Indira Gandhi International Airport
-
రిపబ్లిక్ డే వేడుకలు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ఆంక్షలు
న్యూఢిల్లీ: జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. రిపబ్లిక్ డే సన్నాహాల కారణంగా జనవరి 19 నుంచి 26 వరకు ఉదయం 10.20 గంటల నుంచి 12.45 వరకు విమానాల టేకాఫ్, ల్యాండింగ్లను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఒకటి. రిపబ్లిక్‌డే వేడకల కోసం రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసారి వేడుకల్లో తొలిసారి సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్) చెందిన మహిళా అధికారులతో మార్చ్ నిర్వహించనున్నారు. అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ మహిళా అధికారితోపాటుఇద్దరు సబార్డినేట్ ఆఫీసర్లు.. మొత్తం 144 మంది మహిళా BSF కానిస్టేబుళ్లకు నాయకత్వం వహించనున్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో నిఘా పెంచారు. కాగా భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే ఈ భారీ పరేడ్‌కు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. ఇందుకు మెక్రాన్ కూడా అంగీకరించారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘నా ప్రియమైన మిత్రుడు మోదీ.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో వేడుకలను జరుపుకోవడానికి నేను వస్తున్నాను’ అని పేర్కొన్నారు. చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ -
మాస్కో విమానంలో బాంబు కలకలం... అప్రమత్తమైన అధికారులు
న్యూఢిల్లీ: మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని అంతర్జాతీయ మిమానాశ్రయానికి గురువారం రాత్రి 11.15 నిమిషాలకు మాస్కో విమానంలో బాంబు ఉందంటూ ఈమెయిల్ హెచ్చరికి వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. అంతేగాదు విమానాశ్రయ భద్రతను కూడా పెంచారు. ఈ మేరకు విమానం ఎస్‌యూ 232 శుక్రవారం తెల్లవారుజామున 3.20 గం.లకు మాస్కో నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానంలో ప్రయాణిస్తున్న దాదాపు 386 మంది ప్రయాణికులను సుమారు 16 మంది సిబ్బందిని తక్షణమే దించేశారు. విమానం మొత్తం తనీఖీ చేయడం ప్రారంభించారు అధికారులు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. అచ్చం అలానే గతనెల సెప్టెంబర్10న లండన్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసింది. (చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్) -
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ రాకవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై డీసీపీ (విమానాశ్రయం) రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ నుంచి పాట్నాకు ప్రయాణిస్తున్న విమానం లోపల బాంబు ఉందని ఓ అగంతకుడు ఫోన్ చేశాడని తెలిపారు. దీంతో వెంటనే అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. విమానంలో ఉన్న సుమారు 52 మంది ప్రయాణికులను మరో విమానానికి తరలించి విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. కాగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ఆకాష్ దీప్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే తన కొడుకు మానసిక స్థితి స్థిరంగా లేదని, అతడు విమానంలో కూర్చున్నప్పుడు తన ఫోన్ నుంచి కాల్ చేశాడని ఆకాష్ దీప్ తండ్రి పోలీసులకు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. చదవండి: హియర్ ఐ యామ్ : 1400 కోవిడ్ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు -
‘ఆ రెండు విమానాలను లండన్ వెళ్లనివ్వం’
న్యూఢిల్లీ: ఉగ్ర ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అలెర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే తీవ్రవాద గ్రూపునకు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్ను నవంబరు 5న తీవ్రవాద దాడికి పాల్పడే అవకాశం ఉందని బెదిరింపు కాల్స్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానాలను లండన్‌కు చేరకుండా అడ్డుకుంటామని చెప్పాడు’’అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు(నవంబరు 1-4) జరిగి 36 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఈ మేరకు ఖలిస్తాన్ తీవ్రవాదులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. (చదవండి: ప్రేయసి సోదరుడిని హతమార్చిన యూట్యూబర్) 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటన... మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన అల్లర్లలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 1984 నాటి ఈ కేసులోని నిందితుల్లో యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ రెండేళ్ల క్రితం ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. -
ఎయిర్‌పోర్టులో ఏఎస్సై చేతివాటం
ఢిల్లీ: అనుమానాస్పద వ్యక్తులపై నిత్యం నిఘాపెట్టాల్సిన ఖాకీయే దారితప్పాడు. ఎయిర్‌పోర్టులో ప్రయాణీకురాలి పర్సు దొంగిలించిన బీఎస్ఎఫ్ ఏఎస్సైని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో శ్రీనగర్ వెళ్లేందుకు విమానం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ తన సీటు కింద పర్సు పెట్టి కూర్చుంది. అదే సమయంలో నిందితుడు నరేశ్ కుమార్ బాగ్డోగ్రా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే విమానం కోసం వేచి చూస్తూ, అదను చూసి పర్సును కొట్టేశాడు. ఆ పర్సులో దాదాపు రూ.15 లక్షల విలువైన బంగారు,వజ్రాభరణాలు ఉన్నాయి. కొద్దిసేపటికి పర్సు పోయిందని గ్రహించిన సదరు మహిళ అక్కడున్న అలారం మోగించి పోలీసులను అప్రమత్తం చేసింది. పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, బండారం బయటపడింది. వెంటనే పోలీసులు నరేశ్‌ని పట్టుకుని తమ కస్టడీలోకి తీసుకున్నారు. చోరీ సొమ్మును బాధిత మహిళకు అప్పగించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. విచారణలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా చేశానని, తను వెళ్లాల్సిన విమానం వచ్చుంటే ఈ సొమ్ముతో బయటపడేవాణ్ణని తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. -
వింత: సీట్లు లేవంటూ.. ఫ్లైట్ నుంచి దించేశారు!
సాక్షి, న్యూఢిల్లీ : బస్సులు, రైళ్లల్లో సీటు లేక బెర్త్ రిజర్వేషన్ చేయించుకోకపోతే దూరపు ప్రయాణం చేసేవారికి కష్టం. కొన్నిసార్లు సీట్లు లేవన్న కారణంగా కొన్ని ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ప్రయాణికులను ఎక్కించుకోరు. కానీ విమానంలో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. సీట్లు లేవు మీరు దిగిపోండి అంటూ ఎయిర్ ఇండియా సిబ్బంది కొందరు ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేశారు. ఆ వివరాలిలా.. ఢిల్లీ నుంచి రాజ్‌కోట్‌కు ఇక్కడి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-495 బయలుదేరాల్సి ఉంది. అయితే చెకింగ్ పూర్తయ్యాక ప్రయాణీకులు ఎయిర్ ఇండియా ఎక్కారు. సీట్ల మోతాదుకు మించి ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది వారిని విమానం నుంచి కిందకి దించారు. పొరపాటున 10 శాతం సీట్లు అదనంగా బుక్ అయ్యాయని, ఆ ప్రయాణీకులను తర్వాత విమానంలో తరలించినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి వివరణ ఇచ్చుకున్నారు. ఎయిర్ ఇండియా తప్పిదం చేస్తే తమను విమానం నుంచి దింపి వేయడం ఏంటని ప్రయాణీకులు నిలదీయగా యాజమాన్యం ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. బస్సులు, రైళ్లల్లోనే కాదు విమానాల్లోనూ ప్రయాణీకులను సీట్లు లేవని దింపి వేస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
రైట్ సిస్టర్స్
ఏరోప్లేన్‌ని కనుగొన్నది రైట్ బ్రదర్స్.ఇప్పుడు ఎగరేస్తున్నది రైట్ సిస్టర్స్.ఆడపిల్లలకు సహజంగానే రెక్కలు ఉంటాయి. మగ ప్రపంచమే అసహజంగాపంజరాల్లో ఉంచుతోంది. ఏదో.. ఇలా ఒకసారి ఓ గొప్ప అద్భుతం ఆవిష్కృతమైనప్పుడు..ఆడపిల్ల మళ్లీ రెక్కలు తొడుగుతోంది. ఇప్పటిదాకా ఆడపిల్లలకు రాంగే జరిగింది. ఇప్పుడు రైట్ జరుగుతోంది. వియ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు. మహిళా నువ్వు.. మహా ‘ఇల’. ఎయిర్ ఇండియా తొలిసారిగా గత ఏడాది ఢిల్లీ నుంచి కాలిఫోర్నియాకు నడిపిన ‘ఆల్ ఉమెన్ క్రూ’ బోయింగ్ విమానంలోని మహిళా సిబ్బంది. (మెయిన్ ఫొటో). అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, స్పైస్ జెట్.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ‘ఆల్–ఉమెన్ క్రూ’ విమానాలను నడిపాయి. ఒక్క ఎయిర్ ఇండియానే ఒకే రోజు అంతా మహిళా సిబ్బందే ఉన్న ఎనిమిది ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌ని ఆపరేట్ చేసింది! ఫిబ్రవరి 26, 2017. ఢిల్లీ. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్ ఇండియా బోయింగ్ 777–200 ఎల్.ఆర్. ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన 16 మంది మహిళా సిబ్బందితో కూడిన బృందం డిస్పాచ్ యూనిట్లో కూర్చుని ఉన్నారు. కొద్ది క్షణాల్లో చరిత్ర సృష్టించబోతున్నారు. అందరిలో ఉద్విగ్నత, ఆనందం. ఆ భావాలే వాళ్ల సంభాషణల్లో, బాడీ లాంగ్వేజ్‌లోనూ! బోర్డింగ్ స్టార్ట్ అయింది. పదహారు మందీ ఒకొక్కరే ఠీవిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఫ్లయిట్‌లోకి. ప్రయాణికులందరూ బోర్డ్ అయ్యారు. సీట్ బెల్ట్ గురించి, ఇతరత్రా జాగ్రత్తలూ చెప్పడం పూర్తయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆ ఫ్లయిట్ కెప్టెన్ సునీతా నరూలా టేకాఫ్ కోసం ఇన్స్ట్రక్షన్స్ మొదలయ్యాయి ‘‘సర్’’ అంటూ! నో ‘సర్స్’.. ఓన్లీ లేడీస్ సునీతా నరూలా సహా కాక్‌పిట్‌లో ఉన్న కోపైలట్స్ నవ్వుకున్నారు ఆ పిలుపుకి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కూడా నవ్వారు అలవాటులో పొరపాటుకి. ‘‘డజంట్ మ్యాటర్’’ అంటూ రన్‌వే మీద పరుగులు తీసి, క్షణాల్లో టేకాఫ్ అయింది ఆ ఫ్లయిట్. టేకాఫ్ అయ్యాక... ‘‘అటెన్షన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్’’ అంటూ ఎనౌన్స్ వినపడటంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో గుబులు! ఏమన్నా అపశకునమా? వాళ్లు ఆ అనుమానంలో ఉండగానే.. ‘‘ఈ ఫ్లయిట్ ఆల్ ఫిమేల్ క్య్రూతో నడుస్తోంది. పదహారు మంది సిబ్బందీ మహిళలే. ఈ వార్తను సంతోషంగా మీతో పంచుకుంటున్నా...’ అనే మాట ఇంకా పూర్తి కానేలేదు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికుల నుంచి చప్పట్లు. ‘కుడోస్’ అంటూ ఆ ఫ్లయిట్లో ఉన్న 250 మంచి థంబ్స్ అప్ చేశారు. తమ మధ్య కూర్చున్న లేడీ ప్యాసెంజర్స్నూ ప్రశసించారు ఆడవాళ్లూ మీకు జోహార్లూ అంటూ! ఫాస్ట్‌గా.. నాన్–స్టాప్‌గా.. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో 15 వేల 300 కిలోమీటర్లు.. 13 టైమ్ జోన్స్‌ను దాటుతూ పదిహేను గంటల పదినిమిషాలు గాల్లో ఎగిరి.. గమ్యస్థానం అయిన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ అయింది విమానం. సీట్ బెల్ట్ తీసేసి అందరూ ఒక్కసారిగా.. ‘‘హుర్రే’’అంటూ జయజయ«ధ్వానాలు చేశారు. ఆ తర్వాత అనౌన్స్మెంట్లో వినిపించింది. ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించిన నాన్‌స్టాప్ ఫ్లయిట్ అని. ఇది రికార్డ్. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టిన తర్వాత ఫ్లయిట్ వింగ్స్‌ను కంట్రోల్ చేస్తోంది పురుషాధిపత్యమే. కమర్షియల్ పైలట్స్‌గా మహిళలు ఉన్నా.. ఫ్లయిట్ మొత్తం మహిళా బృంద నిర్వహణలో టేకాఫ్ తీసుకోవడం ఇదే తొలిసారి కావచ్చు. పైగా ఇంత దూరం ప్రయాణం. శాన్ఫ్రాన్సిస్కోలో విమానంలోంచి ప్రయాణికులు దిగుతున్నప్పుడు ఆ కెప్టెను, కో పైలట్స్‌ను చూడాలని తాపత్రయపడ్తున్నారు. తోసుకుంటున్నారు... ప్రయాణికులు. ప్యాసెంజర్స్ సెల్యూట్ కొట్టారు ఒక తల్లి.. తన పదకొండేళ్ల కూతురికి క్షమతాను చూపిస్తూ.. ‘‘పెద్దయ్యాక నువ్వు ఆమెలా కావాలి’’ అంటూ స్ఫూర్తి నింపుతోంది. అది చూసిన క్యాబిన్ క్య్రూ రోమాంచితమైంది. ఈ తరానికి తాము రోల్‌మోడల్స్! ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది? గుండెనిండుగా ఆత్మసంతృప్తిని నింపుకొని.. ఆత్మవిశ్వాసం నడిపిస్తుంటే అదే ఠీవితో పదహారు మంది కదులుతుంటే.. ప్యాజెంజర్స్ సెల్యూట్ చేశారు. ఇది విజయం! స్త్రీ శక్తి గెలుపు. అదే ప్రేరణ, అదే పదహారు మంది సిబ్బందితో ఆ ఫ్లయిట్ ఢిల్లీకి కూడా తిరుగు ప్రయాణం చేసింది! ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక కూడా సేమ్ ఫీలింగ్. ఆ స్ఫూర్తి ఎంతో మంది ఆడపిల్లలకు రెక్కలు తొడిగింది. కొత్త లక్ష్యాలను ఏర్పర్చింది. శక్తికి సారథులు.. వారధులు స్టీరియో టైప్‌ను బ్రేక్ చేసి, కొత్త శక్తికి సారథ్యం వహించినవాళ్లు.. కెప్టెన్ సునీతా నరూలా, క్షమతా బాజ్‌పేయి, కెప్టెన్ ఇందిరా సింగ్, కెప్టెన్ గుంజన్ అగ్రవాల్. పైలట్‌గా వీళ్లందరిదీ 20 నుంచి 30 ఏళ్ల అనుభవం. కాక్‌పిట్ క్య్రూ, క్యాబిన్ క్య్రూ, చెక్ ఇన్ స్టాఫ్, డాక్టర్, కస్టమర్ కేర్ స్టాఫ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సహా టెక్నీషియన్స్, ఇంజనీర్స్, ఫ్లయిట్ డిస్పాచర్, ట్రిమ్మర్ సహా అందరు మహిళలే ఆ రోజు సేవలందించారు. ఇది రికార్డ్. అంతేకాదు లైన్ ఆపరేషన్ ఆడిట్ సేఫ్టీని నిర్వహించింది కూడా మహిళే. హర్‌ప్రీత్ సింగ్. వరల్డ్ ట్రిప్‌కి ఓ మహిళా ఆఫీసర్ ఆడిట్ నిర్వహించడం అదే తొలిసారి. మహిళా దినోత్సవానికి తమ సంస్థ తరఫున కానుకగా ఎయిర్ ఇండియా సంస్థ ఆ నిర్ణయాన్ని తీసుకొని అమలు చేసిందట. ‘‘అలాగని ఈ రంగంలో వివక్ష లేదని చెప్పలేం. అధిగమించడం వాళ్ల వాళ్ల శక్తిసామర్థ్యాలను బట్టి ఉంటుంది. నేను 1980ల్లో ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. నా వయసప్పుడు 20లో ఉంది. అప్పుడున్న మగ పైలట్లందరూ 40 పైబడ్డవాళ్లే. నన్ను భయపెట్టేవాళ్లు. అయితే తర్వాత కొద్ది రోజులకే నా ఎబిలిటీస్‌తో వాటన్నిటినీ అధిగమించాననుకోండి’’ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటుంది సునీతా నరూలా. ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా సంస్థ 1956లో తొలిసారిగా మహిళా పైలట్‌ను నియమించింది. ఆమె పేరు దర్బా బెనర్జీ. 1990లో 26 ఏళ్ల నివేదితా భాసిన్ అనే పైలట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను నడిపి సివిల్ ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత పిన్నవయసు పైలట్‌గా పేరు నమోదు చేసుకుంది. – శరాది ఫస్ట్ : దర్బా బెనర్జీ యంగెస్ట్: నివేదితా భాసిన్ -
ట్రక్కును ఢీ కొట్టిన విమానం
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా విమానానికి శుక్రవారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ రెడీ అవుతున్న విమానం గ్రౌండ్ కూలింగ్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమాన ఇంజిన్ స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఇలాంటి ముప్పు వాటిల్ల లేదు. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన ఎయిర్ఇండియా ఇంజినీర్లు ఇంజిన్‌ను సరి చేశారు. -
విమానాన్ని ఆపి ఎలుకను పట్టారు
న్యూఢిల్లీ: అది.. ప్రపంచంలోనే అత్యధిక దూరం ప్రయాణించే ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా-173 విమానం. ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు నుంచి దాదాపు 200 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధమైంది. అంతలోనే విమానం లోపల ఒక ఎలుక కనిపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని ఆపేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించేసి, సిబ్బందితో ఎలుక వేట మొదలుపెట్టారు. ఒకటీ, రెండు కాదు.. ఎలుకను పట్టడానికి సిబ్బందికి ఏకంగా ఆరు గంటల సమయం పట్టింది. అంతా ఊపిరి పీల్చుకుని ఇక బయలుదేరొచ్చనుకునేలోపే మరో అవాంతరం ఎదురైంది.. అంతసేపు డ్యూటీలోనే ఉన్న ఆ విమానం పైలట్, ఇతర సిబ్బందిని తర్వాత డ్యూటీకి కొనసాగించటానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో అధికారులు కొత్త జట్టును పిలిపించారు. వారు రావడానికి మరో మూడు గంటల సమయం పట్టింది. ఈ పరిణామాలతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత విమానం గమ్యస్థానానికి బయలుదేరింది. -
ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు శుక్రవారం దొంగచాటునా తరలిస్తున్న విదేశీ కరెన్సీని పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడి లగేజిని సోదా చేయగా ‘ గోపాల దేశీ నెయ్యి’ డబ్బా అనుమానాస్పదంగా కనిపించింది. దాని మూత పగులగొట్టి చూడగా రూ.92.59 లక్షల విలువైన 1,44,800 అమెరికన్ డాలర్ల నోట్లు బయటపడ్డాయి. కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఢిల్లీ నుంచి వెళ్లే ప్యాసింజర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్యాసింజర్లకు శుభవార్త. ఇకపై ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ, విదేశీ సర్వీసులలో ప్రయాణించే వ్యక్తుల నుంచి తీసుకునే యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్)ను తగ్గించారు. డొమెస్టిక్ సర్వీసుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ ఇక నుంచి కేవలం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రూ.45 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ప్రకటించారు. గతంలో డొమెస్టిక్ విమానాలలో ప్రయాణించే వారి నుంచి యూడీఎఫ్‌ను రూ.275 నుంచి గరిష్టంగా రూ.550 వరకు తీసుకునేవారు. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు రూ.635 నుంచి గరిష్టంగా రూ.1,270 చెల్లించేవారు. ఇక ఢిల్లీ నుంచి వెళ్లే విమాన ప్రయాణికులు సాధారణ యూడీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి రావడం ప్రయాణికులకు నిజంగా శుభవార్తే. కొత్త చార్జీలతో డొమెస్టిక్ సర్వీస్ ప్రయాణికులకు రూ.233 నుంచి 466 వరకు ఆధా అవగా, ఇంటర్నేషనల్ సర్వీస్ ప్యాసింజర్స్‌కు రూ.518 నుంచి గరిష్టంగా రూ.1,048 వరకు భారం తగ్గనుంది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరి అథారిటీ 2015 డిసెంబర్ నెలలోనే ఈ ప్రతిపాదన చేయగా రెండున్నరేళ్ల తర్వాత యూడీఎఫ్ ధరలు సవరించారని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) అధికారులు తెలిపారు. -
డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు
తిరుచ్చి శివను నాలుగు దెబ్బలు కొట్టానన్న అన్నాడీఎంకే ఎంపీ శశికళ * కాదు ఒక్కటేనన్న శివ * ఢిల్లీ విమానాశ్రయంలో ఘటన సాక్షి, చెన్నై: ఢిల్లీ విమానాశ్రయం వేదికగా చెంపలు పగులగొట్టేలా గొడవకు దిగిన డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీల వ్యవహారం తమిళనాడులో దుమారం రేపింది. డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, అన్నాడీఎంకేకు చెందిన శశికళ పుష్ప రాజ్యసభ సభ్యులు. ఇటీవల శివ, శశికళ సన్నిహితంగా ఉండే ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై రాష్ట్రంలో చర్చ జరిగింది. ఇది సద్దుమణగకముందే వీరిద్దరు గొడవ పడ్డారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చేందుకు శివ, శశికళ వేర్వేరుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఢిల్లీ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే గొడవ చోటు చేసుకుంది. తమ అమ్మ (జయలలిత)ను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమానాశ్రయ సెక్యూరిటీ వద్ద శివ అవహేళనగా వ్యాఖ్యలు చేయడంతో తాను నాలుగుసార్లు ఆయన చెంప పగలగొట్టినట్టు శశికళ చెప్పారు. దీంతో ఆగ్రహించిన శివ అనుచరులు తన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో ఇద్దరు ఎంపీలు తమ పార్టీ అధిష్టానాలకు వివరణ ఇచ్చుకున్నారు. పనిగట్టుకుని గొడవ పడ్డారు.. శివ: విమానాశ్రయ సిబ్బంది తనకు మర్యాద ఇచ్చి, ఆమెకు ఇవ్వలేదన్న అసూయతోనే శశికళ పనిగట్టుకుని తనతో గొడవ పడ్డారని శివ చెప్పారు. చెన్నైకి వచ్చేందుకు బోర్డింగ్ పాస్ తీసుకుని, అత్యవసర పనిపడటంతో దాన్ని రద్దు చేసుకుని బయటకు తిరిగి వస్తున్నప్పుడు తన చొక్కా లాగి మరీ ఓ చెంప దెబ్బ కొట్టారని తెలిపారు. మహిళా ఎంపీ కావడంతో తాను కనీసం వాగ్యుద్ధానికీ దిగలేదని, భద్రతా సిబ్బంది సూచనతో బయటకు వచ్చేశానని చెప్పారు. తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఉద్దేశించి విమర్శలు, ఆరోపణలు చేసి ఉంటే, ఇలా బహిరంగంగా కొట్టే సంస్కృతి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంకే చీఫ్ కరుణానిధికి శిశ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఇక, శశికళ పోయెస్ గార్డెన్‌కు చేరుకుని సీఎం, తమ పార్టీ అధినేత్రి జయలలితకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా చుట్టుముట్టగా ఆమె మౌనంగా వెళ్లిపోయారు. -
ఢిల్లీ విమానాశ్రయానికి మూడు అవార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) మూడు అవార్డులను దక్కించుకుంది. ఏటా 25-40 లక్షల ప్రయాణికుల్ని హ్యాండిల్ చేసే విభాగంలో ఆసియా పసిఫిక్‌లో సైజ్ అండ్ రీజియన్ విభాగంలో రెండు అవార్డులను, అలాగే ఏసియా పసిఫిక్‌లో రెండో ఉత్తమ విమానాశ్రయం అవార్డునూ దక్కించుకుంది. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ)-2015 అవార్డులను ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) మంగళవారం ప్రకటించింది. -
ఎయిర్పోర్ట్ గస్తీ అధికారి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజ్ సింగ్ (58) అనే సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మంగళవారం రాత్రి విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ అనుహ్యంగా బిజ్వాసన్ లోని సీఐఎస్ఎఫ్ క్యాంపులో తన సర్వీసు తుపాకీతో తనను కాల్చుకున్నాడు. ఫలితంగా మూడు బుల్లెట్లు తగిలాయి. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. రాజ్ సింగ్ 1980 నుంచి సీఐఎస్ఎఫ్లో చేరి విధులు నిర్వర్తించాడు. -
టర్కీ విమానానికి బాంబు బూచి
ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ న్యూఢిల్లీ: బాంబు బెదిరింపు వార్తతో టర్కీ విమానాన్ని మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. టర్కీకి చెందిన 330 ఎయిర్ క్రాఫ్ట్ విమానం 134 మంది ప్రయాణికులతో ఇస్తాంబుల్ నుంచి బ్యాంకాక్ వెళుతోంది. విమానం టాయిలెట్ రూంలోని అద్దాలపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టినట్లు లిప్‌స్టిక్‌తో రాశారు. ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై నాగ్‌పూర్ ఏటీసీకి సమాచారం అందించారు. వారి సూచన మేరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. సీఐఎస్ఎఫ్ బలగాలు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పేలుడు పదార్థాలు లేవని తేల్చినట్లు పౌరవిమానయాన కార్యదర్శి ఆర్.ఎన్. చౌబే మీడియాకు తెలిపారు. పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరం రాత్రి 9.30 గంటలప్రాంతంలో విమానాన్ని పంపేందుకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. కాగా, విమానంలో బాంబు తనిఖీకి దాదాపు మూడు గంటల సమయం పట్టినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మహేశ్ శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ సురేందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. -
అది.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టు!
దేశ రాజధానిలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) 2014 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఏడాదికి 2.5-4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిన విభాగంలో ఈ అవార్డు వచ్చింది. ఎయిర్‌పోర్టు సేవల నాణ్యత అవార్డును ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల జోర్డాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అందించింది. ఎయిర్‌పోర్టు భాగస్వాములు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించి వినియోగదారులకు అత్యుత్తమ అనుభవం అందించేందుకు కృషిచేశారని, అందుకే తమకు ఈ స్థానం దక్కిందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు సీఈవో ఐ. ప్రభాకర రావు చెప్పారు. వినియోగదారులకు సేవల విషయంలో 300 మంది సభ్యుల బృందం 5 పాయింట్లను చూడగా, అందులో ఢిల్లీకి 4.90 స్కోరు వచ్చింది. 2011, 2012, 2013 సంవత్సరాల్లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. తర్వాతి సంవత్సరానికి తన పనితీరు మెరుగుపరుచుకుంది. ఇక్కడినుంచి గడిచిన సంవత్సరంలో దాదాపు 4 కోట్ల మంది ప్రయాణికులు 58 స్వదేశీ, 62 అంతర్జాతీయ గమ్యాలకు వెళ్లారు. సగటున రోజుకు 885 విమానాలు వెళ్లాయి, వాటిలో 6.96 లక్షల టన్నుల కార్గోను తీసుకెళ్లారు. -
నగరంలో పోలీసు భద్రత కట్టుదిట్టం
సాక్షి, న్యూఢిల్లీ: సిడ్నీ, పెషావర్లలో ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలోని కీలక ప్రదేశాలన్నింటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్ కమిషనర్ బీ. ఎస్. బస్సీ నగరంలో అలర్ట్ ప్రకటించారు. తమ పరిధిలోని అన్ని ప్రముఖ మాల్స్, మార్కెట్లు, సినిమాహాళ్లు, రాయబార కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ వెట్రో, ఐదు నక్షత్రాల హోటళ్లు, ధార్మికస్థలాల వద్ద భద్రతను పెంచాలని ఆయన అన్ని పోలీసుస్టేషన్ల ఇన్చార్జిలను ఆదేశించారు. స్కూళ్ల వద్ద భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో నివాసం ఉంటున్న ఇరాక్, సిరియా సానుభూతిపరులు, విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ముప్పు ఉందని నిఘా సంస్థల హెచ్చరికలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. విదేశీయులు ఉండే ప్రాంతాల్లో విదేశీయులు ఎక్కువగా నివసించే పహాడ్ గంజ్, లాజ్‌పత్‌నగర్, చాణక్యపురి, మయూర్ విహార్, పాత ఢిల్లీ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. సెలవుపై వెళ్లిన పోలీసు సిబ్బంది వెంటనే విధులల్లో చేరాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన నేపథ్యంలో జనవరి 23 నుంచి జనవరి 28 మధ్యకాలంలో ఐఎస్ఐఎస్ దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే కంటే ముందు 26/11 లేదా పార్లమెంటుపై దాడి తరహాలో నగరంలో మరో దాడి జరిగే ప్రమాదం ఉన్నదని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిక చేశాయి. కమాండోలు సిద్ధం ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ స్థితినైనా ఎదుర్కోవడానికి స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్), ఎన్స్జీ కమాండోలు సంసిద్ధంగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. స్పెషల్ సెల్ కిందకు వచ్చే స్వాట్ కింద 160 మంది కమాండోలు ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల సమయంలో క్రీడాకారులకు భద్రతను ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన ఈ బలగంలోని కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు, వారి వద్ద అనేక అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉన్న నాలుగు గ్రూపులు స్పెషల్ కింద ఉన్నాయి. ఒక్కొక్క గ్రూపులో 40 మంది కమాండోలు ఉన్నారు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టడానికి పోలీస్‌శాఖ అన్నిరకాల చర్యలను తీసుకొందని ఉన్నతాధికారులు చెప్పారు. -
విమానంలో పొగలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. 154 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మధ్యాహ్నం 3.35 ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఇండిగో ఎయిర్‌బస్ ఏ-320 విమానం ల్యాండింగ్ అయిన వెంటనే ఎడమవైపు కింది భాగం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసి) టవర్ సిబ్బంది దీన్ని గమనించి వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దింపారు. టాక్సీ వేలో ప్రయాణికులను దింపుతున్న సమయంలో 28 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఒకరికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. బుధవారం నాటి ఘటనపై ఏవియేషన్ అధికారులు విచారణకు ఆదేశించారు. -
మూడు గంటలు ప్రయాణించి వెనక్కి!
ఎయిర్ ఇండియా విమాన పైలట్ నిర్వాకం న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి గంట ఆలస్యంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మూడుగంటలపాటు ప్రయాణించిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఎయిరిండియా ప్రతినిధుల వివరాల ప్రకారం... ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ 121) శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు 200 మంది ప్రయాణికులతో షెడ్యూలు కంటే గంట ఆలస్యంగా ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. తర్వాత మూడు గంటలపాటు గాలిలో ప్రయాణించిన తర్వాత మిగతా ప్రయాణ సమయంపై లెక్కలు వేసుకున్న పైలట్ కంగుతిన్నాడు. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి నైట్ కర్ఫ్యూ(రాత్రిపూట ప్రవేశం ఉండదు) సమయంలోగా చేరుకోవడం సాధ్యం కాదని, ఆ తర్వాత అక్కడికి చేరినా విమానాన్ని దింపడం కుదరని గ్రహించాడు. అలాగే విమానం ఆలస్యం అయినందున ఒక పైలట్‌కు పరిమితి ఉన్న డ్యూటీ సమయం కూడా మించిపోతుందని గుర్తించాడు.ఇక చేసేదేమీ లేక విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించాడు. దీంతో అసలే ఆలస్యం.. ఆపై సగందూరం వెళ్లి వెనక్కి వచ్చేసరికి ప్రయాణికులంతా ఉసూరుమన్నారు. కాగా, ప్రయాణికులకు వసతి సౌకర్యాలు కల్పించామని, వారిని ఆదివారం ఉదయం మరో విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్‌కు పంపుతామని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. -
ఐటీవో టన్నెల్ పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఐటీవో మెట్రోస్టేషన్‌కి సంబంధించిన రెండో టన్నెల్ ఏర్పాటు మంగళవారం పూర్తయింది. మెట్రోఫేజ్-3లో భాగంగా సెంట్రల్ సెక్రెటేరియట్ నుంచి ఐటీవో వరకు నిర్మిస్తున్న టన్నెల్ పనులను డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్, ఇతర డెరైక్టర్లు పర్యవేక్షించారు. సొరంగం తవ్వకం పనులు విజయవంతంగా పూర్తవడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. 700 మీటర్ల పొడవైన ఈ మార్గాన్ని మండీహౌస్ స్టేషన్ కిందిగా తవ్వారు. తిలక్ బ్రిడ్జి కిందిగా నిర్మిస్తున్న ఈ సొరంగ మార్గం భూఉపరితలం నుంచి 18 మీటర్ల లోతులో ఉన్నట్టు డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. సొరంగం తవ్వేందుకు షాంగై మెట్రోషీల్డ్ కార్పొరేషన్ నుంచి తెప్పించిన భూమి పీడనాలు తట్టుకునే ప్రత్యేక టీబీఎం మిషన్‌ను వాడారు. 5.7 మీటర్ల వ్యాసంతో తవ్విన ఈ సొరంగ మార్గంలో 467 రింగ్‌లను ఉపయోగించినట్టు వెల్లడించారు. సమయం మరింత ఆదా.. ఎన్సీఆర్లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నోయిడాలోని బొటానికల్ గార్డెన్ ఎన్సీఆర్లో మొట్టమొదటి ఇంటర్చేంజ్ మెట్రోస్టేషన్ రాబోతోంది. ఎన్సీఆర్లోని మెట్రో ప్రయాణికులకు మరింత సమయం ఆదా చేయడంతోపాటు మెట్రోరైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ వరకు నిర్మించనున్న మెట్రోలైన్ నిర్మాణం శరవేగంతో జరుగుతోంది. ఈ లైన్ నిర్మాణంతో దక్షిణ ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు తగ్గనున్నాయి. గుర్గావ్ వె ళ్లేందుకు సైతం అరగంట సమయం ఆదా అవుతుంది. 2016 వరకు ఈ లైన్ నిర్మాణం పూర్తవుతుందని డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఢిల్లీ బయట ఇంటర్చేంజ్ మెట్రోస్టేషన్ లేదు. మెట్రోరైలు మూడో ఫేజ్ నిర్మాణం పూర్తయితే నోయిడావాసులకు మరిన్ని ఇబ్బందులు తగ్గనున్నాయి. ఇంటర్చేంజ్ అయ్యేందుకు స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. ఈ కారిడర్లో నిర్మాణంతో నోయిడా నుంచి ఢిల్లీలోని కల్కాజీ, నెహ్రూ ప్లేస్, హజ్కాస్ ప్రాంతాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. మెట్రో అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)లో పేర్కొన్న ప్రకారం 2016 వరకు బొటానికల్ గార్డెన్ మెట్రోస్టేషన్ రోజుకు 97,980 మంది ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రతిరోజూ 14 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చు. నోయిడా నుంచి గుర్గావ్ వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం రాజీవ్‌చౌక్ మెట్రోస్టేషన్‌కి వెళ్లి అక్కడి నుంచి గుర్గావ్ వెళ్లాల్సి వస్తోంది. బొటానికల్ గార్డెన్ మెట్రోస్టేషన్ నిర్మాణంతో హజ్కాస్లో మెట్రోలైన్ మారి గుర్గావ్ వెళ్లొచ్చు. అధికారులు చెబుతున్న ప్రకారం ఇలా చేస్తే అరగంట వరకు సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం గుర్గావ్- హుడా సిటీ సెంటర్ లైన్లో నోయిడా నుంచి బొటానికల్ గార్డెన్ స్టేషన్ మధ్య ప్రయాణానికి గంటన్నర పడుతోంది. రాజీవ్ చౌక్‌లో మెట్రో మారడం తప్పనిసరి. పశ్చిమ జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్ కారిడార్‌లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సైతం ఓ స్టేషన్‌గా మారుతుంది. ఈ నిర్మా ణం పూర్తయితే బొటానికల్‌గార్డెన్ నుంచి ఎయిర్‌పోర్టుకి నేరుగా 45 నిమిషాల్లో చే రుకోగలుగుతారు. 2016 వరకు ఈ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఎంఆర్సీ అధికారి అనూజ్దయాల్ తెలిపారు.