Papua
-
న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
ఆ అడవి మహిళలకు మాత్రమే.. నగ్నంగా మారితేనే ప్రవేశం!?
ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్‌లో గల జయపురలో ఉన్న అడవికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. కాదని పురుషులు ఎవరైనా ఆ అడవిలో అడుగుపెడితే అస్సలు సహించరు. ఇంతకీ స్త్రీలు అక్కడికి ఎందుకు వెళ్తారు? మగవాళ్లు గనుక అక్కడ ప్రవేశిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? ఆ కథాకమామీషు ఏంటో స్థానికుల మాటల్లోనే.. బీబీసీ ఇండోనేషియాతో మాట్లాడిన ఆడ్రియానా మరౌడ్.. ‘‘చాలా కాలం నుంచి ఇది మహిళలకు మాత్రమే చెందిన అడవిగా ఉంది. నా పుట్టుక మొదలు నేటి దాకా దీని మనుగడ ఇలాగే కొనసాగుతోంది. ఒకే రకమైన నిబంధనలు అమలు అవుతున్నాయి. ఈ అడవిలోకి రావాలంటే నగ్నంగా మారాల్సి ఉంటుంది. దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు. మహిళలు ఇక్కడ స్వేచ్ఛగా విహరిస్తారు. ఈ అడవి లేకుండా మాకు జీవితమే లేదు. ప్రతిరోజూ ఇక్కడికి వస్తాం. మాకు కావాల్సినవి తీసుకువెళ్తాం. ఒకవేళ ఎవరైనా పురుషుడు గనుక ఇక్కడ ప్రవేశిస్తే.. అతడు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుమారు 69 అమెరికా డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పాలిష్ చేసిన రాళ్ల రూపంలో ఈ మొత్తాన్ని సదరు వ్యక్తి చెల్లించాలి. నిజానికి ఏదైనా అలికిడి వినిపిస్తే మేం వెంటనే అప్రమత్తమవుతాం. మా గొంతు వినగానే ఎవరైనా ఇతర వ్యక్తులు ఇక్కడ ఉంటే వెంటనే వెళ్లిపోతారు’’ అని చెప్పుకొచ్చారు. ఆల్చిప్పల సేకరణై వెళ్తున్న మహిళ(ఫొటో క్రెడిట్: బీబీసీ) ఇక మరో గ్రామస్తురాలు ఆరి రుంబోరుసి తన అనుభవాలు పంచుకుంటూ... ఆల్చిప్పల సేకరణకై తామంతా ఇక్కడికి వస్తామని అసలు విషయం తెలిపారు. ‘‘వెలితిగా అనిపించినపుడు జట్టుగా మారతాం. మా స్నేహితులను కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాం. బోటులో వారు ఇక్కడకు వస్తారు. అడవిలో ఉన్నపుడు మాకు నచ్చినట్లుగానే ఉంటాం. ఒక్క పురుషుడు కూడా ఇక్కడ ఉండడు. కాబట్టి మాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. పెద్దలతో, ఇతరులతో మా అభిప్రాయాలు పంచుకునే వెసలుబాటు ఉంటుంది. నీటిలో సేదదీరుతూ.. బురదలో ఉన్న ఆల్చిప్పలు సేకరిస్తాం’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ కారణంగా ఇబ్బందులు సముద్ర ఒడిలో సేకరించిన ఆల్చిప్పలను సమీప మార్కెట్లలో అమ్మడం ద్వారా ఇక్కడి మహిళలు ఆదాయం సమకూర్చుకుంటారు. అయితే, పచ్చని ప్రకృతితో నిండి ఉన్న ఈ అపురూప సంపదను సైతం ప్లాస్టిక్ భూతం వెంటాడుతోంది. స్థానిక పట్టణాల నుంచి కొట్టుకువస్తున్న ప్లాస్టిక్ వస్తువులతో సముద్రం నిండిపోతోంది. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి మహిళలు చెబుతున్నారు. ‘‘ఇది చాలా విచారకరం. అంతకుముందు ఆల్చిప్పలతో మా పడవలు సగం నిండేవి. కానీ ఇప్పుడు, చెత్తాచెదారం పోగు చేసి బయటపారేయడమే పనిగా మారింది. ఏదేమైనా ఈ అడవిని శుభ్రంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’’ అని తమకు జీవనాధారం కల్పిస్తున్న అడవితల్లిపై వారు ప్రేమను చాటుకుంటున్నారు. చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు -
ఇంటరాగేషన్ పేరుతో దారుణం..
జకర్తా : ఇండోనేషియా పోలీసులు తమ కండ కావరాన్ని ప్రదర్శించారు. చోరీ కేసులో అరెస్టైన ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. అప్పటికీ అతడు నేరాన్ని అంగీకరించకపోవడంతో చేతులు కట్టేసి ఓ బతికున్న భారీ సైజు పామును నిందితుడిపై వదిలారు. ఈ సంఘటన పపువాలో చోటుచేసుకుంది. తనను వదిలేయమని అతను ప్రాధేయపడినా కనికరించలేదు. అంతటితో ఆగకుండా మరో పోలీసుల అధికారి పామును నిందితుడి నోట్లో, లోదుస్తుల్లోకి పంపాలని అనడం వీడియోలో రికార్డయింది. అక్కడే ఉన్న పోలీసు పాము తోకను నిందితుడి నోట్లో పెట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పటి వరకు ఎన్ని చోరీలు చేశావని అడగ్గా, అతను రెండు చోరీలు మాత్రమే చేశానని నేరాన్ని అంగీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మలేషియా పోలీసులు క్షమాపణ చెప్పారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. విచారణ అధికారి ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదని పేర్కొన్నారు. -
నిందితుడిపై పాములను వదిలి ఇంటరాగేషన్
-
కూలిపోయిన ఇండోనేసియా విమానం
-
కూలిపోయిన ఇండోనేసియా విమానం
జకర్తా: గల్లంతయిన ఇండోనేసియా విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యహ్నం పపువా ప్రాంతంలో పర్వతంపై కూలిపోయినట్టు స్థానికులు చెప్పారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ విమానంలో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఓక్సిబిల్కు బయల్దేరింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. ఆ సమయంలో దట్టమైన మేఘాలు, వర్షం, పొగమంచుతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
ఇండోనేసియా విమానం గల్లంతు
-
ఇండోనేసియా విమానం గల్లంతు
జకర్తా: ఇండోనేసియా విమానం గల్లంతైంది. ఇందులో 54 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆదివారం పుపువా ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గల్లంతయింది. ఏం జరిగిఉంటుదన్న విషయం తెలియదని, ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. విమానం గల్లంతయిన ప్రాంతంలో పర్వతాలున్నాయని, దట్టమైన మేఘాలతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. దీంతో విమానం గాలింపు చర్యలు చేపట్టలేదని వెల్లడించారు. -
ఇండోనేసియాలో భారీ భూకంపం
జకార్తా : ఇండోనేసియాలోని పశ్చిమ ప్రాంతంలోని పవువా ప్రావిన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదు అయింది. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. పవువాకు 75 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతాలలో భయంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు మీడియా వివరించింది.