hucha venkat
-
యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..
-
యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..
కర్ణాటక ,దొడ్డబళ్లాపురం: కన్నడ సినీ హీరో, నిర్మాత హుచ్చ వెంకట్ ఇటీవలే సకలేశపుర, కొడగు, మైసూరు తదితర ప్రదేశాల్లో పబ్లిక్‌గా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి స్థానికులతో గొడవపడి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం అదే హుచ్చా వెంకట్ హిందూపురం–యలహంక రహదారి మార్గంలోని మారసంద్ర టోల్ వద్ద వీరంగం సష్టించాడు. దొడ్డబళ్లాపురం మీదుగా టోల్ వద్దకు వచ్చిన వెంకట్ అక్కడే తన కారు నిలిపి టోల్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న కాలేజ్ అమ్మాయి దగ్గరకు వెళ్లి తనను ప్రేమించమని,పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు.అమ్మాయి భయంతో అక్కడి నుండి పరుగులు తీసింది.తరువాత వెంకట్ తన కారు అద్దాలను తనే రాళ్లతో పగలగొట్టుకున్నాడు.స్థానికులపై అరిచాడు.అంతలో సమాచారం అందుకున్న రాజానుకుంట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హుచ్చ వెంకట్‌ను స్టేషన్‌కు తరలించారు. తనకారు అద్దాలను పగలగొట్టుకున్న హుచ్చ -
చెన్నైలో చెప్పులు లేకుండా తిరుగుతున్న నటుడు
కర్ణాటక, యశవంతపుర: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటున్న నటుడు హుచ్చ వెంకట్ కాళ్లకు చెప్పులు లేకుండా చెన్నై వీధుల్లో తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సినిమాల్లో పంచింగ్ డైలాగులు వేసే హుచ్చ వెంకట్ చెన్నై వీధుల్లో అలా తిరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం ‘దురహంకారి హుచ్చ వెంకట్’ అనే సినిమా ప్రోమోను విడుదల చేశారు. సినిమాను తీస్తున్నట్లు మాధ్యమాలకు విడుదల చేశారు. చెన్నై చిత్రాలు ఈ సినిమా షూటింగ్లో భాగమా, లేదా అనేది తెలియాల్సి ఉంది. -
సీఎంను కలవలేకపోయిన నటుడు
యశవంతపుర : నటుడు హుచ్చ వెంకట్ ... ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవటానికి వచ్చి నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. వెంకట్ బుధవారం జేపీ నగరలోని సీఎం కుమారస్వామి ఇంటికి వెళ్లారు. అయితే సీఎం బీజీగా ఉండటంతో కలవటానికి అవకాశం దొరకలేదు. చాలా సేపు వేచి ఉన్నా సీఎంను కలిసే అవకాశం లేకపోవడంతో అక్కడినుంచి వెనుదిరిగారు. -
ఐశ్వర్యతో పెళ్లి కాలేదు: వెంకట్
యశవంతపుర : నటి ఐశ్వర్యను తాను వివాహం చేసుకున్నట్లు ఫేస్బుక్ లైవ్‌లో చేప్పిన శాండల్‌వుడ్ నటుడు హుచ్చ వెంకట్ మూడు రోజుల తరువాత మాట మార్చాడు. తాను ఐశ్వర్యను వివాహం చేసుకోలేదంటూ బుధవారం మరో వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ‘డిక్టేటర్ హుచ్చ వెంకట్’ అనే సినిమాలో హిరోయిన్‌గా ఐశ్వర్య నటిస్తోందని, సినిమా చిత్రీకరణలో భాగంగా జరిగిన వివాహ దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసినట్లు తెలిపారు. -
ఐశ్వర్యతో వెంకట్ రహస్య వివాహం
బెంగళూరు: సినిమా హీరో, హీరోయిన్ల పెళ్లి అంటే ఆకాశమంత పందిరి, భారీగా మేళతాళాలు, వీఐపీ అతిథులతో ఊరంతా సందడిగా ఉంటుంది. కానీ ఈ నటుడు మాత్రం వధువు మెడలో పసుపు కొమ్ము కట్టేసి ముగించాడు. వినూత్న నటన, హావభావాలతో అభిమానులను సంపాదించుకున్న శాండల్‌వుడ్ నటుడు హుచ్చ వెంకట్‌కు కళ్యాణ భాగ్యం కలిసి వచ్చింది. డిక్టేటర్ హుచ్చ వెంకట్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకున్నాడు. గత వారం తలకావేరిలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. నిరాడంబరంగా పసువుకొమ్ము కట్టి దంపతులయ్యారు. ఇద్దరిదీ ప్రేమ పెళ్లి కావడం విశేషం. ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పగా, వారు పెళ్లికి నిరాకరించారు, దీంతో తలకావేరిలో గుట్టుగా వివాహం చేసుకున్నట్లు వెంకట్ తెలిపారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా, తమను క్షమించి అందరిలో ఒక్కడిగా చూడాలని హుచ్చ వెంకట్ ఫేస్బుక్ లైవ్‌లో ప్రకటించాడు. వెంకట్ పెళ్లిపై ఐశ్వర్య తల్లి ఆగ్రహం నటుడు హుచ్చ వెంకట్ విహవాంపై ఐశ్వర్య తల్లి రూప ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ‘ఎవరిని అడిగి ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. నేను ఈ పెళ్లిని ఒప్పుకోవటం లేదు. మూడు రోజుల నుండి ఐశ్వర్య ఫోన్లో దొరకటంలేదు. వెంకట్ ఐశ్వర్య చెన్నైలో ఉన్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకున్న విషయం తెలిసినప్పుటి నుండి వెంకట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా నాకు భయంగా ఉంది’ అని ఆమె అన్నారు. తనను హుచ్చ వెంకట్ హత్య చేస్తాడనే భయం ఉందని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెంకట్ ఫేస్బుక్లో లైవ్‌లో చేప్పేవరకూ వారిద్దరికి వివాహం అయినట్లు తమకు తెలియదన్నారు. -
నటుడు ఆత్మహత్యాయత్నం
► ఫినాయిల్ తాగి స్నేహితులకు సమాచారం బనశంకరి : ప్రేమ విఫలం కావడంతో కన్నడ నటుడు హుచ్చ వెంకట్ తన నివాసంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్నేహితుల సహాయంతో ఆస్పత్రిలో చేరిన హుచ్చ వెంకట్ అక్కడ రచ్చ రచ్చ చేశారు. డాక్టర్లతో సహా అందరిపై విరుచుకుపడ్డారు. వివరాలు... కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఓ నటిని హుచ్చ వెంకట్ ప్రేమించాడు. ఆమె కూడా ప్రేమించిందని, కానీ సదరు యువతి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో హుచ్చ ఆదివారం ఫినాయిల్ తాగి మీడియాకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అతని స్నేహితులు హుటాహుటిన అక్కడకి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో హుచ్చ వెంకట్ అందరిపై విరుచుకుపడ్డారు. డాక్టర్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విపరీతమైన ప్రచారం యావ కలిగిన హుచ్చ వెంకట్ ఈ ఘటనను ఇలా ప్రచారం చేసుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉంటే హుచ్చ వెంకట్ నటించిన పోకిరీ చిత్రం శాండిల్‌వుడ్‌లో అట్టర్‌ప్లాప్ కావడంతో నెల రోజులుగా సైలెంట్‌గా ఉన్న హుచ్చ వెంకట్ ఆదివారం ఒక్కసారిగా ఫినాయిల్ తాగి మీడియాతో పాటు స్నేహితులకు సమాచారం ఇవ్వడం సంచలనం కల్గిస్తోంది.