Passenger airplane
-
ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికుల బాహాబాహీ
న్యూఢిల్లీ:ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్ కోసం కొట్టుకున్నారు. డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్‌రెస్ట్ విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్యుద్ధం జరిగింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటు కేటాయించారు. ఆదివారం(డిసెంబర్22) ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ కోసం తన పాత సీటు వద్దకు మళ్లీ వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్యుద్ధం స్టార్టయింది. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. అయితే ఈ గొడవ చివరకు సమసిపోయిందని, ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిర్ఇండియా అధికారులు తెలపడం గమనార్హం. -
గగనతలంలో 17 కోట్ల మంది!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. తీవ్రమైన వేడి గాలులు, ఇతర వాతావరణ సంబంధిత అంతరాయాలతో 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలం పాక్షికంగా ప్రభావితమైంది. భారతీయ విమానయాన సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 16.2 శాతంగా ఉందని ఇక్రా వివరించింది. ద్వితీయార్థం పుంజుకోవచ్చు..గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య విమానయాన సంస్థల ఆదాయాలు క్షీణించాయి. విమానాలు నిలిచిపోవడం, అధిక ఇంధన ధరలు ఇందుకు కారణం. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయాలు పుంజుకోవచ్చని అంచనా. ఎయిర్‌లైన్స్ వ్యయాల నిర్మాణం సాధారణంగా రెండు కీలక భాగాలైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు, రూపాయి మారకం కదలిక ఆధారంగా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే 2024–25 మొదటి ఎనిమిది నెలల్లో సగటు ఏటీఎఫ్ ధరలు 6.8 శాతం తగ్గి కిలోలీటరుకు రూ.96,192కు చేరుకున్నాయి. అయితే కొవిడ్‌కు ముందు కాలం 2019–20 మొదటి ఎనిమిది నెలల్లో ఇది రూ.65,261 నమోదైందని ఇక్రా వివరించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు..మొత్తం వ్యయాల్లో ఇంధన ఖర్చులు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటాయి. నిర్వహణ వ్యయాలు 35–50 శాతంగా ఉన్నాయి. విమానాల లీజు చెల్లింపులు, ఇంధన ఖర్చులు, విమానాలు, ఇంజన్ నిర్వహణ వ్యయాలు డాలర్ పరంగా నిర్ణయించబడతాయి. కొన్ని విమానయాన సంస్థలు విదేశీ కరెన్సీ రుణాన్ని కలిగి ఉన్నాయి. దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుగుణంగా ద్వారా వచ్చే ఆదాయాలపై విదేశీ కరెన్సీలో నికర చెల్లింపులు చేయాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!గత నష్టాల కంటే తక్కువగా..దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర వృద్ధి మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై ‘స్థిర(స్టేబుల్)’ రేటింగ్‌ను ఇక్రా కొనసాగించింది. 2024–25లో విమానయాన పరిశ్రమ నష్టం రూ.2,000–రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది. పరిశ్రమ 2025–26లో ఇదే స్థాయిలో నష్టాన్ని నివేదించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ కింజాల్ షా తెలిపారు. -
8 మందే ప్రయాణికులు.. విమానం దిగమని కోరిన సంస్థ
విమానం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులను దించేసిన సంఘటన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి చెన్నైకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే వారిని మరో విమానంలో ఎక్కిస్తామని హామీ ఇచ్చారు. దాంతో సదరు ప్రయాణికులు దిగిపోయారు. కేవలం ఎనిమిది మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించినట్లు తర్వాత ప్రయాణికులు గ్రహించినట్లు తెలిసింది. ఇండిగో విమానం 6E 478 ఆదివారం సాయంత్రం అమృత్సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి బయలుదేరింది. అయితే ఎనిమిది ప్రయాణికులు మినహా ఇతర ప్రయాణికులు బెంగళూరులోనే దిగిపోయారు. విమానంలో కేవలం ఎనిమిది మందే ఉండడంతో వారిని వేరే విమానంలో చెన్నై పంపిస్తామని కోరాగా వారు దిగిపోయారు. అయితే కేవలం 8 మందితో ప్రయాణించేందుకు ఇండిగో నిరాకరించిందని తెలిసింది. దాంతో ఆదివారం రాత్రి బెంగళూరులోనే ఉండి సోమవారం వెళ్లాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. తమ ప్రయాణానికి అడ్డంకి ఏర్పడినప్పటికీ విమానయాన సంస్థ వారి బసకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. ‘నవంబర్ 19, 2023 రోజున ఫ్లైట్ 6E 478 అమృత్సర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నై బయలుదేరింది. అమృత్సర్ నుంచి వచ్చే మరో ఎయిర్‌క్రాఫ్ట్ ఆలస్యం అయింది. దాంతో ఈ ఎనిమిది మంది చెన్నైకి వెళ్లే విమానం ఎక్కలేకపోయారు. ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ ప్రయాణికులకు సహాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. రాత్రిపూట వసతితో పాటు తదుపరి విమానంలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కానీ కొందరు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లాంజ్‌లో ఉండాలనుకున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’అని ఇండిగో ప్రకటన విడుదల చేసింది. -
బ్రెజిల్లో విమానం కూలి..14 మంది మృతి
రియో డి జనిరో: బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో చిన్న ప్యాసింజర్ విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్ సమీపంలో కూలిందన్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా చెప్పారు. -
Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో
కౌలాలంపూర్: మలేషియాలో ఓ విమానం హఠాత్తుగా నేలపై కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక కారు డాష్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు క్షణాల వ్యవధిలో వైరల్ గా మారాయి. మలేషియాలోని ఒక నాలుగు లైన్ల రహదారిపై వెళ్తోన్న కారు డాష్ కెమెరాలో ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు రికార్డయ్యాయి. ఆకాశం నుండి ఒక్కసారిగా ఊడిపడినట్టుగా ఓ విమానం రెప్పపాటులో నేలకొరిగింది. అంతే వేగంగా కూలిన విమానం నుండి దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానం లాంగ్కావి లోని నార్తర్న్ రిసార్ట్ ఐలాండ్ నుండి బయలుదేరి రాజధాని కౌలాలంపూర్ కు పశ్చిమాన ఉన్న సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి చేరాల్సి ఉంది. విమానంలో ఆరుగురు ప్యాసింజర్ల తోపాటు ఇద్దరు సిబంది ఉన్నారని తెలిపారు. విమానంలో ఎనిమిది మంది తోపాటు రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిపారు. Dashcam footage shows final moments of the private jet crash in Malaysia. https://t.co/1rsoP7ALGx Viewer discretion advised. pic.twitter.com/fo4Fqxu319 — Breaking Aviation News & Videos (@aviationbrk) August 17, 2023 మలేషియా సివిల్ ఏవియేషన్ అథారిటీ అధిపతి నొరాజ్ మన్ మహమూద్ తమకు ఈ విమానం నుండి ఎలాంటి మేడే(ప్రమాదాన్ని సూచించే) సిగ్నల్స్ అందలేదన్నారు. మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ సభ్యుడు మహమ్మద్ స్యామీ మహమ్మద్ హషీమ్ ఈ విమానం అస్థిరంగా వెళ్తుండటాన్ని తానూ చూశానని కొద్దిసేపటికే పెద్ద శబ్దం విన్నానని అన్నారు. ఇది కూడా చదవండి: సింగపూర్‌లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం -
చైనా స్వదేశీ విమానం సక్సెస్
బీజింగ్: చైనా మొట్టమొదటి సారిగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం విజయవంతంగా ప్రయాణించింది. విమానయాన రంగం మార్కెట్లోకి డ్రాగన్ దేశం అధికారికంగా ప్రవేశించింది. పశ్చిమదేశాలకు చెందిన బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలతో పోటీ పడేలా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానాన్ని తయారు చేసింది. తొలిసారిగా షాంఘై నుంచి బీజింగ్‌కు వెళ్లిన ఈ విమానం రెండున్నర గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. -
విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు
అమృత్సర్: అంతర్జాతీయ విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన ఘటన మరోటి వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం.. శనివారం షార్జా నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరిన ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమానంలో పంజాబ్‌లోని కోట్లీ గ్రామానికి చెందిన రాజీందర్ సింగ్ ప్రయాణిస్తున్నారు. విమానంలో తప్పతాగాక అతను విమాన మహిళా సిబ్బంది(ఎయిర్ హోస్ట్) ఒకరితో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఆమెను లైంగికంగా వేధించాడు. గొడవను గమనించిన తోటి విమాన సిబ్బంది వెంటనే అమృత్‌సర్‌లోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే రాజీందర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. భారత శిక్షాస్మృతిలోని 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. చదవండి: కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన -
బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు
న్యూఢిల్లీ: ప్రయాణికుల విమానాలను కార్గో విమానాలుగా మార్చే కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ జట్టు కట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌లో కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. దేశీ, విదేశీ విమానాలను పూర్తి స్థాయిలో మార్పిడి చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందని బోయింగ్ తెలిపింది. ఈ కన్వర్షన్ లైన్లో .. ఇప్పటికే ఒక మోస్తరుగా వినియోగించిన బోయింగ్ 737–800 ప్యాసింజర్ విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చనున్నారు. వచ్చే 18 నెలల్లో లైన్‌కు సంబంధించి పనులు ప్రారంభం కాగలవని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. బోయింగ్‌తో భాగస్వామ్యం.. అంతర్జాతీయ స్థాయి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) సర్వీసులను అందించడంలో తమ సామర్థ్యాలకు నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా తయారీ, ఈ–కామర్స్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత విమాన కార్గో ఏటా 6.3 శాతం వృద్ధి నమోదు చేయగలదని బోయింగ్ అంచనా వేస్తోంది. -
విమానంలో రచ్చ రచ్చ చేసిన ప్రయాణికుడు.. వీడియో వైరల్
విమానం టేకాఫ్ అయ్యాక తనను కిందకు దింపమని రచ్చ రచ్చ చేశాడు ఓ ప్రయాణికుడు. బట్టలు విప్పేసుకుని హల్చల్ చేశాడు. విమానం కిటికీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సీట్లను పదే పదే తన్నాడు. ఆపేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా దాడి చేశాడు. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో గతవారం ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 14న పెషవార్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న పీకే-283 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్యాసెంజర్ విచిత్రంగా ప్రవర్తించసాగాడు. విమానంలో ప్రయాణికులు నడిచే ఫ్లోర్‌పై బోర్లా పడుకుని ప్రార్థనలు చేయాలని ఇతరులకు సూచించాడు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా ఊరుకోలేదు. వారితో దురుసుగా ప్రవర్తించి బెంబేలెత్తించాడు. ప్రయాణికుడి చేష్టలకు విసిగిపోయిన సిబ్బంది నిబంధనల ప్రకారం అతడ్ని సీటుకు కట్టేశారు. అతడు మరోసారి విమానం ఎక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. ప్యాసెంజర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికుడు ఒకరు ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. #Video A passenger created extreme trouble on a Pakistan International Airlines (PIA) Peshawar-Dubai PK-283 flight as he suddenly started punching seats and kicking the aircraft’s window. pic.twitter.com/bUZ0ZTVNxw — Ghulam Abbas Shah (@ghulamabbasshah) September 19, 2022 చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు.. ప్రపంచదేశాల అధినేతలు హాజరు -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఎయిర్ ఏసియా నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొంద వచ్చని తెలిపింది. ఆఫర్‌తో పాటు అదనంగా డిస్కౌంట్లు పొందవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది వరకు ఎయిర్ ఏసియా జూలై 7 నుంచి జులై 10వరకు స్ప్లాష్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఢిల్లీ-జైపూర్ మార్గాల్లో ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.1497గా ఉంటుందని, ఈ సేల్‌లో బుక్ అయిన టికెట్స్‌ను జూలై 26, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. పరిమిత ఇన్వెంటరీ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు మొత్తం బుకింగ్ అయితే .. జులై 10 తరువాత బుకింగ్‌కు రెగ్యులర్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్ పేర్కొంది. కాగా, ఎయిర్ ఏషియా ఇండియా తన అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టాటాదే బెంగళూరులో ప్రధాన కేంద్రంగా టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా (ఇండియా) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. జూన్12,2014నుంచి ఎయిర్ ఏసియా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కి పైగా 100 కనెక్టింగ్ రూట్లలో ఎయిర్ ఏసియా విమానాల రాకపోకల్ని నిర్వహిస్తుంది. -
రోజుకు 90,000 మంది ప్రయాణం!
ముంబై: ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 1–10 తేదీల్లో రోజుకు 90,000 మంది ప్రయాణించారు. జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే నెల మధ్య కాలంతో పోలిస్తే ఇది అయిదురెట్లు అధికం. జూన్ చివరినాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 62,000లకు చేరింది. కోవిడ్ పరిస్థితి మెరుగుపడడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కారణంగా దేశీయ ట్రాఫిక్ 2023 మార్చినాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇందుకు మరో ఏడాది పడుతుంది. జూలైలో 22.9 లక్షల మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2019 జూలైలో ఈ సంఖ్య 58 లక్షలు నమోదైంది. ఈ కాలంతో పోలిస్తే విమాన సర్వీసులు గత నెలలో 45% తగ్గి 20,800 ఉంది. సందర్శనీయ స్థలాలు తెరవడంతో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ సామర్థ్యంలో 72.5 శాతం స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. చదవండి : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
రద్దీ పెరిగిపోతుంది, 49 లక్షలకు చేరిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలతో పోలిస్తే జులైలో ప్యాసింజర్ ట్రాఫిక్ 57 శాతం వృద్ధి చెంది 49 లక్షలకు చేరింది. గతేడాది జూన్‌లో రద్దీ 31.1 లక్షలుగా ఉందని.. ఏడాది కాలంతో పోలిస్తే 132 శాతం వృద్ధి రేటు నమోదయిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది జులైలో సగటున ప్రతి విమానంలో 104 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదే జూన్ నెలలో ప్యాసింజర్ సంఖ్య 98గా ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌లైన్స్ సామర్థ్యం కూడా పెరిగింది. గతేడాది జులైలో 24,770 విమానాలు డిపార్చర్ కాగా.. ఈ ఏడాది జులై నాటికి 90 శాతం పెరుగుదలతో 47,200 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ అయ్యాయని పేర్కొంది. సగటు రోజు వారీ డిపార్చర్స్ చూస్తే.. గతేడాది జులైలో 800 విమానాలు కాగా.. ఈ ఏడాదికవి 1,500లకు పెరిగాయి. జూన్ నెలలో రోజుకు 1,100 ఎయిర్‌లైన్స్ డిపార్చర్ జరిగాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అండ్ కో–గ్రూప్ హెడ్ కింజల్ షా వివరించారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నప్పటికీ విమానాశ్రయ సంస్థలపై ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో లీజర్, వ్యాపార ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని.. కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు -
ఎగిరిపోదాం ఎంచక్కా..
సాక్షి, కర్నూలు(సెంట్రల్): విమానయానంపై కర్నూలు జిల్లా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణ సమయం ఆదా అవుతుందనే ఉద్దేశం, నూతన ప్రయాణ అనుభూతి పొందాలన్న ఉత్సుకతతో విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో కర్నూలు ఎయిర్‌పోర్టు (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం – ఓర్వకల్లు) నుంచి రాకపోకలు ఊపందుకున్నాయి. నగరాలకు చలో చలో కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఏడాది మార్చి 28న విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఉడాన్ పథకం కింద ఇక్కడి నుంచి విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో ఆయా నగరాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు అధికశాతం విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీకెండ్లో రెండు రోజుల సెలవు ఉంటుండడంతో విమానంలో సొంతూళ్లకు వచ్చి వెళుతున్నారు. విశాఖపట్నం అందాలను తిలకించడానికి జిల్లా నుంచి వెళ్లే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. గోవాకు వెళ్లే వారు వయా బెంగళూరు మీదుగా ప్రయాణిస్తున్నారు. విశాఖ – కర్నూలు మధ్య నడిచే సర్వీసుల్లో 72 సీట్లకు గాను ప్రతిసారి 55–60 మంది ప్రయాణిస్తున్నారు. బెంగళూరుకు కూడా 50 మందికి తగ్గకుండా వెళ్తున్నారు. చెన్నైకి వెళ్లే వారి సంఖ్య మాత్రం కాస్త తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం ఆ నగరానికి రాకపోకలు సాగిస్తున్న వారిలో వ్యాపారులు ఎక్కువగా ఉంటున్నారు. కర్నూలు– చెన్నై సర్వీసుల్లో 72 సీట్లకు గాను 40–45 సీట్లు భర్తీ అవుతున్నాయి. క్రమంగా పెరుగుదల కరోనా రెండో దశ ప్రభావం విమాన ప్రయాణాలపైనా బాగానే పడింది. బెంగళూరు, చెన్నై నగరాల్లో లాక్డౌన్ విధించడం, ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ పెట్టడంతో ఆ సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విమాన రాకపోకలపై నిషేధం లేకున్నా లాక్డౌన్, కర్ఫ్యూ కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. మే మాసంలో ఒక్కో ట్రిప్పులో 10–15 మంది కూడా ప్రయాణించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే కరోనా కేసులు తగ్గిపోవడం, లాక్డౌన్ ఎత్తేయడం, కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో విమాన ప్రయాణాలు మళ్లీ పుంజుకున్నాయి. విద్యా సంస్థలు పునః ప్రారంభమై, వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో ఊపందుకుంటే ఇక్కడి నుంచి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది కరోనా సెకండ్ వేవ్‌తో మే మాసంలో విమాన ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. అయితే ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్లేవారు..వచ్చే వారు అధికంగా ఉంటున్నారు. – కైలాస్ మండల్, ఏడీ, ఎయిర్‌పోర్టు అథారిటీ విమానాల టైం టేబుల్ ఫ్లైట్ నంబర్ సర్వీసు అందుబాటులో బయలుదేరు సమయం చేరుకునే సమయం ఉండే రోజులు ఎయిర్‌పోర్టు ఎయిర్‌పోర్టు 6ఈ7911 సోమ, బుధ, శుక్ర, ఆది బెంగళూరు 09.05 కర్నూలు 10.10 6ఈ7912 సోమ, బుధ, శుక్ర, ఆది కర్నూలు 10.30 విశాఖపట్నం 12.40 6ఈ7913 సోమ, బుధ, శుక్ర, ఆది విశాఖపట్నం 13.00 కర్నూలు 14.55 6ఈ7914 సోమ, బుధ, శుక్ర, ఆది కర్నూలు 15.15 బెంగళూరు 16.25 6ఈ7915 మంగళ, గురు, శని, ఆది చెన్నై 14.50 కర్నూలు 16.10 6ఈ7916 మంగళ, గురు,శని, ఆది కర్నూలు 16.30 చెన్నై 17.50 విమాన టికెట్ ధరలు (రూ.లలో) కర్నూలు – బెంగళూరు 2,077 కర్నూలు – చెన్నై 2,555 కర్నూలు– విశాఖపట్నం 3.077 -
ఇరాన్లో కుప్పకూలిన విమానం
ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతున్న తరుణంలో ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోవడం మరింత ఆందోళన రేపింది. బోయింగ్ 737 విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక కారణాలతోనే ఈ విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఉక్రేనియన్ విమానం బుధవారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాజధాని టెహ్రాన్ శివారు పరాంద్ సమీపంలో బోయింగ్ 737 జెట్ కూలిపోయిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా మొత్తం 180 ప్రాణాలు కోల్పోయారు. -
ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు
జకర్తా: ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. శుక్రవారం 10 మందితో వెళ్తున్న విమానం ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జాడలేకుండా పోయింది. ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది. ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మకస్సార్లో మరో 30 నిమిషాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు ఆ దేశ రవాణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు. గత ఆగస్టులో 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేసియా విమానం కుప్పకూలింది.