ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు | Passenger airplane with 10 aboard missing in east Indonesia | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు

Published Fri, Oct 2 2015 6:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 AM

ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు

ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు

జకర్తా: ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. శుక్రవారం 10 మందితో వెళ్తున్న విమానం ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జాడలేకుండా పోయింది.

ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన విమానం దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది. ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మకస్సార్లో మరో 30 నిమిషాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినట్టు ఆ దేశ రవాణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు. గత ఆగస్టులో  54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేసియా విమానం కుప్పకూలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement