
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిన సంగతి తెలిసిందే.. అదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు అధికారికంగా వెల్లడించారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని స్వయంగా కుమారస్వామి చెప్పారు.
పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు కరోనా సమయంలో రూ.930 కోట్ల లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిందని కుమారస్వామి తెలిపారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని కుమారస్వామి గుర్తుచేశారు.
నాటి నుంచి ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. వైఎస్సార్‌సీపీ సఫలీకృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, కార్మికుల ఒత్తిడితో చివరికి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం... పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది.

ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment