
న్యూఢిల్లీ:ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్ కోసం కొట్టుకున్నారు. డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్‌రెస్ట్ విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్యుద్ధం జరిగింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటు కేటాయించారు.
ఆదివారం(డిసెంబర్22) ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ కోసం తన పాత సీటు వద్దకు మళ్లీ వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్యుద్ధం స్టార్టయింది.
ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. అయితే ఈ గొడవ చివరకు సమసిపోయిందని, ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిర్‌ఇండియా అధికారులు తెలపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment