న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు శుక్రవారం దొంగచాటునా తరలిస్తున్న విదేశీ కరెన్సీని పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడి లగేజిని సోదా చేయగా ‘ గోపాల దేశీ నెయ్యి’ డబ్బా అనుమానాస్పదంగా కనిపించింది. దాని మూత పగులగొట్టి చూడగా రూ.92.59 లక్షల విలువైన 1,44,800 అమెరికన్ డాలర్ల నోట్లు బయటపడ్డాయి. కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత
Published Sat, Jul 15 2017 5:29 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
Advertisement
Advertisement