అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు
అన్నానగర్: చెన్నై నుంచి గురువారం దుబాయ్‌కి పాదరక్షల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి యత్నించిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే విమానంలో నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులకు గురువారం రహస్య సమాచారం అందింది. అనంతరం అధికారులు విమానాశ్రయంలో నిఘా ఉంచారు. ఆ సమయంలో దుబాయ్‌కి వెళ్లడానికి చెన్నైకి చెందిన 35 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతన్ని అనుమానంతో అధికారులు నిలిపి విచారణ చేశారు. పొంతన లేని సమాధానాలు తెలపడంతో అతని లగేజీలను పరిశీలించగా ఏమీ లభించలేదు. అనంతరం ప్రత్యేక గదికి తీసుకువెళ్లి తనిఖీ చేయగా అతను ధరించిన పాదరక్షల్లో రూ.13.50లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
మదురై విమానాశ్రయంలో కరెన్సీ పట్టివేత:యువకుడు అరెస్టు
మదురై విమానాశ్రయంలో గురువారం రూ.43.50 లక్షల విలువైన ఇండియన్, విదేశీ కరెన్సీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి యువకుడిని అరెస్టు చేశారు. వివరాలు.. మదురై నుంచి సింగపూర్‌కు వెళ్లే విమానంలో హవాలా నగదు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గురువారం మదురై విమానాశ్రయ సహాయ కమిషనర్ వెంకటేష్‌బాబుకి సమాచారం అందింది. వెంటనే విమానాశ్రయ అధికారులు విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను పరిశీలన చేశారు. అప్పుడు పెద్ద సూట్‌కేసుతో వచ్చిన ఓ యువకుడిని అనుమానంతో విచారించారు. అతను తూత్తుకుడి నారాయణన్ వీధికి చెందిన పార్వతినాథన్ (29) అని తెలిసింది. అతని సూట్‌కేసులో కట్టలు కట్టలుగా రూ.45.50 లక్షల ఇండియన్, విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. అధికారులు నగదుని స్వాధీనం చేసుకుని పార్వతినాథన్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment