సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు నిరసనకు దిగారు. అగనంపూడి, పెదగంట్యాడ, ముస్తఫా జంక్షన్లలో భారీ నిరసనలు చేపట్టారు. ఉక్కు కార్మికులకు హెచ్‌ఆర్ఏ నిలిపివేస్తూ ప్లాంట్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.
మరోవైపు, అనుబంధ పరిశ్రమల విక్రయానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రైవేటుకు అప్పగించిన ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్‌ను విక్రయించారు. మరో రెండేళ్ల పాటు వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా అమ్మేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: లాభాల్లో ఉన్నా అమ్మేశారు
కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న జపాన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారంటూ ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రశ్నిస్తోంది. ఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్‌లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలాచేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment