ల్లంతయిన ఇండోనేసియా విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యహ్నం పపువా ప్రాంతంలో పర్వతంపై కూలిపోయినట్టు స్థానికులు చెప్పారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ విమానంలో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.