
ఇండోనేసియా విమానం గల్లంతు
జకర్తా: ఇండోనేసియా విమానం గల్లంతైంది. ఇందులో 54 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆదివారం పుపువా ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు.
పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గల్లంతయింది. ఏం జరిగిఉంటుదన్న విషయం తెలియదని, ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. విమానం గల్లంతయిన ప్రాంతంలో పర్వతాలున్నాయని, దట్టమైన మేఘాలతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. దీంతో విమానం గాలింపు చర్యలు చేపట్టలేదని వెల్లడించారు.