Foreign currency
-
కెనడా చర్రితలోనే భారీ చోరీ : 400 కిలోల గోల్డ్, విదేశీ కరెన్సీ భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్
టొరంటోలోని ప్రధాన విమానాశ్రయంలో 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భారీచోరికి పాల్పడ్డాడు. భారత్ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కెనడా చరిత్రలోనే భారీ చోరీగా నమోదైంది. సుమారు 400 కిలోల బంగారం బిస్కెట్లు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో చోరీ కేసులో మరో ఐదుగురిని అరెస్టు చేసిన తర్వాత మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడిపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది (2023) ఏప్రిల్ 17 22 మిలియన్లకు పైగా కెనడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీని ఉన్న ఎయిర్ కార్గో కంటైనర్‌ని నకిలీ పత్రాలను ఉపయోగించి తస్కరించినట్టు పీల్స్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. జ్యూరిచ్ నుండి టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీ తో కంటైనర్ వచ్చింది. దీన్ని చాకచక్యంగా ఓ ప్రత్యేక స్థలానికి తరలించారు. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు అర్చిత్ గ్రోవర్‌ను టొరంటోలోని విమానాశ్రయంలో అరెస్టు చేసి అభియోగాలు మోపారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిధూ (54), అమిత్ జలోతా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసత్ పరమలింగం (35)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీత్ పనేసర్ (31), మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరి (42)లపై కూడా అరెస్టు వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధూ, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి వెల్లడించారు. -
సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం
సింగపూర్: సింగపూర్ అడ్డాగా చేసుకుని హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి బంగ్లాలు, కార్లు, నగదు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సింగపూర్ పోలీసులు. సింగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆర్చార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుండి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని అన్నారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ వాహనాలు, 23 మిలియన్ సింగపూర్ డాలర్లు(140 కోట్ల) నగదు కట్టలు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగులు, నగలు బంగారు బిస్కెట్లు.. మొత్తంగా రూ. 4491 కోట్ల ఆస్తులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుండి 44 వయస్సు మధ్యలో ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వారిని చైనా, కంబోడియా, సిప్రాస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠాలో సిప్రాస్ కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకగా అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు పోలీసులు. ఈ ముఠా ఆన్లైన్లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాముల తోపాటు ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపింది. ఈ ముఠాకి సహకరించిన ఆర్ధిక సంస్థలను ఉపేక్షించేది లేదని తెలిపింది. ఈ సందర్బంగా పోలీసు శాఖలోని వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ డేవిడ్ చ్యు మాట్లాడుతూ మీరు దొరికితే మిమ్మల్ని అరెస్టు చేస్తాం, అక్రమంగా సంపాదించిన మీ ఆస్తులు దొరికితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12% మాత్రమే విదేశీ నగదు వృద్ధి చెందగా కేవలం సింగపూర్ లోనే విదేశీ ధన ప్రవాహం 16% వృద్ధి చెందింది. అందుకే సింగపూర్ పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. ఇది కూడా చదవండి: భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి.. -
TTD: విదేశీ కరెన్సీ విషయంలో టీటీడీకి ఊరట
సాక్షి, తిరుమల: భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం ఊరటనిచ్చింది. శ్రీవారికి విదేశీ దాతలు లేదా భక్తులు సమర్పించే కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి టీటీడీకి మినహాయింపును ఇచ్చింది. వివరాల ప్రకారం.. భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ విషయంలో టీటీడీకి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. వీటిని భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని కేంద్రం సూచించింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్ తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు కేంద్రం సమాచారం ఇచ్చింది. -
రూ.8.23 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
అన్నానగర్: తిరుచ్చి విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి రూ.8.23 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. రాత్రి 1.30 గంటలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విమానం ఎక్కేందుకు వెళ్తున్న ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో తంజావూరుకు చెందిన అహ్మద్ ముస్తఫా అనే ప్రయాణికుడి వద్ద అమెరికా డాలర్లను గుర్తించి అరెస్టు చేశారు. వాటి విలువ రూ.8.23 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Land for jobs scam: రూ.600 కోట్ల కుంభకోణం!
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుటుంబసభ్యుల నివాసాల్లో శుక్రవారం జరిపిన సోదాల్లో దొరికిన నగలు, నగదు, వెల్లడైన పత్రాలను బట్టి నేర విస్తృతి రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని ఈడీ తెలిపింది. లాలూ కుటుంబసభ్యుల ఇళ్లలో లెక్కల్లో చూపని రూ.కోటి నగదు, రూ.1.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. వీటితోపాటు, లాలూ కుటుంబసభ్యుల పేరిట ఉన్న సేల్ డీడ్స్, ఆస్తి పత్రాలు దితరాలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని బట్టి నేర విస్తృతి రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. వీటిల్లో రూ.350 కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.250 కోట్ల మేర బినామీదార్ల పేరిట లావాదేవీలు ఉన్నాయంది. తేజస్వీ యాదవ్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈడీ.. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలోని ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న డి–1088 నాలుగంతస్తుల భవనం తేజస్వీదేనని తెలిపింది. ఈ కేసులో ఈ కంపెనీని ‘లబ్ధిపొందిన సంస్థ’గా గుర్తించినట్లు వెల్లడించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్లకుపైగా విలువైన ఈ భవనాన్ని తేజస్వీ, ఆయన కుటుంబం కేవలం రూ.4 లక్షలకే పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఇలాంటివే మరో నాలుగు ఆస్తులను గుర్తించామని తెలిపింది. రైల్వే జాబ్స్ ఫర్ లాండ్ కుంభకోణంపై తమ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల్లో భాగంగా లాలూ కుటుంబీకులు, వారి సంబంధీకులు రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పెట్టిన మరిన్ని పెట్టుబడులను కూడా వెలికితీస్తామని తెలిపింది. లాలూ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కు చెందిన వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు తేజస్వీ గైర్హాజరు ఇదే కేసులో తేజస్వీ యాదవ్ శనివారం సీబీఐ విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలు చూపుతూ విచారణకు మరో తేదీని నిర్ణయించాలని ఆయన కోరినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ సమన్ల ప్రకారం ఈ నెల 4వ తేదీన జరగాల్సిన విచారణకూ తేజస్వీ డుమ్మా కొట్టారు. తేజస్వీ కోరిన విధంగా విచారణకు మరో తేదీని నిర్ణయించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చినందుకు ప్రతిఫలంగా ఉచితంగా లేక తక్కువ ధరకు భూములను పొందినట్లు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. లాలూ కుటుంబం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. జేడీయూ అగ్రనేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తేజస్వీ వాదనను సమర్థించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నమే సీబీఐ విచారణ అంటూ విమర్శించారు. అయితే, 2017లో నితీశ్..లాలూపై దర్యాప్తు సంస్థలు చేసిన అవినీతి ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడటం విశేషం. -
బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్
ముంబై: అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్‌కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. అయితే.. ముందుగా సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వెతకగా.. ఆ కుటుంబం నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గురించి ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్(AIU)కు ముందుగానే సమాచారం అందింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచే ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు, ఏఐయూ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. గురువారం ఉదయం ముంబై ఛత్రపది శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ కుటుంబం కదలికలపై అధికారులకు అనుమానం వచ్చింది. ఇద్దరు వృద్ధులతో సహా ముగ్గురు ఉన్న ఆ కుటుంబం లగేజీని అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాళ్ల సూట్‌కేసులో ఉన్న షూస్ లోపల, పట్టుచీరల మధ్య అమెరికన్ డాలర్లు ప్రత్యక్షం కావడంతో కంగుతిన్నారు. మొత్తం అమెరికన్ డాలర్ కరెన్సీ విలువ 4,97,000 డాలర్లుకాగా, మన కరెన్సీలో దాని విలువ రూ.4.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించారు జడ్జి. ఇంత డబ్బు ఎక్కడిది? ఎలా చేతులు మారింది? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. #WATCH | In a targeted op by AIU, Mumbai Airport Customs, a family of 3 Indian pax going to Dubai were intercepted. The baggage examination of the 3 led to seizure of foreign currency worth 4,97,000 USD (approx Rs 4.1 Cr). All 3 passengers were arrested: Customs (Source:Customs) pic.twitter.com/TdQVZd4wox — ANI (@ANI) November 3, 2022 -
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ఆదాయాన్ని బుధవారం స్థానిక శివాలయం వీధిలో ఉన్న పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలో లెక్కించారు. 90రోజులకు సంబంధించి చదురుగుడి, వనంగుడి హుండీల్లో సమకూరిన ఆదాయాన్ని లెక్కించగా వాటిలో ఫారిన్ కరెన్సీని అమ్మవారికి భక్తులు కానుకలుగా అందజేశారు. 18 డాలర్స్ యుఎస్ఏ కరెన్సీ, పది సింగపూర్ డాలర్స్, కువైట్‌కు ఒక దినార్, యుఏఈకి చెందిన 10 దిర్హమ్స్, నేపాల్‌కు 10 రూపీస్ విదేశీ కరెన్సీని ఆదాయం లెక్కింపు సందర్భంగా హుండీల్లో గుర్తించినట్లు ఆలయ ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్ కిశోర్ కుమార్ వెల్లడించారు. చదురుగుడి హుండీల నుంచి రూ.35 లక్షల 18వేల 290 నగదు, 50 గ్రాములు 100 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి లభించాయన్నారు. అలాగే వనంగుడి హుండీల నుంచి రూ.7 లక్షల 13వేల 082 నగదు, ఒక గ్రా ము 40 మిల్లీగ్రాముల బంగారం, 45 గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పైడితల్లి భక్తబృందం సేవా సమితి సభ్యులు, పాలకమండలి సభ్యులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ..
సాక్షి, మెదక్: విదేశీ కరెన్సీ కావాలని ఓ కిరాణ షాపులో మోసానికి పాల్పడిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న సాయి భైరవ కిరాణం దుకాణానికి శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విదేశీ కరెన్సీ కావాలా? అంటూ కౌంటర్‌పై కూర్చున్న శ్రీతేజతోపాటు షాపులో పని చేస్తున్న సయ్యద్, సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డిలను మాటల్లో పెట్టారు. ఈ క్రమంలో కౌంటర్లోని రూ.30 వేలతోపాటు మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకొని మోసగాళ్లు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ముందుగా దుకాణంలోకి వచ్చి మా దగ్గరున్న విదేశీ కరెన్సీ తీసుకొని ఇక్కడి డబ్బు ఇవ్వాలని కోరుతూ మాటల్లో పెట్టారు. కౌంటర్లోని డబ్బుతోపాటు కిరాణ సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిపాల్‌రెడ్డి వద్ద రూ.2వేలు తీసుకున్న సమయంలో తమకు జరిగిన సంఘటన గుర్తులేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ఆ ముగ్గురు మోసగాళ్లు నార్త్‌సైడ్ అధికారులుగా మంచి దుస్తులు వేసుకొని కారులో వచ్చినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి కిరాణం కౌంటర్లో కూర్చున్న శ్రీతేజ తండ్రి ప్రభుశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై నర్సాపూర్ ఎస్ఐ గంగరాజును వివరణ కోరగా రవిశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!
Putin has banned Russians from leaving country: ఉక్రెయిన్ రష్యాల మధ్య పోరు నివరవధికంగా సాగుతూనే ఉంది. ప్రపంచదేశాల ఆంక్షలు, హెచ్చరికలు లక్ష్య పెట్టక తనదైన యుద్ధ వ్యూహ రచనతో ఉక్రెయిన్‌పై దాడి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదేశాలన్ని పలు ఆంక్షలతో రష్యాని కట్టడిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాక బ్యాంకులను దిగ్బంధం చేసి స్విఫ్ట్ కొరడ ఝళిపించేందుకు యత్నిస్తోంది. దీంతో ఇప్పుడు పుతిన్ సుమారు రూ.7 లక్షలకు పైగా విదేశీ కరెన్సీతో రష్యన్లు ఎవరు దేశం విడిచి పారిపోకుండా ఉండేలా నిషేధించారని ఉక్రెయిన్ స్థానిక మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన డిక్రి పై కూడా పుతిన్ సంతకం చేశారని తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికా దాని మిత్రదేశాలు, ఈయూ , ఇతర దేశాలు విధించిన ఆంక్షలను అనుసరించి పుతిన్ ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయన్‌కు బహిరంగంగా తన మద్ధతను బలపరిచారు. రష్యాపై పోరాటంలో యూఎస్ ప్రమేయం లేదని చెప్పారు. అయితే తమ దేశం తన మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడుతుందని చెప్పారు. ఈ మేరకు జోబైడెన్ మాట్లాడుతూ...ఉక్రేనియన్లు స్వచ్ఛమైన ధైర్యంతో పోరాడుతున్నారని,రాబోయే కొద్ది రోజులు, వారాలు లేదా నెలలు వారికి కఠినంగా ఉండొచ్చు. అంతేకాదు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను ట్యాంకులతో చుట్టు ముట్టవచ్చునేమో కానీ ఉక్రెయిన్ ప్రజల మనస్సులను గెలవలేడు. ప్రపంచ దేశాల ధృఢ సంకల్పాన్ని పుతిన్ ఎన్నటికీ బలహీనపరచలేడు అని అన్నారు. (చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..) -
ఆర్ఐఎల్కు భారీ నిధులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 30,000 కోట్లు) సమీకరించింది. తద్వారా గరిష్టస్థాయిలో ఫారెక్స్ బాండ్లను జారీ చేసిన తొలి దేశీ కార్పొరేట్‌గా నిలిచింది. మూడు దశలలో జారీ చేసిన ఈ బాండ్ల ద్వారా సమకూర్చుకున్న నిధులను రుణ చెల్లింపులకు వినియోగించే ప్రణాళికల్లో ఉంది. ఫిబ్రవరిలో గడువు తీరనున్న 1.5 బిలియన్ డాలర్ల రుణం దీనిలో కలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఫారెక్స్ బాండ్ల ఇష్యూకి దాదాపు 3 రెట్లు అధిక రెస్పాన్స్ లభించినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. వెరసి 11.5 బిలియన్ డాలర్లమేర డిమాండ్ కనిపించినట్లు వెల్లడించింది. అతిపెద్ద ఇష్యూగా రికార్డు... ఆర్ఐఎల్ తాజా నిధుల సమీకరణ దేశంలోనే అతిపెద్ద విదేశీ కరెన్సీ బాండ్ లావాదేవీగా నమోదైంది. గతంలో పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ 2014లో చేపట్టిన 2.2 బిలియన్ డాలర్ల ఫారెక్స్ బాండ్ల ఇష్యూ ఇప్పటివరకూ రికార్డుగా నమోదైంది. ఆర్ఐఎల్ 2.875 శాతం కూపన్ రేటుతో 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల జారీ ద్వారా 1.5 బిలియన్ డాలర్లను సమీకరించింది. ఈ బాటలో 3.625 శాతం రేటుతో 30ఏళ్ల కాలావధిగల బాండ్ల జారీ ద్వారా 1.75 బిలియన్ డాలర్లను అందుకుంది. ఇదేవిధంగా 3.75 శాతం రేటుతో 40 ఏళ్ల బాండ్ల జారీ ద్వారా 0.75 బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. జపాన్ వెలుపల బీబీబీ రేటింగ్ కలిగిన ఒక ఆసియా కంపెనీ 40 ఏళ్ల కాలపరిమితిగల డాలర్ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం! మూడు కాలావధులుగల ఈ బాండ్ల గడువు 2032–2062 మధ్య కాలంలో ముగియనుంది. యూఎస్ ట్రెజరీలతో వీటి కూపన్(వడ్డీ) రేట్లు అనుసంధానమై ఉన్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. తద్వారా వీటి కూపన్ రేట్లను ట్రెజరీలకంటే 1.2 శాతం, 1.6 శాతం, 1.7 శాతం చొప్పున అధికంగా నిర్ణయించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా అతితక్కువ కూపన్ రేటుతో వీటిని జారీ చేసినట్లు తెలియజేసింది. డన్జోలో రిలయన్స్ రిటైల్‌కు వాటాలు 25.8 శాతం కొనుగోలు డీల్ విలువ రూ. 1,488 కోట్లు దేశీ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్.. ఆన్లైన్ నిత్యావసర సరుకుల డెలివరీ విభాగంలో కార్యకలాపాలు విస్తరించడంపై మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా క్విక్ కామర్స్ సంస్థ డన్జోలో 25.8 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,488 కోట్లు). ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్‌బాక్స్, లైట్‌రాక్, 3ఎల్ క్యాపిటల్, అల్టీరియా క్యాపిటల్ కూడా ఈ విడతలో మరికొంత పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నిర్వహించే రిటైల్ స్టోర్లకు అవసరమయ్యే హైపర్‌లోకల్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా డన్జో అందిస్తుంది. అలాగే జియోమార్ట్ వ్యాపారుల నెట్‌వర్క్‌కు డెలివరీల సదుపాయాలు కూడా కల్పిస్తుంది. -
గ్లోబల్ ట్రేడ్‌లో ఇలా రుణం తీర్చడం ఇదే ఫస్ట్ టైం!
వస్తు మార్పిడి.. తెలియని విషయమేం కాదు. పాతరోజుల్లో బాగా ఆచరణలో ఉండేది. కరెన్సీ వాడకంలోకి వచ్చాక.. క్రమంగా తగ్గిపోయింది. అయితే దేశాల మధ్య రుణ ఒప్పందాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి కదా. ఈ క్రమంలో గ్లోబల్ ట్రేడింగ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక, ఇరాన్ నుంచి కొన్ని ఏళ్లుగా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు నాలుగేళ్లుగా 251 మిలియన్ డాలర్ల విలువైన రుణం పేరుకుపోయింది. దీనిని తీర్చేందుకు సంచలన ప్రకటన చేసింది ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం. రుణాన్ని ధన రూపేణ కాకుండా.. వస్తుమార్పిడి రూపంలో తీరుస్తామని, ఈమేర విలువ చేసే సిలోన్ టీ ఉత్పత్తులను ఇరాన్‌కు అందిస్తామని పేర్కొంది. గత యాభై ఏళ్లలో విదేశీ వాణిజ్యంలో ఈ తరహా ప్రకటన చేసిన దేశం శ్రీలంకే కావడం విశేషం!. ఇందుకు సంబంధించి శ్రీలంక మంత్రి రమేశ్ పాథిరానా అధికారికంగా ఓ ప్రకటన చేశారు. జనవరి నుంచి ప్రతీ నెలా 5 మిలియన్ డాలర్ల విలువ చేసే తేయాకు ఉత్పత్తులను ఇరాన్‌కు అందిచనున్నట్లు తెలిపారు. ఆయిల్ ఉత్పత్తుల విషయంలో ఇరాన్‌కి పడ్డ రుణం నాలుగేళ్లుగా పేరుకుపోతోంది. ఈ తరుణంలోనే లంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదా? ఇదిలా ఉంటే యూఎన్, యూఎస్ ఆంక్షల పరిధిలో ‘టీ’ కూడా ఉంది. అయితే మానవతా కోణం దృష్ట్యా(ఎమర్జెన్సీ సందర్భాల్లో) టీ అనేది ఫుడ్ జాబితాలో ఉందని గుర్తు చేస్తోంది లంక ప్రభుత్వం. అంతేకాదు ఇరాన్ బ్యాంక్‌ల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక ప్రకటించుకుంది. మరోవైపు శ్రీలంక గత కొంతకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోతూ వస్తోంది. విదేశీ మారకద్రవ్య సంక్షోభం, కరోనా ప్రభావంతో టూరిజం నిలిచిపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ప్రతీ ఏడాది 340 మిలియన్ కేజీల టీని ఉత్పత్తి చేస్తోంది. కిందటి ఏడాది 265 మిలియన్ కేజీల టీని ఎగుమతి చేయగా.. 1.24 బిలియన్ డాలర్లు సంపాదించింది. దేశం మొత్తం మీద ఐదు శాతం జనాభా తేయాకు ఆధారిత పనులతో జీవనం కొనసాగిస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్! -
వక్రమార్గంలో బంగారం బిస్కెట్లు, 9 ఐఫోన్లు, ధిరామ్‌లు.. డాలర్లు.
సాక్షి, శంషాబాద్: ఒకే రోజు మూడు వేర్వేరు కేసులో అక్రమంగా రవాణా జరుగుతున్న బంగారం, విదేశీకరెన్సీ, ఐఫోన్లను శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అక్రమంగా తీసుకొచ్చిన 9 ఐఫోన్లు బయటపడ్డాయి. వీటి విలువ 8.37 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం ఇలా.. ఓ మహిళా ప్రయాణికురాలు దుబాయ్ నుంచి సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తనిఖీల్లో భాగంగా ఆమె వద్ద ఉన్న చేతి సంచిలో మూడు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. 350 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 17.69 లక్షలు ఉంటుందని అధికారులు నిర్దారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధిరామ్‌లు..డాలర్లు.. ఇద్దరు మహిళా ప్రయాణికులు సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి షార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఐఎస్ఎఫ్ చేపట్టిన తనిఖీల్లో వారి వద్ద 55000 యుఏఈ ధిరామ్‌లు, 970 యూఎస్ డాలర్లు బయటపడ్డాయి. సీఐఎస్ఎస్ అధికారులకు నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అక్రమంగా తరలిస్తున్న కరెన్సీ విలువ భారత కరెన్సీలో 11.49 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెరపైకి తాలిబన్ల సరికొత్త రూల్.. ఈ సారి ఏకంగా..
కాబూల్: ఆప్గనిస్తాన్‌లో తాలిబన్లు పరిపాలన ఏమోగానీ తమ నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విదేశీ కరెన్సీపై తాలిబన్లు నిషేధం విధించారు. దీంతో ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండగా , ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత జఠిలంగా తయారుకానుంది. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్గనిస్తాన్ వెళ్లినప్పటినుంచి అంతర్జాతీయ సమాజం తాలిబాన్ల పరిపాలనను ప్రభుత్వంగా గుర్తించడానికి నిరాకరించింది. మరో వైపు ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో బ్యాంకులు నగదు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు పరిపాలనంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, దేశాన్ని అభివృద్ధి వైపు నడపడం లాంటివి గాక కేవలం తమకు తెలిసిన రాక్షస పాలన, ఏకాధిపత్య నిర్ణయాలను మాత్రమే అనుసరిస్తూ వస్తున్నారు తాలిబన్లు. ఈ పరిస్థితిలో స్వదేశీ వ్యాపారం కోసం విదేశీ కరెన్సీ వాడే వారిని శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలుపుతూ ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. దేశంలో ఆర్థిక పరిస్థితి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆఫ్గన్లందరూ ఇకపకై ప్రతి లావాదేవీలను ఆఫ్గనిస్తాన్ కరెన్సీలోనే చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపాడు. చదవండి: China: చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటనకు కారణం కోవిడా? ఆహార కొరతా? -
బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్ ఛార్జీల పేరిట రూ.9700 కోట్లు లూటీ
హిడ్డెన్ ఛార్జీల పేరిట భారీ దోపిడికి పాల్పడుతున్నాయి బ్యాంకులు. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలను లెక్కాపత్రం లేకుండా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించే వారు లేకపోవడంతో శ్రమ జీవుల సంపాదనను జలగల్లా పీల్చేస్తున్నారు బ్యాంకర్లు. ఉన్నత విద్య కోసం మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయు సంఖ్య పెరుగుతోంది. ఇలా విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపే కుటుంబ సభ్యుల నుంచి ప్రాసెసింగ్ ఫీజు, ఎక్సేంజ్ మార్క్‌అప్ పేరుతో బ్యాంకులు వేల కోట్ల రూపాయలను దోపిడి చేస్తున్నాయి. ఈ విషయాన్ని క్యాపిటల్ ఎకనామిక్స్ అనే ఇండిపెండెంట్ రీసెర్చ్ సంస్థ బయట పెట్టింది. విదేశాలకు భారీగా విదేశాల్లో ఉన్న తమ వారి కోసం భారతీయులు పెద్ద ఎత్తున నగదును పంపిస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం 12.7 బిలియన్ డాలర్లు ( సుమారు 95 వేల కోట్లు)గా ఉంది. ఇందులో అత్యధికంగా 3.8 బిలియన్ డాలర్లు ఉన్నత విద్య కోసం వెచ్చిస్తుండగా ఆ తర్వాత ట్రావెల్ (3.2 బిలియన్), ఫ్యామిలీ సపోర్ట్ (2.7 బిలియన్) డాలర్లు ఉన్నాయి. తగ్గిస్తున్నామంటూనే విదేశాలకు డబ్బు పంపే విషయంలో ఛార్జీలు తగ్గిస్తున్నామని కొన్నేళ్ల కిందట బ్యాంకులు ప్రకటించాయి. దీంతో వాటి ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2016లో ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.15,017 కోట్లు వసూలు అవగా 2019లో ఈ మొత్తం 12,142 కోట్లకు పడిపోయింది. దీంతో ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎక్సేంజీ మార్క్‌అప్ పేరుతో వసూలు చేసే హిడ్డెన్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచాయి బ్యాంకులు. 2016లో ఎక్సేంజీ మార్కప్ ఛార్జీల మొత్తం రూ.2,505 కోట్లు ఉండగా 2019కి వచ్చే సరికి రూ.4,422 కోట్లకు పెరిగింది. ఇలా ఓ వైపు ప్రాసెసింగ్ ఛార్జీలు తగ్గించామని చెబుతూనే మరోవైపు వడ్డన కార్యక్రమం చేపడుతున్నాయి బ్యాంకులు. దీంతో బ్యాంకుల కాసుల పెట్టె గలగలమంటోంది. 2020 ఏడాదికి సంబంధించి విదేశీలకు నగదు చెల్లించే సమయంలో ఎక్సేంజీ మార్క్‌అప్ పేరుతో రూ.9,700 కోట్ల రూపాయలు అనధికారికంగా వసూలు చేసినట్టు క్యాపిటల్ ఎకనామిక్స్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది విదేశీ చెల్లింపులకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజుగా బ్యాంకులు రూ.26,300 కోట్లు వసూలు చేశాయి. ఇందులో హిడ్డెన్ ఛార్జెస్ పేరుతో వసూలు చేసిన రూ.9,700 వాటా 36 శాతంగా ఉంది. ఎక్సేంజీ మార్క్‌అప్ విదేశాలకు డబ్బు పంపివ్వడం లేదా అక్కడి నుంచి నగదు స్వీకరించే సమయంలో బ్యాంకులు ఎక్సేంజీ మార్క్‌అప్ పేరుతో ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలరు - రూపాయిల మధ్య మారకం విలువ ఎప్పుడు స్థిరంగా ఉండదు. దీంతో ఎక్సేంజీ మార్కప్ ఛార్జీలను వీటిని నేరుగా కాకుండా హిడ్డెన్ ఛార్జీలుగా బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అదనపు ఆదాయం కోసం ఈ ఎక్సేంజీ మార్క్‌అప్ ఛార్జీలను పెంచడం ద్వారా బ్యాంకులు తమ వినియోగదారుల జేబుల్లో చేతులు పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రమజీవుల కష్టం గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల్లో నూటికి 90 శాతం మంది శ్రమ జీవులే. ఇండియాలో తమ కుటుంబాలకు ఆసరగా ఉంటూ కాయకష్టం చేసి నగదు ఇండియాకు పంపిస్తున్నారు. కానీ వీళ్ల దగ్గరి నుంచి కూడా భారీ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. 2016లో ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రూ.10,200 కోట్లు ఉండగా 2020కి వచ్చే సరికి ఇది రూ.14,000 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి సంబంధించి రెమిటెన్స్ కోటాలో వసూలు చేసిన హిడ్డెన్ ఛార్జెస్ విలువ రూ. 4,200 కోట్ల నుంచి రూ.7,900 కోట్లకు చేరుకుంది. టెక్నాలజీ పెరిగినా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు సుళువుగా జరిగిపోతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులు కూడా తగ్గిపోతున్నాయి. కానీ విదేశాలకు నగదు చెల్లింపులు, స్వీకరణ చేసేప్పుడు మాత్రం వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఫీజు, హిడ్డెన్ ఛార్జీలు పెరుగుతూ పోతున్నాయి. చదవండి: పీబీ ఫిన్‌టెక్ ఐపీవో నవంబర్ 1న ప్రారంభం -
మీ ఇల్లు నచ్చింది.. అద్దెకు ఉంటానంటూ ఫోన్ పే లింకు పంపి..
సాక్షి, హిమాయత్‌నగర్: ఆర్మీ అధికారినని చెప్పి ఓ వ్యక్తి తన అకౌంట్ నుంచి డబ్బులు కాజేశాడంటూ వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఓ మహిళ సోమవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంటిని రూ.10 వేలకు అద్దెకు ఇస్తున్నట్లు ఓఎల్ఎక్స్, మ్యాజిక్బ్రిక్స్లో యాడ్ పోస్ట్ చేశామన్నారు. ఇది చూసిన ఓ వ్యక్తి తాను ఆర్మీ అధికారినని, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బదిలీపై వస్తున్నట్లు చెప్పాడు. మీ ఇల్లు నచ్చింది మీకు ఫోన్ పే లింకు పంపుతున్నాను యాక్సెప్ట్ చేస్తే ముందుగానే డబ్బులు ఇస్తానని నమ్మించి, లింకు పంపాడు. లింకును ఓపెన్ చేశాక తన అకౌంట్లో ఉన్న రూ.లక్షా 95వేలు కాజేసినట్లు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ కరెన్సీతో పట్టుబడ్డ మహిళ శంషాబాద్: విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న మహిళా ప్రయాణికురాలిని శంషాబాద్ విమానాశ్రయలో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈకే–275 విమానంలో అబుదాబి వెళ్లడానికి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి లగేజీని సాధారణ తనిఖీల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ అధికారులు పరిశీలించారు. అందులో 50,500 సౌదీ రియాల్స్ (భారత కరెన్సీ విలువలో రూ.9.77 లక్షలు) బయటపడ్డాయి. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు మహిళను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లాటరీలో డబ్బులు గెలిస్తే? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. వచ్చే నెల ఇండియా వస్తాను. నాతో బాటు 10,000 డాలర్లు తెచ్చుకోవచ్చా. ఇంకేదైనా మార్గం ఉందా? - కోనేరు రంగారావు, వర్జీనియా (ఈమెయిల్ ద్వారా) గతంలో ఎన్నోసార్లు మనం ఈ విషయం ప్రస్తావించాం. మీరు ఇండియా వస్తున్నప్పుడు అంత పెద్ద మొత్తం డాలర్ల కరెన్సీ నోట్లను మీతో పాటు తేకూడదు. తెస్తే రిస్క్. చట్టరీత్యా నేరం. నిషేధం. ఇంత పెద్ద వ్యవహారాన్ని ‘హవాలా’గా పరిగణించే అవకాశం ఉంది. అలా తేకండి. రాచమార్గం ఉండగా వేరే మార్గం ఎందుకు? మీరు వచ్చే ముందు, లేకపోతే వచ్చిన తర్వాత .. అక్కడున్న మీ అబ్బాయి/అమ్మాయి అకౌంటు నుండి ఇండియాలోని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకోండి. ఇలా పంపబడిన మొత్తం.. అమెరికాలో పన్నుభారానికి గురి అయినదై ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు. ఇక్కడ మీ అకౌంటులోకి జమ అవుతుంది. పంపే వ్యక్తి వివరాలన్నీ మీ ఇన్‌కం ట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. పేరు, చిరునామా, పాస్‌పోర్ట్ కాపీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొత్తం, బదిలీ వివరాలు వీటితో పాటు ఒక ఈమెయిల్ తెప్పించుకోండి. మీరు ఇటునుంచి ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి. ఇక మీ విషయానికొస్తే ఇంత మొత్తం జమ అవ్వడమనేది, బ్యాంకు అధికారుల దృష్టిలో పడుతుంది. ఏ అధికారి దృష్టిలో పడినా మీ దగ్గర పూర్తి వివరణ ఉండాలి. ఈ వ్యవహారం వల్ల గానీ, జమ వల్ల గానీ ఎటువంటి పన్నుభారం ఉండదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ సందర్భంలో మీరు అక్కడ సంపాదించిన మొత్తం గానీ, మీ పిల్లలు సంపాదించిన మొత్తం గానీ ఇండియా వస్తోందని అనుకుంటున్నాం. కుటుంబ సభ్యులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఎటువంటి పన్నుభారం ఉండదు. కుటుంబ సభ్యులు కాకపోతే ఈ వ్యవహారాన్ని అప్పుగా పరిగణించాలి. అలా కాకపోతే ఆదాయం అవుతుంది. ఏ వ్యవహారానికయినా సరైన డాక్యుమెంట్లు ఉండాలి. నేను ఈ మధ్యే రైల్వే శాఖలో నుంచి రిటైర్ అయ్యాను. ఆ సందర్భంలో సుమారు రూ.50,00,000 వచ్చింది. దీని మీద పన్ను భారం ఉంటుందా? - నండూరి సత్యవతి, హైదరాబాదు సాధారణంగా ప్రభుత్వ సర్వీసు నుండి రిటైర్ అయిన వారికి పదవీ విరమణ సందర్భంలో వచ్చిన పెన్షన్ ప్రయోజనాల మీద ఎటువంటి పన్నుభారం ఉండదు. సెక్షన్ 10 ప్రకారం వీటన్నింటి మీద మినహాయింపు ఉంది. అయితే, రిటర్ను వేసేటప్పుడు, రిటర్నులో ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ వివరాలు రాయండి. ఇలా రాయడం వల్ల మున్ముందు ‘సోర్స్’ వివరణలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. లాటరీల మీద ఆదాయాన్ని ఎలా ట్రీట్ చేస్తారు? - ఎం. ఉపేంద్ర, నిజామాబాద్ ముందుగా లాటరీల మీద ఆదాయాన్ని/ప్రైజ్ మొత్తాన్ని ఆదాయంగా భావిస్తారు. ఇతర ఆదాయం కింద వర్గీకరిస్తారు. ఈ ఆదాయం మీద విధిగా టీడీఎస్ చేస్తారు. దీనిపై 30 శాతం మేర భారం పడుతుంది. విద్యా సుంకం అదనం. పైగా ఎటువంటి బేసిక్ లిమిట్ మినహాయింపు ఉండదు. మొత్తం లాటరీని ఆదాయంగా భావించి, 30 శాతం ప్రకారం పన్ను వేస్తారు. ఈ భారంలో నుంచి టీడీఎస్‌ను తగ్గించి, పన్ను చెల్లించాలి. కె.సీహెచ్.ఎ.వీ.ఎస్. ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య - ట్యాక్సేషన్ నిపుణులు -
కొనసాగుతున్న ఫారెక్స్ నిల్వల రికార్డులు
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వల చరిత్రాత్మక రికార్డులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీతో ముగిసిన వారంలో అంతకుముందు వారంతో పోల్చిచూస్తే (సెప్టెంబర్ 11) నిల్వలు 3.378 బిలియన్ డాలర్లు పెరిగి 545.038 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ మార్క్దాటి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు భారత్ 15 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. దిగుమతులకు సంబంధించి వ్యయాలు తగ్గడం, పెరిగిన పసిడి నిల్వల విలువ వంటి అంశాలు దీనికి నేపథ్యం. తాజా సమీక్షా వారంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 3.943 బిలియన్ డాలర్లు ఎగసి 501.464 బిలియన్ డాలర్లకు చేరాయి. ► అయితే పసిడి నిల్వల విలువ 580 మిలియన్లు తగ్గి, 37.440 బిలియన్ డారల్లకు చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధర తగ్గడం దీనికి నేపథ్యం. ► అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ పరిమాణం మిలియన్ డాలర్లు పెరిగి 1.483 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద రిజర్వ్స్ మాత్రం 14 మిలియన్ డాలర్లు తగ్గి 4.651 బిలియన్ డాలర్లకు చేరింది. -
పల్లీల్లో పచ్చనోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ బలగాలు బుధవారం చెప్పాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్–3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ ప్యాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. -
పల్లీల్లో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ..
-
వేరుశెనక్కాయల్లో డబ్బులే డబ్బులు
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, విలువైజ వజ్రాలను అక్రమంగా తరలించేందుకు దళారులు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి రూ.45 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అక్రమంగా తీసుకు వచ్చిన తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. అయ్యగారి పనితనం చూసి ‘వాట్ యాన్ ఐడియా’ అంటూ అవాక్క అయ్యారు. ఆ వ్యక్తి వినూత్న రీతిలో విదేశీ కరెన్సీని తీసుకువచ్చినా ...చివరికి అధికారులకు చిక్కిన సంఘటన ఢిల్లీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బందికి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే... ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ పాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ పాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు ఆధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. అయితే మురాద్ సాధారణ కూలీ అని, అతడి చేత ఎవరో ఈ పని చేయించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను అధికారులు ట్విటర్లో పోస్ట్ చేశారు. మురాద్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అంతుచిక్కని విదేశీ కరెన్సీ అపహరణ
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: పట్టణంలోని దినవారి బజారు సమీపంలోని సాయి ట్రావెల్స్‌లో నిర్వహిస్తున్న వెస్టర్న్ యూనియన్ నగదు బదిలీ కేంద్రం వద్ద సోమవారం రూ.3 లక్షల విలువైన విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. ఈ కేసు విషయమై సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తులో చోరీకి పాల్పడినవారు టర్కీ దేశానికి చెందిన ఇద్దరు యువకులుగా అనుమానిస్తున్నారు. నగదు బదిలీ కేంద్రంలో పనిచేస్తున్న నిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ మంగళవారం కేసు నమోదు చేశారు. అనుమాతులలో ఒకరికి సంబంధించిన ఫొటోలను సీసీ కెమెరా ద్వారా సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు. -
‘డాలర్’ డ్రీమ్ ఇక చౌకే!!
అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి!!. ఈ సామెత బ్యాంకుల్లో డాలర్ లావాదేవీలు జరిపే రిటైల్ కస్టమర్లకు అనుభవంలోకి వస్తుంటుంది. బ్యాంకులు విదేశీ కరెన్సీని కస్టమర్‌కు అమ్మేరేటుకు, వారి నుంచి కొనే రేటుకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. ఇకపై బ్యాంకుల ఈ భారీ బాదుడుకు ఆర్బీఐ చెక్ చెబుతోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) లావాదేవీలు జరిపే వీలును రిటైల్ కస్టమర్లకు ఆర్బీఐ కల్పించనుంది. టూరిస్టు వీసా వచ్చిందని, చదువులకని, ఉద్యోగాలకని ఏటా ఇండియా, అమెరికా మధ్య లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇలా అమెరికా యాత్ర పెట్టుకున్నవాళ్లంతా రూపాయలను డాలర్లలోకి మార్చుకోవడం, అక్కడ నుంచి వచ్చాక డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడం తప్పని సరి కార్యక్రమమనే చెప్పాలి. అమెరికాయే కాదు. విదేశాల్లో దాదాపు ఎక్కడికెళ్లినా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చెల్లుతుంది కనుక... అక్కడ లోకల్ కరెన్సీని తీసుకోవాలన్నా డాలర్‌తో ఈజీ కనుక అంతా డాలర్లవైపే మొగ్గుతారు. ఈ డాలర్లకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు ఇలాంటి కస్టమర్లకు డాలర్లు అమ్మేటప్పుడు భారీ ప్రీమియంలు వసూలు చేస్తుంటాయి. కస్టమర్లు డాలర్లు కొనుగోలు చేసే సమయంలో ఎక్చేంజ్ రేట్‌పై దాదాపు 2 శాతం ప్రీమియంతో విక్రయించడం, అదే కస్టమర్లు డాలర్లను విక్రయించడానికి వచ్చినప్పుడు ఎక్చేంజ్ రేటుపై దాదాపు 2 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడం బ్యాంకులకు పరిపాటిగా మారింది. ఒకవేళ కస్టమరు క్రెడిట్‌కార్డు ద్వారా డాలర్ కొనాలంటే మరో 3 శాతం ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి కస్టమర్ కష్టాలకు త్వరలో విముక్తి లభించనుంది. ఫారెక్స్ మార్పిడి విషయంలో బ్యాంకులు విధించే భారీ మార్జిన్ల కారణంగా నష్టపోతున్న కస్టమర్లకు త్వరలో ఊరట కలగనుంది. వచ్చే ఆగస్టు నుంచి రిటైల్ కస్టమర్లకు దాదాపు ఎక్చేంజ్ రేటుకు సమానంగానే బ్యాంకులు డాలర్లను అమ్మడం, కొనడం చేయాల్సి ఉంటుంది. అంతేకాక బ్యాంకులన్నీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లను ఒకే ఉమ్మడి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై చేయాల్సి ఉంటుంది. రెండేళ్లకు కార్యరూపం రిటైల్ కస్టమర్లకు బ్యాంకులు వసూలు చేసే భారీ మార్జిన్ల నుంచి ఊరట కలిగించాలని 2017లోనే ఆర్బీఐ నిర్ణయించింది. 2017 అక్టోబర్‌లో దీనికి సంబంధించి చర్చాపత్రం విడుదల చేసింది కూడా. తరవాత క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సీసీఐఎల్) కలిసి రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. తొలుత ఆరంభంలో వెయ్యి డాలర్లు, తర్వాత ప్రతిసారీ 500 డాలర్ల చొప్పున ఈ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ భావించింది. కానీ ఎంత మొత్తాన్నయినా ఈ ప్లాట్‌ఫామ్‌పై అనుమతించాలని ఆర్బీఐ తాజాగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ఫామ్‌పై గరిష్ఠ పరిమితి 5 లక్షల డాలర్లు. తొలుత డాలర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆ తర్వాతి దశల్లో ఇతర కరెన్సీలకు దీన్ని విస్తరిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే రిటైల్ ఆర్డర్లన్నింటినీ కలిపి మార్కెటబుల్ లాట్స్గా మార్చి ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. దీంతో కస్టమర్లకు బ్యాంకుల మధ్యన జరిగే ఎక్చేంజ్ రేటే వర్తిస్తుంది. జూలై 1న రిజిస్ట్రేషన్లు ఆరంభం ప్లాట్‌ఫామ్‌పై కస్టమర్ల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి ఆరంభమవుతాయని భారత ఫారిన్ ఎక్చేంజ్ డీలర్ల సమాఖ్య తెలిపింది. ఆగస్టు 5 నుంచి ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది కస్టమర్లు పాల్గొనేందుకు ఒక నెల ముందే రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ ఆరంభించిందని, ఎంత మొత్తంలో లావాదేవీలు జరపవచ్చనే విషయం ఆర్బీఐ త్వరలో నిర్ణయిస్తుందని, ఒక్క రూపాయి లావాదేవీనైనా సరే సీసీఐఎల్ సెటిల్ చేస్తుందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యాప్‌ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో కస్టమర్లు బేసిక్ సమాచారం అం దించాల్సి ఉంటుంది. సదరు కస్టమర్‌కు తన బ్యాంకు ట్రేడింగ్ లిమిట్ నిర్ధారిస్తుంది. ఈ పరిమితికి అనుమతి వచ్చాక కస్టమర్‌కు సీసీఐఎల్ లాగిన్ వివరాలు పంపుతుంది. ఈ వివరాలతో లాగినై కస్టమర్ ఆర్డర్లను ఉంచడం, కాన్సిల్ చేయడం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంటర్ బ్యాంక్ ఎక్చేంజ్రేట్లు ప్లాట్‌ఫామ్‌పై కనిపిస్తుంటాయి. కస్టమర్ నేరుగా ఆ రేట్లు పొందలేడు, కొందరు కస్టమర్ల ఆర్డర్లన్నింటినీ కలిపి ఒక లాట్‌గా మార్చి లావాదేవీ నిర్వహిస్తారు. అందువల్ల స్పాట్ రేటుతో పోలిస్తే కస్టమర్‌కు వచ్చే రేటులో స్వల్పతేడా ఉండొచ్చు. దీనికితోడు కస్టమర్‌కు చెందిన బ్యాంకు స్వల్ప రుసుమును సదరు లావాదేవీకి వసూలు చేస్తుంది. అనంతరం కస్టమ ర్ లావాదేవీకి వచ్చిన రసీదు తీసుకొని తన బ్యాం కుకు వెళ్లి డాలర్లను తీసుకోవడం, లేదా జమ చేయడం చేస్తారు. ప్లాట్‌ఫామ్‌ను స్పెక్యులేషన్‌కు వినియోగించకుండా జాగ్రత్తలు చేపడతారు. -
భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు మార్చి 15వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 3.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీనితో ఈ పరిమాణం 405.6 బిలియన్ డాలర్లకు చేరింది. డాలర్ రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ విలువ పెరుగుదల దీనికి ప్రధాన కారణం. 2018 ఏప్రిల్ 13న భారత్ విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్ల స్థాయిని చూశాయి. అటు తర్వాత రూపాయ బలహీనత, విదేశీ నిధులు వెనక్కుపోవడం వంటి అంశాల నేపథ్యంలో కొంత తగ్గాయి. -
పాదరక్షల్లో విదేశీ కరెన్సీ
అన్నానగర్: చెన్నై నుంచి గురువారం దుబాయ్‌కి పాదరక్షల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి యత్నించిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే విమానంలో నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులకు గురువారం రహస్య సమాచారం అందింది. అనంతరం అధికారులు విమానాశ్రయంలో నిఘా ఉంచారు. ఆ సమయంలో దుబాయ్‌కి వెళ్లడానికి చెన్నైకి చెందిన 35 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతన్ని అనుమానంతో అధికారులు నిలిపి విచారణ చేశారు. పొంతన లేని సమాధానాలు తెలపడంతో అతని లగేజీలను పరిశీలించగా ఏమీ లభించలేదు. అనంతరం ప్రత్యేక గదికి తీసుకువెళ్లి తనిఖీ చేయగా అతను ధరించిన పాదరక్షల్లో రూ.13.50లక్షల అమెరికన్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మదురై విమానాశ్రయంలో కరెన్సీ పట్టివేత:యువకుడు అరెస్టు మదురై విమానాశ్రయంలో గురువారం రూ.43.50 లక్షల విలువైన ఇండియన్, విదేశీ కరెన్సీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి యువకుడిని అరెస్టు చేశారు. వివరాలు.. మదురై నుంచి సింగపూర్‌కు వెళ్లే విమానంలో హవాలా నగదు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గురువారం మదురై విమానాశ్రయ సహాయ కమిషనర్ వెంకటేష్‌బాబుకి సమాచారం అందింది. వెంటనే విమానాశ్రయ అధికారులు విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను పరిశీలన చేశారు. అప్పుడు పెద్ద సూట్‌కేసుతో వచ్చిన ఓ యువకుడిని అనుమానంతో విచారించారు. అతను తూత్తుకుడి నారాయణన్ వీధికి చెందిన పార్వతినాథన్ (29) అని తెలిసింది. అతని సూట్‌కేసులో కట్టలు కట్టలుగా రూ.45.50 లక్షల ఇండియన్, విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. అధికారులు నగదుని స్వాధీనం చేసుకుని పార్వతినాథన్ను అరెస్టు చేశారు. -
నెల్లూరు: భారీ స్థాయిలో విదేశీ కరెన్సీని పట్టుకున్న పోలీసులు
-
శంషాబాద్‌లో భారీగా పట్టుబడ్డ విదేశీ నగదు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో భారీగా విదేశీ నగదు పట్టుబడింది. ఖతర్, యూఏఈ, బెహ్రాన్, కువైట్, సౌదీ దేశాలకు చెందిన నగదును ఓ ప్రయాణికుడి వద్ద ఎయిర్‌పోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సొమ్ము మొత్తం దాదాపు కోటికి పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహ్మద్ పర్వేజ్ వద్ద ఈ నగదు పట్టుపడినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మయన్మార్ నుంచి బంగారం స్మగ్లింగ్.. మరోవైపు విశాఖలో కూడా భారీగా బంగారం పట్టుబడింది. గౌహతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 3314 గ్రాముల బంగారంను ఆర్డీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు స్వాధీనం చేసుకున్న బంగారు విలువ రూ.1.89 కోట్లు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఓ ముఠా మయన్మార్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. -
భారత ఫారెక్స్ నిల్వలు 393 బిలియన్ డాలర్లు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు డిసెంబర్ 28తో ముగిసిన వారంలో 116.4 మిలియన్ డాలర్లు ఎగశాయి. దీనితో నిల్వలు మొత్తం విలువ 393.40 బిలియన్ డాలర్లకు చేరింది. విలువను డాలర్ రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ (యూరో, పౌండ్, యన్ వంటివి) అసెట్స్ పెరగడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్ 13న రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారకనిల్వలు అటు తర్వాత క్రమంగా తగ్గాయి. తాజాగా విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఫారిన్ కరెన్సీ అసెట్స్: మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన ఈ విభాగం పరిమాణం 106.30 మిలియన్ డాలర్లు పెరిగి 368.077 బిలియన్ డాలర్లకు చేరింది. ►పసిడి నిల్వల విలువ స్థిరంగా 21.224 బిలియన్ డాలర్లుగా ఉంది. ►ఇక ఐఎంఎఫ్‌కు సంబంధించిన దేశీ నగదు నిల్వలు కూడా 6.5 మిలియన్ డాలర్లు పెరిగి 2.640 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్(రాజేంద్రనగర్) : శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామున దుబాయ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎఫ్‌జడ్436 విమానంలో దుబాయ్ బయలుదేరడానికి వచ్చిన వ్యక్తిని ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేయగా.. హ్యాండ్ బ్యాగ్‌లో విదేశీ కరెన్సీ దొరికింది. కువైట్, బహ్రెయిన్, యూఏఈ, ఒమన్, సౌదీ దేశాల కరెన్సీ ఉంది. భారత కరెన్సీలో వాటి విలువ రూ.39,86,195 ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితుడు ఇదే తరహాలో రెండోసారి పట్టుబడడం గమనార్హం. ఈ నోట్లను అనధికార డీలర్ నుంచి తీసుకుని విదేశాలకు చేరవేస్తున్నట్లు విచారణలో తేలింది. -
శంషాబాద్‌లో వీజ్‌మన్ ఫారెక్స్ కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ కరెన్సీ క్రయవిక్రయాల్లో ఉన్న వీజ్‌మన్ ఫారెక్స్ శంషాబాద్ విమానాశ్రయంలో అయిదు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు ఈ కౌంటర్లను కంపెనీ నిర్వహించనుంది. విదేశీ కరెన్సీ, ప్రీపెయిడ్ ఫారెన్ కరెన్సీ కార్డ్స్, ట్రావెలర్స్ చెక్కులు ఇక్కడ లభ్యమవుతాయని వీజ్‌మన్ ఎండీ బి.కార్తికేయన్ తెలిపారు. -
ప్రయాణికురాలి వద్ద విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ వెళుతున్న మహిళా ప్రయాణికురాలి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దుబాయ్ బయలుదేరే ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ26 విమానం ఎక్కడానికి నస్రత్‌జహాన్ అనే ప్రయాణికురాలు రెండున్నర గంటలు ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇంటర్నెషన్ డిపార్చర్లో ఆమె బ్యాగులు తనిఖీ చేపట్టిన సీఐఎస్ఎఫ్ పోలీసులకు అందులో ఉన్న కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో విప్పి చూశారు. అందులో సౌదీ కరెన్సీ 1,25,500 రియాల్స్ కట్టలు మూడు బయటపడ్డాయి. దీంతో సీఐఎస్ఎఫ్ పోలీసులు వెంటనే కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడి చేరుకుని డబ్బును లెక్కపెట్టారు. ఆ ప్రయాణికురాలి వద్ద లభించిన సొమ్ము భారత కరెన్సీలో రూ.22.94 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వెంకన్న ఖాతాలో భారీగా విదేశీ కరెన్సీ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. మే నెలకు సంబంధించి 61,858 సేవా టికెట్లను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చినట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టికెట్లను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీటీడీ వద్ద 45 టన్నుల విదేశీ నాణేలున్నాయి. నాణేల మార్పిడికి టీటీడీ సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తోంది. ఇందులో మలేసియా దేశ నాణేలు 18 టన్నులు ఉండగా.. వాటి మార్పిడికి బ్యాంక్ ముందుకొచ్చింది. త్వరలో 18 టన్నుల మలేషియా నాణేలు స్వదేశీ కరెన్సీగా మారుస్తాం. గత నెలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాం. అదే విధంగా ఈనెలలో శ్రీనివాసమంగాపురం, కపిలేశ్వర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 13, 20 తేదీల్లో వికలాంగులు, వయో వృద్దులకు..14, 21వ తేదీల్లో చంటిబిడ్డ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తున్నాం. గదుల పొందిన భక్తులకు ఇబ్బందులు తలెత్తితే టీటీడీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తాము. క్యూ కాంప్లెక్స్ లో తోపులాటల నివారణకు మార్పులు తీసుకొచ్చాము. ఆన్లైన్లో లక్కీ డ్రిప్‌లో సేవా టికెట్లు పొందేందుకు లక్షమంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భక్తుల కోసం నడక మార్గంలో, ఘాట్ రోడ్డులో అనేక ఏర్పాట్లు చేస్తున్నాము. మూడు నెలల్లో ప్రత్యేక పూల మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాము. జనవరి నెలలో 20.96 లక్షల మంది భక్తులు శ్రీవారి సేవలో పాల్గొనగా.. 87.49 లక్షల లడ్డూ విక్రయాలు జరిగాయి. హుండి ద్వారా స్వామి వారికి రూ.83.84 కోట్లు ఆదాయం లభించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులపై త్వరలో చర్యలు తీసుకుంటాం. ఆనందనిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టు కోసం సమర్పించిన బంగారాన్ని కొంతమంది దాతలు వెనక్కి తీసుకుంటున్నార'ని అనిల్ కుమార్ వెల్లడించారు. -
ఎయిర్‌పోర్టులో రూ.1.5 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం నగరానికి చెందిన వ్యక్తి దుబాయ్ వెళ్లేందుకు చెక్ఇన్ పూర్తి చేసుకుని విమానాశ్రయంలో వేచి ఉన్నాడు. ముందస్తు సమాచారం అందుకున్న డీఆర్ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేయడంతో అతడి లగేజీని తనిఖీ చేశారు. దీంతో అతడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన ఒమన్, సౌదీ దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విదేశీ కరెన్సీ అక్రమ రవాణా!
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి దుబాయ్, షార్జాలకు విదేశీ కరెన్సీని అక్రమ రవాణా చేయ డానికి యత్నించిన ఇద్దరికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెక్ చెప్పారు. వీరిచ్చిన సమాచారంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధీనం లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు మహారాష్ట్ర వాసుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ప్రధాన రాకెట్లో కమీషన్ తీసుకుని పనిచేసే పాత్రధారులని గుర్తించారు. వీరిద్దరినీ కస్టమ్స్ అధికారులకు అప్పగించిన డీఆర్ఐ ఈ రాకెట్ మూలాలు అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తేలడంతో లోతుగా ఆరా తీస్తోంది. పక్కా ప్లాన్‌తో.. మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఉల్లాస్‌నగర్‌కు చెం దిన ఓ గ్యాంగ్ దుబాయ్, షార్జాల నుంచి భారీగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లను భారత్‌కు స్మగ్లింగ్ చేస్తోంది. వీటిని అక్కడ ఖరీదు చేయడానికి అవసరమైన విదేశీ కరెన్సీ ఇక్కడే సమకూర్చుకుంటోంది. ఈ రాకెట్ ఇక్కడి నుంచి విదేశీ కరెన్సీని ఆయా దేశాలకు తరలించడానికి, ఖరీదు చేసిన బంగారం, ఇతర వస్తువుల్ని ఇక్కడికి తీసుకురావడానికి కమీషన్ పద్ధతిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. అలాంటి ఏజెం ట్లలో ఉల్లాస్‌నగర్‌కి చెందిన బంటి రామ్నాని, రాజేంద్రప్రసాద్ గుప్త ఉన్నారు. ఈ రాకెట్ ఏ కోణంలోనూ తమపై అనుమానం రాకుండా, ఏ ఆధారాలు చిక్కకుండా పక్కాగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా వీరిద్దరూ ముంబై నుంచి విదేశీ విమానాలు ఎక్కకుండా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఇద్దరికీ ఆదివారం ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్స్, ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్‌ల్లో హైదరాబాద్ నుంచి దుబాయ్, షార్జాలకు టికెట్లు బుక్ చేసింది. శనివారం అర్ధరాత్రి రామ్నాని, గుప్తలను డొమెస్టిక్ విమానంలో ముంబై నుంచి హైదరాబాద్ పంపింది. రూ. 99 లక్షల విలువైన యూరోలు, డాలర్లను చాకచక్యంగా ప్యాక్ చేసింది. ఈ కరెన్సీని రోల్స్‌గా చుట్టి ఇద్దరి మల ద్వారాలు (రెక్టమ్), ట్రాలీబ్యాగ్స్ హ్యాండిళ్లతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన చెప్పుల అడుగు భాగంలో దాచింది. సోదాల్లో పట్టుబడ్డ నిందితులు ఏజెంట్లు ఇద్దరూ తమ లగేజీతో ఆదివారం ఉదయం శంషాబాద్ విమానా శ్రయం నుంచి దుబాయ్, షార్జాలకు వెళ్లడా నికి విమానం ఎక్కనున్నారని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన డీఆర్ఐ యూనిట్‌కు తెలిసింది. వారిచ్చిన సమాచారంతో హైదరా బాద్ విమానాశ్రయంలో ఉన్న ఏఐయూ అధికారులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకు న్నారు. సోదాలు నిర్వహించి రహస్యంగా దాచిన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నా రు. రూ.20 వేల కమీషన్ కోసమే తాము ఈ కరెన్సీని అక్రమ రవాణా చేస్తున్నట్లు నిందితు లు అంగీకరించారు. కస్టమ్స్ అధికారులు వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. -
బ్రెడ్ ప్యాకెట్ల మధ్యలో కరెన్సీ కట్టలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు నగర పోలీసులు చెక్ పెట్టారు. భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పాతబస్తీ వాసుల్ని అరెస్టు చేసి, వీరి నుంచి రూ.3.96 కోట్ల విలువైన ఏడు దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన స్ప్రే పెయింటర్ రవూఫ్ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని దుబాయ్‌కి తరలిస్తున్నట్లు దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అం దింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రవూఫ్ బుధవారం అరబ్ ఎమిరేట్స్ విమానం ఎక్కుతు న్నట్లు గుర్తించారు. అప్పటికే అతడు తన లగేజ్‌ను చెక్ ఇన్‌లో వేసి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కౌంటర్లు దాటి నట్లు నిర్థారించుకున్నారు. విమానాశ్రయం లోపలకు వెళ్లి చర్యలు తీసుకునే అధికారం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో కస్టమ్స్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బంది రవూఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు లగేజ్ బెల్ట్‌పై ఉన్న బ్యాగ్‌ను వెనక్కు రప్పించారు. దాన్ని తెరిచి చూడగా అందులోని ఆరు కట్టల్లో ఏడు దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. ఈ బండిళ్లను రవూఫ్ బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ల మధ్యలో ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిలో అమెరికన్ డాలర్లు, యూరోలతో పాటు సౌదీ, కువైట్, బెహరేన్, ఒమన్ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. తనకు ఈ డబ్బును మొఘల్పురకే చెందిన మెహరేన్ అందించాడని, దుబాయ్‌లో ఉండే అబ్దుల్లాకు చేరిస్తే రూ.15 వేల కమీషన్, విమాన టిక్కెట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని రవూఫ్ అంగీకరించాడు. మెహరేన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనను దించి వెళ్లినట్లు ఇతడు చెప్పాడు.దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెహరేన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. రవూఫ్‌తోనే ఫోన్ చేయించి అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయం నుంచి పహాడీషరీఫ్ వెళ్లే మార్గంలో ఓ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద అతడు ఉన్నట్లు గుర్తించారు. అయితే అతడు రవూఫ్నే క్యాబ్‌లో రమ్మని చెప్పి.. ఆ వాహనం నంబర్ తెలుసుకుని ఫాలో అవడం ప్రారంభించాడు. దీంతో సిటీ శివార్ల వరకు రహస్యంగా వెంబడించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా మెహరేన్ను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ నగదు మెహరేన్ సొంతం కాదని, కొందరు వ్యాపారుల వద్ద తీసుకుని 3 శాతం కమీషన్‌కు ఆశపడి దుబాయ్‌కు పంపుతున్నట్లు బయటపడింది. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సైతం ఈ రాకెట్ మూలాలు కనుక్కోవడంపై దృష్టి పెట్టారు. ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఏఏ మార్గాల్లో సిటీకి వచ్చిందనే అంశాలనూ ఆరా తీస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు శుక్రవారం దొంగచాటునా తరలిస్తున్న విదేశీ కరెన్సీని పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడి లగేజిని సోదా చేయగా ‘ గోపాల దేశీ నెయ్యి’ డబ్బా అనుమానాస్పదంగా కనిపించింది. దాని మూత పగులగొట్టి చూడగా రూ.92.59 లక్షల విలువైన 1,44,800 అమెరికన్ డాలర్ల నోట్లు బయటపడ్డాయి. కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఫారెక్స్ నిల్వలు ‘ 381.95 బిలియన్ డాలర్లు
ముంబై: దేశంలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ఇవి జూన్ 16తో ముగిసిన వారంలో 799 మిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 381.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనికి విదేశీ కరెన్సీ అసెట్స్‌లో పెరుగుదల ప్రధాన కారణం. రిజర్వు బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ అసెట్స్ 802.4 మిలియన్ డాలర్లమేర పెరుగుదలతో 358.08 బిలియన్ డాలర్లకు ఎగశాయి. బంగారం నిల్వలు ఎప్పటిలాగే స్థిరంగా 20.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఐఎంఎఫ్ వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌కు సంబంధించిన మొత్తం 1.3 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 1.46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలకు సంబంధించిన మొత్తం కూడా 2.1 మిలియన్ డాలర్లమేర తగ్గుదలతో 2.3 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 11.5 మిలియన్ డాలర్లమేర క్షీణించి 381.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఫారెక్స్ నిల్వలు ‘381.95 బిలియన్ డాలర్లు ముంబై: దేశంలో ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ఇవి జూన్ 16తో ముగిసిన వారంలో 799 మిలియన్ డాలర్ల మేర పెరుగుదలతో 381.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనికి విదేశీ కరెన్సీ అసెట్స్‌లో పెరుగుదల ప్రధాన కారణం. రిజర్వు బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ అసెట్స్ 802.4 మిలియన్ డాలర్లమేర పెరుగుదలతో 358.08 బిలియన్ డాలర్లకు ఎగశాయి. బంగారం నిల్వలు ఎప్పటిలాగే స్థిరంగా 20.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఐఎంఎఫ్ వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌కు సంబంధించిన మొత్తం 1.3 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 1.46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలకు సంబంధించిన మొత్తం కూడా 2.1 మిలియన్ డాలర్లమేర తగ్గుదలతో 2.3 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 11.5 మిలియన్ డాలర్లమేర క్షీణించి 381.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
తగ్గిన ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేట్లు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ తాజాగా ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంకింగ్) (ఎఫ్సీఎన్ఆర్–బి) టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఏడాది పైబడి రెండేళ్ల దాకా ఉండే కాల వ్యవధి గల ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుతమున్న 2.39% నుంచి 2.36%కి తగ్గింది. అలాగే రెండేళ్లు పైబడి.. మూడేళ్ల దాకా కాలవ్యవధి గల డిపాజిట్లపై రేటు 2.58% నుంచి 2.50%కి, మూడేళ్ల నుంచి నాలుగేళ్ల కన్నా తక్కువ వ్యవధికి 2.77% నుంచి 2.70 శాతానికి వడ్డీ రేటు తగ్గింది. నాలుగేళ్లు పైబడి, అయిదేళ్ల కన్నా తక్కువ కాలవ్యవధి ఉండే డిపాజిట్లపై 2.87 శాతం నుంచి 2.82 శాతానికి, అయిదేళ్ల వ్యవధికి 2.97 శాతం నుంచి 2.89 శాతానికి రేటు తగ్గినట్లవుతుందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు వివరించింది. -
విదేశీ నాణేల గుట్టలు
⇒ టీటీడీ ఖజానాలో పేరుకుపోతున్న వైనం ⇒ ఇప్పటికే 200 టన్నులు ఉంటాయని అంచనా ⇒ పరిపాలన భవనం, గోవిందరాజస్వామి ఆలయంలో నిల్వ సాక్షి,తిరుమల: తిరుమలేశునికి విదేశీ భక్తులు భక్తితో సమర్పించే నాణేలు నిష్ఫలంగా మారుతున్నాయి. దశాబ్దంగా గుట్టలుగా పోస్తున్న టీటీడీ అధికారులు వాటి మార్పిడి గురించి పట్టించుకోవడంలేదు. ఫలితంగా నాణేలు రూపు మారుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 టన్నుల నాణేల పరిస్థితి ఇలా తయారైంది. వాటిని మార్పిడి చేస్తే స్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందన్న వాస్తవాన్ని అధికారులు గుర్తించడంలేదు. వడ్డీకాసులవాడైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి హుండీలో భక్తులు సమర్పించే కానుకలు ప్రతి నెలా కోట్లలో ఉంటాయి. ఇందులో విదేశీ కరెన్సీ వాటా 15 శాతం పై మాటే. నాణేలు మరో 5 శాతం ఉంటాయని అంచనా. తిరుమలేశునికి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ వెంట తీసుకొచ్చిన కరెన్సీ నోట్లతోపాటు నాణేలు కూడా కానుకగా సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు ఆసియా ప్రాంతానికి చెందిన సింగపూర్, మలేషియా, మార్షియస్, ఇండోనేషియా, బ్యాంకాంగ్, శ్రీలంక, కువైట్, దుబాయ్ వంటి ఎన్నో దేశాలకు చెందిన నాణేలు శ్రీవారి హుండీలో ఎక్కువగా వస్తుంటాయి. శ్రీవారికి 2016–2017 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1110 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ఇందులో విదేశీ కరెన్సీ సుమారు రూ.150 కోట్లుపైబడి ఉంది. ఇక విదేశీ నాణేల విలువ కూడా సుమారు రూ.60 కోట్ల వరకు ఉంది. వాటిని నిర్ణీత గడువులో విదేశీ మారకద్రవ్యంతో నగదు మార్పిడి చేసుకుంటే శ్రీవారి ఖజానాకు మరింత ఆదాయం లభిస్తుంది. అయితే టీటీడీ అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడంలేదు. దశాబ్దంగా విదేశీ నాణేలు గుట్టలుగా ఉండడమే ఇందుకు నిదర్శనం. మొదట పరిపాలన భవనంలో నిలువ చేయడం మొదలు పెట్టిన అధికారులు అక్కడ నిండిపోవడంతో ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలోని ఆభరణాలు భద్రపరిచే గదిలోకి చేరుస్తున్నారు. ఇక్కడ 100 టన్నులు, అక్కడ మరో 100 టన్నులు ఉంటాయని భావిస్తున్నారు. పొడిగా రాలిపోతున్న నాణేలు వివిధ దేశాలు వివిధ లోహాలతో నాణేలు తయారు చేస్తుంటాయి. ఏ నాణెలు అయినా వాడకుండా గుట్టలుగుట్టలుగా పడేస్తే లోహ మిశ్రమాలతో కూడినవి కావడంతో రసాయన చర్య జరిగి రూపు కోల్పోవడంతో పాటు పొడిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టీటీడీ వద్ద దశాద్ద కాలం దాటిన నాణేలు కూడా ఉన్నాయంటే వాటి పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. తక్షణమే వీటిని తరలించికపోతే నాణెం విలువ మాట ఎటున్నా లోహం విలువ కూడా రాదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత టీటీడీ విభాగాధిపతులు చొరవ తీసుకోవాల్సి ఉంది. -
ఎయిర్‌పోర్టులో భారీగా కరెన్సీ పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు గురువారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లే అహ్మద్ అనే వ్యక్తి లగేజీలో రూ.55 ల క్షల విలువైన విదేశీ కరెన్సీ దొరికింది. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విదేశీ కరెన్సీ భారీగా దొరకటం ఈ వారంలో ఇది రెండోసారని అధికారులు చెబుతున్నారు. -
విదేశీ కరెన్సీతో ఐదుగురి పట్టివేత
హైదరాబాద్ : చెలామణీలో లేని విదేశీ కరెన్సీని అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకునేందుకు యత్నించిన ఐదుగుర్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లాకు చెందిన రామసాగర్ (34) కారుడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఓసారి అతడు గోవాకు వెళ్లిన సమయంలో అక్కడ కేరళకు చెందిన జావిద్ పరిచయమయ్యాడు. అతని వద్ద చెలామణీలో లేని వెనుజులా దేశ కరెన్సీ ఉంది. ఆ దేశంలో 2008లోనే బ్యాన్ చేసిన కరెన్సీ మన రూపాయల్లో 11 లక్షల పైచిలుకు ఉంటుందని దాన్ని కేవలం లక్షన్నరకే ఇస్తానని నమ్మ బలికాడు. దీంతో రామసాగర్ తన భార్య నగలు అమ్మి మరీ వాటిని కొనుగోలు చేశాడు. ఇతని స్నేహితులు సైదాబాద్‌కు చెందిన కె.కరుణాకర్ (43), పద్మారావు నగర్‌కి చెందిన జి.రంజిత్ కుమార్ (33), సైదాబాద్‌కు చెందిన ఎం.రవిచంద్ర (43), గుంటూరు జిల్లాకు చెందిన ఎన్. నాగమల్లేశ్వర్ రావు (30) లతో కలిసి పలువుర్ని మోసం చేసి వాటిని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద వీరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు నగదును ఓ వ్యక్తికి రూ.5 లక్షలకు అమ్మేందుకు యత్నిస్తున్నట్లు వారు విచారణంలో ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి కరెన్సీ సరఫరా చేసిన జావిద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
శంషాబాద్‌లో భారీగా నగదు పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళుతున్న ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పాతబస్తీకి చెందిన అహ్మద్ నుంచి భారత కరెన్సీలో రూ.10 కోట్లు విలువ చేసే విదేశీ కరెన్సీ ఉన్నట్లు ముందస్తు సమాచారం తెలుసుకున్న అధికారులు సోమవారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడిని డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం
దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆక్వా ఎగుమతితో విదేశీ మారకద్రవ్యం
నాస్కా రీజనల్ కో–ఆర్డినేటర్ నందకిషోర్ నెల్లూరు రూరల్ : ఆక్వా ఉత్పత్తుల ఎగుమతితో విదేశీమారద ద్రవ్యం వస్తుందని నాస్కా రీజనల్ కో–ఆర్డినేటర్ టి.నందకిశోర్ అన్నారు. ఎంపెడా(సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ సంస్థ నెల్లూరు శాటిలైట్ సెంటర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఆక్వా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ సౌకర్యంపై ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తోందన్నారు. రైతులు పండించిన ఆక్వా ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవాలంటే ఎంపెడాలో రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు, భూమి పాస్‌బుక్, సాగు చేస్తున్న చేప, రొయ్యల రకాలు, తదితర వివరాలతో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రైతుల ఉత్పత్తులను పరీక్షించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని, ఈ సర్టిఫికేట్ ఆధారంగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాస్కా ఫీల్డ్మేనేజర్ పాపయ్య, పావనమూర్తి, రవీంద్ర, పర్వేజ్, ఆక్వా సొసైటీ అధ్యక్షుడు కుమారి అంకయ్య, ఉడతా వెంకటేశ్వర్లు, బాలయ్య, ఆక్వా రైతులు పాల్గొన్నారు. -
దొరికిన మరాఠీ దొంగలు
నంద్యాల: మహానంది క్షేత్రంలోని కోనేరులో ఇటీవల ఓ భక్తుడు స్నానం చేస్తుండగా అతని బ్యాగ్‌లోని విదేశీ కరెన్సీని చోరీ చేసిన ముగ్గురు మహారాష్ట్రకు చెందిన దొంగలను పోలుసులు పట్టుకున్నారు. వారి నుంచి విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌కు చెందిన మేకల రామాంజనేయులు 15వ తేదీన మహానంది క్షేత్రానికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేశారు. ఆయన ఆలయం వెలుపల ఉన్న కోనేరు వద్ద స్నానం చేయడానికి వెళ్తూ, సమీపంలోని చెట్టు వద్ద బ్యాగ్ పెట్టాడు. స్నానం చేసి వచ్చాక బ్యాగ్ కనిపించలేదు. ఇందులో రూ.99వేలు అమెరికా డాలర్లు, సౌదీకి చెందిన రియాజ్ నోట్లు ఉన్నాయి. దీంతో ఆయన మహానంది ఎస్ఐ కష్ణుడుకు ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు మరాఠీ దొంగలు బ్యాగ్‌లో నుంచి నోట్లను కాజేస్తుండగా ఆ దశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు విదేశీ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులు, వ్యాపారస్తుల దగ్గర ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని సోలార్‌పూర్‌కు చెందిన విశాల్ మానిక్ చౌహాన్, ధాన్‌సింగ్ బాపు చౌహాన్, చెన్నాసింగ్‌భగవత్‌లను అరెస్ట్ చేసి రూ. 99,344లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో మహానంది ఎస్ఐ కష్ణుడు, రూరల్ ఏఎస్ఐ మహబూబ్‌పీరా పాల్గొన్నారు. -
శంషాబాద్‌లో వ్యక్తి అరెస్ట్: విదేశీ కరెన్సీ స్వాధీనం
అనుమతులు లేకుండా విదేశి కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ డీఆర్ఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 1.25 లక్షల సౌదీ రియాద్‌లను స్వాధీనం చేసకున్నారు. దుబాయి నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద భారీగా సౌదీ రియాద్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
10వేల కోట్లకు పైగాసమీకరించనున్న ఎస్బీఐ
విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా రూ.10,000 కోట్లకు పైగా (150 కోట్ల డాలర్లు) పెట్టుబడులు సమీకరించనున్నది. డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో దీర్ఘకాల బాండ్ల జారీ ద్వారా ఈ స్థాయిలో నిధులను సమీకరిస్తామని బీఎస్ఈకి ఎస్బీఐ నివేదించింది. బుధవారం సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఈ నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఒకేసారి గాని, వివిధ దఫాలుగా గానీ సమీకరిస్తామని పేర్కొంది. పబ్లిక్ ఆఫర్/డాలర్ లేదా ఇతర కన్వర్టబుల్ కరెన్సీల్లో ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఈ పెట్టుబడులను సమీకరిస్తామని ఎస్బీఐ వివరించింది. -
భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
-ఐదుగురి అరెస్టు జైపూర్: విదేశీ కరెన్సీని చెలామణీ చేసేందుకు యత్నించిన ముఠాను ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ తెలిపిన వివరాలివీ.. టర్కీ దేశం కరెన్సీ ‘లిరా’ను చెలామణీ చేసేందుకు ఏడుగురు సభ్యుల ముఠా యత్నిస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం 300 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వాటి విలువ రూ. 500 కోట్లని తేలింది. అయితే, ఆ కరెన్సీ ప్రస్తుతం టర్కీలో చెలామణీలో లేదు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. -
విదేశీ కరెన్సీ స్వాధీనం..ఒకరి అరెస్ట్
హైదరాబాద్:చెలామణీలో లేని విదేశీ కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట్‌కు చెందిన వరప్రసాద్ అనే యువకుడు మైత్రీవనం సమీపంలో శనివారం మధ్యాహ్నం టర్కీ దేశ కరెన్సీ లిరాలను మార్పిడి చేసుకునేందుకు యత్నించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 89 లిరా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ల విలువ రూ.100 కోట్లు ఉంటుందని, అయితే అవి ఇప్పుడు చెల్లుబాటు కావని చెబుతున్నారు. ఈ కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన వారంలో రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే... 158 మిలియన్ డాలర్లు ఎగసి 360 బిలియన్ డాలర్లుకు ఎగబాకాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ల పరిమాణం పెరగడం మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి పెరిగేందుకు దోహదపడినట్లు శుక్రవారం విడుదలైన రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గణాంకాలు తెలిపాయి. కేవలం డాలరు ఆస్తులే 159 మిలియన్లు ఎగసి 336 బిలియన్లకు చేరాయి. కాగా పసిడి నిల్వలు స్థిరంగా 20 బిలయన్ డాలర్లుగా కొనసాగుతున్నాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 96 లక్షల 34 వేల రూపాయల విలువైన అమెరికా, సౌదీ అరేబియాకు చెందిన కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌కు ఈ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు చెప్పారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
'ప్రవృత్తి’కి పరదేశంలోనే నాంది !
విదేశీ కరెన్సీ, నాణేల సేకరించడంలో కోలారు వాసి దిట్ట 25 దేశాలకుపైగా కరెన్సీ సేకరణ వృత్తి పరంగా డ్రైవింగ్ శిక్షకుడు... కోలారు : విదేశీ నాణేలు, కరెన్సీల సేకరణలో నగరానికి చెందిన కోలారమ్మ డ్రైవింగ్ స్కూల్ యజమాని ఆర్ గోపాల్ ప్రత్యేకత కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 25కు పైగా విదేశీ కరెన్సీతో పాటు వివిధ దేశాలకు చెందిన నాణేలు సేకరించారు. వీటిని అత్యత భద్రంగా తన డ్రైవింగ్ స్కూల్ ఆఫీసులోనే ఫ్రేము వేసి ప్రదర్శనకు ఉంచారు. 17 ఏళ్లుగా విదేశీ కరెన్సీ సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటికి తోడు భారతదేశానికి చెందిన పాత కాలం నాటి కరెన్సీని కూడా సేకరించారు. పదవ తరగతి వరకు చదువుకున్న ఆర్ గోపాల్ 1999లో డ్రైవింగ్ పాఠశాలను నగరంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ప్రారంభించారు. తాను విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో నాణేల సేకరణ చేయాలనే కోరిక కలిగిందని గోపాల్ తెలిపారు. నగరంలోని దేవరాజ్ అరసు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ లెసైన్సుకోసం తన వద్దకు వస్తుంటారని వారి వద్దనుంచి వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీని సేకరించినట్లు తెలిపారు. గోపాల్ వద్ద ఇంతవరకు అమెరికా, కొరియా, సౌదీ అరేబియా, జపాన్, సింగపూర్, చైనా, మలేషియా, ఇరాక్, ఇండోనేషియా, లండన్, పాకిస్తాన్, కువైట్, బ్యాంకాక్, శ్రీలంక, ఓమెన్, ఫిలిపైై్పన్స్, నైజీరియా, కాంగో, భూటాన్, ఖతార్, నేపాల్, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన కరెన్సీలు ఉన్నాయి. మిగిలిన దేశాలకు చెందిన కరెన్సీని కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నానని ప్రపంచంలోని అన్ని దేశాల కరెన్సీలను సేకరించాలనేది తన లక్ష్యమని గోపాల్ అన్నారు. -
నోటు విలువ కోటి రూపాయలు!
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్నకు విదేశీ కరెన్సీ వెల్లువెత్తింది. సోమవారం శ్రీవారి ఆలయ హుండీల్లోని ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో 11 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు లభించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు చెప్పారు. ఇందులో టర్కీ దేశానికి చెందిన 5 లక్షల లిరసీ నోటు (భారత కరెన్సీ ప్రకారం రూ.1,14,48,362.12) ఉంది. అమెరికా డాలర్లు 265, సౌదీ అరేబియన్ రియాల్స్ 730, ఖతర్ రియాల్ 1, యూఏఈ దర్హమ్స్ 60, మలేషియా రింగిట్స్ 170, కెనడా డాలర్లు 5, యూరోలు 10, సింగపూర్ డాలర్లు 7, కువైట్ దినార్ 1, నేపాల్ రూ.10 నోటు ఒకటి హుండీలో లభ్యమయ్యాయి. -
రూ. కోటి విదేశీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోటి విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. అరేబియా ఎయిర్‌లైన్స్ విమానంలో దుబాయి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సదరు ప్రయాణికుడి వద్ద పెద్ద మొత్తంలో యూరోలు, దిర్హమ్లు దొరికాయి. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు 5 వేల అమెరికన్ డాలర్ల నగదు, మరో 5 వేల డాలర్లు చెక్కు రూపంలో మాత్రమే తమ వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి ఉంటే నిబంధనల మేరకు శిక్షార్హులవుతారు. -
కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎంవో కార్యాలయంపై సీబీఐ దాడుల ఘటనకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ దాడులకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని కేజ్రీవాల్ సమర్థించడం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటేనే సీబీఐ దాడులు చేస్తుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేజ్రీవాల్ కార్యాలయంలో సీబీఐ దాడులు చేయలేదని, తప్పుడు విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. మరోవైపు కేజ్రీవాల్ కార్యాలయంలో దాడులు జరిపినట్లు వచ్చిన వార్తలను సీబీఐ ఖండించింది. దాడులు జరపినట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవంటూ సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. -
సీఎంఓ నివాసంలో 3లక్షల ఫారెన్ కరెన్సీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్ నివాసంలో మూడు లక్షల విలువైన విదేశీ కరెన్సీతో పాటు రూ.2.4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా దాడులపై సీబీఐ మరికాసేపట్లో మీడియా ముందుకు రానుంది. మరోవైపు దాడులను ఖండిస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకుని, ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఢిల్లీ సచివాలయంలోని అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం సీబీఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. సీఎంఓలోని రాజేంద్రకుమార్ అనే అధికారి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే కేసులో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. -
బ్రీఫ్స్
కాంటాక్ట్‌లెస్ ఫారెక్స్ కార్డు దేశంలోనే తొలిసారిగా 15 విదేశీ కరెన్సీలను నింపుకునే కాంటాక్ట్‌లెస్ ఫారెక్స్ కార్డును యాక్సిస్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. కార్డు స్వైపింగ్ చేయనవసరం లేకుండానే సెన్సర్‌తో పనిచేసే విధంగా రూపొందించిన ఈ కార్డుల ద్వారా ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లే ప్రయాణికులు మరింత సులభతరంగా, సురక్షితమైన లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీని క్రెడిట్, డెబిట్‌కార్డుల్లో కూడా వినియోగిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. డెంగ్యూకి బీమా రక్షణ ఈ మధ్యకాలంలో డెంగ్యూ జ్వరం బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఈ వ్యాధి చికిత్సా వ్యయాన్ని భరించడానికి కొత్త బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటురంగ ఆరోగ్య బీమా కంపెనీ అపోలో మ్యూనిక్ ‘డెంగ్యూ కేర్’ పేరుతో ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం రూ. 444 వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. డెంగ్యూ జ్వరం బారిన పడి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే గరిష్టంగా రూ. 50,000 వరకు, అదే హాస్పిటల్లో చేరకుండా ఔట్ పేషెంట్‌గా చికిత్స తీసుకుంటే రూ. 10,000 బీమా రక్షణ లభిస్తుంది. గతేడాది 40,000 కేసులు నమోదు కాగా సగటు చికిత్సా వ్యయం రూ. 35,000 ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఎల్అండ్టీ మిడ్‌క్యాప్ డివిడెండ్ ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్ సంస్థ మిడ్‌క్యాప్ పథకంపై 30% డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్‌కు రికార్డు తేదీ ఆగస్టు 19గా నిర్ణయించారు. ఈ తేదీ నాటికి కలిగి ఉన్న ప్రతీ యూనిట్‌కు రూ. 3 డివిడెండ్ లభిస్తుంది. గడిచిన ఏడాది కాలంలో 40 శాతం రాబడిని అందించిన ఈ పథకం యూనిట్ విలువ (డివిడెండ్) రూ. 40.86 గా ఉంది. యూబీఐ నుంచి మూడు కార్డులు ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న వ్యాపారులు, విద్యార్థులు, అధికాదాయ వర్గాల వారికోసం మూడు ప్రత్యేక కార్డులను ప్రవేశపెట్టింది. చిన్న వ్యాపారస్థుల కోసం డెబిట్ కార్డును, అలాగే అధికాదాయవర్గాల వారికోసం క్రెడిట్ కార్డును విడుదల చేసింది. దీంతోపాటు ఎటువంటి ఆదాయం, క్రెడిట్ రేటింగ్ లేని విద్యార్థుల కోసం యూ సెక్యూర్ పేరుతో క్రెడిట్ కార్డును అందిస్తోంది. కానీ ఈ కార్డు కావాలంటే మాత్రం విద్యార్థులు టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. -
విదేశీ కరెన్సీ ఇంకా ఈజీ..!
ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌తో ఆన్లైన్లో విదేశీ కరెన్సీ లావాదేవీలు ♦ డీలర్లకు- కస్టమర్లకు మధ్య ఆగ్రిగేషన్ సేవలు ♦ ఏడు నెలల్లో రూ.7 కోట్ల వ్యాపారం చేసిన సంస్థ ♦10 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గతంలో విమాన ప్రయాణమనేది బడా బాబులకే పరిమితం. కానీ ఇప్పుడో...! పెరిగిన వేతనాలు, అందుబాటులోకి వచ్చిన విమానయాన చార్జీలు, ప్రతి రూట్లోనూ సర్వీసులు... ఇవన్నీ కలసి విమానయానాన్ని అందరికీ చేరువ చేశాయి. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ... విదేశాలకు వెళ్లినప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య అక్కడి కరెన్సీ!. ఇందుకోసం ఎవరైనా సరే కాసింత హోమ్ వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే స్థానికంగా ఉన్న బ్యాంకుల తాలూకు ఫారెక్స్ బ్రాంచినో, లేనిపక్షంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించిన ఫారెక్స్ డీలర్లనో సంప్రదించాలి. పెపైచ్చు అందరి దగ్గరా ఒకేరకమైన మార్పిడి చార్జీలుండవు. ఉదాహరణకు డాలర్‌నే తీసుకుంటే కనీసం రూపాయి నుంచి ఆరేడు రూపాయల వరకూ వ్యత్యాసం ఉంటుంది. ఎవరి దగ్గర ఎంత రేటు ఉందన్నది తెలుసుకోవటం కూడా అంత సులభమేమీ కాదు. అందుకని ఈ చిక్కులన్నిటినీ పరిష్కరించే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది ‘ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్’. అది కూడా ఉచితంగానే!! సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం రెండేళ్లు తీవ్రంగా శ్రమించి... చివరికి 2015 జనవరిలో ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్ పేరుతో ఆన్లైన్లో ఫారెక్స్ ఎక్స్ఛ్ంజ్ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు హదీ షేక్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ ప్రతి సెకనుకూ మారుతుంటుంది. కరెన్సీ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు సాధారణంగా మన దగ్గర రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. బ్యాంకుకెళ్లాలి. కానీ బ్యాంకులు ఎంత రేటుకు డాలర్‌ను ఇస్తున్నాయో చెప్పవు. మునుపటి రోజు డాలర్ రేటుకే ఇచ్చేస్తాయి. రెండోది.. ఫారెక్స్ డీలర్ల వద్దకెళ్లడం. ఇందుకోసం కస్టమర్లు ఫారెక్స్ డీలర్లకు ఫోన్లు చేస్తుంటారు. వారు ఈరోజు డాలర్ రేటింతని చెబుతారు. మళ్లీ మరో డీలర్‌కు ఫోన్ చేస్తారు కస్టమర్లు. అక్కడి రేటూ తెలుసుకుంటారు. అలా కొంతమంది డీలర్లను సంప్రదించి ఎవరోఒకరిని ఎంచుకుంటారు. ఇది చాలా వ్యయ, ప్రయాసలతో కూడుకున్న పని. అందుకని అందరు డీలర్లనూ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి.. వారి రేట్లను కస్టమర్లకు ఒకేచోట ఇచ్చేస్తే.. కస్టమర్లకు కావాల్సిందేదో వాళ్లే ఎంచుకుంటారు కదా!. సమయం, డబ్బూ ఆదా అవుతాయి. 55 మంది డీలర్లు.. 600 బ్రాంచీలు.. ప్రస్తుతం ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌లో పాల్ మర్చంట్స్ లిమిటెడ్, సెంట్రమ్ డెరైక్ట్ లిమిటెడ్, ఓరియంట్ ఎక్స్ఛ్ంజ్, అక్బర్ ట్రావెల్స్, మ్యాట్రిక్స్ ఫారెక్స్ వంటి సుమారు 55 మంది ఫారెక్స్ డీలర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. వీరు దేశవ్యాప్తంగా 600 బ్రాంచీలలో విస్తరించి ఉన్నారు. ఈ బ్రాంచీల్లో 20 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో ఉన్నాయి. 10-15 శాతం బ్రాంచీలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, పుణే, అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో ఎఫ్‌ఎక్స్‌కార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏడు నెలల్లో రూ.7 కోట్లు..: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌ను ప్రారంభించిన 7 నెలల్లో రూ.7 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. నెలకు 30-40% వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు 3 వేల కస్టమర్లకు 1,100 లావాదేవీలు పూర్తి చేశాం. రోజుకు 400లకు పైగా ఎంక్వయిరీలొస్తున్నాయి. దాదాపు 25 మంది కస్టమర్లకు లావాదేవీలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో గత నెలలోనే సేవలను ప్రారంభించాం. నిధుల సమీకరణపై దృష్టి.. ఇప్పటికే దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు 5-10 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. కానీ, ఈ ఏడాది ముగింపు నాటికి డీల్స్‌ను క్లోజ్ చేసే యోచనలో ఉన్నాం. రూ.3 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్‌లో ఇటీవలే డాక్టర్ ముస్తాక్ షా, డాక్టర్ ఫరాజ్ నక్విలు 2 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టారు. వీటితో డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరించాం. ఐటీ సదుపాయాలను మెరుగు పరిచాం. ఈ ఏడాది ముగింపు నాటికి వందకుపైగా డీలర్లు, 2,000 బ్రాంచీలు, 6,000 కస్టమర్లతో రూ.35 కోట్లకు పైగా లావాదేవీలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కస్టమర్లకు ఉచితమే.. ఎఫ్‌ఎక్స్‌కార్ట్ సేవలు కస్టమర్లకు పూర్తిగా ఉచితం. డీలర్ల నుంచి ప్రతి లావాదేవీలో కమీషన్ తీసుకుంటాం. 1,000 డాలర్ల కరెన్సీ మార్పిడికి రూ.100 చార్జీ చేస్తాం. వినియోగదారులు ఎక్కడి నుంచి ఎఫ్‌ఎక్స్‌కార్ట్.కామ్ సేవలను వినియోగిస్తున్నారో కూడా జియో-లొకేషన్ ద్వారా ట్రాక్ చేస్తాం. దీంతో వినియోగదారునికి దగ్గర్లో ఉన్న డీలర్ వివరాలొస్తాయి. దీంతో లావాదేవీలు త్వరగా చేసుకోవచ్చు. అంతేకాకుండా రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఫారెక్స్ వెండర్ డాలర్‌కు ఎంత రేటిస్తున్నాడో కూడా కస్టమర్‌కు మెసేజ్ రూపంలో వెళుతుంది. దీంతో కస్టమర్ తనకు నచ్చిన డీలర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. -
ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం
విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్చేంజ్ సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది. సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి ఆంటోనీ మాట్లాడుతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. -
విజయవాడలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం
సాక్షి, విజయవాడ: విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్ఛేంజి సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది. మంగళవారం సూర్యారావుపేట వేమూరివారి వీధిలో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి అంటోనీ విలేకరులతో మాట్లాడతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. రిజర్వు బ్యాంకు గుర్తించిన దేశాలకు చెందిన కరెన్సీని తమ సంస్థలో మార్చుకోవచ్చన్నారు. విదేశాలకు వెళ్లేవారికి అక్కడి కరెన్సీని ఇక్కడే తీసుకునే సౌకర్యం ఉందన్నారు. విదేశాలకు డబ్బు పంపే సౌకర్యం, విదేశీ కరెన్సీ డిమాండ్ డ్రాప్టులు వంటి సేవలు తమ సంస్థ అందిస్తోదన్నారు. -
విదేశీ అందాలకు దీటైన స్వదేశీ సౌందర్యం!
ఫొటో ఫీచర్ అద్భుతమనిపించే ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి... అపురూపమనే వాతావరణంలో గడపటానికి, అబ్బురమనిపించే అందాలను చూడటానికి... ఆకట్టుకొనే స్థలాల్లో ఆహ్లాదంగా గడపటానికి... ‘వేల మైళ్లు దాటి పోవాలి, సరిహద్దులు దాటాలి, వీసాలు తెచ్చుకోవాలి... విదేశీ కరెన్సీ చేతిలో ఉండాలి..!’ ఎంతోమందిలోని భావనలు ఇవి. అయితే మనదేశం గురించి పూర్తిగా తెలుసుకొంటే అవన్నీ కేవలం భ్రమలే అని స్పష్టమవుతుంది. ఓ సారి ఈ ఫొటోలను చూడండి... బ్యాంకాక్‌లోని ఫ్లోటింగ్ మార్కెట్‌కు దీటైన శ్రీనగర్ ఫ్లోటింగ్ మార్కెట్ స్విస్ అందాలకు సాటైన హిమాచల్‌ప్రదేశ్‌లోని కజ్జార్ వెనీస్తో పోటీలో వెనుకబడని కేరళలోని అలెప్పీ సహారా ఎడారికంటే నేనేం తక్కువ అంటున్నట్లు రాజస్థాన్ థార్ వెనిస్లోని బురానో కాలనీని ప్రతిబింబించే పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ కాలనీ కొత్త ప్రదేశాలను చూడాలంటే లక్షలే అక్కరలేదు. ఆస్వాదించే అభిరుచి ఉంటే మన అందాల సౌరభాలూ అపురూపమే. -
తగ్గిన విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు జనవరి 2వ తేదీతో ముగిసిన వారాంతానికి 319.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు వారంతో (డిసెంబర్ 26) పోల్చితే 471 మిలియన్ డాలర్లు తగ్గాయి. అమెరికా డాలర్ల రూపంలో ఉండే ఫారిన్ కరెన్సీ అసెట్స్ విలువ 863 మిలియన్ డాలర్లు తగ్గి, 294.53 బిలియన్ డాలర్లుగా ఉంది. మారక విలువల్లో తగ్గుదల దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వలు 1.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం నిల్వల విలువ డిసెంబర్ 26తో పోల్చితే 18.98 బిలియన్ డాలర్ల నుంచి 19.37 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
రెండేళ్లలో 1,000 కోట్ల రుణాలు
⇒‘సాక్షి’ ఇంటర్వ్యూ: యూఏఈ ఎక్స్చేంజ్ ఎండీ వి. జార్జ్ ఆంటోనీ ⇒ఎన్నారై రెమిటెన్స్‌ల్లో పెద్దగా మార్పు లేదు ⇒బ్యాంకింగ్ లెసైన్స్‌పై మరోసారి ప్రయత్నం ⇒వ్యాపార విస్తరణకు ప్రస్తుతం నిధులు అవసరం లేదు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ కరెన్సీ నుంచి స్వదేశీ మనీ ట్రాన్స్ఫర్ వరకు అన్నీ ఆర్థిక సేవలను ఒకే గొడుగు కింద అందిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో త్వరలోనే బ్యాంకింగ్ లెసైన్స్ కూడా పొందగలమన్న ధీమాను యూఏఈ ఎక్స్ఛేంజ్ వ్యక్తం చేస్తోంది. ప్రీపెయిడ్ కార్డులతో పాటు గ్రామీణ రుణ మార్కె ట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామంటున్న యూఏఈ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జ్ ఆంటోనీతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... రూపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే నిధుల ప్రవాహం (రెమిటెన్స్) ఎలాగుంది? రూపాయి విలువ పెరగడం తగ్గడం అనేది ఎన్నారైల రెమిటెన్పై పెద్దగా ప్రభావం చూపదు. వీళ్లలో ప్రతీ నెలా ఇంటి అవసరాలకై నగదు పంపేవారే ఎక్కువగా ఉన్నారు. వీరికి రూపాయి పెరగడం, తగ్గడంతో సంబంధం లేకుండా జీతం కింద ప్రతీ నెలా పంపిస్తూనే ఉంటారు. రూపాయి విలువ ఇంకా తగ్గుతుందని వీరు పంపకుండా కూర్చుంటే ఇక్కడి వీరిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. కార్పొరేట్లు, ఇతర వ్యాపారసంస్థలు మాత్రమే రెమిటెన్స్‌ను వాయిదా వేసుకోగలవు కానీ సాధారణ ప్రజల రెమిటెన్స్‌లపై రూపాయి మారక ప్రభావం తక్కువే అని చెప్పొచ్చు. రూపాయి విలువ తగ్గడం వలన ఇండియాకి వస్తున్న నిధులు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయే కానీ ప్రతీ నెలా పంపే మొత్తంలో మాత్రం పెద్దగా తేడా ఏమీ లేదు. యూఏఈ ఎక్స్ఛేంజ్ ఎటువంటి సేవలను అంది స్తోంది? మిగిలిన సంస్థలతో పోలిస్తే మీ ప్రోడక్టుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఒక్క డిపాజిట్ల సేకరణ తప్ప దాదాపు అన్ని ఆర్థిక సేవలను ఒకే చోట అందిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే యూఏఈ ఎక్స్ఛేంజ్ అనేది ఒక ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్. ఫారిన్ ఎక్స్ఛేంజ్ లావాదేవీల్లో ఇండియాలోనే మొదటి స్థానంలో ఉన్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా కరెన్సీ రేట్లు ఒకే విధంగా ఉండటం మా ప్రత్యేకత. అలాగే రెమిటెన్సెస్, 24 గంటలు పనిచేసే విధంగా డొమెస్టిక్ మనీట్రాన్స్‌ఫర్, ట్రావెల్ అండ్ టూర్స్, బీమా, చిన్న స్థాయి రుణాలు, ప్రీపెయిడ్ కార్డులు, యుటిలిటీ చెల్లింపులు ఇలా అన్ని సేవలను అందిస్తున్నాం. త్వరలోనే ఒకే కార్డులోనే వివిధ దేశాల కరెన్సీని లోడ్ చేసుకునే విధంగా మల్టీ కరెన్సీ కార్డును ప్రవేశపెట్టబోతున్నాం. అలాగే క్షణాల్లో 180 దేశాల నుంచి నగదు పంపే విధంగా ఎక్స్ప్రెస్మనీ పేరుతో సేవలు అందిస్తున్నాం. వినియోగదారుడు ఒకసారి మా శాఖకు వస్తే ఒకే చోట అన్ని ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకెళ్ళొచ్చు. బ్యాంక్ లెసైన్స్ పొందాలనుకున్న ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయి? మొన్న ఆర్బీఐ కేవలం రెండు సంస్థలకు మాత్రమే బ్యాంక్ లెసైన్స్ ఇచ్చింది. ఈసారి కూడా బ్యాంక్ లెసైన్స్‌కు దరఖాస్తు చేస్తాం. ఆర్బీఐ విడుదల చేసే కొత్త మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే ఒక బ్యాంక్ చేసే అన్ని కార్యకలాపాలను కొనసాగిస్తుండటమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుండటంతో తప్పకుండా లెసైన్స్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుత ఆదాయం, వ్యాపార విస్తరణ నిధుల సేకరణ గురించి వివరిస్తారా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 367 శాఖలు ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 61 శాఖలను కలిగి ఉన్నాం. కొత్తగా హైదరాబాద్ రీజియున్లో 9, కరీంనగర్ రీజియున్లో రెండు శాఖలను ప్రారంభించాం. గతేడాది రూ. 5,000 కోట్ల ఆదాయంపై రూ. 20 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాం. గత పదేళ్ల నుంచి లాభాల్లో ఉండటంతో వ్యాపార విస్తరణకు నిధుల అవసరం లేదు. ప్రస్తుతం చిన్న రుణాల మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. రూ. 50 వేల లోపు పర్సనల్, గోల్డ్, వ్యాపార రుణాలను మంజూరు చేస్తున్నాం. ప్రస్తుతం రూ. 450 కోట్లుగా ఉన్న రుణ పోర్ట్‌ఫోలియో రెండేళ్లలో రూ. 1,000 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. రెండేళ్ల తర్వాతనే ఐపీవో లేదా ఇతర మార్గాల్లో నిధుల సేకరణ గురించి ఆలోచిస్తాం. -
రూ.90లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ : పాతబస్తీలోని కాలాపత్తర్‌లో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.90 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీతో తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దేశ వ్యాప్తంగా ముత్తూట్ ఫైనాన్స్ ఏటీఎంలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బంగారం తనఖా వ్యాపార రంగంలోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ వచ్చే మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ఆరు వేల ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ డెరైక్టర్ జార్జ్ ఎం. అలెగ్జాండర్ వెల్లడించారు. బెంగళూరులోని లింగరాజపురంలో తొలి ఏటీఎంను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంతానికి దేశ వ్యాప్తంగా వంద ఏటీఎంలను నెలకొల్పనున్నట్లు చెప్పారు. మరో ఏడాదిలో వెయ్యి, రెండేళ్లలో రెండు వేల ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలుత తమ బ్రాంచి కార్యాలయాల్లోనే ఏటీఎంలను నెలకొల్పుతామని, తదుపరి ఆఫ్ సైట్ ఏటీఎంల గురించి ఆలోచిస్తామని వివరించారు. తమ ఏటీఎంలలో నగదు తీసుకోవడం, నిల్వ వాకబులతో పాటు ఖాతా నుంచి ఖాతాకు బదిలీ, పిన్ చేంజ్, కార్డ్‌లెస్ విత్‌డ్రా, కార్డ్ టు కార్డ్ బదిలీ లాంటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. వీటితో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏటీఎం సదుపాయంతో కూడిన ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నగదు బదిలీ, విదేశ ద్రవ్య మార్పిడి, ఎయిర్ టికెటింగ్, బిల్లుల చెల్లింపులు లాంటి సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. 65 శాతం ఏటీఎంలను సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీడియో ఇంటర్యాక్టివ్ సదుపాయం, టీవీ స్క్రీన్లను నెలకొల్పడం ద్వారా ఈ ఏటీఎంలను వాడకందార్ల నేస్తాలుగా రూపొందిస్తామని తెలిపారు. -
రూ.75లక్షల ఫారెన్ కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న మొన్నటి వరకూ బంగారం, ఎర్ర చందనం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు తాజాగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఎమిరేట్ విమానంలో దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి నుంచి సోమవారం ఉదయం రూ. 72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రూ. 40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నేపథ్యంలో బీహార్‌లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా వైశాలీ జిల్లా అంజన్ పీర్ చౌక్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ. 40 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ గురువారం వెల్లడించారు. పట్టుబడిన నగదును సీజ్ చేసి... అందుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదులో యూఎస్, దుబాయి తదితర దేశాలకు చెందిన డాలర్లు, రియాల్.... ఉన్నాయని తెలిపారు. నగదుపై ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. -
ఫారెక్స్ నిల్వలు @291 బిలియన్ డాలర్లు
ముంబై: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు నవంబర్ 29వ తేదీతో ముగిసిన వారాంతానికి 291.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఈ నిల్వలు 5.04 బిలియన్ డాలర్లు పెరిగాయి. డాలర్ల రూపంలో ఉండే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) పెరగడం మొత్తంగా సానుకూల ఫలితానికి కారణమని ఆర్బీఐ తాజా గణాంకాలు పేర్కొన్నాయి. ఎఫ్‌సీఏలు 5.07 బిలియన్ డాలర్లు ఎగసి 263.73 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మారకపు ద్రవ్య నిల్వల్లో భాగమైన బంగారం విలువ స్థిరంగా 21.22 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 12.2 మిలియన్ డాలర్లు పెరిగి 4.43 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద ఉన్న నిల్వల పరిస్థితి చూస్తే, ఈ పరిమాణం 46.2 మిలియన్ డాలర్లు పెరిగి 1.90 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ మారకపు నిల్వలు పెరగడం ఇది వరుసగా నాల్గవవారం. -
విదేశీ నాణేలకు తుప్పు
=మార్చడంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం =పరకామణి నుంచి ట్రెజరీకి చేరుతున్న కాయిన్లు సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించిన నాణేలు నాలుగేళ్లుగా ట్రెజరీలో మగ్గుతున్నాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి పూర్తిగా తుప్పుపట్టే పరిస్థితి నెలకొంది. తిరుమలకు వేలాదిమంది విదేశీ భక్తులు, ప్రవాసభారతీయులు వస్తుం టారు. వారు ఆయా దేశాలకు చెందిన నాణేలను శ్రీవారికి కానుకలుగా సమర్పిస్తుంటారు. వీటిని పరకామణి సిబ్బంది లెక్కించే సమయంలో వేరు చేస్తారు. స్వదేశీ నాణేలను బ్యాంకుల్లో జమ చేస్తారు. విదేశీ నాణేలను తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ట్రెజరీకి పంపుతారు. ట్రెజరీ నుంచి వాటిని విదేశీ బ్యాంకుల్లో మార్చుకుని, తిరిగి టీటీడీ బ్యాంకుల్లో జమచేయాల్సి ఉంది. ఈ పద్ధతి 2009 వరకు బాగానే జరిగింది. ఆ తర్వాత విదేశీ బ్యాంకులను సంప్రదించడం మానేశారు. ఈ నాణేలను ట్రెజరీలోనే భద్రపరుస్తున్నారు. తిరుమలలో జరిగే హుండీ లెక్కింపుల ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని, తిరుపతిలోని ట్రెజరీకి అప్పగిస్తారు. ఇలా అప్పగించిన నాణేలు నాలుగు సంవత్సరాలుగా పరిపాలనా భవనంలోని ట్రెజరీలోనే మగ్గుతున్నాయి. వీటిని మార్చడానికి టీటీడీ అధికారులకు సమయం లేదో, లేక ఆ డబ్బు అక్కరలేదని అనుకుంటున్నారో తెలియడం లేదని టీటీడీ ఉద్యోగులు అంటున్నారు. 2009 నుంచి 2011 వరకు వచ్చిన విదేశీ కరెన్సీ దాదాపు 600 బ్యాగుల్లో నిక్షి ప్తమై ఉ న్నాయి. ఒక్కో బ్యాగు 30 నుంచి 40 కిలోల వరకు బ రువు ఉంటుందని సంబంధిత అధికారులు తెలి పారు. వీటిలో పది లక్షలకు పైగా నాణేలు ఉండవచ్చని అంచనా. స్వదేశీ కరెన్సీతో ఈ నాణేలను మారిస్తే దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు టీ టీడీ పేరిట జమ అవుతుంది. ఇది కాకుండా 2011 నుంచి 2013 వరకు వచ్చిన నాణేలు మరో పది టన్నుల వరకు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ వీటిని మార్చక పోవడం వల్ల ఎంతో వడ్డీని పోగొట్టుకోవాల్సి వస్తోంది. వారానికొక సారి కట్నోట్ల మార్పిడి విదేశీ నాణేలను మార్చకుండా అలాగే దాచి పెడు తుండగా, కట్ నోట్లను మాత్రం వారానికి ఒకసారి మారుస్తున్నారు. దీనికి బాం్యకు అధికారులు ముం దుకు వచ్చి, ఎన్ని కట్ నోట్లు ఉన్నాయో తీసుకుని, వాటిని టీటీడీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంటారు. అయితే విదేశీ నాణేల మార్పిడిలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. టీటీడీ ట్రెజరీలోని గదులు ఈ బ్యాగులతో నిండిపోతున్నాయి. కొన్ని నాణేల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని తుప్పు పట్టే స్థితికి చేరుకుంటున్నాయి. దీనిపై టీటీడీ అధికారి ఒకరు మాట్లాడుతూ పురాతన నాణేలను మ్యూజియంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మిగిలిన నాణేలను త్వరలోనే మారుస్తామని తెలిపారు. నాణేలు ఎక్కువగా ఉండడంతో వాటిని ఏ బ్యాంకుకు ఇవ్వాలనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
జీరో వడ్డీ స్కీమ్‌లు వద్దు
ముంబై: ఖరీదైన సెల్‌ఫోన్ కావాలా.. ముందుగా పైసా చెల్లించక్కర్లేదు! పైగా ఎలాంటి వడ్డీ లేకుండానే సమాన నెలసరివాయిదా(ఈఎంఐ)లలో డబ్బు కట్టేయొచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే చాలు! ఇటీవలి కాలంలో ఇలాంటి జీరో వడ్డీ ఈఎంఐ స్కీమ్‌లు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. మొబైల్ ఫోన్లకే కాదు టీవీలు, ఫ్రిజ్‌లు తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయ సంస్థలు ఈ తరహా స్కీమ్‌లతో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు వీటన్నింటికీ ఆర్బీఐ చెక్ చెప్పింది. కన్సూమర్ గూడ్స్ కొనుగోళ్లకు సంబంధించి జీరో శాతం వడ్డీరేట్ల పథకాలను నిషేధిస్తున్నట్లు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో పండుగ సీజన్లో అమ్మకాల జోష్‌పై నీళ్లుచల్లినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వినియోగదారుల మేలుకే... కాగా, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై కూడా ఎలాంటి అదనపు చార్జీలనూ వసూలు చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘ఒక ఉత్పత్తి అమ్మకానికి సబంధించి వడ్డీరేట్ల స్వరూపాన్ని బ్యాంకులు దెబ్బతీయకూడదు. ఇలాంటి చర్యల వల్ల ధరల విధానంలో పారదర్శకత లేకుండా పోతుంది. వినియోగదారుడు అన్ని అంశాలూ తెలుసుకొని అంతిమంగా తగిన నిర్ణయం తీసుకోవాలంటే వాస్తవ ధర అనేది చాలా ముఖ్యం’ అని ఆర్బీఐ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలు జీరో వడ్డీరేట్లు అనే విధానమే పూర్తిగా తప్పుదోవపట్టించే అంశమని కూడా ఆర్బీఐ అంటోంది. ‘ఏదైనా ఉత్పత్తి, సంబంధిత విభాగం విషయంలో ప్రాసెసింగ్ చార్జీలు, ఎంత వడ్డీరేట్లు విధిస్తున్నారనేది కచ్చితంగా, పారదర్శకంగా తెలియజేయాల్సిందే. కస్టమర్లకు ఏదో ఒక ఆశజూపి వాళ్ల జేబు గుల్ల చేసేందుకే ఇలాంటి ‘జీరో’ స్కీమ్‌లు పుట్టుకొస్తున్నాయని కూడా ఆర్బీఐ వ్యాఖ్యానించింది. వాస్తవానికి జీరో వడ్డీ కింద ఆఫర్ చేస్తున్న ఈఎంఐ స్కీమ్‌లలో ప్రాసెసింగ్ చార్జీల రూపంలో వడ్డీని నిగూఢంగా ఉత్పత్తి ధరకే జతచేసి విక్రయ సంస్థలు మాయ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి డబ్బు చెల్లించి కొనుగోలు చేయలేని వినియోగదారులు అసలు ఉత్పత్తి ధరను పట్టించుకోకుండా... వడ్డీలేకుండా సులభ వాయిదాలకు మొగ్గుచూపుతున్నట్లు ఆర్బీఐ పరిశీలనలో వెల్లడైంది. ఇదేకాదు.. కొన్ని బ్యాంకులు కూడా ఇలాంటి మసిపూసే కొన్ని చర్యలకు పాల్పడుతున్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఏదైనా ఉత్పత్తి కొనుగోలు కోసం కస్టమర్లకు ఆఫర్ చేసే రుణంపై విధించే వడ్డీరేటులోనే అదనపు రుసుము(ప్రాసెసింగ్, కమిషన్ చార్జీ ఇతరత్రా) వడ్డింపులను కలిపి ఈఎంఐలను వసూలు చేస్తున్నాయనేది ఆర్బీఐ పరిశీలన. రిటైల్ ఉత్పత్తులకు విభిన్న వడ్డీరేట్లు వద్దు... ఒకే విధమైన ప్రొడక్ట్, సమాన కాలవ్యవధిగల రుణాలకు ఒక్కో కస్టమర్‌కు ఒక్కో విధమైన వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులపై కూడా ఆర్బీఐ దృష్టిసారించింది. ఇటువంటి డిఫరెన్షియల్ వడ్డీరేట్ల విధానాన్ని రిటైల్ ఉత్పత్తులకు ఇచ్చే రుణాలకు వర్తింపజేయరాదని కూడా ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ముఖ్యంగా రిటైల్ ఉత్పత్తుల విషయంలో కస్టమర్ రిస్క్తత్వంతో సంబంధంలేకుండా ఒకేవిధమైన(ఫ్లాట్) వడ్డీరేటును అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ఏదైనా వడ్డీరేట్ల తగ్గింపు ఆఫర్లపైనా కొరఢా ఝుళిపించింది. కస్టమర్లకు ఉత్పత్తి కొనుగోలు కోసం ఇచ్చే రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని అందించాలంటే... విక్రయ సంస్థలు ఇచ్చే డిస్కౌంట్లను పరిగణనలోకి తీసుకున్నాకే రుణ మొత్తాన్ని మంజూరు చేయాలని స్పష్టీకరించింది. రుణ చెల్లింపుపై ఏదైనా మారటోరియం వంటి ప్రయోజనం ఉంటే... బ్యాంకులు ముందుగానే తగిన రీపేమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు అనేది కూడా మారటోరియం వ్యవధి తర్వాత నుంచే ఉండాలని... వడ్డీరేటును పూర్తి కాలవ్యవధికి సర్దుబాటు చేయకూడదని కూడా నోటిఫికేషన్లో తెలిపింది. ఉత్పత్తిపై డీలర్లు, తయారీ కంపెనీలు అందించే డిస్కౌంట్లు, ప్రయోజనాలను కస్టమర్లకు పూర్తిగా లభ్యమయ్యేలా రుణాలను అందించే బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ పేర్కొంది. డెబిట్ కార్డులపై... కొన్ని విక్రయ కేంద్రాల(పాయింట్ ఆఫ్ సేల్స్) వద్ద ఏదైనా ఉత్పత్తి/సేవల కొనుగోలు కోసం డెబిట్ కార్డుల ద్వారా సొమ్ము చెల్లిస్తే... ఆ మొత్తం లావాదేవీపై కొంత శాతాన్ని అదనపు ఫీజుకింద వసూలు చేస్తున్న ఉదంతాలు కూడా ఆర్బీఐ దృష్టికెళ్ళాయి. ఇలాంటి రుసుములు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. అదనపు చార్జీలను వడ్డించే విక్రయ సంస్థలతో బ్యాంకులు ఒప్పందాలను తెగదెంపులు చేసుకోవాలని ఆదేశించింది. ఇటువంటి చర్యలు, ఉత్పత్తుల విక్రయం అనేది పారదర్శక, నిష్పాక్షిక ధరల విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనదని... వినియోగదారుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసేదని కూడా ఆర్బీఐ వ్యాఖ్యానించింది. వీటివల్ల రుణాలు, వడ్డీరేట్లకు సంబంధించిన మూల ఉత్తర్వుల్లోని నిబంధనలను తుంగలోకి తొక్కినట్లవుతుందని పేర్కొంది. కస్టమర్ల హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవహరించవద్దని బ్యాంకులకు ఆర్బీఐ హితవుపలికింది.