
నటుడు హుచ్చ వెంకట్
కర్ణాటక, యశవంతపుర: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటున్న నటుడు హుచ్చ వెంకట్ కాళ్లకు చెప్పులు లేకుండా చెన్నై వీధుల్లో తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సినిమాల్లో పంచింగ్ డైలాగులు వేసే హుచ్చ వెంకట్ చెన్నై వీధుల్లో అలా తిరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం ‘దురహంకారి హుచ్చ వెంకట్’ అనే సినిమా ప్రోమోను విడుదల చేశారు. సినిమాను తీస్తున్నట్లు మాధ్యమాలకు విడుదల చేశారు. చెన్నై చిత్రాలు ఈ సినిమా షూటింగ్‌లో భాగమా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment