నేపాల్ లో విమానం అదృశ్యం కలకలం! | Small plane with 21 on board goes missing in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్ లో విమానం అదృశ్యం కలకలం!

Published Wed, Feb 24 2016 9:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

నేపాల్ లో విమానం అదృశ్యం కలకలం!

నేపాల్ లో విమానం అదృశ్యం కలకలం!

ఖఠ్మాండ్: ఓ ప్రత్యేక విమానం అదశ్యమైందని నేపాల్ అధికారులు ప్రకటించారు. నేపాల్ పర్వతాలలో చిక్కుకుని ఈ విమానం కనిపించకుండా పోయి ఉండొచ్చునని వారు భావిస్తున్నారు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం... నేపాల్ లోని పొఖారా ఏరియా నుంచి 21 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం 7:45 గంటలకు ఓ విమానం బయలుదేరింది.

చివరగా 8:50 గంటలకు ఆ విమానం నుంచి సిగ్నల్స్ అందాయని, ఆ తర్వాత నుంచి విమానం జాడ చిక్కలేదని వెల్లడించారు. పొఖారా నుంచి జామ్ సోమ్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమాన అదృశ్యం సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సిబ్బంది విమానాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement