శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న డేటా విండ్ కంపెనీ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు.
ఎయిర్‌పోర్ట్ కార్మికుల ఆందోళన
Published Fri, Jul 7 2017 4:23 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న డేటా విండ్ కంపెనీ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. దాదాపు 100 మంది ఉద్యోగులు కంపెనీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. నెలనెలా వేతనాలు ఇవ్వకుండా, ఎఎస్‌ఐ పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా ఇప్పటి దాకా వేధించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
Advertisement
Advertisement