విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఎయిర్ ఏసియా నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొంద వచ్చని తెలిపింది. ఆఫర్‌తో పాటు అదనంగా డిస్కౌంట్‌లు పొందవచ్చని పేర్కొంది.
వచ్చే ఏడాది వరకు
ఎయిర్ ఏసియా జూలై 7 నుంచి జులై 10వరకు స్ప్లాష్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఢిల్లీ-జైపూర్ మార్గాల్లో ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.1497గా ఉంటుందని, ఈ సేల్‌లో బుక్ అయిన టికెట్స్‌ను జూలై 26, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. పరిమిత ఇన్వెంటరీ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు మొత్తం బుకింగ్ అయితే .. జులై 10 తరువాత బుకింగ్‌కు రెగ్యులర్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్ పేర్కొంది. కాగా, ఎయిర్ ఏషియా ఇండియా తన అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
టాటాదే
బెంగళూరులో ప్రధాన కేంద్రంగా టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా (ఇండియా) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. జూన్12,2014నుంచి ఎయిర్ ఏసియా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కి పైగా 100 కనెక్టింగ్ రూట్లలో ఎయిర్ ఏసియా విమానాల రాకపోకల్ని నిర్వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment