Kumara Swamy
-
జగన్ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది: మంత్రి కుమారస్వామి
-
విశాఖ ఉక్కు కార్మికులకు కేంద్రమంత్రి కుమారస్వామి షాక్
-
వైఎస్ జగన్ వల్లే ప్రైవేటీకరణ ఆగింది - కేంద్రమంత్రి కుమార స్వామి
-
నాటి జగన్ సర్కార్ ఒత్తిడితోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది: కుమారస్వామి
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిన సంగతి తెలిసిందే.. అదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేడు అధికారికంగా వెల్లడించారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని స్వయంగా కుమారస్వామి చెప్పారు.పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు కరోనా సమయంలో రూ.930 కోట్ల లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిందని కుమారస్వామి తెలిపారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని కుమారస్వామి గుర్తుచేశారు.నాటి నుంచి ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. వైఎస్సార్సీపీ సఫలీకృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, కార్మికుల ఒత్తిడితో చివరికి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం... పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారంప్యాకేజీతో ఒరిగేదేమీ లేదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహం -
విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కుమారస్వామి
-
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్రమంత్రి కుమారస్వామి పర్యటన
-
Karnataka: కింగ్ మేకర్ కాదు.. కింగ్ అవుతాం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయాం అన్నారు. తాము నిధుల కొరతతో గెలిచే 25 స్థానాల్లో వెనుకపడ్డామని చెప్పుకొచ్చారు తాను జేడీఎస్ అభ్యర్థులకు ఆర్థికంగా సాయపడలేకపోయానంటూ వాపోయారు. కనీసం 120 రాకపోయినప్పటికీ మాకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. జేడీఎస్ మేకర్ కాదని కచ్చితంగా కింగ్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బొమ్మై రియాక్షన్ ఇదే..) -
తెలుగు ప్రజల మధ్దతుతో మేమె గెలుస్తాం...
-
karnataka Assembly Elections: హై ఓల్టేజ్ సీట్లలో అమీతుమీ!
సాక్షి, కర్ణాటక ఎలక్షన్ డెస్క్: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై అందరి దృష్టి నిలిచింది. సీఎం బసవరాజ బొమ్మై, సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ నేత డీకే శివకుమార్, యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర, కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్‌గౌడ తదితరుల నియోజకవర్గాల్లో గాలి ఎలా ఉందనేది చర్చనీయాంశమైంది. ప్రముఖులు కావడం, నియోజకవర్గాల్లో అన్ని విధాలా పట్టు ఉన్న మూలంగా వీరి విజయానికి ఢోకా లేకపోవచ్చనేది మెజారిటీ మాట. కానీ సమయం అనుకూలించకపోతే ఎవరికై నా పరాజయం తప్పదని అనేకసార్లు ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి. శిగ్గావ్లో సీఎం బొమ్మైకు పరీక్ష హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం బసవరాజ్ బొమ్మై పోటీలో ఉన్నారు. బొమ్మై గత మూడు పర్యాయాలు 2008లో 12వేలు, 2013లో 9,600, 2018 ఎన్నికల్లో 9,200 మెజారిటీతో గట్టెక్కడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ బరిలో ఉన్నారు. బొమ్మైకి లింగాయత్ వర్గాల ఓటర్ల బలముంటే, కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు. ఈసారి పోటీ గట్టిగానే ఉండొచ్చని తెలుస్తోంది. చెన్నపట్టణలో కుమారకు పోటీ రామనగర జిల్లా చెన్నపట్టణ నుంచి జేడీఎస్ తరఫున మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా చెన్నపట్టణను చెబుతారు. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సీపీ యోగేశ్వర్ 1999, 2004, 2011, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. యోగేశ్వర్ ఒకసారి స్వతంత్ర, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ, నాల్గోసారి ఎస్పీ నుంచి విజయం సాధించారు. 2018లో జేడీఎస్ తరఫున పోటీ చేసిన కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మరోసారి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వరుణలో సిద్దుకు తేలికేనా? మైసూరు జిల్లా వరుణలో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎదురు లేదు. 2008, 2013 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018లో తనయుడు యతీంద్రను పోటీ చేసి గెలిపించారు. అయితే పక్క నియోజకవర్గమైన చాముండేశ్వరిలో నిలబడిన సిద్ధరామయ్య ఓడిపోయారు. ఈసారి వరుణ నుంచే బరిలో ఉన్నారు. ఆయనకు మంత్రి వి.సోమణ్ణ పోటీ చేస్తున్నారు. కనకపురలో ఇద్దరు దిగ్గజాలు కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఓడిపోయింది లేదు. ఇక్కడ కాంగ్రెస్ – జేడీఎస్ మధ్యనే పోటీ ఉంటోంది. బీజేపీది మూడో స్థానమే. గతంలో జేడీఎస్ నుంచి డీకేశిపై పోటీ చేసి ఓడిన నారాయణగౌడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నుంచి సీనియర్ మంత్రి ఆర్.అశోక్ డీకేను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారు, సమ ఉజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనేద ఉత్కంఠ నెలకొంది. రామనగరలో తనయుని కోసం.. రామనగర నుంచి మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ జేడీఎస్ నుంచి బరిలో దిగారు. రామనగరలో 2004 నుంచి నాలుగుసార్లు హెచ్డీ కుమారస్వామి గెలుస్తూ వచ్చారు, గత ఎన్నికల్లో భార్య అనితకు అప్పజెప్పారు. ఉప ఎన్నికల్లో ఆమె కూడా గెలిచారు. ఈసారి తనయుడు పోటీలో ఉన్నాడు. దంపతులిద్దరూ కొడుకు కోసం ప్రచార వ్యూహాల్లో మునిగారు. విజయేంద్రకు ఢోకా లేదా! శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర బీజేపీ టికెట్‌తో పోటీలో ఉన్నారు. శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒకసారి తప్ప యడియూరప్ప గెలుపొందారు. శికారిపుర అంటే యడియూరప్పే అనే పేరు వచ్చింది. ఈసారి వారసున్ని బరిలోకి దింపారు. గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. -
‘రైతు బిడ్డను పెళ్లి చేసుకున్న వధువుకి రూ.2 లక్షలు’
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఆకట్టుకునేందుకు నేతలు హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా జేడీ(ఎస్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తమ పార్టీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రైతు బిడ్డను పెళ్లి చేసుకునే యువతులకు తమ పార్టీ రూ. 2 లక్షలు అందచేస్తుందని ప్రకటించారు. కోలార్‌లో జరిగిన 'పంచరత్న' ర్యాలీలో కుమారస్వామి ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. రైతు బిడ్డల పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడపిల్లలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. రైతుల కొడుకులను వివాహం చేసుకునేందుకు ఆడపిల్లలు సిద్ధంగా లేరని తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా మన యువకుల ఆత్మ గౌరవాన్ని కాపాడవచ్చని తెలిపారు. కర్ణాటకలో మే 10న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. 224 స్థానాలున్న అసెంబ్లీలో కనీసం 123 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జేడీ(ఎస్) ఇప్పటి వరకు 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. -
టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ 'మరో ప్రస్థానం'
కొత్త పార్టీ కాదు.. పేరు మార్పు కేసీఆర్ కొత్తగా ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించడం లేదు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.. జాతీయ స్థాయి కార్యకలాపాలకు వీలుగా ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చుతున్నారు. నిబంధనల ప్రకారం పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం అన్నీ ప్రస్తుతమున్నవే కొనసాగుతాయి. అవసరానికి తగ్గట్టుగా భవిష్యత్తులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కొత్త పార్టీ అయితే నమోదు నుంచి నిధుల దాకా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. అదే పేరు మార్పుతో అయితే వెంటనే నేరుగా రంగంలోకి దిగేందుకు అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయమే ఎజెండా దేశంలో ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల ఉనికే లేకుండా చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని.. మరోవైపు కాంగ్రెస్ బలహీనమైందని కేసీఆర్ తరచూ చెప్తున్నారు. ఈ క్రమంలో దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ పేరు మార్పు సభలోనూ ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నారని.. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయంగా నిలవడమే ఎజెండా అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒక పార్టీ విలీనం.. మరో మూడు లైన్లో..! తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ పార్టీ బీఆర్ఎస్లో విలీనానికి సిద్ధమైంది. కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా బీఆర్ఎస్తో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పుడు కొత్త ప్రస్థానం దిశగా కీలక అడుగు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఉద్యమ పార్టీగా తెలంగాణ పోరాటం చేసి, పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త పాత్ర పోషించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ‘జాతీయత’ను ప్రతిబింబించేలా టీఆర్ఎస్ పేరు మార్పిడికి పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం 1.19 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ‘కొత్త జాతీయ పార్టీ.. జాతికి అనివార్యం’ అనే నినాదంతో కొత్త పార్టీ జెండా, ఎజెండాలను బుధవారం ప్రకటించనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్టీ జనరల్ బాడీ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకునే కేసీఆర్‌కు.. పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనరల్ బాడీ సమావేశానికి మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గం, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు కలుపుకొని మొత్తం 283 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. దసరా పండుగ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ముగిశాక.. నేతలు, ప్రతినిధులందరికీ కేసీఆర్ విందు ఏర్పాటు చేశారు. బేగంపేట విమానాశ్రయంలో కుమారస్వామికి స్వాగతం పలుకుతున్న కేటీఆర్ తదితరులు జాతీయ వేదిక అవసరాన్ని వివరిస్తూ.. బుధవారం టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సుమారు రెండు గంటల పాటు ప్రసంగించనున్నారు. ప్రాంతీయ అస్తిత్వానికి ఉనికి లేకుండా బీజేపీ సాగిస్తున్న పాలన, ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ అవసరం, జాతీయ, ప్రాంతీయ పార్టీలను బీజేపీ కనుమరుగు చేస్తున్న తీరు తదితరాలను ప్రస్తావించనున్నారు. దేశాన్ని రాష్ట్రాల సమాహారంగా పేర్కొన్న రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తున్న తీరును ఈ భేటీలో కేసీఆర్ వివరిస్తారని.. మోదీ ప్రభుత్వం పాలనను లాభ నష్టాల దృష్టితో చూస్తున్న వైనాన్ని ఎండగడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు విస్తృత జాతీయ వేదిక అవసరమని, జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పోషించే పాత్రనూ వివరిస్తారని అంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీనమవడం, ప్రాంతీయ పార్టీల వైఫల్యం నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు జాతీయ పార్టీగా టీఆర్ఎస్ రూపాంతరం చెందుతున్నట్టు ప్రకటించనున్నారని పేర్కొంటున్నాయి. కేసీఆర్ తీర్మానంతో.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత రాష్ట్ర సమితి’గా మారుస్తూ బుధవారం జరిగే జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించనున్నారు. ‘‘జాతీయ స్థాయిలో రాజకీయ కార్యకలాపాలకు వీలుగా భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ పేరును మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో సవరణ చేస్తున్నాం’’ అని ఈ తీర్మానంలో పేర్కొననున్నారు. దీనికి మద్దతునిస్తూ ఒకరిద్దరు టీఆర్ఎస్ నేతలు ప్రసంగించే అవకాశం ఉంది. తీర్మానం ఆమోదం అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ కొత్త పేరుపై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ‘‘కొత్త పార్టీని ఏర్పాటు చేయడం లేదు. ప్రస్తుతమున్న టీఆర్ఎస్ పేరును మాత్రమే మారుస్తున్నాం. పార్టీ జెండా, రంగు, ఎన్నికల చిహ్నం తదితరాలన్నీ పాతవే ఉంటాయి. ఎన్నికల సంఘం నియమావళి మేరకు పార్టీ పేరు మార్చేందుకు కేవలం జనరల్ బాడీ తీర్మానం సరిపోతుంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడం కేవలం లాంఛన ప్రాయమే..’’ అని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలే అయినా.. పలు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇదే తరహాలో టీఆర్ఎస్ ముందుకు వెళ్లనుందని పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే పార్టీ పేరులో ‘తెలంగాణ’ పదం ఒక్క రాష్ట్రానికే చెందినది కావడంతో.. జాతీయ స్థాయిలో విస్తరణకు కొంత ఇబ్బందిగా ఉంటుందని, అందుకే జాతీయతను ప్రతిబింబిస్తూ ‘భారత రాష్ట్ర సమితి’గా మారుస్తున్నారని వెల్లడించాయి. ‘తెలంగాణ భవన్’ సన్నద్ధం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చారిత్రక ప్రకటనకు వేదిక కాబోతున్న తెలంగాణ భవన్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం ఇక్కడ జరిగే ఆ పార్టీ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం కోసం రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ సన్నద్ధంగా ఉంది. సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యదర్శి ఎం.రమేశ్‌రెడ్డి, తెలంగాణభవన్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుసహా 283 మంది ప్రతినిధులు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశ మందిరంలో సీటింగ్ ఏర్పాట్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునే గదుల్లో వసతులను పరిశీలించారు. మరోవైపు పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ను స్వాగతిస్తూ తెలంగాణ భవన్ పరిసరాలతోపాటు పలుచోట్ల పార్టీ నేతలు ‘డియర్ ఇండియా.. హీ ఈజ్ కమింగ్’, ‘హి ఈజ్ ఆన్ ది వే’, ‘ఢిల్లీలో రెపరెపలాడనున్న తెలంగాణ ఆత్మగౌరవం’, ‘దేశ్ కీ నేతా కేసీఆర్’, ‘దిల్దార్ సీఎం’, ‘జయహో కేసీఆర్’నినాదాలతో కూడిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేసిన అనంతరం పెద్ద ఎత్తున సంబురాలు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ నేతలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్లో ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ విలీనం జాతీయ పార్టీగా మారుతున్న టీఆర్ఎస్లో తమ పార్టీని విలీనం చేసేందుకు తమిళనాడుకు చెందిన ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ ముందుకు వచ్చింది. బుధవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో విలీన ప్రకటన ఉండనుంది. ‘విడుతలై చిరుతైగల్ కచ్చి’ పార్టీ నుంచి చిదంబరం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు తొల్కప్పియన్ తిరుమవలవన్ మంగళవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్వాగతం పలికి సోమాజిగూడలోని ఓ హోటల్‌కు తీసుకుని వెళ్లారు. విడుతలై చిరుతైగల్ కచ్చి ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు భాగస్వామ్య పార్టీగా ఉంది. హైదరాబాద్‌కు చేరుకున్న కుమారస్వామి బృందం బుధవారం తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఇక కేసీఆర్ ఆహ్వానం మేరకు మాజీ సీఎంలు శంకర్‌సింగ్ వాఘేలా (గుజరాత్), అఖిలేశ్ యాదవ్ (యూపీ)తోపాటు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ కూడా హాజరవుతారని ప్రచారం జరిగినా మంగళవారం రాత్రి వరకు వారి రాకపై స్పష్టత రాలేదు. -
దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేత చరిత్ర సృష్టించారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ రాజకీయాలు చర్చించేందుకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆదివారం కేసీఆర్‌తో కుమారస్వామి ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. వీరిద్దరూ దాదాపు 3 గంటల పాటు నేషనల్ పాలిటిక్స్‌పై చర్చించారు. ఇక, భేటీ అనంతరం మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. దేశానికి తెలంగాణ మోడల్ కానుంది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక అవసరం. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను సైతం తప్పుపడుతున్నారు. నిరుదోగ్యం పెరిగిపోయిందని, రూపాయి విలువ పతనమైందని, ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తోందని ఆరోపించారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ కావాలని దేశ ప్రజలను కోరారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతలను కలుస్తున్నారు. -
నిఖిల్ పెళ్లిపై నివేదిక ఇవ్వండి
సాక్షి, బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ వివాహ వేడుకపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో నిఖిల్ వివాహం (ఏప్రిల్ 17) సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. పెళ్లి కోసం ఎన్ని వాహనాలకు పాస్‌లు ఇచ్చారు. ఎంతమంది అతిథులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించారా లేదా అనేది తెలపాలంటూ గత నెల 21నాటికి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా... ప్రభుత్వం ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. పెళ్లికి ఇచ్చిన పాస్‌లను దుర్వినియోగం చేశారని పిటిషనర్ ఆరోపించడంతో... దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మే 5లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా!) మరోవైపు లాక్డౌన్ నిబంధనలను గాలికి వదిలి మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైభవంగా జరిగింది. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు బీజీ గోవిందప్ప తనయుని వివాహం బేలూరులో జరిపారు. ఈ వేడుకకు పెద్దసంఖ్యలో అతిథులు రావడం, కనీస దూరం, మాస్కులు లేకుండా హాజరు అయ్యారు. దీంతో ప్రజలకు ఒక చట్టం, పెద్దలకు మరో చట్టమా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. (నిఖిల్ పెళ్లి సింపుల్‌గా జరిగింది: యడియూరప్ప) -
నిఖిల్ పెళ్లిపై స్పందించిన కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య వచ్చే నెల 3వ తేదీకల్లా తగ్గే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా కరోనా కేసులు కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని, నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యక్రమం వల్లే 58శాతం కేసులు వచ్చాయన్నారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. కూలీలకు ఆహారం, దుస్తుల కోసం కేంద్రం తగిన నిధులు పంపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.500 కోట్లు, తెలంగాణకు రూ.280 కోట్లు పంపించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. (లాక్డౌన్ వేళ దేవుడి రథోత్సవం!) అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి పెళ్లిలో లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన విషయం తెలిసిందే. వివాహ తంతుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ...ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ సీఎం కుమారస్వామి లాక్డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర సమయంలో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. కరోనాపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 20మందిని మించి గుమికూడదన్న విషయాన్ని గుర్తు చేశారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన వారే నిబంధనలు ఉల్లంఘించడం దురదృష్టకరమన్నారు. (ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా! ) తన తల్లి సంవత్సరికం కార్యక్రమాన్ని కూడా ఆన్లైన్ ద్వారా తాను ఒక్కడినే నిర్వహించుకున్నానని, లాక్డౌన్ నిబంధలు ప్రజా ప్రతినిధులే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. కరోనాను అరికట్టేందుకు లాక్డౌన్ శరణ్యమని ప్రపంచమంతా చెబుతోందన్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. టెస్టుల ద్వారా కరోనా తగ్గుతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాహుల్‌ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌గా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. (లాక్డౌన్ ఉల్లంఘించి.. ఎమ్మెల్యే బర్త్‌డే పార్టీ) ఇక రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ఢిల్లీకి రవాణా చేసేందుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని, పండ్లు, కూరగాయల రవాణలో సమస్యలు ఉంటే సహాయం కోసం కాల్ సెంటర్ నెంబర్: 18001804200 & 14488 కు ఫోన్ చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. (4 నిమిషాల్లో మూడుముళ్లు) -
ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా!
సాక్షి, బెంగళూరు : మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని ప్రధాని నుంచి క్రిందిస్థాయి అధికారుల వరకు మొత్తుకుంటున్నా దేవెగౌడ కుటుంబ పట్టించుకోలేదు. పెళ్లికి పెద్ద ఎత్తున బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరంతా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా గుమిగూడి పెళ్లిని తిలకరించారు. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించకపోవడం గమనార్హం. శానిటైజర్లు వాడారో, లేదో తెలియదు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లిపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి అశ్వత్నారాయణ తెలిపారు. రామనగర డిప్యూటీ నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. కలెక్టర్, ఎస్పీతో కూడా మాట్లాడానని చెప్పారు. వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి నిబంధనలు పాటించాలన్న విచక్షణ లేకపోవడం దారుణమని విమర్శించారు. నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లిపై సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పెళ్లి తంతు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: మాజీ సీఎం ఇంట పెళ్లి -
నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో జరిగింది. గురువారం నుంచే బెంగళూరులో వధువు, వరుడి నివాసంలో సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్డౌన్ అడ్డు వచ్చింది. పెళ్లికి తక్కువ సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు హాజరయ్యారు. -
ఐపీఎస్ ఇంటికి సీబీఐ.. నాకేం భయం: కుమారస్వామి
కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో భగ్గుమన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ దూకుడు పెంచింది. సీనియర్ ఐపీఎస్, రౌడీలకు సింహస్వప్నమని పేరున్న అలోక్‌కుమార్ ఇంటి తలుపు తట్టింది. త్వరలో మరికొందరి ఇళ్లలోనూ సోదాలు జరగవచ్చని సమాచారం. కర్ణాటక, బనశంకరి: సంచలనాత్మక ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్‌కుమార్ ఇంటిపై గురువారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో రెండుగంటల పాటు శోధించి పలు ముఖ్యమైన పత్రాలను, మొబైల్‌ఫోన్, పెన్‌డ్రైవ్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నాలుగు నెలల కిందట అలోక్‌కుమార్ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఫోన్‌ట్యాపింగ్ జరిగినట్లు ఆగస్టులో ఆరోపణలు గుప్పుమన్నాయి. అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో ట్యాపింగ్ నిర్వహించారని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఇది తీవ్ర సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్ప ఈ కేసును సీబీఐ అప్పగించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మద్రాస్‌రోడ్డులో కేఎస్ఆర్పీ అదనపు పోలీస్డైరెక్టరేట్ (ఏడీజీపీ) గా ఉన్న అలోక్‌కుమార్ నివాసంపై ఒక్కసారిగా సీబీఐ అధికారులు చేరుకున్నారు. నివాసంలో మూలమూలనా శోధించారు. ఆయన ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ తదితరాలను జల్లెడ పట్టారు. ట్యాపింగ్‌పై ప్రశ్నలు సోదాల సమయంలోనే ఒక సీబీఐ సీనియర్ అధికారి నేతృత్వంలోని అలోక్‌కుమార్‌ను విచారణ చేపట్టి సమాచారం రాబట్టారు. ఫోన్ ట్యాపింగ్‌కు ఎందుకు పాల్పడ్డారు, కారణాలేమిటి? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో ఆయన పాత్ర కీలకం కావడంతో త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. అలా రచ్చ అయ్యింది ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న భాస్కర్‌రావ్, కమిషనర్ పోస్టు కావాలని పలువురు నాయకులతో ఫోన్లో మాట్లాడటాన్ని ట్యాప్ చేసి లీక్ చేశారు. ఆ టేపులో టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ట్యాపింగ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం మొదలైంది. అప్పట్లో అలోక్‌కుమార్ నివామైన నగర పోలీస్ కమిషనర్ బంగ్లా నుంచి ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అదికారుల పేర్లు కూడా వినబడుతున్నాయి. అలోక్‌కుమార్ కేఎస్ఆర్పీ ఏడీజీపీగా బదిలీ అయిన అనంతరం పెన్‌డ్రైవ్‌లో సుమారు 30 జీబీ వాయిస్ రికార్డింగ్‌లను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధిచి మొదట సీసీబీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో స్వయంప్రేరితంగా ఐపీసీ సెక్షన్ 72 ఐటీ యాక్టు, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో ఆధారాలన్నింటినీ సీబీఐకి అప్పగించారు. విచారణ జరగనీ: దేవెగౌడ జేడీఎస్ అధినేత హెచ్డీ.దేవేగౌడ మాట్లాడుతూ.. సీబీఐ తన పని తాను చేస్తుందని, దీనిగురించి నేను ఎందుకు మాట్లాడాలని, ఎవరెవరిని విచారణ చేస్తుందో చేయనీ అని అన్నారు. హెచ్డీ.కుమారస్వామిని విచారిస్తారా? అన్న ప్రశ్నకు అందులో ఎవరు ఉన్నారో తనకు తెలియదని, ఊహాగానాలకు జవాబు ఇచ్చేది లేదని చెప్పారు. నాకేం భయం: కుమారస్వామి ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణపై తనకేమీ భయం లేదని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ.కుమారస్వామి అన్నారు. గురువారం బెంగళూరులో పార్టీ ఆఫీసులో పార్టీ ఎంపీల సమావేశంలో పాల్గొనే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో ఎవరినైనా విచారిస్తే నేనెందుకు పట్టించుకోవాలి?, ఎవరెవరి హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగాయో వాటన్నింటిని మీదా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దేశ న్యాయవ్యవస్థలో ఎవరు ఎవరినైనా విచారించవచ్చు, సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్‌కుమార్ సమర్థుడైన అధికారి అని కుమార కితాబిచ్చారు. -
కుమారస్వామి బెదిరించారు: విశ్వనాథ్
బెంగళూరు సాక్షి/ శివాజీనగర/ మైసూరు: ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకోవడాన్ని మూడో చెవి కూడా విందా?, అవుననే అంటున్న కొందరు నాయకులు. కన్నడనాట మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేకెత్తిస్తున్నాయి. గత నెలాఖరు వరకు పరిపాలించిన జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి పలువురు ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని తాజాగా తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్, జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్‌తో పాటు పలువురు నాయకులు తమ ఫోన్ల ట్యాపింగ్‌జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ఫోన్ల సంభాషణలను చాటుగా విన్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు అప్పటి బెంగళూరు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ సుత్రధారిగా భావిస్తున్నారు. కుమారస్వామి బెదిరించారు: విశ్వనాథ్ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనతో పాటు అనర్హతకు గురైన ఎమ్మెల్యేలందరి ఫోన్లను ట్యాపింగ్ చేయించి ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారంటూ జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. బుధవారం ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాప్ కావడంతో తమ ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయన్న విషయం వెలుగు చూసిందన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. వీటన్నింటి వెనుక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హస్తం ఉందని, అనర్హత ఎమ్మెల్యేలను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి కుమారస్వామి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని, రాజీనామాను ఉపసంహరించుకోకపోతే ఆడియో క్లిప్పులు బహిర్గతం చేస్తామంటూ ప్రభుత్వం కూలిపోకముందు కుమారస్వామి స్వయం గా ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. దీనిపై అనర్హత ఎమ్మెల్యేలమంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. తమ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. ట్యాపింగ్‌పై విచారించాలి: జీటీ మైసూరు: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపించాలని జేడీఎస్ మాజీ మంత్రి జీటీ దేవేగౌడ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని, దానిపై ఆసక్తి కూడా లేదన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీలోని స్నేహితులు కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇక ముఖ్యమంత్రి యడియూరప్పతో భేటీ కావడం వెనుక మైసూరు పాల సమాఖ్య ఎన్నికల గురించి చర్చ తప్ప మరేమీ లేదన్నారు. మైసూరు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. -
కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో స్పీకర్ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నారు. సభలో చర్చలో భాగంగా స్పీకర్ రమేష్ కుమార్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గత కొన్ని రోజులుగా సభలో జరిగే పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు కనీస సంప్రదాయలు పాటించకుండా స్పీకర్ పదవిలో ఉన్న తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి తాను పూర్తిగా న్యాయం చేసినట్లు భావిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగ ప్రమాణాల మేరకు సభను నిర్వహించానన్నారు. సభలో జరగబోయే పరిణామాలను తాము ముందే ఊహించి.. తన రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్లు వెల్లడించారు. తానేంటో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. కాగా సభలో సీఎం కుమార స్వామి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఓటింగ్‌కు తాము సిద్ధమేని...కానీ డివిజన్ పద్దతిలో ఓటింగ్ జరపాలని స్పీకర్‌ని కోరారు. దానికి స్పీకర్ నిరాకరించారు. -
కుమారస్వామికి గవర్నర్ డెడ్‌లైన్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతోంది. తాజాగా గవర్నర్ వాజూభాయ్ వాలా సీఎం కుమారస్వామికి కీలక సూచన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని కుమారస్వామికి గవర్నర్ సూచించారు. ఈ మేరకు గవర్నర్ వాజూభాయ్ వాలా సీఎంకు ఓ లేఖ రాశారు. అంతకుముందు విశ్వాస పరీక్షను ఈ రోజే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్‌కు ఓ సందేశం పంపారు. అయితే, సభలో ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు కుమార ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బలపరీక్షకు సిద్ధం కావాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ఈ కూటమికి 98 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, తమకు 105 మంది ఉన్నారని చెప్పారు. -
విశ్వాస పరీక్షకు సిద్ధం!
-
రాష్ట్రపతి పాలనా? బలపరీక్ష?
సాక్షి, బెంగళూరు: తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కన్నడనాట రాష్ట్రపతి పాలన తప్పదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 14 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్, గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మద్దతు లేక పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసులు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ గాల్లో దీపంలా మారిపోయింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో తెలియని గందరగోళం నెలకొంది. మంగళవారం శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్ కూడా రాజీనామా చేశారు. గవర్నర్ ఏమంటారు? అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అలాగే రాజీనామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే బీజేపీ లోలోపల తన కార్యాచరణను అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రుల రాజీనామాలు చేయడంతో సంకీర్ణం మైనారిటీలో జారిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నర్ వజుభాయి వాలా కుమారస్వామి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలనకే సిఫార్సు చేస్తారా అనేది సస్పెన్స్‌గా మిగిలింది. మైనారిటీలో కుమార సర్కారు 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 37 మంది, బీజేపీకి 105 మంది, బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారపక్షానికి మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో ఆబలం 103కు క్షీణించింది. సర్కారు ఏర్పాటుకు 113 మంది శాసనసభ్యుల బలముండాలి. గ తంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ముందుగా బలపరీక్షకు అధికార పక్షాల్ని గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారింది. బలపరీక్షకే సీఎం మొగ్గు బలపరీక్షకు సిద్ధంగా ఉండాలని సీఎం కుమారస్వామి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. బలం చాటుకోవడానికి విశ్వాస పరీక్షను ఎదుర్కొవడమే ఉత్తమమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష సందర్భంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేయవచ్చని, విప్‌కు భయపడి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని భావిస్తున్నారు. ఒకవేళ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్షలో ఓటు వేస్తే సంబంధిత ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. సంకీర్ణానికే మహేశ్ మద్దతు నానాటికీ బలం కోల్పోతున్న సంకీర్ణ ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ మద్దతు ప్రకటించారు. మంగళవారం విధానసౌధ కార్యదర్శితో భేటీ అయి సర్కారుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించి వెళ్లిపోయారు. నేడు ముంబైకి డీకేశి ముంబైలో మకాం వేసిన అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. బుధవారం డీకే శివకుమార్ బృందం అసంతృప్త ఎమ్మెల్యేల వద్దకు వెళ్లనుంది. వారు రెబెల్స్‌ను కలిసే అవకాశం లభిస్తుందా? అన్నది అనుమానమేనని తెలుస్తోంది. -
కర్ణాటక సంక్షోభం: వ్యూహాత్మకంగా స్పీకర్ నిర్ణయం!
బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర సంక్షోభం దిశగా సాగుతోంది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. తాజాగా శనివారం మరో 11 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. అయితే, వారు రాజీనామా లేఖలు అందించే సమయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తన కార్యాలయంలో అందుబాటులో లేరు. అధికార సంకీర్ణ కూటమికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సమయంలో స్పీకర్ అందుబాటులో లేకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో స్పీకర్ రమేశ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నా కూతుర్ని పికప్ చేసుకోవడానికి నేను ఇంటికి వెళ్లాను. రాజీనామా లేఖలు స్వీకరించి.. లేఖలు తీసుకున్నట్టు వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని నా కార్యాలయానికి సూచించాను. 11 మంది రాజీనామా చేశారు. రేపు (ఆదివారం) సెలవు కాబట్టి, సోమవారం వారి రాజీనామాల సంగతి చూస్తాను’ అని ఆయన వెల్లడించారు. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం అత్యంత కీలకం కావడంతో ప్రస్తుతానికి వ్యూహాత్మకంగా ఆయన దాటవేత ధోరణి అవలంబిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే.. కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా బీజేపీ 105, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్పీ 1, ఇతరులు 2 ఉన్నాయి. గతంలో ఇద్దరు, ఇప్పుడు 11 మంది సంకీర్ణ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో బలపరీక్ష జరిగితే.. బీజేపీ సులువగా బలపరీక్షలో నెగ్గి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. -
కర్ణాటకలో పెనుమార్పులు
తాండూరు టౌన్: లోక్‌సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో పెనుమార్పులు సంభవిస్తాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ప్రస్తుతం ఉన్న కుమారస్వామి ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల అనంతరం కుప్పకూలే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ ప్రభుత్వంలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. బుధవారం ఆయన తెలంగాణ–కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని చించోళిలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ తాండూరులో బీజేపీ సీనియర్ నేత అరవింద లింబావళితో కలిసి విలేకరులతో మాట్లాడారు. చించోళి, కందుగోళ్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 25 వేలకు పైగా మెజార్టీ సాధిస్తారన్నారు. ప్రభుత్వం పడిపోతే మల్లిఖార్జున ఖర్గే సీఎం అవుతారని, ఏకంగా సీఎం కుమారస్వామి ప్రకటించడం పట్ల వారి ప్రభుత్వంపై ఆయనకు నమ్మకం సడలినట్లేనని ఎద్దేవా చేశారు. ఈసారి కర్ణాటకలో 20 నుంచి 22 ఎంపీ సీట్లు గెలుస్తామని, దేశవ్యాప్తంగా 285కు పైగా ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచి తిరిగి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. అనంతరం సీనియర్ నాయకులు అరవింద లింబావళి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల అనంతరం కర్ణాటకలో కుమారస్వామి ప్రభు త్వం కూలిపోతుందని, యడ్యూరప్ప తిరిగి సీఎం అవుతారన్నారు. -
స్టాలిన్‌తో భేటీ కానున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నేటి నుంచి సీఎం కేసీఆర్.. మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మొదట కేరళ సీఎం పినరయి విజయన్‌తో సంప్రదింపులు జరుపనున్నారు. అటుపై ఈ నెల 13న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం కుమారస్వామితో సోమవారం ఉదయం కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. నీరు విడుదల చేసినందుకు కుమారస్వామికి కృతజ్క్షతలు తెలిపారని సమాచారం. -
సుమలతపై కుమారస్వామి ఘాటు విమర్శలు
మండ్య: అంబరీశ్ మరణించిన బాధ తాలూకు ఛాయలే సుమలతలో కనిపించడం లేదని సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. మండ్య నగరంలోని బందిగౌడ లేఔట్లో ఉంటున్న మాజీ ఎంపీ జి.మాదేగౌడతో సీఎం బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమలతా ప్రసంగాలను గమనిస్తున్నానని, ఆమె ముఖంలో భర్త చనిపోయిన బాధ ఏమాత్రం లేదని విమర్శించారు. నాటకీయంగా సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మండ్య జిల్లాలో సుమారు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కష్టాలపై తాను స్పందిస్తానని తెలిపారు. రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం కోసం సాయం చేస్తానన్నారు. సుమలతా ఆటలు ఎక్కువ కాలం సాగవని విమర్శించారు. మైసూరులోని ఏ హోటల్లో కుర్చొని డబ్బులు ఇచ్చి పుచ్చుకున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు అన్ని విషయాలు తెలుసునని తెలిపారు. మండ్యలో సీఎం తనయుడు నిఖిల్ జేడీఎస్ అభ్యర్థిగా, సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. బీఎస్ఎఫ్ భద్రత తెచ్చుకోండి సుమలతకు ప్రత్యేక భద్రత కావాలంటే బీఎస్ఎఫ్ లేదా సరిహద్దులో గస్తీ కాసే వారిని భద్రతకు పెట్టుకోవచ్చని, అవసరమైతే తానే కేంద్రానికి లేఖ రాస్తానని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేయట్లేదని తెలిపారు. కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దర్యాప్తు చేసుకోవచ్చని తెలిపారు. తాను ఎవరిని జోడెద్దులు, దొం గ ఎద్దులు అని సంభోధించలేదన్నారు. దొంగ ఎద్దులు అని మాట్లాడినట్లు వచ్చినవన్నీ మీడియా సృష్టేనన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కొన్ని ఎద్దులు వస్తాయని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఎవరికి ఓట్లు వేయాలనే విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు. -
సీఎం మాట తప్పారు
సాక్షి, బెంగళూరు: ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అంబరీష్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారా? అంని సీఎం కుమారస్వామి సుమలత ప్రశ్నించారు. మండ్య జిల్లాలో సుమలతా మీడియాతో మాట్లాడుతూ అంబరీష్ పేరును ఉపయోగించుకున్న వారు ఎవరు, ఇప్పుడు ఆయనకు విరుద్ధంగా మాట్లాడేవారు ఎవరనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అంబరీష్ గురించి ఏమీ మాట్లాడనని రెండు రోజుల క్రితం చెప్పిన సీఎం అప్పుడే మాట తప్పారని విమర్శించారు, అంబరీష్‌కు ఏం చేశారో మాట్లాడుతున్న సీఎం, మండ్య ప్రజలకు ఏమీ చేశారో కూడా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
సుమలతకు క్షమాపణలు
సాక్షి, బెంగళూరు: నటి సుమలతా అంబరీశ్‌పై ప్రజాపనుల మంత్రి, తన సోదరుడు హెచ్డీ రేవణ్ణ చేసిన వ్యాఖ్యలపై తాను క్షమాపణ చెబుతున్నట్లు ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఆదివారం సీఎం అధికారిక నివాసం కృష్ణాలో ఆయన పల్స్ పోలియోలో శిశువులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమలతా పోటీ అంశానికి సంబంధించి హెచ్డీ రేవణ్ణ చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే ఆయన తరఫున తాను క్షమాపణ అడుగుతున్నట్లు తెలిపారు. హెచ్డీ రేవణ్ణ వ్యాఖ్యల వల్ల సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. మండ్య లోక్‌సభ ఎన్నికల విషయంలో మీడియా ఎందుకంత ఆసక్తి కనపరుస్తోందంటూ ప్రశ్నించారు. ఆపరేషన్ కమలకు ఆడియో టేప్ కేసు విషయంపై సిట్ ఏర్పాటుపై అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నాలుగైదు రోజుల్లో సీట్ల సర్దుబాటు వచ్చే లోక్‌సబ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా ఓ కొలిక్కి రాలేదని కుమారస్వామి తెలిపారు. నాలుగైదు రోజుల్లో ఈ విషయంపై తీర్మానిస్తామని తెలిపారు. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయి కర్ణాటకకు రావాల్సిన రూ. 2 వేల కోట్ల పరిహారం అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కేంద్రం ప్రకటించిన పరిహారం రూ. 900 కోట్లులోనూ కేవలం రూ. 400 కోట్లు మాత్రమే అందిందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. మంకీ ఫీవర్ నివారణ చర్యలు మలేనాడు ప్రాంతంలో కనిపిస్తున్న మంగనకాయిలే (మంకీ ఫీవర్) వ్యాధి వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంకీ ఫీవర్‌తో మరణించి వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. మంకీ ఫీవర్‌తో మరణించిన కుటుంబాలకు పరిహారం ఇస్తే స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడా పరిహారం కోసం డిమాండ్ చేస్తారని తెలిపారు. ఇప్పటివరకు సాగర్ తాలూకాలో 8 మంది, తీర్థహళ్లి తాలూకాలో ఇద్దరు మొత్తం 10 మంది మంకీ ఫీవర్‌తో మరణించినట్లు తెలిపారు. అలాగే 1,762 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించామని చెప్పారు. 272 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. -
యెడ్డీ ఆడియో క్లిప్పులపై సిట్
బెంగళూరు: అధికార జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపరిచేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నించినట్లుగా ఉన్న ఆడియో క్లిప్పింగులపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అయితే, యడ్యూరప్ప ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్వయంగా ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్న ఈ కేసులో సిట్ దర్యాప్తుతో నిజాలు ఎలా వెలుగులోకి వస్తాయని ప్రశ్నించారు. యడ్యూరప్ప మాట్లాడినట్లు ఉన్న క్లిప్పింగుల్లో తన పేరును కూడా ప్రస్తావించినందున నిజాలు నిగ్గు తేల్చాలంటూ సోమవారం అసెంబ్లీలో స్పీకర్ రమేశ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. నిజాయతీపరుడు, నిబద్ధత కలిగిన స్పీకర్ రమేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలను తప్పని రుజువు చేసి, ఆ పదవి ఔన్నత్యాన్ని కాపాడాలని అధికార పక్ష సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కుమారస్వామి ఆ ఆడియో క్లిప్పింగులపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, క్లిప్పింగుల్లో స్పీకర్ పేరు ప్రస్తావనపై మాత్రమే విచారణను పరిమితం చేయాలని, లేకుంటే సిట్‌ను ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయంటూ ప్రతిపక్ష బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, ప్రతిపక్ష బీజేపీ కొంతకాలంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, క్యాంప్ రాజకీయాలు చేయడం విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల సీఎం కుమారస్వామి.. బీజేపీ నేత యడ్యూరప్ప జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నట్లుగా ఉన్న ఫోన్ సంభాషణ క్లిప్పింగులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఒకవేళ అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన చేరినట్లయితే స్పీకర్ వారికి అనుకూలంగా రూలింగ్ ఇచ్చేందుకు గాను రూ.50 కోట్లు ఇద్దామంటూ యడ్యూరప్ప అన్నట్లుగా అందులో రికార్డయి ఉంది. యడ్యూరప్ప ఏమన్నారు? మొదట్లో వీటిని ఖండించిన యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడతో తాను మాట్లాడింది నిజమేనంటూ ఆదివారం ప్రకటించారు. అయితే, సీఎం ప్రోద్బ లంతోనే అతడు తనతో భేటీ అయ్యాడని ఆరోపించారు. అందులోని కీలక అంశాలను తొలగించి, తమకు అనువుగా ఉండేలా సంభాషణ క్లిప్పింగులు రూపొందించారని అన్నారు. శాసనసభ సమావేశాలకు గైర్హాజరవుతున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కాంగ్రెస్ కోరింది. -
ఆ గొంతు నాదే : యడ్యూరప్ప
బెంగళూరు : కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ఆడియో టేపు వ్యవహారంలో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ టేపులో మాటలు తనవేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పరోక్షంగా అంగీకరించిన అంశం సంచలనం సృష్టించింది. తమ ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో యడ్యూరప్ప తమ శాసనసభ్యులను కొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ ఆడియో టేపును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆరోపణలను ఖండించిన యడ్యూరప్ప ‘ఆ ఆడియో సంభాషణ నాదేనని నిరూపిస్తే రాజీనామా చేస్తా’నంటూ సవాలు కూడా చేశారు. అయితే ఆదివారం హుబ్బళ్లిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘నేను దేవదుర్గకు వెళ్లినప్పుడు అర్ధరాత్రి ముఖ్యమంత్రి కుమారస్వామి తన పార్టీ ఎమ్మెల్యే కుమారుడిని పంపి నాతో మాట్లాడేలా ప్రేరేపించారు. ఆ సంభాషణలో తనకు అవసరమైన మాటల్ని కత్తిరించి ఎడిట్ చేసి వాటిని విడుదల చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహించిన యడ్యూరప్ప ఆడియోలో సంభాషణ తనదేనని అంగీకరించారు. ఆడియో టేపుల విషయంలో యడ్యూరప్ప నిజం ఒప్పుకోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పక్షాలు ఆయనపై విమర్శల దాడికి దిగాయి. యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిందేనంటూ ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర డిమాండ్ చేశారు. -
రచ్చవుతున్న వాయిస్ రికార్డింగ్
తమ ఎమ్మెల్యేకు యడ్యూరప్ప రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చారని సీఎం కుమారస్వామి బడ్జెట్‌కు ముందు ఆడియో టేపులు విడుదల చేయగా, అవి నకిలీవని, ఆయన రికార్డింగ్ అనుభవంతో వాటిని తయారు చేసి ఉంటారని యడ్డి మండిపడ్డారు. ఇందులో స్పీకర్ మీద కూడా ఆరోపణలు రావడం గమనార్హం. సాక్షి బెంగళూరు: జేడీఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసినట్లు సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో రికార్డులు నకిలీవని ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. శుక్రవారం ఆయన విధానసౌధ వద్ద మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపిస్తున్న సీఎం కుమారస్వామి రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘రాజీనామా చేసి వచ్చెయ్.. సభాధ్యక్షునితో నేను మాట్లాడుతా’ అని తాను ప్రలోభపెట్టినట్లు కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. సభాపతి పదవిని సీఎం కుమారస్వామి అగౌరవ పరుస్తున్నారని విమర్శించారు. నకిలీ ఆడియో రికార్డులతో రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని, సీఎం కుమారస్వామి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. దేవదుర్గకు హెలికాప్టర్లో వెళ్లి వచ్చానని చెప్పారు. అంతేకానీ తాను ఎవరితో మాట్లాడలేదని చెప్పారు. ఆయన సినిమా రికార్డింగులు చేసిన వ్యక్తి ‘ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సినిమా వ్యక్తి. ఆయన ఎన్నో సినిమాలు నిర్మి ంచారు. రికార్డింగులు చేయించారు. ఈక్రమంలో ఈ రికార్డింగు కూడా అలాంటిదే’ అని యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్‌నే సీఎం కుమారస్వామి ప్రలోభపెట్టారన్నారు. జేడీఎస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని యడ్యూరప్ప చెప్పారు. కాంగ్రెస్– జేడీఎస్ నుంచి సుమారు 12 మంది ఎమ్మెల్యేలు సమావేశాలకు ముఖం చాటేశారని, వీరిలో ఎంతమంది సర్కారుకు మద్దతు ఇస్తారో లేదో తెలియదన్నారు. కుమార ఆఫర్ ఇచ్చారు: సుభాష్ గుత్తేదార్ సీఎం కుమారస్వామి తనకు భారీ ఆఫర్ ప్రకటించారని ఎమ్మెల్యే సుభాష్ గుత్తేదార్ ఆరోపించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్లో బెర్తుతో పాటు తనకు అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని కుమారస్వామి ఆఫర్ ఇచ్చారన్నారు. తాను ఏ పార్టీలోకి మారనని స్పష్టం చేశానన్నారు. -
బీజేపీ ప్రలోభాలకు ఆధారాలున్నాయ్
బెంగళూరు: తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందనీ, అందుకు సాక్ష్యమిదేనంటూ శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస్వామి ఓ ఆడియో క్లిప్పింగ్‌ను మీడియాకు వినిపించారు. ఆ ఆడియోలో...అధికార జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యే నాగన్ గౌడ కొడుకు శరణ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లుగా ఉంది. బీజేపీ పక్షంలోకి వస్తే మంత్రి పదవితోపాటు మరిన్ని లాభాలు కల్పిస్తామని, స్పీకర్ సైతం వస్తే రూ.50 కోట్లు ఇస్తామన్నట్లుగా ఆడియోలో ఉంది. ఆ ఆడియోను లేబొరేటరీకి పంపి అందులోని వాయిస్ ఎవరిదో తేలుస్తామన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే క్రమంలో తన పేరు ప్రస్తావనకు రావడంపై స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. ఆ ఆడియో క్లిప్‌పై విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అందులో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నదీ స్పష్టంగా లేనప్పటికీ ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. ఆ క్లిప్పులో జడ్జీల పేర్లు, ప్రధాని మోదీతోపాటు బీజేపీ చీఫ్ అమిత్‌ల పేర్లు ప్రస్తావనకు వచ్చాయని వివరించారు. సీఎం కుమారస్వామి చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కొట్టిపారేశారు. కాగా, సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన తమ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బుధవారం నుంచి మొదలైన బడ్జెట్ సమావేశాలకు హాజరుకాని రమేశ్ జర్కిహోలి, ఉమేశ్ జాధవ్, మహేశ్ కుమతాలి, బి.నాగేంద్రలపై ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోనున్నట్లు సీఎల్పీ నేత సిద్ధరామయ్య వెల్లడించారు. -
కుమార స్వామి సర్కార్‌ను కూలదోయం : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూర్ : కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోసేందుకు తమ పార్టీ సభ్యులెవరూ ప్రయత్నించడం లేదని బీజేపీ కర్ణాటక చీఫ్ బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో పాలక సంకీర్ణం, బీజేపీల మధ్య అధికారం కోసం పోరు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఉన్న పాలక సంకీర్ణ ఎమ్మెల్యేలను బీజేపీ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయడంలేదని మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో విఫలమైన కాంగ్రెస్-జేడీఎస్ తమపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు తమ పార్టీ నేతలెవరూ ఎలాంటి ఆపరేషన్‌నూ చేపట్టడం లేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక చోట చేరితే వారెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో అంతర్గత పోరు అదుపుతప్పిందని, వారి అంతర్గత వైఫల్యాలకు బీజేపీని నిందించడం తగదని యడ్యూరప్ప హితవు పలికారు. -
వీరుడి చుట్టూ.. వివాదాల గుట్టు
సాక్షి, బెంగళూరు : మైసూర్ పులిగా పిలవబడే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. జేడీఎస్ చీఫ్, కర్ణాటక సీఎం కుమారస్వామి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని ముస్లింలను ఆకట్టుకునేందుకే జేడీఎస్-కాంగ్రెస్ టిప్పు ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్తనాటకానికి తెరలేపిందని అన్నారు. టిప్పు పాలనలో హిందూవులను చిత్రహింసలకు గురిచేశారని, ఆయనను యాంటీ హిందూపాలకుడిగా బీజేపీ వర్ణించింది. యడ్యూరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఖండించారు. 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారిని ఎదురించిన గొప్ప పోరాడయోధుడు టిప్పుసుల్తానని, అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను జరుపుకోవడంలో తప్పేమీ లేదని వివరించారు. పోరాటయోధులను బీజేపీ ఎప్పుడూ గౌరవించలేదని.. టిప్పుపై రాజకీయం ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలనే ఏజెండాతో బీజేపీ ఈ ఆరోపణలకు దిగిందని అన్నారు. టిప్పు ఉత్సవాలను నిర్వహించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గతంలో అభినందిచినట్లు ఆయన గుర్తుచేశారు. గతంలో కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా టిప్పుపై వివాదం రేగింది. ప్రతి ఏడాది టిప్పు జయంతి, వర్థింతి వేడుకల సమయంలో రాజకీయంగా దుమారంరేగడం కన్నడలో సాధారణంగా మారిపోయింది. కాగా బ్రిటిష్ హయాంలో మైసూర్ పాలకుడిగా ఉన్న టిప్పు సుల్తాన్ వారితో వీరోచితంగా పోరాడి 1799 మే 4న 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారు. ముఖ్యంగా యుద్దంలో అనుసరించాల్సిన వ్యూహాలను రచించడంతో టిప్పును దిట్టగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఆధునిక చరిత్రలో యుద్దంలో తొలిసారిగా రాకెట్లను ఉపయోగించిన ఘనత టిప్పు సుల్తాన్‌కే దక్కుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయం తెలిసిందే. -
టిప్పు సుల్తాన్ జయంతి : కుమారస్వామి వర్సెస్ బీజేపీ
సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలా..లేదా అనేది బీజేపీయే తేల్చుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల గురించి తాను ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని, దేశంలో భిన్న వర్గాలు వారికిష్టమైన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయని మాత్రమే వ్యాఖ్యానించానన్నారు. కాగా టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను ఈనెల 10న నిర్వహించాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఖండించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని (మాండ్య) కాపాడుకునే క్రమంలో మరణించారు. కన్నడ భాషకు, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిన టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను నిర్వహించడాన్ని పలువురు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని నిర్ణయించింది. -
దుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక సీఎం
-
కర్ణాటక సర్కారులో మంత్రులకు శాఖలు కేటాయింలు
-
నాకు ఇప్పుడే మంత్రి పదవి కావాలి...
సాక్షి, బెంగళూరు : మాజీ మంత్రి, బీదర్ జిల్లా బబలేశ్వర్ ఎమ్మెల్యే ఎంబీ పాటిల్‌కు మంత్రివర్గంలో తాజా కేబినెట్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన అనుచరులు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఆయన కూడా మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెంగళూరులోని ఎంబీ పాటిల్ నివాసానికి క్యూ కట్టారు. సీఎం కుమారస్వామితో సహా ఎంతో మంది సీనియర్ నాయకులు, మంత్రులు వెళ్లి మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలించలేదు. ఆయన ఒక్క మెట్టు కూడా దిగలేదు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశపాండే వెళ్లి ఎంబీ పాటిల్‌తో మాట్లాడారు. అనంతరం ఉపముఖ్యమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్, మంత్రి కేజే జార్జ్ తదితరులు వెళ్లి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎంబీ పాటిల్ మాత్రం ఎవ్వరి మాట వినకుండా పట్టిన పట్టు వదలడం లేదు. ఎంబీ పాటిల్ ఇంటికి సీఎం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగళూరు నగరంలోని సదాశివనగర్‌లో ఉన్న మాజీ మంత్రి ఎంబీ పాటిల్ ఇంటికి కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి స్వయంగా వెళ్లారు. సుమారు గంటన్నర పాటు సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఎంబీ పాటిల్ కుటుంబ సభ్యులకు తనకు ఎంతోకాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎంబీ పాటిల్‌కు మంత్రి పదవి రాలేదని అసమ్మతి వ్యక్తం చేశారని చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతానని సీఎం అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్‌తో మాట్లాడితే అన్ని సర్దుకుంటాయని సీఎం కుమారస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్నీ గమనిస్తోందని.. సీఎం కుమారస్వామి ఎంబీ పాటిల్‌కు సూచించారు. వచ్చే జాబితాలో చోటు త్వరలో మంత్రివర్గం విస్తరణ ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఎంబీ పాటిల్‌కు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం తనకు ఇప్పుడే మంత్రి పదవి కావాలని పట్టుబట్టారు. తాజా జాబితాలో తన పేరు ఎందుకు లేదో సమాధానం చెప్పాలని ఎంబీ పాటిల్ కోరారు. లింగాయత్– వీరశైవుల ప్రత్యేక మతం కోసం పోరాటాలు చేసినా ఫలితం లేకపోయిందని పాటిల్ ఆవేదన చెందారు. చెప్పడానికి వచ్చిన మంత్రులతో మాట్లాడుతూ మీకు (మంత్రులకు) పదవులు ఇచ్చారు. ఏమైనా మాట్లాడుతారు. కానీ నాకు మంత్రి పదవి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఎవరు చెప్పినా ఎంబీ పాటిల్ వినే పరిస్థితిలో లేరన్నారు. ఆయనతో జరిపిన చర్చలన్నీ విఫలమైనట్లు తెలిపారు. మద్దతుదారుల ఆందోళన మాజీ మంత్రి ఎంబీ పాటిల్‌తో మాట్లాడటానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులపై ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒక్కడిని కాను.. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎంబీ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ... తాను ఒక్కడినే పార్టీకి వ్యతిరేకంగా లేరన్నారు. తనతో పాటు సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. సీఎం కుమారస్వామి తన ఇంటికి వచ్చి మాట్లాడిన సంగతి వాస్తవమే అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోని వ్యవహారాలపై సీఎం ఏం చెప్పలేరు కదా అన్నారు. గత రెండు రోజుల నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలందరు చర్చించినట్లు తెలిపారు. -
సీఎంను కలవలేకపోయిన నటుడు
యశవంతపుర : నటుడు హుచ్చ వెంకట్ ... ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవటానికి వచ్చి నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. వెంకట్ బుధవారం జేపీ నగరలోని సీఎం కుమారస్వామి ఇంటికి వెళ్లారు. అయితే సీఎం బీజీగా ఉండటంతో కలవటానికి అవకాశం దొరకలేదు. చాలా సేపు వేచి ఉన్నా సీఎంను కలిసే అవకాశం లేకపోవడంతో అక్కడినుంచి వెనుదిరిగారు. -
మాఫీ ఎలా?
సాక్షి, బెంగళూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతల రుణ మాఫీ చేయాలంటూ రైతుసంఘాలు, ప్రతిపక్ష బీజేపీ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడితో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నికల ప్రచారంలో జేడీఎస్ గద్దెనెక్కితే రైతులకు రూ. 53 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని కుమారస్వామి హామీనిచ్చారు. అనూహ్య పరిస్థితుల్లో కుమార సీఎం కావడం, రుణాల రద్దు కోసం బీజేపీ సహా రైతుసంఘాలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. రుణమాఫీపై ఉన్న సాదకబాధకాలపై మంగళవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రుణమాఫీపై తీవ్రంగా చర్చించినట్లు తెలిపారు. నేడు (బుధవారం) రుణమాఫీపై ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తామని చెప్పారు. రూ.55 వేల కోట్లు అవసరం తొలుత రైతులకు రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుందనే విషయంపై అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. సీఎం నివాసంకృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక స్థితిని వివరించారు. వాణిజ్య బ్యాంకులతో పాటు సహకార సంస్థల్లోని మొత్తం రుణాలను మాఫీ చేయాలంటే రూ. 55 వేల కోట్లు అవసరమవుతాయని ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. ఆరోగ్య బీమా పథకం యశస్వీపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అమలు తీరుతెన్నుల గురించి ఆరా తీశారు. పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంపై సూచనలిచ్చారు. నేడు రైతు సంఘాలతో సీఎం భేటీ రైతు రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి నేడు (బుధవారం) ఉదయం 11.15 గంటలకు విధానసౌధలో రైతు సంఘాలతో సమావేశం నిర్వహిస్తారు. ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర్ ఈ భేటీలో పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనాల్సిందిగా బీజేపీ పక్ష నేత బీఎస్ యడ్యూరప్పనూ ఆహ్వానించారు. రుణమాఫీపై ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్‌కు కుమార షాక్ : బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల రద్దు బొమ్మనహళ్లి : రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మంత్రి మండలి ఏర్పాటుకాలేదు. మంత్రివర్గంలో చోటు కోసం రెండు పార్టీల నుంచి ఔత్సాహికులకు కొదవ లేదు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేను శాంతపరచడానికి సీఎం కుమారస్వామి గత ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్, బోర్డుల అధ్యక్షుల పదవీకాలం ముగియకముందే రద్దు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే బోర్డు, కార్పొరేషన్ల పదవుల్లో ఉండేవారందరూ కాంగ్రెస్ నాయకులే. పదవీకా లం ఉండగానే ఎలా రద్దు చేస్తారని అధ్యక్షలు రుసరుసలాడుతున్నారు. కుమారస్వామిది ఏకపక్ష నిర్ణయమని ఆక్షేపిస్తున్నారు. -
ప్రధాని మోదీతో కుమారస్వామి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం సాయంత్రం కలిశారు. కర్ణాటక సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీని కుమరస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని కుమారస్వామి పేర్కొన్నారు. మోదీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కుమారస్వామి కలుసుకుని, కొత్త మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపు తదితర కీలక విషయాలపై చర్చించారు. సోనియా గాంధీ వైద్యపరీక్షలకోసం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంతో వారిని కుమారస్వామి కలుసుకోలేకపోయారు . కాగా ఆదివారం మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..రెండు మూడు రోజుల్లో మంత్రిపదవులను కేటాయిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హామి ఇచ్చారు. మరో వైపు కుమారస్వామి కాంగ్రెస్ పట్ల తనకున్న నిబద్దతను మరోసారి చాటుకున్నారు. కాంగ్రెస్ వల్లే తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ‘ స్పష్టమైన తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరాను, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వల్లే నేను ఇవాళ సీఎం పదవిలో ఉన్నాను.6 కోట్ల రాష్ట్ర ప్రజల తీర్పు వల్ల కాదు. ఇది నా స్వతంత్ర ప్రభుత్వం కాదు. నన్ను సీఎం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతలకు రుణపడి ఉంటాను' అని వ్యాఖ్యానించారు. -
కుమారస్వామి (సీఎం) రాయని డైరీ
మూడు రోజులైంది! ఇంకా మూడు రోజులు తక్కువ ఐదేళ్లవ్వాలి. ఐదేళ్లూ అవుతుందా, మూణ్ణాళ్లకే ఐదేళ్లు అవుతుందా చూడాలి. రేపటికిగానీ తెలీదు. పాలిటిక్స్‌లో రేపు జరగాల్సిందంటూ ఏమీ ఉండదు. అయినా సరే, ఏ రోజుకారోజు.. రేపటికి గానీ తెలియని రోజే. ఐదేళ్లు కంప్లీట్ అవ్వాలని మనం అనుకుంటే అవుతుందా? కంప్లీట్ అవనివ్వాలని అనుకునేవాళ్లు అనుకోవాలి. ఇవేమీ రాకరాక వచ్చిన ఐదేళ్లు కాదు. వస్తాయి అనుకుని ఎదురుచూసిన ఐదేళ్లు కాదు. వస్తాయో రావో అనుకున్న ఐదేళ్లు కాదు. వస్తే రానియ్, పోతే పోనియ్ అనుకున్న ఐదేళ్లు కాదు. కర్ణాటక ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి, ఇచ్చివెళ్లిన ఐదేళ్లూ కాదు. కాంగ్రెస్ రాలేక, బీజేపీని రానివ్వలేక.. ‘తీస్కో కుమారస్వామీ’ అని నా చేతుల్లో పెట్టేసిన ఐదేళ్లు. ఈ ఐదేళ్ల మీద.. తీసుకున్నవాళ్లకు ఎంత హక్కు ఉంటుందో, ఇచ్చిన వాళ్లకూ అంతే హక్కు ఉంటుందని తీసుకున్నవాళ్లు మర్చి పోయినా, ఇచ్చినవాళ్లు గుర్తుపెట్టుకోకుండా ఉంటారా? గుర్తు చేయకుండా ఉంటారా?! కాంగ్రెస్ ఎప్పుడెవర్ని వరెస్ట్‌గా ట్రీట్ చేస్తుందో కాంగ్రెస్‌కే తెలీదు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు రాత్రి హిల్టన్ హోటల్లో డీకే శివకుమార్ దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ‘ఏమైంది శివా’ అని భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగాను. ‘హోమ్‌సిక్’ అన్నాడు. ‘అది కాదులే.. చెప్పు’ అన్నాను. మనిషి కదిలిపోయాడు! ‘ఇంత చేశానా! మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్నీ, మీ జేడీఎస్ ఎమ్మెల్యేల్నీ బీజేపీ కంట పడకుండా ఒక చోట కలిపి కూర్చోబెట్టానా! ఢిల్లీ వెళ్లి, నేనే ఇదంతా చేశాను అని చెబితే రాహుల్ నన్ను కనీసం కూర్చోమని కూడా అనలేదు! అనకపోతే అనకపోయాడు, ఎక్కడ కూర్చుంటావ్? క్యాబినెట్‌లోనా, పీసీసీ సీట్లోనా అనైనా అడగాలి కదా! అడగలేదు. నేనేమైనా సన్యాసం తీసుకోడానికి రాజకీయాల్లోకి వచ్చానా? లేకపోతే చెస్, ఫుట్‌బాల్ ఆడటానికి వచ్చానా? నేనూ కాంగ్రెస్ వాడినే కదా. నాకూ ఆశలుంటాయి కదా? నాకూ హోమ్‌సిక్ ఉంటుంది కదా?’ అన్నాడు. ‘ఊరుకో శివా’ అన్నాను. అతడి ఎమోషన్‌కి నేను బరస్ట్ అయ్యేలా ఉన్నాను. నేనే రాహుల్‌ని అయ్యుంటే వెంటనే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంని చేసేయాలన్నంత ఆపేక్ష కలిగింది నాకు అతడి మీద. పోనీ శివకుమార్ మా పార్టీ వాడైనా బాగుండేది.. హోమ్ సిక్ లేకుండా హోమ్ మినిస్టర్‌గా పెట్టుకునేవాళ్లం. రేపు ఆర్ఆర్ నగర్ పోలింగ్. కాంగ్రెస్‌కి బలమైన సీటు. జేడీఎస్‌కి బలమైన క్యాండిడేటు. కాంగ్రెస్‌కి సపోర్ట్ ఇస్తే, బీజేపీకి సపోర్ట్ చేస్తాం అంటున్నారు కార్యకర్తలు. ‘ఏం చేద్దాం శివా’ అని అడిగాను. ‘ఏదో ఒకటి చేద్దాం’ అన్నాడు. రేపటికి ఐదు రోజులు అవుతుంది నేను ప్రమాణ స్వీకారం చేసి! - మాధవ్ శింగరాజు -
నా జీవితంలోనే బిగ్ చాలెంజ్: కుమార స్వామి
బెంగళూరు : కాంగ్రెస్ మద్దతుతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించడం తన జీవితంలోనే పెద్ద సవాల్ అని జేడీఎస్ అధినేత, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఇక రేపు (బుధవారం) కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు ఆలయాలను సందర్శిస్తూ.. ఇష్ట దైవాలను దర్శించుకుంటున్నారు. మంగళవారం శ్రీనేగరిలోని ఆదిశంకరాచార్య ఆలయానికి సతీసమేతంగా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జేడీఎస్-కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు కొనసాగించడం నాకు పెద్ద సవాల్. ముఖ్యమంత్రిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను. ఈ ప్రభుత్వం సరైన పాలనను అందిస్తుందా అని ప్రజల్లో కూడా సందేహాలున్నాయి. నాపై శారదాంబే, జగద్గురుల దీవెనలుంటాయి. వారి ఆశిస్సులతో అంతా మంచే జరుగుతోంది.’ అని కుమార స్వామి పేర్కొన్నారు. నేడు కుమార స్వామి శ్రీనేగరి శారదాంబె ఆలయం, దక్షిణామయ పీఠంలను దర్శించుకున్నారు. కుమార స్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్సీ అధినేత్రి మాయవతి, ఎస్పీనేత అఖిలేష్ యాదవ్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. -
సీఎం..కేరాఫ్ రామనగర
ఒక జిల్లా నుంచి ఒకరు కాదు, ఇద్దరు కాదు.. నలుగురు ముఖ్యమంత్రులు కావడం యాదృచ్ఛికం కావచ్చు, అయినా అది విశేషమే కదా. బెంగళూరు సమీపంలోని రామనగర జిల్లా ఈ ఖ్యాతిని సంపాదించుకుంది. తాజాగా సీఎం కాబోయే జేడీఎల్పీ నేత కుమారస్వామి ఈసారి రామనగర నుంచి గెలవడం తెలిసిందే. కర్ణాటక, దొడ్డబళ్లాపురం: రాష్ట్రానికి రామనగర జిల్లా మరోసారి ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని దక్కించుకుంది. తాజాగా జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో కలిపి రామననగర జిల్లా నుండి ఎన్నికయిన ఎమ్మెల్యేలు మొత్తం నలుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. జిల్లాలో మాగడి నియోజకవర్గం మినహా కనకపుర, రామనగర, చెన్నపట్టణ నియోజకవర్గాల నుండి ఎన్నికయిన ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. కెంగల్ హనుమంతయ్య నాంది మైసూరు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం 2వ ము ఖ్యమంత్రిగా ఎన్నికయిన ప్రముఖ వ్యక్తి కెంగల్ హ నుమంతయ్య.ఆయన అప్పట్లో రామనగర నుండి ఎన్నికయ్యారు. 1952 నుండి 1956 వరకూ ఆయన రాష్ట్ర ము ఖ్యమమంత్రిగా పనిచేశారు. ఈయన తరువాత సుమా రు మూడున్నర, నాలుగు దశాబ్దాల పా టు రామనగర నుంచి ఎవరూ సీఎం కుర్చీని అందుకోలేదు. దేవేగౌడ వంతు వరుసగా ఓటమి పాలవుతూ రాజకీయ భవిష్యత్తు కో సం ఎదురు చూస్తున్న హెచ్డీ దేవేగౌడ 1994లో జరిగి న అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థిగా రామనగర నుండి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడే ఆయ న ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం 172 రోజుల పా టు రాష్ట్రాన్ని పాలించారు. తరువాత నాటకీయ పరిణా మాలతో ఆయన దేశ ప్రధానిగా అందలమెక్కారు. రామకృష్ణ హెగ్డే ఇలా 1983లో ముఖ్యమంత్రి అయిన రామకృష్ణ హెగ్డే చట్టసభ సభ్యుడు కాకపోవడంతో ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి వచ్చింది. అప్పట్లో కనకపుర ఎమ్మెల్యే పీజీ ఆర్ సింధ్యా చేత రాజీనామా ఇప్పించి రామకృష్ణ హెగ్డే పోటీ చేసి గెలిచారు. కుమారస్వామి అదృష్టం తరువాత 2004లో దేవేగౌడ కుమారుడు హెచ్డీ కుమారస్వామి ఎన్నికల్లో మొదటిసారిగా రామనగర నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకున్న కారణంగా అదృష్టం తన్నుకొచ్చి కుమారస్వామి ముఖ్యమంత్రి గద్దెనెక్కారు. ఒక సంవత్సరం 253 రోజుల పాటు పదవిలో ఉన్నారు. ఈసారి ఏమవుతుందో..? ఈ దఫా రామనగరతో పాటు మొదటిసారిగా చెన్నపట్టణ నుండి పోటీ చేసి కుమారస్వామి గెలుపొందా రు. ఆయన రామనగర స్థానానికి రాజీనామా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిజానికి చెన్నపట్టణలో ప్రజలు కుమారస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటిం చడం వల్లే గెలిపించారని చెప్పవచ్చు. ఏది ఏమైనా రామనగర అనేది కేరాఫ్ ముఖ్యమంత్రిగా మారింద ని జిల్లా ప్రజలు ఆనందంగా చెప్పుకుంటున్నారు. -
కర్ణాటక సీఎం నేనే..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ఒక వైపు కొనసాగుతుండగానే తామే కాబోయే సీఎంలమంటూ ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టేసుకున్నారు. వారు ఏం చెప్పారో చూద్దాం.. మే 17, 18లలో ముహూర్తం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం, బీజేపీ గెలవడం తథ్యం. నేను మే 17 లేదా 18వ తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రధాని మోదీ, లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో బాధ్యతలు చేపడతా. రెండు చోట్లా గెలుస్తా చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఫలితాల అనంతరం వారంలోగా నేనే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతా. నాన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా.. మా జేడీఎస్ పార్టీ జయకేతనం ఎగురవేయటం ఖాయం. మే 18న మా నాన్న హెచ్డీ దేవెగౌడ జన్మదినం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా తండ్రికి బహుమతిగా ఇస్తా. -
బీజేపీ అభ్యర్థి అశ్లీల సందేశం ?
యశవంతపుర : చిక్కమగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ అభ్యర్థి ఎంపీ కుమారస్వామి ఒక మహిళలకు వాట్సప్‌లో అశ్లీల సందేశం ఉన్న విడియో పంపినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది నియోజకవర్గంలో పెద్ద వివాదంగా మారింది. బీజేపీ నాయకులు తలదించుకునేలా చేసింది. గతంలో కూడా ఆడియో వైరల్ అయింది. స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలకు సమాధానం చెప్పలేక పోయారు. ఎన్నికల సమయం అశ్లీల విడియో వైరల్ కావటంతో బీజేపీ నాయకులు ప్రచారం చేయని స్థితి నెలకొంది. అయితే ఎవరో గిట్టనివారు నకిలీ స్క్రీన్షాŠట్ వైరల్ చేసినట్లు కుమారస్వామి మంగళవారం పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. నకలీ స్క్రీన్షాట్లను వైరల్ చేసి నియోజకవర్గంలో తన గౌరవ, మర్యాదలను కించపరుస్తున్నట్లు చిక్కమగళూరు ఎస్పీ అణ్ణామలై, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. -
కింగ్ మేకర్‌ను కాదు.. కింగ్‌నే !
సాక్షి, మైసూరు: కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వాతావరణం వెడెక్కింది. శాసనసభ ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కాదని, కింగ్‌గానే అవతరిస్తానని.. జేడీఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. మైసూర్‌లోని ఇలవాలలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి శనివారం ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చాముండేశ్వరి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ మూడో స్థానంలో నిలుస్తుందని ఇండియా టుడే చెప్పిన సర్వే తప్పుడమయమన్నారు. ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పడం వృథా ప్రయాసని.. కౌంటింగ్ రోజు వచ్చే ఫలితాలు మరోరకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ వంద స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని, ఇది కన్నడ ప్రజల తీర్పని కుమారస్వామి అన్నారు. ఇదే విషయాన్ని బాండ్ పేపర్‌పై కూడా రాసిస్తానని మీడియా ముందు కుమార స్వామి సవాల్ విసిరారు. ఇండియా టుడే సర్వే ఎవరు, ఎందుకు చేయించారు అనే విషయం తనకు తెలుసని.. సీఎం సిద్ధరామయ్య సలహాదారుడు దినేష్ అమిన్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. సర్వేను ప్రజలు నమ్మొద్దని అన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, మాజీ ప్రధాని దేవెగౌడలను కలిసిన విషయం మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ ఎన్నికల్లో జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని, తెలుగు, కన్నడిగులను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తామని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. -
ప్రియా ప్రకాశ్‌కు ఛాన్స్ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్!
సాక్షి, చెన్నై: నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కోలీవుడ్ ఎంట్రీ ఖరారైనట్లేనా? ఇటీవల నటి ప్రియా వారియర్ టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా నిలిచింది. ఈమె నటించిన తొలి మలయాళ చిత్రం ఓరు ఆడార్ లవ్. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ చిత్ర ట్రైలర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్లో ఒక కాలేజీ విద్యార్థులు తమ ప్రేమను చాటుతున్న దృశ్యాలు ఉన్నాయి. అంతేకాక హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ కొంటెగా కన్ను గీటుతూ.. లవ్ బుల్లెట్‌ను గురి చూసి హీరో గెండెల్లోకి వదలడం వంటి దృశ్యాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ భామ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయింది. ఆమెతో బేటికి మీడియా సైతం పోటీ పడింది. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలో కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. తాజాగా కోలీవుడ్‌లో సూర్యకు జంటగా కేవీ. ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనుందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే దీనిపై డైరెక్టర్ స్పందించారు. అది అవాస్తవమని ఆయన తెలిపారు. అంతేకాక, హిందీలో రణ్వీర్ సింగ్‌తో రొమాన్స్ చేయడానికి ప్రియా రెడీ అయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ అమ్మడిని కోలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు. విజయ్‌సేతుపతి హీరోగా సూదుకవ్వుమ్, కాదలుమ్ కడందు పోగుం వంటి విజయం సాధించిన చిత్రాలకు కుమారస్వామి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మరో చిత్రానికి ఆయన రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
వారసులొస్తున్నారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వారసుల జోరు కనిపిస్తోంది. అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు ఈ సారి తమ వారసుల్ని రంగంలోకి దించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లకు ఈ నెల 24 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్)లు టిక్కెట్ల పంపిణీపై భారీగా కసరత్తు చేస్తున్నాయి. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌కు బాటలు వెయ్యడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారు. వారికి టిక్కెట్లు ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కుమారుల మధ్య పోటీకి సై ? ఎంతోమంది వారసులు ఈ సారి బెర్త్‌లు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ అందరి దృష్టి ఇప్పుడు మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంపైనే పడింది. ఈ నియోజకవర్గంలో అమీతుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ నియోజకవర్గం నుంచే కుమారుడ్ని రంగంలోకి దించడానికి సిద్దరామయ్య సర్వం సిద్ధం చేశారు. తన కుమారుడు పోటీ చేయడానికి వీలుగానే సిద్దరామయ్య ఈ సారి వరుణకు బదులుగా దాని పక్కనే ఉన్న చాముండేశ్వరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ కూడా వరుణ నియోజకవర్గంలో యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పోటీకి దింపాలని భావిస్తోంది. విజయేంద్ర అయితేనే యతీంద్రకు గట్టి పోటీ ఇవ్వగలడని అంచనాకి వచ్చింది. అంతే కాక వరుణ నియోజకవర్గంలో లింగాయత్‌ల జనాభా ఎక్కువ. విజయేంద్ర కూడా లింగాయత్ వర్గానికి చెందిన వాడు కావడంతో అతనిని బరిలోకి దింపితేనే పోటీ రసవత్తరంగా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే విజయేంద్ర వరుణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. వంశం పేరు చెప్పుకొని బీజేపీ నుంచి ఎవరూ టిక్కెట్ ఆశించలేరంటూ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు పార్టీ కేడర్ ఆహ్వానం మేరకే తాను నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజాసమస్యల్ని తెలుసుకుంటున్నానని విజేయంద్ర అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వ్యూహాలను కూడా రూపొందిస్తున్నట్టు చెప్పారు . మొత్తానికి వరుణ నియోజకవర్గంలో కుమారుల మధ్య పోటీ ఉంటుందా లేదా అన్న సస్సెన్స్‌కు మరి కొద్ది రోజుల్లోనే తెరపడనుంది. టిక్కెట్ రేసులో మరికొందరు వారసులు పార్టీలకతీతంగా చాలా మంది నాయకులు తమ వారసుల్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, సీనియర్ నేతలు ఎందరో తమ పిల్లలకు టిక్కెట్ ఇప్పించుకోవడానికి అధిష్టానం చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. కర్ణాటక హోం మంత్రి ఆర్.రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యరెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం బెంగుళూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న సౌమ్య టిక్కెట్ కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. న్యాయశాఖమంత్రి టీబీ జయచంద్ర కుమారుడు సంతోష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెఎన్ రాజన్న కుమారుడు రాజేంద్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ ఆల్వాలు టిక్కెట్ల రేసులో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత పోటీ లేకపోయినా బీజేపీ నేతలు కూడా వారసుల్ని తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.బీజేపీ నేతపరిమళ నాగప్ప తన కుమారుడు ప్రీతమ్‌కు హనూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల బరిలో కుటుంబానికి కుటుంబం మరోవైపు జేడీ (ఎస్)లో వారసులకు కొదవే లేదు. జేడీ (ఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవలు కూడా ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి ఆయన సోదరుడు హెచ్డీ రేవణ్ణలు మాత్రమే కాదు వారి భార్యలు అనిత కుమారస్వామి, భవానీ రేవణ్ణలు కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. రేవణ్ణ తన కుమారుడు ప్రజ్వల్‌ను కూడా ఈ సారి ఎన్నికల బరిలో దించుతూ ఉండడంతో, కుమారస్వామి కూడా తన కుమారుడు, నటుడైన నిఖిల్‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి నిఖిల్‌కు రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేకపోయినా బలవంతంగా ఒప్పించి తీసుకువస్తున్నట్టు పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి మంచి పట్టు ఉన్న పాత మైసూరు నుంచే నిఖిల్‌ను ఎన్నికల బరిలోకి దించాలని కుమారస్వామి యోచిస్తున్నారు..మొత్తంగా చూస్తే ఈ సారి ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఎక్కడ చూసినా వారసుల సందడే కనిపిస్తోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఈ భేటీ వెనుక ఏ కథ?
అన్ని పార్టీలకూ సినీ స్టార్ల గ్లామర్, మద్దతు కావాలి. జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి హీరో కిచ్చ సుదీప్తో అదే చర్చిస్తున్నారు. బెంగళూరులో కుమార నివాసంలో సుదీప్తో మాటామంతీ యశవంతపుర: ప్రముఖ బహుభాషా హీరో సుదీప్ జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కుటుంబాన్ని కలవడం రాజకీయ వేడిని పుట్టిస్తోంది. సోమవారం మధ్యాహ్నం కిచ్చ సుదీప్ బెంగళూరులో కుమార నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా రెండు గంటల పాటు రాజకీయాలపై చర్చించిన్నట్లు తెలిసింది. కుమార కుటుంబసభ్యులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. వచ్చే ఎన్నికలలో జేడీఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సుదీప్‌ను కుమార కోరినట్లు సమాచారం. సుదీప్ మనసులో ఏముందో కుమార సతీమణి అనిత, తనయుడు, వర్ధమాన హీరో నిఖిల్ గౌడలు సుదీప్తో ముచ్చటించారు. ఇటీవల నెలమంగళ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసమూర్తి సుదీప్తో కలిసి జేడీఎస్ తరపుర ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది. ఇటీవల సుదీప్ సీఎం సిద్ధరామయ్యను కూడా కలవడం తెలిసిందే. దీంతో రాజకీయాల్లో సుదీప్ సాయం కోరే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కిచ్చ నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కన్నడలో టాప్ హీరోల్లో ఒకరైన సుదీప్ బాహుబలి, ఈగ వంటి తెలుగు హిట్ చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితమైన సంగతి తెలిసిందే. -
మాసం పర్వం
విష్ణుప్రీతికరం... లక్ష్మీప్రదం మన ఇష్టదైవానికి సంబంధించిన నామాలను సాధ్యమైతే ప్రతినిత్యం లేదా సంవత్సరంలో ఆయా దేవతలకు సంబంధించిన మాసంలో లేదా వారంలో ఆయా దేవతలకు ప్రీతిపాత్రమైన రోజున స్మరించడం వల్ల ఇష్టదైవం అనుగ్రహం కలుగుతుందనడంలో సందేహం లేదు. మార్గశీర్షమాసం విష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసం రోజులూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విశిష్ట ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు స్త్రీలోకానికి దక్కిన మహావరం. మార్గశిర గురువార వ్రతాన్ని విధి విధానాలతో ఆచరించడం సర్వశ్రేయోదాయకం. శుభప్రద షష్ఠి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడానికి సర్వోత్తమమైనది. ఈ రోజున శివపార్వతుల గారాల తనయుడైన కుమారస్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. అదేవిధంగా కుజదోషం ఉన్నవారు, గోచారం ప్రకారం కుజుడు నీచస్థానంలో సంచరిస్తూ, పలు రకాలైన ఇబ్బందులకు గురవుతున్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే, ఆయా దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తి. వీలయిన వారు పుట్టలో పాలు పోయడం శ్రేయోదాయకం. (24, శుక్రవారం సుబ్రహ్మణ్య షష్ఠి) -
60 ఏళ్ల వృద్ధుడిగా జగపతిబాబు
విలన్‌గా టర్న్ తీసుకున్న తరువాత జగపతి బాబు రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవటంతో పాటు విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా జగ్గుభాయ్తనే తీసుకుంటున్నారు. అయితే విలన్‌గా మారిన తరువాత ఫుల్ బిజీ అయిన జగపతిబాబు ఇప్పుడు మరోసారి హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. జాగ్వర్ ఆడియో రిలీజ్ సందర్భంగా కుమారస్వామి నిర్మాణంలో తాను హీరోగా ఓ సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు జగ్గుభాయ్. ఆ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలను జాగ్వర్ సక్సెస్ మీట్లో వెల్లడించారు. తాను లీడ్ రోల్లో తెరకెక్కనున్న సినిమాకు తాను నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటానని తెలిపారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్, చెన్నాంభిక ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయని తెలిపిన జగపతి బాబు, ఈ సినిమాలో తాను 60 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్టుగా తెలిపారు. ఈ సినిమాకు సంబందించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
మరోసారి హీరోగా జగ్గుభాయ్
ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన సీనియర్ యాక్టర్ జగపతి బాబు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విలన్‌గా ఫుల్ ఫాంలో ఉన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ చిత్రాల్లో విలన్‌గా నటిస్తున్నాడు. విలన్‌గా మారిన తరువాత తిరిగి హీరో పాత్రలకు దూరమైన ఈ సీనియర్ స్టార్ ఇప్పుడు మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం కన్నడలో నిఖిల్ కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన భారీ చిత్రం జాగ్వర్లో నెగెటివ్ రోల్లో నటిస్తున్న జగ్గుభాయ్, నవంబర్ నుంచి తను హీరోగా తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జాగ్వర్ నిర్మాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మించనున్నారు. ఇటీవల జరిగిన జాగ్వర్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు కుమారస్వామి. జగపతిబాబు మంచి నటుడు మాత్రమేకాదు, ఆయన స్టార్ హీరో అన్న నిర్మాత, ఆయన ఏజ్‌కు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ దొరికిందని అందుకే వెంటనే సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం జాగ్వర్‌తో పాటు తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు జగపతిబాబు. -
పవన్ కల్యాణ్‌తో కుమారస్వామి భేటీ
హైదరాబాద్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ శనివారం జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ తమ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. చాలాకాలంగా తమ మధ్య స్నేహం ఉందని ఆయన తెలిపారు. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి చిత్రం విడుదల సందర్బంగా ఆశీర్వాదం కోసమే పవన్‌ను కలిసినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కుమారస్వామి తనకు మంచి మిత్రుడన్నారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. నితిన్ కుమారస్వామి గౌడ సినీ ప్రవేశంపై మాత్రమే చర్చించినట్లు పవన్ చెప్పారు. కుమారస్వామితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కాగా కృష్ణా పుష్కరాలకు వెళ్లడం లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. అలాగే ప్రత్యేక హోదాపై ఆయనను ప్రశ్నించగా, తర్వాత స్పందిస్తానని అన్నారు. కాగా కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ నటించిన 'జాగ్వార్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఎ. మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీప్తి కథానాయికగా నటించారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. -
టీడీపీకి అధికారం బీజేపీ భిక్షే
కృత్తివెన్ను : భారతీయ జనతాపార్టీ చలవతో గెలిచి ఏరు దాటి తెప్ప తగలేసే మాటలు మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ పొత్తును తెంచుకుంటామంటే ఉంచుకోవడానికి మేం సిద్ధంగా లేమని బిజెపి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ధ్వజమెత్తారు. సోమవారం కృత్తివెన్నులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం ప్రధాని మోడి, సినీనటుడు పవన్ కల్యాణ్‌ల భి„ó నన్న సంగతిని టీడీపీ మరవకూడదన్నారు. 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తులేకుంటే టిడిపి గతేంటో ప్రజలతో పాటు ఆ పార్టీ నాయకులకు తెలుసన్నారు. తెలుగుదేÔ¶ ంలో కొందరు ఎంఎల్ఏ, ఎంపిలు వారి స్థాయిని మరిచి ప్రధాన మంత్రిని విమర్శించడం వారి చౌకబారు తనాన్ని తెలియజేస్తోందన్నారు. వెంకయ్య నాయుడును విమర్శించే స్థాయి టిడిపి నాయకులకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు హైజాక్ చేసి తన పేరు పెట్టుకుంటున్నాడని ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదని ఆయన ఎద్దేవాచేశారు. పొత్తు ఇష్టం లేకపోతే చంద్రబాబు ఒక్కమాట చెప్తే చాలు, అంతేకానీ చోటా నాయకులతో మొరిగించడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుప్పాల రాము, మండల పార్టీ అధ్యక్షులు దాసరి వెంకట శ్రీనివాస్, పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు. ఫొటో.. -
అనుమానాస్పద స్థితిలో ఏఆర్ఎస్సై మృతి
కరీంనగర్ : వరంగల్ జిల్లాకు చెందిన రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై కుమారస్వామి (45) అనుమానాస్పద స్థితిలో మరణించారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కాని మరణానికి కారణం తెలియదని పోలీసులు వెల్లడించారు. -
అలా అయితే గుండు గీయించుకుంటా
కోలారు: ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఎత్తినహొళె పథకం మూడేళ్లలో పూర్తి అయితే గుండు గీయించుకుంటానని మాజీ ము ఖ్యమంత్రి కుమారస్వామి సవాల్ చేశా రు. శనివారం నగరంలో జేడీఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. బయలు సీమ జిల్లాలకు ఎత్తినహొళె పథకం ద్వారా నీటిని అందించడానికి ప్రయత్నాలు చేస్తుందని. ఇది మూడేళ్లలో పూర్తవుతందని చెప్పడం ప్రజలను మభ్య పెట్టడమేనన్నారు. ఎత్తిన హొళె ప్రాజెక్టు ప్రభుత్వం చెబుతున్నంత వేగవంతంగా సాగడం లేదన్నారు. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య రెండు సంవత్సరాల అవధిలో సాధించింది శూన్యమనాఇ చెప్పారు. జేడీఎస్ వామ మార్గంలో అధికారంలోకి రావాలని చూస్తోందని సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలను కుమార స్వామి తిప్పికొట్టారు. 2004లో జేడీఎస్ అధికారంలో ఉన్న సమయంలో సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా జేడీఎస్ వామ మార్గంలోనే అధికారంలోకి వచ్చిందని చెప్పగలరా అని సీఎంకు సవాల్ విసిరారు. -
యడ్యూరప్ప, కుమారస్వామిలపై ఎఫ్ఐఆర్
బెంగళూరు: ఓ భూమి డీనోటిఫికేషన్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్.డి.కుమారస్వామిలపై కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వారిద్దరిపై అవినీతి నిరోధక చట్టంతోపాటు నేరపూరిత కుట్ర, చీటింగ్ సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక్కడి ఆర్.టి.నగర్‌లోని మతదహళ్లి లేఅవుట్లోని భూమిని డీనోటిఫై చేసిన వ్యవహారంలో ఇద్దరు నేతల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయని లోకాయుక్త ఎస్పీ సోనియా నారంగ్ తెలిపారు. -
నిరాశతోనే అలా మాట్లాడుతున్నారు
- రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ బెంగళూరు: రాజకీయ అస్థిత్వాన్ని జేడీఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కోల్పోయిందని రాష్ట్ర ఆ హార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ విమర్శించారు. ఈ పరిణామంతో జేడీఎస్ పార్టీ నేత హెచ్.డి.కుమారస్వామి నిరాశలో కూరుకుపోయారని, అందుకే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దినేష్ గుండూరావ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేపాల్ భూకంప బాధితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నభాగ్య పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు మూడు పూటలా భోజనం చేసే అదృష్టాన్ని కల్పించిందని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయలేదని, అందుకే ప్రజలు ఆయన్ను అధికారం నుంచి దించేశారని విమర్శించారు. ఇక కుమారస్వామి తనపై చేసిన వ్యాఖ్యలపై దినేష్ గుండూరావ్ స్పందిస్తూ....‘నేను అవినీతికి పాల్పడినట్లు, అందుకు సంబంధించిన ఆధారాలు ఆయన వద్ద ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా కుమారస్వామి చెబుతూనే ఉన్నారు. అయితే కుమారస్వామి ఎప్పుడూ ఆ ఆధారాలను బయటపెట్టలేదు. ఎందుకంటే అసలు నేను అవినీతి చేసి ఉంటే, అందుకు సంబంధించిన ఆధారాలు ఉండేది, వాటిని బయటపెట్టగలిగేది. ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకు కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే’ అని పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి డెడ్‌లైన్
రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాల్సిందే లేదంటే ఉద్యమం తప్పదు {పభుత్వానికి కుమార హెచ్చరిక బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీ.కే రవి మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తును సోమవారం లోపు సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వానికి జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామి డెడ్‌లైన్ విధించారు. లేదంటే ‘జన్మభూమి నుంచి కర్మభూమి వరకు’ పేరుతో డీ.కే రవి స్వస్థలం దొడ్డకుప్పల నుంచి బెంగళూరు వరకూ పాదయాత్ర చేపడుతానని ఆయన వెల్లడించారు. డీ.కే రవి ృుతికి సంబంధించిన కేసును సీబీఐకు అప్పగించాలని రాష్ట్ర ఒక్కలిగ సంఘంతోపాటు రాష్ట్రంలోని వివిధ ధార్మిక సంస్థల అధిపతులైన స్వామీజీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెంగళూరులోని కువెంపు కళాక్షేత్రం నుంచి ఫ్రీడం పార్కువరకూ శుక్రవారం నిరసన ర్యాలీను నిర్వహించారు. వీరికి విపక్షాలకు చెందిన నాయకులు కూడా తమ మద్దతును తెలియజేశారు. డీ.కే రవి తల్లిదండ్రులతో కలిసి అనంతరం ఫ్రీడం పార్కుృో బహత్సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ... సోమవారం లోపు డీ.కే రవి కేసును సీబీఐకు అప్పగించకుంటే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దొడ్డకుప్పల నుంచి బెంగళూరు వరకూ పార్టీలకు అతీతంగా పాదయాత్ర చేస్తామని తెలిపారు. డీ.కే రవి కేసును తప్పుదోవ పట్టించడానికే ఒక మహిళా ఐఏఎస్ అధికారి పేరును అనవసరంగా తెరపైకి తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ అధికారిణి మూడు సార్లు డీ.కే రవికి ఫోన్ చేసిందనే నెపంతో విచారణ పేరుతో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ప్రశ్నించిన సీఐడీ అధికారులు...డీ.కే రవికు ఫోన్ చేసి బెదిరించిన మంత్రులు, వారి సంబంధీకులను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. డీ.కే రవికు పోస్ట్‌మార్టం చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఎందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటికి పిలిపించుకుని మాట్లాడినట్లని ఈ సందర్భంగా కుమారస్వామి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనాయకులతో పాటు వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజలు చేసిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. కాగా, డీ.కే రవి తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని ఈ సందర్భంగా ఒక్కలిగ సంఘం నాయకులు భరోసా ఇచ్చారు. -
మాజీ సీఎం కొడుకా.. మజాకా
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేవెగౌడ తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని హీరోగా పెట్టి 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నారు. తెలుగుచిత్ర రంగంలో 50 కోట్ల రూపాయలు చిన్న మొత్తమే కావచ్చుకానీ కన్నడలో ఇంత పెట్టుబడి పెట్టి సినిమా తీయడం ఇదే మొదటి సారి. ఎందుకంటే సాధారణంగా కన్నడ సినిమాలకు సరాసరిగా నాలుగు కోట్ల రూపాయలకు మించి ఖర్చుపెట్టరు. సూపర్ స్టార్ సినిమాలకు కూడా 12 కోట్ల రూపాయలకు మించి ఖర్చుపెట్టరు. పలు తెలుగు చిత్రాలను హిట్‌చేసిన ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించనున్నట్టు కన్నడ సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే పూరి ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఒకేసారి తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకోవడం వల్లనే ఈ చిత్ర నిర్మాణానికి 50 కోట్లు ఖర్చుపెడుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. కుమారస్వామి దేవెగౌడ రాజకీయాల్లోకి రాకముందు చిత్రరంగంలో త్రిపాత్రాభినయం చేశారు. చిత్ర నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటనపట్ల అమితాసక్తి కలిగిన ఆయన కుమారుడు నిఖిల్ పలు అంతర్జాతీయ సంస్థల్లో నటన కోసం శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్నాడట. -
...ఆ సిఫారసు తిరస్కరించండి
కేపీసీసీ నియామకాలపై విపక్ష నేతల పట్టు గవర్నర్‌కు వేర్వేరుగా విజ్ఞప్తి చేసిన శెట్టర్, కుమారస్వామి బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ)కు అధ్యక్షుడితో పాటు సభ్యుల పేర్లను సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపి న నివేదికను తిరస్కరించాల్సిందిగా విపక్ష నేత లు జగదీష్ శెట్టర్, కుమారస్వామి వేర్వేరుగా డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు విజ్ఞ ప్తి చేశారు. రాజకీయ మూలాలు ఉన్నవారు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిని కేపీఎస్సీ వంటి సంస్థలకు అధ్యక్షులుగా, సభ్యులుగా నియమించకూడదని సుప్రీం కోర్టు నుం చి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. అయి తే ఇందుకు విరుద్ధంగా సిద్ధరామయ్య కేపీఎస్సీ సంస్థకు అధ్యక్షుడిగా కాంగ్రెస్‌పార్టీకు చెందిన సుదర్శన్‌తోపాటు సభ్యులుగా రాజకీయ మూ లాలతోపాటు క్రిమినల్ కేసులు ఉన్నవారి పేర్ల ను సిఫార్సు చేశారని ఆరోపించారు. వీరిని ఆ యా స్థానాల్లో నియమిస్తే కేపీఎస్సీలో అక్రమాలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశా రు. నియమాకాలకు సంబంధించి లోకాయుక్త లేదా మరేదైనా స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ అధికారులతోకాని ప్రత్యేక ‘శోధనా కమిటీ’ వేయాలన్నారు. ఈ కమిటీ అందించే నివేదికను అనుసరించి కేపీఎస్సీ అధ్యక్షుడి నియామకాన్ని చేపట్టాలని సూచించారు. -
రూ. 6 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
సీబీఐ విచారణకు కుమారస్వామి డిమాండ్ అర్కావతి లేఔట్‌పై విచారణకు శెట్టర్ పట్టు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో సుమారు రూ.ఆరు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, ఒక్క బెంగళూరులోనే రూ.రెండు లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని శాసన సభలో జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శాసన సభలో 69వ నిబంధన కింద దీనిపై శుక్రవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆయన పాల్గొంటూ, నగరంలో చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయని, 1985 నుంచి ఈ ఆక్రమణలు నిర్నిరోధంగా సాగిపోతున్నా రెవెన్యూ, బీబీఎంపీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములకు అప్పనంగా పట్టాలిచ్చేశారని ఆరోపించారు. ఇలాంటి అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో గృహ నిర్మాణ సంఘాలు భూములను ఆక్రమించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాయని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు ఇతరులు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించడమే ఏకైక మార్గమని ఆయన సూచించారు. అర్కావతి లేఔట్‌పై కూడా.... : నగరంలోని అర్కావతి లేఔట్లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరిగిన డీనోటిఫికేషన్‌లో అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. శాసన సభలో 69వ నిబంధన ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ, కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని భూసేకరణకు ఎంపిక చేసిన భూములను డీనోటిఫై చేశారని విమర్శించారు. బీడీఏ అత్యంత జాగ్రత్తగా డీనోటిఫై అని పేర్కొనకుండా, రీమాడిఫై అనే పదాన్ని ఉపయోగించిందని ఆరోపించారు. అర్కావతి లేఔట్లో ఇప్పటికే సుమారు అయిదు వేల ఎకరాల నివేశనాలను పంపిణీ చేసి, రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేశారని తెలిపారు. అలాంటి భూములను డీనోటిఫై చేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నివేశనాలను తీసుకున్న వారి గతి ఏమిటని ప్రశ్నించారు. ఈ అవకతవకలపై నిష్పాక్షిక దర్యాప్తును చేపట్టడానికి వీలుగా ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. భూమిని వినియోగించుకోకపోతే స్వాధీనం : పారిశ్రామికాభివృద్ధి, విద్యా సంస్థలు, పూజ మందిరాలు, గృహ నిర్మాణాలు, తోటల పెంపకానికి పొందే భూములను ఏడేళ్లలోగా సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. కర్ణాటక భూ సంస్కరణల సవరణ బిల్లును శుక్రవారం ఆయన శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోని భూములను భూ బ్యాంకులకు అప్పగించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహరం చెల్లించబోదని తెలిపారు. -
నేటి నుంచి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు
ఆలయ ట్రస్టు చైర్మన్ కుమారస్వామి సాక్షి, బళ్లారి/ అర్బన్ : బళ్లారిలోని షిర్డి సాయిబాబా ఆలయంలో శుక్రవారం నుంచి గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. ఆయన గురువారం నగరంలోని విశాల్‌నగర్ నెలకొన్న షిర్డి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకల వివరాలను విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాబా ఆలయంలో ప్రతి గురువారం 10 వేల మంది భక్తులు సందర్శిస్తుంటారని, భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా అన్నదానం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు లక్ష మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులందరి కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 500 మందితో రక్తదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయంలో నిత్యాన్నదానానికి చెన్నైకు చెందిన రమణ అనే భక్తుడు నెలకు రూ.30 వేలు అందజేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి సాయిబాబా ట్రస్టు నుంచి మెరిట్, పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. పూజా వివరాలు 1న తెల్లవారు జామున కాగడ హారతి, మంగళ స్నానం, గణపతి పూజ, అభిషేకం, సాయి అష్టోత్తర నామ పూజ, సాయి సంచరిత పారాయణం, ధూప హరతి, కేశవ గాయన సమాజ బృందంతో సంగీత కార్యక్రమం, రాత్రి 7 గంటలకు పల్లకీ మహోత్సవం, ఉయ్యాల సేవ తదితర పూజలు నిర్వహించారు. శనివారం గురుపౌర్ణమి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కాగడ హారతి, గణపతి పూజ, సాయి చరిత్ర పారాయణం, సాయిబాబా నగర సంకీర్తన, గంధాభిషేకం, దత్తాత్రేయ సహస్రనామ అర్చన పూజలు, సాయి సత్యవ్రతం, హారతి, అన్నదానం, సాయంత్రం 3-12 సంవత్సరాల చిన్నారులతో సాయిబాబా వేషాలు, ధూప హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు, పల్లకి మహోత్సవం, ఉయ్యాల సేవ, సజారతి, ప్రసాద వినియోగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13న ఆదివారం కూడా వివిధ ధార్మిక పూజలు నిర్వహిస్తారు. -
నిద్రావస్థలో సర్కార్
కరువు నివారణ చర్యలేవీ? ఎమ్మెల్యే కాశప్పను అరెస్ట్ చేయాలి బీజేపీలో డబ్బు తీసుకునే సంస్కృతి లేదు కుమారస్వామి జేడీఎస్ గురించి ఆలోచిస్తే మంచిది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో తీవ్ర కరువు ఛాయలు ఏర్పడినా నివారణ చర్యలు తీసుకోవడంలో సిద్ధు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి విమర్శించారు. నగరంలో బీజేపీ స్లం మోర్చా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దరామయ్య హావభావాలు, చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఆయన ఐదేళ్లు పదవిలో కొనసాగుతారనే నమ్మకం ఆయనకే లేదని స్పష్టమవుతోందని అన్నారు. రాష్ట్ర మంత్రులు మహాదేవ ప్రసాద్, అంబరీష్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా పోలీసులపై దాడి చేసిన ఎమ్మెల్యే కాశప్పను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక చట్టం,సామాన్యులకు మరొక చట్టం ఉంటుందా? అని ప్రశ్నించారు. విధాన పరిషత్, రాజ్యసభ సభ్యులుగా బీజేపీ బలోపేతానికి పని చేసిన వారిని ఎంపిక చేశామని, డబ్బు తీసుకుని పదవులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీపై ఆరోపణలు చేసేముందు ఎమ్మెల్సీ ఎంపికపై సొంత పార్టీ నాయకులే ఏమంటున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. -
రూ.40 కోట్లు ఇస్తే ఎమ్మెల్సీ మీదే..
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆఫర్ ఆయన మాటల రికార్డింగ్‌తో సీడీ వెలుగులోకి సాక్షి, బెంగళూరు: ఓ ఎమ్మెల్సీ పదవి కోరుకునే ఆశావహుడైన అభ్యర్థి నుంచి మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి ఏకంగా రూ. 40 కోట్లు డిమాండ్ చేసినట్లు వెలువడిన వార్త శనివారం మీడియాలో తీవ్ర దుమారం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రం బిజాపుర జిల్లాకు చెందిన విజుగౌడ పాటిల్ అనుచరులు కొంతమంది బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయంలో కుమారస్వామితో భేటీ అయ్యారు. విజుగౌడకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ వారు ఒత్తిడి తెచ్చారు. వారి మధ్య జరిగిన సంభాషణను అక్కడున్న వారిలో ఒకరు, తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి, సీడీలుగా మార్చి మీడియాకు అందించారు. కన్నడ టీవీ చానళ్లలో అవి విస్తృతంగా ప్రసారమయ్యాయి...‘నా చేతుల్లో ఏమీ లేదు. ఓటు వేయడానికి ఒక్కో ఎమ్మెల్యే కోటి రూపాయలు అడుగుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి వారు చాలా ఖర్చు చేశారు. కష్టాల్లో ఉన్నారు’ అని కువ ూర స్వామి మాట్లాడిన సంభాషణ సీడీలో ఉంది. దీనిపై కుమారస్వామి మీడియాతో స్పందిస్తూ,... ‘కొన్ని మీడియా సంస్థలు తనపై, తన పార్టీపై కక్షకట్టి ఆరోపణలు చేస్తున్నాయి. పార్టీలో అంతర్గత విషయాలు బయటకు రాకపోవడం మంచిది. అన్ని పార్టీల్లో ఇలాంటివి సహజం. ఇదేదో పెద్ద అపరాధం అన్నట్లు చెబుతున్నారు. ఎంత ఖర్చు చేస్తే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తున్నారో మీకు తెలియదా?’ అని ఎదురు ప్రశ్నించారు. -
ఆధారాలుంటే చూపు
కుమారకు సీఎం ప్రతి సవాల్ అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు మొదట నీపై ఉన్న ఆరోపణల నుంచి బయటపడు రాష్ట్రంలో ఎక్కడా మోడీ ప్రభంజనం లేదు ‘హావేరి’ కాల్పులకు బీజేపీయే కారణం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారికి తాను రక్షణ కల్పిస్తున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ. కుమారస్వామి చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. దీనికి సంబంధించి ఆధారాలుంటే ఆయన వెంటనే విడుదల చేయాలని సవాల్ విసిరారు. హావేరిలో బుధవారం ప్రచారానికి వెళ్లడానికి ముందు హుబ్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్రమ మైనింగ్ గురించి మాట్లాడే నైతిక హక్కు కుమారస్వామికి లేదని అన్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆయనపై ఉన్న ఆరోపణల నుంచి ముందుగా బయట పడాలని సూచించారు. కాగా రాష్ట్రంలో ఎక్కడా మోడీ ప్రభంజనం లేదని, బీజేపీ ఆ భ్రమల్లో ఉందని ఎద్దేవా చేశారు. మోడీ దేవ లోకం నుంచి ఊడి పడలేదని, తనలాగే ఓ సీఎం మాత్రమేనని అన్నారు. హావేరిలో రైతులపై జరిగిన కాల్పులకు అప్పటి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కనుక మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్ శెట్టర్, సదానంద గౌడ, యడ్యూరప్పలకు రైతుల ఆత్మహత్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. -
జేడీఎస్‌కు షాక్
ఉత్తర కన్నడ అభ్యర్థి శివానంద నామినేషన్ ఉపసంహరణ ఆర్థిక ఇబ్బందులతో వైదొలుగుతున్నట్లు ప్రకటన నాయక్‌పై మండిపడిన కుమారస్వామి ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ ఆదేశం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజైన శనివారం ఉత్తర కన్నడ జేడీఎస్ అభ్యర్థి శివానంద నాయక్ పార్టీ అగ్ర నాయకులను నిశ్చేష్టులను చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆయన నామినేషన్ ఉపసంహరించు కోవడంతో అక్కడ పార్టీ అభ్యర్థే లేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నట్లు శివానంద ప్రకటించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, వేరే అభ్యర్థిని సూచించి ఉండాల్సిందన్నారు. తానే పోటీ చేస్తానని ముందుకు రావడంతో శివానందకు టికెట్టు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు పేడి లాగా ఎన్నికల సమరం నుంచి పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్న మొత్తాన్ని పార్టీకి తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే తనయుడు ప్రశాంత్ దేశ్‌పాండే, బీజేపీ అభ్యర్థిగా అనంత కుమార్ హెగ్డే పోటీ చేస్తున్నారు. కాగా రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు గాను జేడీఎస్ ఇప్పటికే కొప్పళలో అభ్యర్థిని నిలపలేదు. దక్షిణ కన్నడ స్థానాన్ని మిత్ర పక్షం ఎస్డీపీఐకి కేటాయించింది. ఉత్తర కన్నడలో అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్లయింది. -
అయోమయం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రధాన పార్టీల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి నేటి (సోమవారం)తో సహా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఇప్పటికీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే విషయం అటు రాష్ట్ర నాయకులకే అంతుబట్టడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో ఎవరికి అనుకూలంగా ప్రచారంలో చేయాలో కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే జేడీఎస్ పార్టీ తమ కార్యకర్తలను ఎక్కువ అయోమయంలో పడేస్తోంది. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాలకూ కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా సగానికి సగం మంది చేత నామినేషన్లు వేయించారు. ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేశాయి. అయితే జేడీఎస్ మాత్రం ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనేలేదు. ఇప్పటి వరకూ జేడీఎస్ కోసం పనిచేసిన వారికి కాదని ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దావణగెరెకు కాంగ్రెస్ నుంచి టికెట్టు ఆశించి భంగపడిన మహిమా పాటిల్‌ను అదేస్థానంలో జేడీఎస్ తరఫున పోటీ చేయించనున్నామని జేడీఎస్ నాయకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఆ స్థానంపై కన్నేసిన ఓ మైనారిటీ జేడీఎస్ నేత అనుచరులు ఏమి చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ బెంగళూరు సెంట్రల్ నుంచి జేడీఎస్ తరఫున బరిలో దిగనున్నట్లు పార్టీ నాయకులు ఘంటాపథంగా చెబుతుండగా షరీఫ్ కాంగ్రెస్‌ను వీడబోరని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఒక వ్యక్తి గురించి రెండు పార్టీల అధినాయకులు పరస్పర విరుద్ధంగా చెప్పుతుండటం ఇరు పార్టీల కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. చిక్కబళాపుర నుంచి కుమారస్వామి పోటీచేసే విషయంపై ఆయనతోపాటు ఆయన తండ్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ కూడా ఇప్పటికీ ఓ అవగాహనకు రాలేకపోవడం పట్ల ఆ ప్రాంత జేడీఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు పార్టీల్లోనూ అంతే.. టికెట్ల కేటాయింపులో అటు బీజేపీలోనూ ఇటు కాంగ్రెస్‌లోనూ అసమ్మతి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. బీదర్ పార్లమెంటు టికెట్టును బీజేపీ ఖూబాకు ఇచ్చింది. కేజేపీ వదలి మొదటి నుంచి ఆ టికెట్టుపై కన్నేసిన సూర్యకాంత్ నాగమారపల్లి ఇప్పటికీ తానే నామినేషన్ దాఖలు చేస్తానని ఇందుకు యడ్యూరప్ప సాయం చేస్తారని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో అక్కడి బీజేపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ముఖ్యంగా మండ్య టికెట్టు దక్కించుకున్న రమ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంబరీష్ అనుచరులను చులకన భావనతో చూస్తున్నారని అందువల్ల ఆమెను పోటీ నుంచి తప్పించనున్నారని కేపీసీసీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై రమ్యతో మాట్లాడి ఒప్పించడానికే ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ ఆమెకు సూచించారని ఆ వర్గం చెబుతోంది. అలాంటిది ఏమీ లేదని ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడటానికేనని మరో వర్గం చెబుతోంది. శివమొగ్గ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించి భంగపడిన కుమార బంగారప్ప ఈనెల 26లోపు తనకు టికెట్టు ఇవ్వక పోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే అలాంటిది ఏమీ జరగదని ముఖ్యమంత్రి చెబుతుండటంతో అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు కుమార బంగారప్ప అనుచరులు కూడా అయోమయంలో పడ్డారు. ఇలా కేపీసీసీ నాయకులే విభిన్న ప్రచారం చేస్తుండటంతో క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. నామినేషన్లు వేయడానికి పట్టుమని మూడురోజులే ఉన్న సమయంలో ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల విషయంలో ఇంత గందరగోళం ఉండటం వారి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
పీఎం రేసులో దేవెగౌడ లేరు
మైసూరు, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల అనంతరం తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తే మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ ప్రధాని అభ్యర్థి కాబోరని ఆయన తనయుడు, జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తృతీయ ఫ్రంటు పునరుత్థానం కోసం దేవెగౌడ ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన ప్రధాని అభ్యర్థి అంటూ జరుగుతున్న ప్రచారంపై ‘ఆలు లేదు చూలు లేదు...’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే ప్రధాని ఎవరనేది తేలుతుందని చెప్పారు. ఎన్నికల్లో దేవెగౌడ హాసన నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేసే ఆలోచన లేదన్నారు. కాగా బెంగళూరులో ఎమ్మెల్యేలకు జీ కేటగిరీ ఇంటిస్థలాల పంపకంపై ప్రభుత్వం సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూ కుంభకోణాలతో పాటు జీ కేటగిరీ నివేశనాలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ ఇంటి స్థలాల కేటాయింపులో ఎమ్మెల్యేల కంటే అధికారుల హస్త లాఘవమే అధికంగా కనిపిస్తోందని ఆరోపించారు. -
శుభమణ్యేశ్వరుడు
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం... దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం... కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కుమారస్వామి కారణజన్ముడు. తారకాసురుడనే లోకకంటకుడైన రాక్షసుని సంహరించడం కోసం జన్మించినవాడు. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఆయనను పూజించడానికి సర్వోత్తమమైనది. ఈరోజున ఆ స్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతానప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవ ల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. తమిళనాడు, పళనిలోని సుబ్రహ్మణ్యాలయం, రాష్ట్రంలోని మోపిదేవి, తిరుపతి, స్కందగిరి తదితర ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నింటిలోనూ స్వామివారికి విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయి. -
మోడీ చెప్పే క థలను వినడం మరిచిపోకండి...
=రాష్ట్రంలో జరగనున్న నరేంద్రమోడీ సభపై కుమారస్వామి వ్యంగ్యాస్త్రాలు =28 లోక్‌సభ స్థానాల్లోనూ జేడీఎస్ పోటీచేస్తుందని వెల్లడి సాక్షి, బెంగళూరు : బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనదైన శైలిలో రాష్ట్ర వాసులకు కథలను వినిపించేందుకు రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన చెప్పే కథలను ప్రతి ఒక్కరూ వినాలని జేడీఎస్ పార్టీ నేత, విధానసభ ప్రతిపక్ష నేత కుమారస్వామి పేర్కొన్నారు. ఇప్పటి వ రకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ర్యాలీలు, సమావేశాల్లో నరేంద్ర మోడీ వివిధ అంశాలపై కట్టు కథలను వినిపించారని, ఇప్పుడు రాష్ట్రంలో నాడప్రభు కెంపేగౌడ, కృష్ణదేవరాయలు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ తదితరుల కథలను వినిపించేందుకు అవకాశం ఉందని నరేంద్రమోడీ పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారమిక్కడి విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. న రేంద్రమోడీ సభకు రూ.10 రుసుమును వసూలు చేయడంపై కుమారస్వామి మండిపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు గాంధీజీ సభకు కూడా ఈ తరహాలో ప్రవేశ రుసుమును వసూలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన షాదీ భాగ్య పథకం విస్తరణపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టతను ఇవ్వాలని కోరారు. షాదీ భాగ్యను ఏయే వర్గాల వారికి విస్తరిస్తారు, బీపీఎల్ కార్డుదారులకి మాత్రమే పరిమితం చేస్తారా అనే విషయాలపై స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీచేయనుందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు. ఇక మైసూరు జిల్లాలోని శ్రీరామ్ చక్కెర కర్మాగారం పునరుద్ధరణ పనుల్లో తాను అక్రవ ూలకు పాల్పడ్డానన్న విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాన ని కుమారస్వామి వెల్లడించారు. -
జేడీఎల్పీ నేతగా కొనసాగుతా
సాక్షి, బెంగళూరు : తన రాజీనామా నిర్ణయంపై జేడీఎల్పీ నేత కుమారస్వామి వెనక్కు తగ్గారు. విపక్ష నేతగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పారు. లోకసభ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి నైతకి బాధ్యత వహిస్తూ జెడీఎల్సీ నేత స్థానానికి, పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఓ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇటీవల జేడీఎస్ పార్టీపై విమర్శలు ఎక్కువయ్యాయని అన్నారు. కుటుంబ పార్టీగా జేడీఎస్‌పై ముద్ర వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించానని అన్నారు. అయితే సమావేశంలో మెజారిటీ సభ్యుల కోరిక మేరకు జెడీఎల్పీ నేతగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విపక్ష విప్ స్థానానికి ఇతరులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం లోపు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. పార్టీలోని నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిస్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సమావేశానికి మాగడి నియోజక వర్గ ఎమ్మెల్యే హెచ్.సి బాలకృష్ణతోపాటు బసవకళ్యాణ శాసనసభ సభ్యుడు మల్లికార్జున ఖుబా డుమ్మాకొట్టారు. వీరిలో సీబీఐ దర్యాప్తునకు భయపడి బాలకృష్ణ కాంగ్రెస్‌వైపు చూస్తున్నారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. మల్లికార్జున ఖుబా బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడకు రాజీనామా పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తమ రాజీనామాను స్పీకర్ ద్వారా ఆమోదింపజేసుకుంటే శాసనసభలో జేడీఎస్ బలం 40 నుంచి 39 పడిపోవడమే కాకుండా ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదాను కోల్పోనుంది. జేడీఎస్‌ను వీడను : జమీర్‌అహ్మద్ తాను జేడీఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్‌ఖాన్ కొట్టిపారేశారు. హజ్ యాత్రలో ఉండటం వల్లే లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పూర్తిస్థాయిలో పాల్గొనలేదన్నారు. ఇందుకు మీడియా విపరీతార్థాలు తీసిందని అసహనం వ్యక్తం చేశారు. కుమారస్వామితో తన స్నేహం విడదీయనిదని తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జేడీఎస్‌పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.