plane missing
-
రష్యాలో విమానం అదృశ్యం.. ప్రయాణికులంతా సేఫ్
మాస్కో/టాంస్క్: రష్యాను వరుస విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. జూలై 6న 28 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం రాడార్ నుంచి అదృశ్యమై ఆ తర్వాత కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. సుమారు 13 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమయింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు మొదలు పెట్టింది. గంటల వ్యవధిలోనే విమానం ఆచుకీ గుర్తించింది. ప్రయాణికులందరిని కాపాడింది. ఆ వివరాలు.. సైబీరియాలో ప్రాంతీయ విమానాలను నడిపే చిన్న విమానయాన సంస్థ సిలాకు చెందిన ఓ విమానం శుక్రవారం కేడ్రోవి పట్టణం నుంచి టాంస్క్ నగరానికి వెళ్తుండగా తప్పిపోయింది. విమానంలో 19 మంది ప్రయాణికులున్నారు. విమానం అదృశ్యం గురించి తెలియగానే అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దించి.. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గంటల వ్యవధిలోనే రెస్క్యూ హెలికాప్టర్లు విమానం ఆచూకీ కనిపెట్టాయి. ప్రమాద స్థలానికి చేరుకుని దానిలో ఉన్న ప్రయాణికులందరని సురక్షితంగా తీసుకువచ్చాయి. పది రోజులజ క్రితం రష్యాలోని పెట్రోపావ్‌లోవిస్క్– కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. -
రష్యాలో విమాన ప్రమాదం.. 28 మంది మృతి
మాస్కో: రష్యాలోని పెట్రోపావ్లోవిస్్క– కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయింది. విమానం ల్యాండ్ కావాల్సిన విమానాశ్రయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో విమానానికి సంబంధించి శకలాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆంటోనోవ్ ఏఎన్–26 విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సొలొడోవ్ చెప్పారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా. -
ఇండోనేషియా విమాన ప్రమాదం ఫొటోలు
-
ఇండోనేషియా విషాదం: బ్లాక్ బాక్స్ ఆచూకీ లభ్యం
జకార్తా: శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేషియా విమానానికి సంబంధించిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్ బట్టి వాటిని త్వరలోనే బయటికి తీస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా నేటి ఉదయం లాంకాంగ్, లకీ ద్వాపాల మధ్య విమాన భాగాలు, శకలాలు, మునుషులు శరీర బాగాలు, దుస్తులు లభ్యమవడంతో ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికిలేరన్న విషయం అర్థమవుతుంది. కాగా విమానం నడిపిన పైలట్లు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారేనని అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్సులను వెలికి తీసి పరిశీలించిన అనంతరం మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.(చదవండి: ఇండోనేషియాలో కూలిన విమానం?) శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిపోయింది. -
బ్రేకింగ్: ఇండోనేషియా విమానం గల్లంతు
జకార్తా: ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్ వెళ్తున్న ఎస్జే 182 శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది కలిపి మొత్తం 59 మంది ఉన్నట్లు తెలుస్తోంది.ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సోకర్నో హట్టా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని నిమిషాలకే అదృశ్యమవడం కలకలం రేపుతోంది. అయితే ఆ విమానం ఓ ద్వీపంలో కూలిపోయి ఉంటుందని ఆ దేశానికి చెందిన మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండోనేషియా దేశంలో విమానయాలకు విషాద చరిత్ర ఉంది. 2018 అక్టోబర్ 29న ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని 189 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి. -
చిలీలో విమానం గల్లంతు
శాంటియాగో : చిలీకి సంబంధించిన మిలటరీ విమానం ఒకటి సుమారు 38 మంది ప్రయాణీకులతో గల్లంతయ్యింది. దేశానికి దక్షిణాన ఉన్న ఓ స్థావరం నుంచి అంటార్కిటికా వెళ్లేందుకు టేకాఫ్ తీసుకున్న విమానం కూలిపోయి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం సుమారు 4.55 గంటలకు సీ–130 విమానం పుంటా ఎరీనా నుంచి టేకాఫ్ తీసుకుందని, 6.13 గంటలకు సంబంధాలు తెగిపోయాయని చిలీ వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఎమర్జెన్సీ పొజిషనింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ అది పనిచేస్తున్నట్లుగా లేదని వాయుసేన అధికారి ఎడ్యురాడో మోస్కూయిరా తెలిపారు. -
ఆచూకీ తెలిపితే రూ. 5లక్షల రివార్డు
న్యూఢిల్లీ : గల్లంతైన ఏఎన్32 రకం విమానం ఆచూకీ తెలిపిన వారికి భారత వాయుసేన 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. విమానం కోసం తీవ్ర గాలింపు చేపట్టిన అధికారులు.. ఆరు రోజులు గడిచిన ఆచూకీ కనుగొనలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తూర్పు దళానికి చెందిన ఎయిర్ మార్షల్ ఆర్ డి మాథుర్ శనివారం ఈ ప్రకటన చేసినట్టు డిపెన్స్ పీఆర్వో వింగ్ కమాండర్ రత్నాకర్ సింగ్ తెలిపారు. విమానం ఆచూకీకి సంబంధించిన ఎలాంటి సమాచారం అందజేసిన వారికి రివార్డును అందజేయనున్నట్టు వెల్లడించారు. గల్లంతైన విమానం గురించి ఎవరైన కొద్దిపాటి సమాచారం అందజేసిన దాన్ని గుర్తించడం తెలిక అవుతుందని పేర్కొన్నారు. సమాచారం తెలుపాల్సిన వారు 0378-3222164, 9436499477, 9402077267, 9402132477 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 13 మందితో బయలుదేరిన ఏఎన్32 విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమాషాల అనంతరం గల్లంతైన సంగతి తెలిసిందే. అస్సాం లోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. విమానం గల్లంతైన మరుక్షణం నుంచే అధికారులు దాని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విమానం ఆచూకీ కనుగోవడానికి అత్యంత సామర్థ్యం కలిగిన హెలికాఫ్టర్లను కూడా వాయుసేన రంగంలోకి దించింది. అయితే కొండ ప్రాంతాలు కావడంతో ప్రతికూల పరిస్థితుల వల్ల అన్వేషణ ఇబ్బందికరంగా మారింది. అధికారులు ఇస్రో సాయం తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. -
నేపాల్ లో విమానం అదృశ్యం కలకలం!
ఖఠ్మాండ్: ఓ ప్రత్యేక విమానం అదశ్యమైందని నేపాల్ అధికారులు ప్రకటించారు. నేపాల్ పర్వతాలలో చిక్కుకుని ఈ విమానం కనిపించకుండా పోయి ఉండొచ్చునని వారు భావిస్తున్నారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం... నేపాల్ లోని పొఖారా ఏరియా నుంచి 21 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం 7:45 గంటలకు ఓ విమానం బయలుదేరింది. చివరగా 8:50 గంటలకు ఆ విమానం నుంచి సిగ్నల్స్ అందాయని, ఆ తర్వాత నుంచి విమానం జాడ చిక్కలేదని వెల్లడించారు. పొఖారా నుంచి జామ్ సోమ్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమాన అదృశ్యం సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సిబ్బంది విమానాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గల్లంతైన విమానం కోసం గాలింపు
జకర్తా : తూర్పు ఇండోనేషియాలో గల్లంతైన విమానం కోసం ఆ దేశ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జూలియస్ బారట శనివారం వెల్లడించారు. ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన ఈ విమానం 10 మందితో దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మసాంబ నుంచి మకస్సార్కు శుక్రవారం బయల్దేరింది. మరో 11 నిమిషాల్లో విమానం మకస్సార్లో దిగాల్సి ఉంది. అంతలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి వైమానిక సిబ్బంది దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో శనివారం ఉదయం నుంచి మళ్లీ విమాన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఏడుగురు ప్రయాణికులతోపాటు ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారని బారట తెలిపారు. వారిలో ముగ్గురు చిన్నారులని చెప్పారు. -
ఇండోనేసియాలో మరో విమానం గల్లంతు
జకర్తా: ఇండోనేసియాలో మరో విమానం గల్లంతైంది. శుక్రవారం 10 మందితో వెళ్తున్న విమానం ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో జాడలేకుండా పోయింది. ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మసాంబ నుంచి మకస్సార్కు బయల్దేరింది. ఇందులో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. మకస్సార్లో మరో 30 నిమిషాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు ఆ దేశ రవాణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలను పంపారు. గత ఆగస్టులో 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేసియా విమానం కుప్పకూలింది. -
ఇండోనేసియా విమానం గల్లంతు
-
ఇండోనేసియా విమానం గల్లంతు
జకర్తా: ఇండోనేసియా విమానం గల్లంతైంది. ఇందులో 54 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆదివారం పుపువా ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గల్లంతయింది. ఏం జరిగిఉంటుదన్న విషయం తెలియదని, ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. విమానం గల్లంతయిన ప్రాంతంలో పర్వతాలున్నాయని, దట్టమైన మేఘాలతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. దీంతో విమానం గాలింపు చర్యలు చేపట్టలేదని వెల్లడించారు.