసిటీ కార్మికుల ధర్నా
హైదరాబాద్: కార్మికులకు,కార్మికశాఖకు వ్యతిరేకంగా రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను ఎత్తివేయించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఫిల్మ్‌సిటీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. జీవో నంబర్ 63ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, ఉద్యోగభద్రత తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రామోజీ ఫిలింసిటీలో పనిచేస్తున్న కార్మికులపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. కార్మికశాఖ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు ఫిల్మ్‌సిటీ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు
గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ కార్యాలయాన్ని కార్యకర్తలు బుధవారం ముట్టడించారు. రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ ఫండ్ ఇవ్వలేదని వారు ఆందోళనకు దిగారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై జిల్లావాసులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సమాయత్తమవుతున్నారు. -
పాలకొల్లు టీడీపీలో టికెట్ల రగడ
-
రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు.?
-
తులసి రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు?
-
తులసి రామచంద్రప్రభుకు టికెట్ ఎలా ఇస్తారు?
గుంటూరు : మంగళగిరి టీడీపీలో ముసలం పుట్టింది. పారిశ్రామిక వేత్త తులసీ రామచంద్రప్రభుకు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గపు సీటును తులసి రామచంద్రప్రభు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో స్థానికేతరుడికి టికెట్ ఎలా కేటాయించారంటూ టీడీపీ పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు శుక్రవారం తాళం వేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టికెట్‌పైనా రగడ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని...ఇటీవలే టీడీపీలో చేరిన వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వటంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ జెండాలు తగులబెట్టారు.