
యశవంతపుర : నటుడు హుచ్చ వెంకట్ ... ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవటానికి వచ్చి నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. వెంకట్ బుధవారం జేపీ నగరలోని సీఎం కుమారస్వామి ఇంటికి వెళ్లారు. అయితే సీఎం బీజీగా ఉండటంతో కలవటానికి అవకాశం దొరకలేదు. చాలా సేపు వేచి ఉన్నా సీఎంను కలిసే అవకాశం లేకపోవడంతో అక్కడినుంచి వెనుదిరిగారు.