
ట్రక్కును ఢీ కొట్టిన విమానం
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా విమానానికి శుక్రవారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ రెడీ అవుతున్న విమానం గ్రౌండ్ కూలింగ్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమాన ఇంజిన్ స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఇలాంటి ముప్పు వాటిల్ల లేదు. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన ఎయిర్‌ఇండియా ఇంజినీర్లు ఇంజిన్‌ను సరి చేశారు.