indonosia
-
కూలిపోయిన ఇండోనేసియా విమానం
-
కూలిపోయిన ఇండోనేసియా విమానం
జకర్తా: గల్లంతయిన ఇండోనేసియా విమానం కూలిపోయింది. ఆదివారం మధ్యహ్నం పపువా ప్రాంతంలో పర్వతంపై కూలిపోయినట్టు స్థానికులు చెప్పారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ విమానంలో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఓక్సిబిల్కు బయల్దేరింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. ఆ సమయంలో దట్టమైన మేఘాలు, వర్షం, పొగమంచుతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
ఇండోనేసియా విమానం గల్లంతు
-
ఇండోనేసియా విమానం గల్లంతు
జకర్తా: ఇండోనేసియా విమానం గల్లంతైంది. ఇందులో 54 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆదివారం పుపువా ప్రాంతంలో విమానం ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయల్దేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గల్లంతయింది. ఏం జరిగిఉంటుదన్న విషయం తెలియదని, ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. విమానం గల్లంతయిన ప్రాంతంలో పర్వతాలున్నాయని, దట్టమైన మేఘాలతో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. దీంతో విమానం గాలింపు చర్యలు చేపట్టలేదని వెల్లడించారు.