అమృత్‌సర్: అంతర్జాతీయ విమానంలో ఓ ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన ఘటన మరోటి వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం.. శనివారం షార్జా నుంచి అమృత్‌సర్‌కు బయల్దేరిన ఇండిగో సంస్థ అంతర్జాతీయ విమానంలో పంజాబ్‌లోని కోట్లీ గ్రామానికి చెందిన రాజీందర్ సింగ్ ప్రయాణిస్తున్నారు. విమానంలో తప్పతాగాక అతను విమాన మహిళా సిబ్బంది(ఎయిర్ హోస్ట్) ఒకరితో గొడవకు దిగాడు.
ఈ సందర్భంగా ఆమెను లైంగికంగా వేధించాడు. గొడవను గమనించిన తోటి విమాన సిబ్బంది వెంటనే అమృత్‌సర్‌లోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే రాజీందర్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. భారత శిక్షాస్మృతిలోని 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
చదవండి: కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
Comments
Please login to add a commentAdd a comment